The voice of a verb describes the relationship between the action (or state) that the verb expresses and the participants identified by its arguments (subject, object, etc.).
When the subject is the agent or doer of the action, the verb is in the active voice. When the subject is the patient, target or undergoer of the action, the verb is said to be in the passive voice.
Active voice
Active voice means that a sentence has a subject that acts upon its verb.
Passive voice
Passive voice means that a subject is a recipient of a verb’s action.
Voice, కర్త (Subject), కర్మ (Object), క్రియ (Verb) ల మధ్య గల బంధాన్ని వివరిస్తుంది. అనగా కర్త చేసిన లేదా కర్తచే చేయబడిన క్రియ యొక్క లక్షణాన్ని Voice తెలియజేస్తుంది. ఈ Voice రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి Active voice కాగా, రెండవది Passive voice.
సబ్జెక్టు కేంద్రంగా చెప్పుకునే వాక్యాలను Active voice అంటారు. అనగా పనిచేసే వ్యక్తి లేదా వస్తువు, సబ్జెక్టు స్థానంలో ఉంటె ఆ వాక్యం (sentence) Active Voice లో ఉందని అర్ధం చేసుకోవాలి.
ఆబ్జెక్ట్ (కర్మ) కేంద్రంగా చెప్పుకునే వాక్యాలను Passive voice అంటారు. అనగా పని జరిగిన లేదా జరపబడ్డ (receiver of action) వ్యక్తి లేదా వస్తువు సబ్జెక్టు స్థానంలో ఉంటె ఆ వాక్యం (sentence) Passive Voice లో ఉందని అర్ధం చేసుకోవాలి.
తెలుగులో ఆక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ పద్దతి లేదు. గడ్డి ఆవు చేత తినబడుతుంది, రావణుడు రాముడు చేత చంపబడ్డాడు వంటి మాటలు తెలుగు వాడుక భాషలో ఉండవు.
ఆంగ్ల భాషలో కూడా మాట్లాడే భాష యందు పాసివ్ వాయిస్ ఉపయోగం తక్కువ. రాసే ఇంగ్లీష్ భాష యందు పాసివ్ వాయిస్ వాక్యాలు ఎక్కువ కనిపిస్తాయి. అందుకే వీటిని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
స్టేట్మెంట్ వాక్యాలు, ప్రశ్నలు, ఆర్డర్ వాక్యాలు, Exclamatory వాక్యాలు వంటి మొదలగు ఇంగ్లీష్ మాట్లల్లో పాసివ్ వాయిస్ విరివిగా ఉపయోగిస్తారు. అలానే To infinitives, Participle వాక్యాలను కూడా కొన్ని సందర్భాలలో పాసివ్ వాయిస్ ఉపయోగిస్తారు.
పాసివ్ క్రియను నేర్చుకోవాలంటే ముందుగా ఆక్టివ్ క్రియను నేర్చుకోవాలి. మనము ఇది వరకు నేర్చుకున్న Tenses అన్ని ఆక్టివ్ వాక్యాలే. ఇప్పుడు వాటిని మనం పాసివ్ క్రియలుగా ఎలా మార్చాలో నేర్చుకోవాలి.
ఆక్టివ్ వాక్యాలను నేర్చుకోవడం కంటే పాసివ్ వాక్యాలను నేర్చుకోవడం కొంచెం కష్టం. ఆక్టివ్ వాయిస్ నేర్చుకోవడం అంటే మాట్లాడేదాన్నే రాతలో నేర్చుకోవడంలా ఉంటుంది. పాసివ్ వాయిస్ వాడుకలో లేనివి కాబట్టి వీటిని నేర్చుకోవడం కొంచెం కఠినంగా ఉంటుంది.
పాసివ్ వాయిస్ నేర్చుకునే ముందు ఒక వాక్యంలో ఉండే కర్త, కర్మ. క్రియలను మీరు గుర్తించగలగాలి. అలానే ఇదివరకే చెప్పుకున్న Tenses వాక్య నిర్మాణం తెలిసి ఉండాలి. అలానే Active మరియు Passive Pronoun రూపాలను తెలుసుకుని ఉండాలి.
ఆక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్ లోకి మార్చే క్రమంలో పాటించాల్సిన.. మొదటి నియమం ఆక్టివ్ వాయిస్ లో ఉండే కర్త (subject) ..పాసివ్ వాయిస్ లోకి వచ్చేసరికి కర్మగా (object) మారుతుంది. అలానే ఆక్టివ్ వాయిస్ లో ఉండే కర్మ (object) ..పాసివ్ వాయిస్ లోకి వచ్చేసరికి కర్తగా (subject) మారుతుంది.
ఇక రెండవ నియమం, ఆక్టివ్ వాయిస్ ఏ Tense (కాలం) లో ఉండేటప్పటికీ ...పాసివ్ వాయిస్ కి వచ్చేసరికి ప్రధాన క్రియ (Verb) - Past Participle (V3) రూపానికి మారుతుంది. అలానే పాసివ్ వాయిస్ వాక్యంలో Verb తర్వాత By / With / To మాటను చేర్చాల్సి ఉంటుంది.
ఆక్టివ్ వాయిస్ వాక్యంలో సబ్జెక్టు స్థానంలో pronoun ఉంటె, పాసివ్ వాయిస్ కి వచ్చేసరికి దానికి తగ్గ పాసివ్ Pronoun రూపాన్ని ఆబ్జెక్ట్ స్థానంలో చేర్చాల్సి ఉంటుంది. ఇక చివరిగా ఆక్టివ్ వాయిస్ వాక్యం ఉండే Tense అనుచరించి, పాసివ్ వాయిస్ లో V3 కి ముందు తగిన Be Form (సహాయక క్రియను) చేర్చాల్సి వస్తుంది.
Active voice |
Passive voice |
He bought a car. (అతను కారు కొన్నాడు) |
A car was bought by him. (కారు అతని చేత కొనబడింది) |
I eat an apple. (నేను ఆపిల్ తిన్నాను) |
An apple is eaten by me. (ఆపిల్ నా చేత తినబడింది) |
Seetha read the novel in one day. (సీత ఒక రోజులో నవల చదివింది) |
The novel was read by Seetha in one day. (నవల సీత చేత ఒక రోజులో చదవబడింది) |
Active voice నుండి Passive voice కు మార్చేటప్పుడు కొన్ని నియమాలు
-
- Active voice లో Verb ఏ రూపంలో (Tense) ఉన్నప్పటికీ, అది Passive voice లోకి మారేటప్పుడు V3 (past participle) రూపంలోకి మారుతుంది.
- Passive voice లో Verb కు ముందు, ఆ వాక్యం ఉండే Tense బట్టి సంబంధిత సహాయక క్రియను చేర్చాల్సి ఉంటుంది.
- Passive voice లో ఆబ్జెక్ట్ స్థానంలో ఉండే సబ్జెక్టు ముందు By, With, To వంటి మాటలను చేర్చాలి.
- Active voice లో సబ్జెక్టు స్థానంలో Pronoun ఉన్నప్పుడు, Passive voice లోకి మారేటప్పుడు, దాన్ని Passive voic రూపానికి మార్చాల్సి ఉంటుంది.
- Active voice లో సబ్జెక్టు స్థానంలోPronoun కాకుండా Noun ఉంటె .. Passive voice అదే Noun ఆబ్జెక్ట్ స్థానంలో రిపీట్ అవుతుంది.
- మనకు అందుబాటులో ఉండే tenses లో కేవలం 8 రకాల tenses మాత్రమే Active voice నుండి Passive voice కు మార్చగలం.
Active voice Example |
Subject + intransitive verb + object He bought a car. (అతను కారు కొన్నాడు) |
Passive voice Example |
Subject + To be (Helping Verb) + V3 (past participle) + By/with/to + object A car was bought by him. (కారు అతని చేత కొనబడింది. |
Change of pronouns in active and passive voice
(Active voice నుండి Passive voice కు మారే సమయంలో Pronouns ల మార్పు)
Active voice | Passive voice |
---|---|
I | Me |
We | Us |
You | You |
He | Him |
She | Her |
It | It |
They | Them |
వాక్యం ఉండే Tense బట్టి Passive voice లో ఉపయోగించాల్సిన Be Form (Helping Verb)
Tense | ‘Be’ form in the Passive Voice |
---|---|
Present Tense | Am, Is, Are |
Past Tense | Was, Were |
Future Tense | Be |
Continuous tense (Present/Past) | Being |
Perfect tense | Been |
వివిధ Tenses వారీగా Active voice నుండి Passive voice మార్పు ఫార్ములా మరియు ఉదాహరణలు
ముందుగా చెప్పినట్లు మనం 8 Tenses మాత్రమే ఆక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్ లోకి మార్చగలం. perfect continuous tense లో ఉండే వాక్యాలను మనం పాసివ్ వాయిస్ లోకి మార్చేందుకు అవకాశం ఉండదు.
Future continuous tense వాక్యాలను కూడా పాసివ్ వాయిస్ లోకి మార్చేందుకు కుదరదు. కావున 12 Tenses లో ఈ 4 tenses బయటకు తీచేస్తే, 8 కాలాలు మాత్రమే మిగులుతాయి.
మనం ఇదివరకే అన్ని కాలాలకు సంబంధించి వాక్య నిర్మాణాన్ని నేర్చుకున్నాం. అవి అన్నీ ఆక్టివ్ వాయిస్ ప్రతిరూపాలుగా ఉంటాయి. ఇప్పుడు ఆ వాక్యాలు పాసివ్ వాయిస్ లోకి మారె సంధర్భంలో చోటు చేసుకునే మార్పులు గమనిద్దాం.
ఈ క్రమంలో మీరు ముఖ్యంగా మూడు అంశాలను గుర్తించాలి. అందులో మొదటిది ఆక్టివ్ వాయిస్ లో వాక్యం ఏ Tense లో ఉండేటప్పటికీ, పాసివ్ వాయిస్ కు వచ్చేసరికి ప్రధాన క్రియా రూపం - Past participle (V3) రూపంలోకి మారుతుంది.
అలానే పాసివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ స్థానంలోకి వచ్చే సబ్జెక్టు ముందు By / With / To మాటలను చేర్చాల్సి ఉంటుంది. ఇక చివరిది ఆక్టివ్ వాయిస్ యందు ఉండే వాక్యం, ఏ Tense యందు ఉందొ గమనించి, ఆ కాలానికి (Tense) చెందిన Be Form (helping verb) ను ప్రధాన క్రియ (V3) ముందు చేర్చాల్సి ఉంటుంది. ఈ మూడు అంశాలు మీరు గుర్తించ గలిగితే మీకు ఆక్టివ్ మరియు పాసివ్ వాయిస్ లపై పట్టు కుదిరినట్లు భావించాలి.
Simple Present Tense
Active Voice | Subject + infinitive (V1) + object |
---|---|
Passive voice | Subject + to be (Am, Is, Are) + past participle (V3) + by object |
Example | Active Voice : Ramesh cares the Dog Passive voice: The Dog is cared by Ramesh |
Present Continuous Tense
Active Voice | Subject + to be (is, am, are) + present participle (V1 + ing) + object |
---|---|
Passive voice | Subject + to be (is, am, are) + being + past participle (V3) + by object |
Example | Active Voice : He is waiting for Devi Passive voice: Devi is being waited by him |
Present Perfect Tense
Active Voice | Subject + Have + V3 ( past participle ) + Object |
---|---|
Passive voice | Subject + Has Been + V3 ( past participle ) + By Object |
Example | Active Voice : I have finished the job Passive voice: The job has been finished by me. |
Simple Past Tense
Active Voice | Subject + Simple Past (V2) + object |
---|---|
Passive voice | Subject + was/were + past participle (V3) + by object |
Example | Active Voice : She cleaned the house Passive voice: The house was cleaned by her |
Past Continuous Tense
Active Voice | Subject + was/were + being + past participle (V1 + ing) + by object |
---|---|
Passive voice | Subject + was/were + being + past participle (V3) + by object |
Example | Active Voice : They were building the house Passive voice: The house being built by them |
Past Perfect Tense
Active Voice | Subject + had + past participle (V3) + object |
---|---|
Passive voice | Subject + had been + past participle (V3) + by object |
Example | Active Voice : I had finished my work Passive voice: My work had been finished by me |
Simple Future Tense
Active Voice | Subject + will/shall + infinitive (V1) + object |
---|---|
Passive voice | Subject + will/shall + be + past participle + by object |
Example | Active Voice : I shall read A Newspaper Passive voice: A Newspaper will be read by me |
Future Perfect Tense
Active Voice | Subject + Shall/will + Have + V3 + Object |
---|---|
Passive voice | Subject + Shall/will + Have been + Past participle (V3) + By Object |
Example | Active Voice : I will have finished the job by Monday Passive voice: The job will have been finished (by me) by Monday. |
Model Verbs విషయంలో ఆక్టివ్ వాయిస్ - పాసివ్ వాయిస్ మార్పులు
Active and Passive voice using May
Active Voice | Subject + may + infinitive + object |
---|---|
Passive voice | Subject + may be + past participle + by object |
Example | Active Voice : He may sell the house. Passive voice: The house may be sold by him. |
Active and Passive voice using Must
Active Voice | Subject + must + infinitive + object |
---|---|
Passive voice | Subject + must be + past participle + by object |
Example | Active Voice : He must finish his duty in a week. Passive voice: His duty must be finished by him in a week. |
Active and Passive voice using Might
Active Voice | Subject + might + infinitive + object |
---|---|
Passive voice | Subject + might be + past participle + by object |
Example | Active Voice : He might meet Devi. Passive voice: Dewi might be met by him. |
Passive voice for “May Have, Might Have, Should Have, Must Have, Ought To Have”
Active Voice | Subject + Above Model verbs + infinitive + object |
---|---|
Passive voice | Subject + Above Model verbs + Been + past participle (V3) + by object |
Example | Active Voice : You may have availed the opportunity. Passive voice: The opportunity may have been availed by you. |