Daily Current Affairs Quiz: 19 January 2025
Telugu Current Affairs Quizzes

Daily Current Affairs Quiz: 19 January 2025

నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(19 జనవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.

1. ఏ దేశాలు అధికారికంగా యూరోపియన్ యూనియన్ సరిహద్దు రహిత స్కెంజెన్‌లో సభ్య దేశాలుగా మారాయి?

  1. రొమేనియా, బల్గేరియా
  2. బల్గేరియా, క్రొయేషియా
  3. బల్గేరియా, స్లోవేనియా
  4. స్లోవేనియా, స్లోవేకియా
సమాధానం
1. రొమేనియా, బల్గేరియా

2. భారతదేశంలో మొదటి గాజు వంతెన ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?

  1. మహారాష్ట్ర
  2. గోవా
  3. తెలంగాణ
  4. తమిళనాడు
సమాధానం
4. తమిళనాడు

3. కింది వారిలో ఎవరికి 2024 మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు రాలేదు?

  1. ప్రవీణ్ కుమార్
  2. సాజన్ ప్రకాశ్
  3. మను భాకర్
  4. డి.గుకేష్
సమాధానం
2. సాజన్ ప్రకాశ్

4. 'స్టంప్డ్ లైఫ్ బిహైండ్ అండ్ బియాండ్ ద ట్వంటీ 'టు యార్డ్స్' ఆత్మకథ రచయిత?

  1. అరుణ్ సింగ్
  2. జై శంకర్
  3. సయ్యద్ కిర్మాణీ
  4. రంగనాథ్ మిశ్రా
సమాధానం
3. సయ్యద్ కిర్మాణీ

5. ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ 2024 విజేత ఎవరు?

  1. హరియాణా స్టీలర్స్
  2. తమిళ్ తలైవాస్
  3. పట్నా పైరెట్స్
  4. తెలుగు టైటాన్స్
సమాధానం
1. హరియాణా స్టీలర్స్

6. అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ (39వ అధ్యక్షుడు) ఇటీవల మరణించారు. ఆయన ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి పొందారు?

  1. 2003
  2. 2002
  3. 2005
  4. 2001
సమాధానం
2. 2002

7. సంతోష్ ట్రోఫీ (ఫుట్ బాల్)–2024 విజేత ఎవరు?

  1. హరియాణా
  2. కేరళ
  3. గుజరాత్
  4. పశ్చిమ బెంగాల్
సమాధానం
4. పశ్చిమ బెంగాల్

8. కింది వాటిలో ఏ దేశం 2025-26 రెండేళ్ల కాలానికి యూఎన్ఓ భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశంగా చేరలేదు?

  1. ఇండియా
  2. డెన్మార్క్
  3. గ్రీస్
  4. పాకిస్థాన్
సమాధానం
1. ఇండియా

9. ఇటీవల మరణించిన కె.ఎస్. మణిలాల్ ఏ రంగానికి చెందినవారు?

  1. ప్రముఖ వైద్యులు
  2. ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త
  3. ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త
  4. ప్రముఖ రాజకీయ నాయకుడు
సమాధానం
2. ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త

10. ఇటీవల మరణశిక్షను రద్దు చేసిన దేశం ఏది?

  1. నైజీరియా
  2. జింబాబ్వే
  3. సోమాలియా
  4. ఫిజీ
సమాధానం
2. జింబాబ్వే

11. ఇటీవల ఏ రాష్ట్రాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ 'గో-టు గ్లోబల్ డెస్టినేషన్స్ ఫర్ 2025'గా గుర్తించింది?

  1. మధ్యప్రదేశ్
  2. గోవా
  3. కేరళ
  4. రాజస్థాన్
సమాధానం
1. మధ్యప్రదేశ్

12. నీడిల్ రహిత షాక్ సిరంజీని అభివృద్ధి చేసిన ఐఐటీ ఏది?

  1. ఐఐటీ ఖరగ్‌పూర్
  2. ఐఐటీ మద్రాసు
  3. ఐఐటీ రూర్కీ
  4. ఐఐటీ బాంబే
సమాధానం
2. ఐఐటీ మద్రాసు

13. ఔషధాలకు లొంగని మొండి మలేరియాను ఎదుర్కోవడానికి ఏ దేశ శాస్త్రవేత్తలు ఇటీవల కీలక సమాచారాన్ని కనుక్కున్నారు?

  1. అమెరికా
  2. చైనా
  3. ఇండియా
  4. రష్యా
సమాధానం
1. అమెరికా

14. ఏ దేశం అధికారం, శక్తికి 242 ఏళ్లుగా ప్రతిగా నిలుస్తున్న 'బాల్డ్ ఈగల్'ను ఆ దేశ జాతీయ పక్షిగా ప్రకటించింది?

  1. రష్యా
  2. కెనడా
  3. మెక్సికో
  4. అమెరికా
సమాధానం
4. అమెరికా

15. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?

  1. జస్టిస్ వి.రామసుబ్రమణియన్
  2. జస్టిస్ లావు నాగేశ్వరరావు
  3. ప్రియాంక్ కనూంగో
  4. బిద్యుత్ రంజన్
సమాధానం
1. జస్టిస్ వి.రామసుబ్రమణియన్

16. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సామర్థ్య అభివృద్ధి కోసం కేంద్రం ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది?

  1. సంజీవ్ కుమార్
  2. రాజేష్ కుమార్ సింగ్
  3. టి.సింగ్
  4. సమీర్ వి.కామత్
సమాధానం
2. రాజేష్ కుమార్ సింగ్

17. ఏ దేశ నూతన ప్రధానిగా అల్ సేక్ వాలు ఇకె నియమితులయ్యారు?

  1. తువాలు
  2. టోంగా
  3. నౌరు
  4. ఫిజీ
సమాధానం
2. టోంగా

18. వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా ఇటీవల ఏ నగరంలో విగ్రహాన్ని ఆవిష్కరించారు?

  1. ఇండోర్
  2. భోపాల్
  3. లఖ్‌నవూ
  4. ఢిల్లీ
సమాధానం
3. లఖ్‌నవూ

19. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఏఆర్) డైరెక్టర్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?

  1. చెరుకుపల్లి శ్రీనివాసరావు
  2. ఎం.రంజిత్ సింగ్
  3. ఆర్.కమల్ నాథ్
  4. ఆర్.రామ్మోహన్ రావు
సమాధానం
1. చెరుకుపల్లి శ్రీనివాసరావు

20. అండర్-19 మహిళల టీ 20 క్రికెట్ టోర్నీ విజేత?

  1. పాకిస్థాన్
  2. ఇండియా
  3. బంగ్లాదేశ్
  4. నేపాల్
సమాధానం
2. ఇండియా

21. దేశంలో తొలి 'బయో - బిటుమెన్' హైవే (జీవవదార్థంతో తారు తయారుచేసి రహదారి వేస్తారు) ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది?

  1. రాజస్థాన్
  2. గోవా
  3. మహారాష్ట్ర
  4. తెలంగాణ
సమాధానం
3. మహారాష్ట్ర

22. ట్రాజన్ 155 mm టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్‌ను భారతదేశం మరియు ఏ దేశం అభివృద్ధి చేసింది?

  1. జపాన్
  2. ఫ్రాన్స్
  3. రష్యా
  4. అమెరికా
సమాధానం
2. ఫ్రాన్స్

23. బహుళజాతి వ్యాయామం LA పెరోస్ యొక్క నాల్గవ ఎడిషన్‌లో ఏ భారతీయ నౌకాదళ నౌక (INS) పాల్గొంది?

  1. INS ముంబై
  2. INS విక్రాంత్
  3. INS కోల్‌కతా
  4. INS సూరత్
సమాధానం
1. INS ముంబై

24. 'వై భారత్ మేటర్స్' పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించారు?

  1. ఎస్. జై శంకర్
  2. జె.పి నడ్డా
  3. అమిత్ షా
  4. ఎవరూ కాదు
సమాధానం
1. ఎస్. జై శంకర్

25. గ్లోబల్ స్పోర్ట్స్ డెస్టినేషన్‌గా దుబాయ్ ఖ్యాతిని పెంపొందించడమే లక్ష్యంగా ఇటీవల దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ తన స్పోర్ట్స్ అంబాసిడర్‌లుగా ఎవరిని నియమించింది?

  1. హర్భజన్
  2. సానియా మీర్జా
  3. ప్యాట్రిస్ ఎవ్రా
  4. పై అందరూ
సమాధానం
4. పై అందరూ

26. ఇటీవల ఏ రాష్ట్రంలోని 24 తీరప్రాంత గ్రామాలకు యునెస్కోకు చెందిన ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రాఫిక్ కమిషన్ 'సునామీ రెడీ' గ్రామాలుగా గుర్తింపు ఇచ్చింది?

  1. గోవా
  2. కేరళ
  3. ఒడిశా
  4. ఆంధ్రప్రదేశ్
సమాధానం
3. ఒడిశా

27. ఏ దేశ రాజ కుటుంబానికి చెందిన యువరాణి మికాసా (101) ఇటీవల మరణించారు?

  1. బ్రెజిల్
  2. జపాన్
  3. అర్జెంటీనా
  4. ఇజ్రాయెల్
సమాధానం
2. జపాన్

28. 2025,అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ అమెరికా ఎన్నివ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు?

  1. 25వ
  2. 45వ
  3. 47వ
  4. 33వ
సమాధానం
3. 47వ

29. ప్రపంచ ఇండోర్ ఆర్చరీ సిరీస్ టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఏ పతకం గెలిచింది?

  1. రజతం
  2. స్వర్ణం
  3. కాంస్యం
  4. నాల్గవ స్థానం
సమాధానం
2. స్వర్ణం

30. 2024, వరి సాగు, ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది?

  1. ఆంధ్రప్రదేశ్
  2. తమిళనాడు
  3. తెలంగాణ
  4. పంజాబ్
సమాధానం
3. తెలంగాణ

Post Comment