Daily Current Affairs Quiz: 15 January 2025
Telugu Current Affairs Quizzes

Daily Current Affairs Quiz: 15 January 2025

నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(15 జనవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.

1. అఖిల భారత సహకార వారోత్సవాలను ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు?

  1. నవంబర్ 14 - 20
  2. నవంబర్ 12 - 20
  3. నవంబర్ 11 - 20
  4. నవంబర్ 10 - 20
సమాధానం
1. నవంబర్ 14 - 20

2. మానవ అక్రమ రవాణా, బలవంతపు శ్రమతో సహా ఆధునిక బానిసత్వాన్ని ఎదుర్కోవడానికి ఇటీవల ఏ దేశం తొలిసారిగా 'యాంటీ స్లేవరీ కమిషనర్'ను నియమించింది?

  1. అమెరికా
  2. ఇండియా
  3. ఆస్ట్రేలియా
  4. రష్యా
సమాధానం
3. ఆస్ట్రేలియా

3. భారత నావికాదళం దేశవ్యాప్త తీరప్రాంత రక్షణ ఎక్షర్‌సైజ్ 'సీ విజిల్ 24' ఎన్నో ఎడిషన్‌ను 2024, నవంబర్ 20, 21 తేదీల్లో నిర్వహించింది?

  1. నాలుగో ఎడిషన్
  2. మూడో ఎడిషన్
  3. ఐదో ఎడిషన్
  4. రెండో ఎడిషన్
సమాధానం
1. నాలుగో ఎడిషన్

4. ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ - 2024ను ఏ దేశ పురుషుల జట్టు నెగ్గింది?

  1. చైనా
  2. భారత్
  3. నేపాల్
  4. శ్రీలంక
సమాధానం
2. భారత్

5. క్రీడల్లో డోపింగ్‌కు వ్యతిరేకంగా యునెస్కో ఇంటర్నేషనల్ కన్వేషన్‌లో భాగంగా 'కాప్ 9'(కాన్ఫరెన్స్ అఫ్ పార్టీస్) బ్యూరో 2వ అధికార సమావేశం, ఫండ్ అప్రూవల్ కమిటీ 3వ అధికార సమావేశాలను ఇటీవల ఏ నగరంలో నిర్వహించారు?

  1. బీజింగ్
  2. న్యూఢిల్లీ
  3. డాకా
  4. దుబాయ్
సమాధానం
2. న్యూఢిల్లీ

6. 2024 సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 6 వరకు భారతీయ కళా మహోత్సవ్ తొలి ఎడిషన్‌ను ఎక్కడ నిర్వహించారు?

  1. న్యూఢిల్లీ
  2. లక్నో
  3. బెంగుళూరు
  4. విశాఖపట్నం
సమాధానం
1. న్యూఢిల్లీ

7. 2024, సెప్టెంబర్ 11-13 తేదీల్లో గ్రీన్ హైడ్రోజన్‌పై రెండో అంతర్జాతీయ సదస్సును ఎక్కడ నిర్వహించారు?

  1. న్యూఢిల్లీ
  2. హైదరాబాద్
  3. చెన్నై
  4. ముంబై
సమాధానం
1. న్యూఢిల్లీ

8. 2024, సెప్టెంబర్ 15న దూరదర్శన్ ఎన్నో వార్షికోత్సవాన్ని నిర్వహించింది?

  1. 62వ
  2. 63వ
  3. 64వ
  4. 65వ
సమాధానం
4. 65వ

9. ఒలింపిక్ కౌన్సిల్ అఫ్ ఆసియా (ఓసీఏ) అధ్యక్షుడిగా ఇటీవల ఏ భారతీయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు?

  1. రణధీర్ సింగ్
  2. భరత్ సింగ్
  3. రాజా సింగ్
  4. ఎవరూ కాదు
సమాధానం
1. రణధీర్ సింగ్

10. ప్రధాని మోడీ 2024, సెప్టెంబరులో ఏ దేశ పర్యటన సందర్భంగా సెమీ కండక్టర్స్, డిజిటల్ ఎకానమీ, హెల్త్‌కేర్, విధ్యా రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడం అనే ఒప్పందాలపై ఆ దేశ ప్రధానితో కలిసి సంతకాలు చేశారు?

  1. సింగపూర్
  2. దుబాయ్
  3. చైనా
  4. మయన్మార్
సమాధానం
1. సింగపూర్

11. ఏ నగరంలోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంలో వేద-3డి మ్యూజియంను నిర్మించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది?

  1. చెన్నై
  2. వారణాసి
  3. అమరావతి
  4. పూరి
సమాధానం
2. వారాణాసి

12. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల 23వ లా కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఈ కమిషన్ కాల వ్యవధి ఎంత?

  1. మూడేళ్లు
  2. రెండేళ్లు
  3. నాలుగేళ్లు
  4. ఆరేళ్ళు
సమాధానం
1. మూడేళ్లు

13. భారతదేశం తన మొదటి మేడ్-ఇన్ 1 ఇండియా సి 295 విమానాన్ని 2026, సెప్టెంబరు నాటికి ఏ కర్మాగారం నుంచి విడుదల చేయాలని నిర్ణయించింది?

  1. ఎయిర్ ఇండియా
  2. టాటా
  3. వడోదర
  4. ఏదీ కాదు
సమాధానం
3. వడోదర

14. 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ)లో ఎంత మొత్తం విలువైన ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభించారు?

  1. 12,000 కోట్లు
  2. 12,850 కోట్లు
  3. 13,000 కోట్లు
  4. 13,500 కోట్లు
సమాధానం
2. 12,850 కోట్లు

15. 2024, అక్టోబరు 28 ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ (జీఎస్ఎల్) ప్రారంభించిన రెండు స్వదేశీ ఫాస్ట్ పెట్రోలింగ్ నౌకలు ఏవి?

  1. అదమ్య, విక్రమ్
  2. అక్షర్, సమర్ద్
  3. విక్రమ్, అక్షర్
  4. అదమ్య, అక్షర్
సమాధానం
4. అదమ్య, అక్షర్

16. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒకే రోజు 11లక్షలకు పైగా మొక్కలు నాటి రికార్డ్ సృష్టించింది?

  1. కేరళ
  2. మహారాష్ట్ర
  3. మధ్యప్రదేశ్
  4. ఒడిశా
సమాధానం
3. మధ్యప్రదేశ్

17. నేపాల్ నూతన ప్రధాన మంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు?

  1. సింఘా దర్బార్
  2. కె.పి శర్మ ఓలి
  3. పుష్ప కమల్ దహల్
  4. చంద్ర షంషేర్ జంగ్
సమాధానం
2. కె.పి శర్మ ఓలి

18. భారత్‌లో ఏ సంవత్సరం నాటికి వృద్ధుల జనాభా రెట్టింపు అవుతుందని ఐక్యరాజ్యసమితి జనాభా కార్యకలాపాల నిధి వెల్లడించింది?

  1. 2040
  2. 2030
  3. 2060
  4. 2050
సమాధానం
4. 2050

19. నెదర్లాండ్స్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణస్వీకారం చేశారు?

  1. డిక్ షూఫ్
  2. బారెండ్ బీషూవెల్
  3. శ్రీ మార్క్ రుట్టే
  4. బెంజమిన్ నెతన్యాహు
సమాధానం
1. డిక్ షూఫ్

20. 'ఫానా ఆఫ్ ఇండియా చెక్ లిస్ట్' పేరుతో భారతదేశం మొత్తం ఎన్ని జాతులను పేర్కొంది?

  1. 1,04,561
  2. 1,01.654
  3. 1,08,010
  4. 1,32,021
సమాధానం
1. 1,04,561

21. 16వ ఆర్ధిక సంఘం ఎంత మంది సభ్యులతో ఓ సలహా మండలిని ఏర్పాటు చేసింది?

  1. ఐదుగురు
  2. నలుగురు
  3. ఇద్దరు
  4. ముగ్గురు
సమాధానం
1. ఐదుగురు

22. జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా ఎవరు నియమితులయ్యారు?

  1. డాక్టర్ హర్షవర్ధన్
  2. ప్రొఫెసర్ స్వామినాథన్
  3. కె. పూనమ్ గుప్త
  4. ఎన్. మిశ్రా
సమాధానం
2. ప్రొఫెసర్ స్వామినాథన్

23. కోపా అమెరికా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌ 2024ను ఏ దేశం గెలుచుకుంది?

  1. ఆస్ట్రేలియా
  2. కొలంబియా
  3. అర్జెంటీనా
  4. ఫ్రాన్స్
సమాధానం
3. అర్జెంటీనా

24. ఇటీవల ఏ దేశంలో జరిగిన అంతర్జాతీయ సైకత శిల్పాల చాంపియన్‌షిప్‌లో ప్రఖ్యాత భారత సైకత శిల్ప కళాకారుడు సుదర్షన్ పట్నాయక్ 'గోల్డెన్ శాండ్‌మాస్టర్' అవార్డును గెలుచుకున్నారు?

  1. ఇండియా
  2. అమెరికా
  3. రష్యా
  4. జర్మనీ
సమాధానం
3. రష్యా

25. 1901 నుంచి నమోదవుతున్న ఉష్ణోగ్రతలను పరిశిలించి ఇటీవల భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఏ సంవత్సరాన్ని అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందని వెల్లడించింది?

  1. 2022
  2. 2023
  3. 2021
  4. 2024
సమాధానం
4. 2024

26. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ను ఏర్పాటు చేసింది, ఈ కమిషన్‌కు చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?

  1. ఎన్. వెంకటరామిరెడ్డి
  2. వై. కోదండరామిరెడ్డి
  3. ఎం. కోదండరెడ్డి
  4. ఎవరూ కాదు
సమాధానం
3. ఎం. కోదండరెడ్డి

27. ఇటీవల కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నిర్వహించిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ -2024 అవార్డుల్లో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది?

  1. సూరత్
  2. జబల్‌పూర్
  3. ఆగ్రా
  4. విజయవాడ
సమాధానం
1. సూరత్

28. ఒకేసారి దాదాపు 10 అణ్వాయుధ వార్‌హెడ్‌లను మోసుకెళ్లే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం)ను ఇటీవల విజయవంతంగా పరీక్షించిన దేశం?

  1. రష్యా
  2. అమెరికా
  3. చైనా
  4. ఉత్తరకొరియా
సమాధానం
3. చైనా

29. భారీ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన మయన్మార్, లాహోస్, వియాత్నం దేశాలను ఆదుకోవడానికి 'ఆపరేషన్ సద్భావ్' పేరుతో ఏ దేశం అత్యవసర సామాగ్రి పంపించింది?

  1. భారత్
  2. చైనా
  3. రష్యా
  4. అమెరికా
సమాధానం
1. భారత్

30. పేద, ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్ళు పైబడిన వారందరికీ కేంద్ర ప్రభుత్వం ఎంత ఉచిత వార్షిక ఆరోగ్య బీమా ప్రకటించింది?

  1. 2 లక్షలు
  2. 3 లక్షలు
  3. 4 లక్షలు
  4. 5 లక్షలు
సమాధానం
4. 5 లక్షలు

Post Comment