Daily Current Affairs Quiz: 13 January 2025
Telugu Current Affairs Quizzes

Daily Current Affairs Quiz: 13 January 2025

నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(13 జనవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.

1. ఇటీవల 16వ 'బ్రిక్స్ సమావేశం' ఎక్కడ జరిగింది ?

  1. రష్యా
  2. చైనా
  3. అమెరికా
  4. ఇండియా
సమాధానం
1. రష్యా

2. బ్రిక్స్ (BRICS) యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి?

  1. సభ్య దేశాల మధ్య రాజకీయ మరియు భద్రతా సహకారం
  2. క్రీడలు, సంస్కృతి మార్పిడి ద్వారా సామజిక మరియు ఆర్థిక అభివృద్ధిని బలోపేతం చేయటం
  3. పై రెండూ సరైనవే
  4. పైవేవీ కావు
సమాధానం
3. పై రెండూ సరైనవే

3. మనీలాండరింగ్ కేసులో పబ్లిక్ సర్వెంట్లను విచారణ చేయటానికి సెక్షన్ 197(1) ప్రకారం ముందస్తు ప్రభుత్వ అనుమతి అవసరమని ఏ కోర్టు తీర్పునిచ్చింది?

  1. సుప్రీం కోర్టు
  2. జిల్లాకోర్టు
  3. హైకోర్టు
  4. ఏదీకాదు
సమాధానం
1. సుప్రీం కోర్టు

4. ఇటీవల కీలక ఔషదాల ధరలు ఎంత శాతం పెంచుతున్నట్లు నేషనల్ ఫార్మాస్యూటికల్ ఫ్రైసింగ్ (ఎన్‌పిపిఏ) అఫ్ ఇండియా ప్రకటించింది?

  1. 20%
  2. 10%
  3. 50%
  4. 30%
సమాధానం
3. 50%

5. 2024 ఐఎమ్‌డీ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా భారత్ స్థానం ఎంత?

  1. 58వ స్థానం
  2. 25వ స్థానం
  3. 44వ స్థానం
  4. 65వ స్థానం
సమాధానం
1. 58వ స్థానం

6. క్షయవ్యాధి సంభవనీయతను పరిష్కరించడానికి వంద రోజుల ప్రచార కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు?

  1. జేపీ నడ్డా
  2. మనసుఖ్ మాండవీయ
  3. అమిత్ షా
  4. మోదీ
సమాధానం
1. జేపీ నడ్డా

7. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ఏ రోజున జరుపుకొంటారు?

  1. డిసెంబర్ 5
  2. డిసెంబర్ 7
  3. డిసెంబర్ 9
  4. డిసెంబర్ 11
సమాధానం
3. డిసెంబర్ 9

8. వోకార్డు మద్దతుతో ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ అభివృద్ధి చేసిన మొదటి స్వదేశీ యాంటీబయాటిక్ పేరు?

  1. అమినోగ్లైకోసైడ్స్
  2. నైట్రోఫురంటోయిన్
  3. నాఫిత్రోమైసిన్
  4. ట్రిమెథోప్రిమ్
సమాధానం
3. నాఫిత్రోమైసిన్

9. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?

  1. రణతుంగ
  2. షమ్మి సిల్వా
  3. కుశాల్ పెరీరా
  4. చరిత్ రజిత
సమాధానం
2. షమ్మి సిల్వా

10. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్సంగ్ సైనీ హర్యానాలోని కురుక్షేత్రలో అంతర్జాతీయ గీతా మహోత్సవాన్ని ఆవిష్కరించారు. 2024 ఇంటర్నేషనల్ గీతా మహోత్సవంలో ఏ దేశం భాగస్వామిగా ఉంది?

  1. ఫ్రాన్స్
  2. ఒమన్
  3. నేపాల్
  4. టాంజానియా
సమాధానం
4. టాంజానియా

11. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా రిలయన్స్ సెక్యూరిటీస్‌పై మార్కెట్ నిబంధనలు, స్టాక్ బ్రోకర్ నియమాలను ఉల్లంఘించినందుకు ఎంత ద్రవ్య పెనాల్టీని విధించింది?

  1. రూ. 50 లక్షలు
  2. రూ. 5 లక్షలు
  3. రూ. 22 లక్షలు
  4. రూ. 9 లక్షలు
సమాధానం
4. రూ. 9 లక్షలు

12. గత డిసెంబర్లో నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మొహాలీ సహకారంతో సీనియర్ లీడర్స్ కోసం డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ పేరుతో ఐదు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది, నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ ఏ మంత్రిత్వ శాఖ కింద వస్తుంది?

  1. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ
  2. మినిస్ట్రీ ఆఫ్ హోంఅఫైర్స్
  3. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
  4. పైవేవికావు
సమాధానం
3. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

13. ఏ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫాం మోసపూరిత యూని ఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ నుంచి రక్షణతో సహా డిజిటల్ మోసాలకు వ్యతిరేకంగా లావాదేవీలు కవరేజీని అందించడానికి రక్షణ ప్రణాళిక షీల్డ్‌ను ప్రారంభించింది?

  1. ఫోన్ పే
  2. గూగుల్ పే
  3. భారత్ పే
  4. పేటీఎం
సమాధానం
3. భారత్ పే

14. ప్రత్యేక పరిష్కారం కోసం రూపొందించిన మహిళల ఆర్థిక అవసరాలు తీర్చడానికి ఏ బ్యాంకు ఏఆర్ ఎస్ఈ ఉమెన్స్ సేవింగ్స్ ఖాతాను ప్రారంభించింది?

  1. యస్ బ్యాంకు
  2. ఐసీఐసీఐ బ్యాంకు
  3. యాక్సిస్ బ్యాంకు
  4. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు
సమాధానం
2. ఐసీఐసీఐ బ్యాంకు

15. యూపీఐ లైట్‌లో ప్రతి లావాదేవీల పరిమితులను రూ.500 నుంచి ఎంతవరకు పెంచారు, యూపీఐ లైట్ మొత్తం వాలెట్ పరిమితి రూ.2000 నుంచి ఎంతకు పెంచారు?

  1. 1000:10,000
  2. 1000:8000
  3. 2000:5000
  4. 1000:5000
సమాధానం
4. 1000:5000

16. 'రిమ్‌టాల్బాజీన్ ఇమ్మాన్యుయేల్ జాడ్రాగో' ఏ దేశ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు?

  1. కెన్యా
  2. నైజీరియా
  3. ఘానా
  4. బుర్కినా ఫాసో
సమాధానం
4. బుర్కినా ఫాసో

17. రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ 2024 ఎక్కడ నిర్వహించారు?

  1. జైపూర్
  2. ఉదయ్‌పూర్
  3. జైసల్మీర్
  4. జోధ్‌పూర్
సమాధానం
1. జైపూర్

18. ఇంధన సామర్థ్య ఉపకరణాలను ప్రోత్సహించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం 'ఉరజ్ వీర్ పథకాన్ని' ప్రారంభించింది?

  1. ఆంధ్రప్రదేశ్
  2. కర్ణాటక
  3. మహారాష్ట్ర
  4. గుజరాత్
సమాధానం
1. ఆంధ్రప్రదేశ్

19. కమిషన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్ 68వ సెషన్‌కు అధ్యక్షత వహించడానికి ఏ దేశం ఎంపికైంది?

  1. చైనా
  2. ఇండియా
  3. రష్యా
  4. ఆస్ట్రేలియా
సమాధానం
2. ఇండియా

20. ఐఎన్ఎస్ తుశీల్ ఏ తరగతి యుద్ధనౌక?

  1. క్రివాక్ థర్డ్ క్లాస్ ఫ్రిగేట్
  2. శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్
  3. గోదావరి క్లాస్ ఫ్రిగేట్
  4. హంటర్ క్లాస్ ఫ్రిగేట్
సమాధానం
1. క్రివాక్ థర్డ్ క్లాస్ ఫ్రిగేట్

21. పానిపట్ విద్యను మెరుగుపరచడం, మహిళలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ఏ పథకాన్ని ప్రారంభించారు?

  1. మిషన్ శక్తి
  2. మహిళా శక్తి కేంద్ర
  3. బీమా శక్తి యోజన
  4. వన్ స్టాప్ సెంటర్
సమాధానం
3. బీమా శక్తి యోజన

22. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూచీకత్తు రహిత వ్యవసాయ రుణాల పరిమితి ప్రస్తుతం ఉన్న రూ. 1.6 లక్షల నుంచి రుణ గ్రహీతకు ఎన్ని రూపాయలకు పెంచింది?

  1. రూ. 2 లక్షలు
  2. రూ. 3 లక్షలు
  3. రూ. 4 లక్షలు
  4. రూ. 5 లక్షలు
సమాధానం
1. రూ. 2 లక్షలు

23. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 26వ గవర్నర్‌గా ఎవరు నియమితులయ్యారు?

  1. సంజయ్ మల్హోత్ర
  2. శక్తికాంతదాస్
  3. ఉర్జిత్ పటేల్
  4. సంజయ్ మూర్తి
సమాధానం
1. సంజయ్ మల్హోత్ర

24. మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం దేశ రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో ఎంత శాతానికి పడిపోయిందని అంచనా వేశారు?

  1. 6.21 శాతం
  2. 5.53 శాతం
  3. 5.23 శాతం
  4. 4.64 శాతం
సమాధానం
2. 5.53 శాతం

25. ప్రధాని మోదీ ఓఎన్‌జీసీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మారిటైమ్ సర్వైవల్ ట్రైనింగ్ సెంటర్‌ను ఎక్కడ ప్రారంభించారు?

  1. గోవా
  2. గుజరాత్
  3. మహారాష్ట్ర
  4. కేరళ
సమాధానం
1. గోవా

26. రూ.6,200 కోట్ల రుణాలు సమీకరించడమే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా ఎమ్ఎస్ఎమ్ ఈ క్లస్టర్ ప్రోగ్రామ్‌ను హోస్ట్ చేస్తున్న ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకు ఏది?

  1. ఇండియాన్ బ్యాంకు
  2. ఎస్‌బీఐ బ్యాంకు
  3. పీఎన్‌బీ
  4. కెనరా బ్యాంకు
సమాధానం
4. కెనరా బ్యాంక్

27. ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డ్స్ 2024, డిసెంబర్ 8న ముంబైలో జరిగింది. ఇందులో ప్రముఖ టీవీ నటుడిగా ఎవరు గుర్తింపు పొందారు?

  1. హర్షద్ చోప్డా
  2. స్వాతి లక్రా
  3. ప్రణాళి రాథోడ్
  4. పుపోలి గంగూలి
సమాధానం
1. హర్షద్ చోప్డా

28. అంతర్జాతీయ పర్వత దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?

  1. డిసెంబర్ 11
  2. డిసెంబర్ 10
  3. డిసెంబర్ 14
  4. డిసెంబర్ 18
సమాధానం
1. డిసెంబర్ 11

29. యూఎన్‌జీఏ ఏ తేదీన ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించింది?

  1. డిసెంబర్ 11
  2. డిసెంబర్ 18
  3. డిసెంబర్ 21
  4. డిసెంబర్ 19
సమాధానం
3. డిసెంబర్ 11

30. యూనిసెఫ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?

  1. డిసెంబర్ 8
  2. డిసెంబర్ 10
  3. డిసెంబర్ 11
  4. డిసెంబర్ 15
సమాధానం
3. డిసెంబర్ 11

Post Comment