పీఎంకేవీవై పథకం ఎలిజిబిలిటీ మరియు రిజిస్ట్రేషన్
Skill development schemes

పీఎంకేవీవై పథకం ఎలిజిబిలిటీ మరియు రిజిస్ట్రేషన్

పీఎం కౌష‌ల్ వికాస్ యోజ‌న (పీఎంకేవీవై) అనేది నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా అమలు చేయబడుతున్న స్కిల్ డెవలప్‌మెంట్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ (MSDE) యొక్క ప్రధాన పథకం.

Advertisement

నిరుద్యోగ మరియు కాలేజీ డ్రాపౌట్ యువతకు పరిశ్రమలకు సరిపోయే నైపుణ్య అభివృద్ధి శిక్షణ అందించి, వారికీ ఉపాధి కల్పించే లక్ష్యంతో 2015 లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రారంభించారు.

స్కిల్ ఇండియా మిషన్

“స్కిల్ ఇండియా మిషన్” లో భాగంగా భారతదేశాన్ని ప్రపంచ ‘నైపుణ్య రాజధానిగా మార్చాలనే లక్ష్యంతో వచ్చిన మొదటి పథకం ఇది. ఈ పథకం ద్వారా 2022 నాటికీ దాదాపు 50 కోట్ల మంది భారతీయ యువతకు నైపుణ్య శిక్షణ అందించి, ఉపాధి కల్పించేడమే లక్ష్యంగా ఈ పథకం రూపొందించారు.

ఈ స్కిల్ సర్టిఫికేషన్ స్కీమ్ అమలు చేసేందుకు దేశవ్యాప్తంగా 700 జిల్లాల్లో 800 లకు పైగా ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రాలు (పిఎంకెకెలు) ఏర్పాటు చేసారు. వీటితో పాటుగా 200 కి పైగా ఐటిఐలు మరియు పిఎంకెకెలు కాని ఇతర శిక్షణ సంస్థలు కూడా ఉన్నాయి. ఇందులో అభ్యర్థులు కోరుకునే నైపుణ్య శిక్షణ కోర్సులు మూడు నెలల నుండి ఏడాది నిడివితో అందిస్తారు.

నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ (NSQF) ప్రకారం శిక్షణ ఇవ్వడమే కాకుండా, వ్యక్తిగత అభివృద్ధికి అవసరమయ్యే సాఫ్ట్ స్కిల్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫైనాన్షియల్ మరియు డిజిటల్ లిటరసీ అంశాల యందు ప్రత్యేక శిక్షణ అందిస్తారు. ఈ శిక్షణ కార్యక్రమాలు అన్ని నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) ద్వారా అమలు చేయబడతాయి.

ప్రధానమంత్రి స్కిల్ డెవలప్ మెంట్ స్కీం (పీఎంకేవీవై) ట్రైనింగ్ తీసుకోవడానికి ఎలాంటి పీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా,  యువతకు అంతర్జాతీయ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే విదంగా శిక్షణ అందిస్తారు. ఇందులో భాగంగా యాడ్-ఆన్ బ్రిడ్జ్ కోర్సులు, అంతర్జాతీయ భాషలను కూడా నేర్పిస్తారు.  ట్రైనింగ్ విజయవంతంగా పూర్తిచేసిన వారికీ ప్రభుత్వమే రూ.8000ల వరకు ఫ్రైజ్ మనీగా అందిస్తుంది. దీనితో పాటుగా కోర్సు పూర్తిచేసిన తర్వాత సర్టిఫికేట్ కూడా అందిస్తారు.

ట్రైనింగ్ పొందిన వారిలో 50% మందికి ప్లేస్‌మెంట్ కల్పిస్తారు. దీని కోసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి వివిధ పరిశ్రమలను ఆహ్వానించి కౌశల్ లేదా రోజ్‌గర్ ఉద్యోగ మేళ నిర్వహిస్తారు. అలానే వ్యాపారం చేసే ఆలోచన ఉన్నవారికి బిజినెస్ లోన్స్ కూడా అందిస్తారు. పీఎంకేవీవై సర్టిఫికెట్ పొందినవారికి జాబ్ రిస్క్ భయాన్ని కవర్ చేసేందుకు మూడేళ్ళ వరకు కౌశల్ బీమా పేరుతో 2 లక్షల వరకు ప్రమాద బీమా కల్పిస్తారు.

పీఎంకేవీవై 3.0 లో భాగంగా అదనపు ప్రయోజనాలతో మహిళలకు, వికలాంగులకు, ట్రాన్స్ జండర్లకు కొత్తగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి, వారి స్వశక్తితో ఎదిగే అవకాశం కల్పిస్తున్నారు. పీఎంకేవీవై 3.0 లో ఎన్రోల్ అయినా ప్రతి ట్రైనీకి జాకెట్, డైరీ, ఐడీ కార్డు హోల్డర్ మరియు బ్యాక్ ప్యాక్ తో కూడిన ఇండక్షన్ కిట్ అందిస్తున్నారు.

పీఎంకేవీవై ఎలిజిబిలిటీ

  • భారతీయ జాతీయత కలిగిన అభ్యర్థులు.
  • నిరుద్యోగ యువత లేదా పాఠశాల/కళాశాల డ్రాపౌట్‌ అభ్యర్థులు.
  • అభ్యర్థులు ఆధార్ కార్డు మరియు బ్యాంకు అకౌంట్ కలిగి ఉండాలి.
  • ఈ పథకం పరిధిలో ప్రస్తుతం చదువుకుంటున్న లేదా ఉద్యోగం చేస్తున్న అభ్యర్థులు అనర్హులు.

పీఎంకేవీవై దరఖాస్తు విధానం

ఆసక్తి గల అభ్యర్థులు www.pmkvyofficial.org వెబ్‌సైట్‌లో ద్వారా మీకు ఆసక్తి ఉండే జాబ్ సెక్టార్ లేదా జాబ్ రోల్ ఆధారంగా మీకు దగ్గరలో ఉండే ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రాల (పిఎంకెకెలు) ను గుర్తించి వాటి వివరాలు పొందవచ్చు. ఆ తర్వాత దశలో సంబంధిత ధ్రువపత్రాలతో సంబంధిత పిఎంకెకెలను సంప్రదించడం ద్వారా నైపుణ్య శిక్షణకు రిజిస్టర్ అవ్వవచ్చు.

ప్ర‌ధాన మంత్రి కౌష‌ల్ వికాస్ యోజ‌నలో సుమారు 30 జాబ్ సెక్టర్లలో 300 పైగా జాబ్ రోల్స్ యందు శిక్షణ అందిస్తున్నారు. ఇందులో అగ్రికల్చర్, ఆటోమోటివ్, ఏవియేషన్, బ్యూటీ, డొమెస్టిక్ వర్కర్స్, ఎలక్ట్రానిక్స్ & హార్డ్వేర్, ఫుడ్ ఫ్రొసెసింగ్, ఫర్నిచర్, హ్యాండీక్రాఫ్ట్స్, హెల్త్ కేర్, లాజిస్టిక్స్, మీడియా, మైన్స్, ఐరన్, స్టీల్, లెథర్, పవర్, టెలికామ్, టెక్సటైల్స్, రబ్బర్, టూరిజం & హాస్పిటాలిటీ వంటివి ఇంకెన్నో ఉన్నాయి.

Recognition of Prior Learning

ఇది వరకే ఉద్యోగం, బిజినెస్ లేదా అనధికారిక శిక్షణ కేంద్రాలలో నైపుణ్యం పొందిన అభ్యర్థులకు ముందస్తు అభ్యాస గుర్తింపు (RPL) కింద నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ (NSQF) ప్రకారం సర్టిఫికేట్ అందిస్తారు. దీని కొరకు అభ్యర్థులకు 6 గంటల నిడివితో బ్రిడ్జ్ కోర్సు నిర్వహించి, అభ్యర్థి ఇదివరకు పొందిన నైపుణ్యత ప్రావీణ్యత అంచనా వేస్తారు. ఇందులో అర్హుత పొందిన వారికీ పీఎం స్కిల్ డెవలప్ మెంట్ స్కీం (పీఎంకేవీవై) సర్టిఫికెట్ అందిస్తారు.

Advertisement

Post Comment