తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రవేశాలు
2021-2022
2021 -22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలను తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ మరియు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మే 25, 2021 నుండి జులై 5, 2021 వరకు అడ్మిషన్ ప్రక్రియ నిర్వహించబోతున్నాట్లు వెల్లడించారు. కరోనా నేపథ్యంలో అడ్మిషన్ టెస్టులు నిర్వహించే సమయం లేకపోవడం వలన, అన్ని రకాల కాలేజీల్లో టెన్త్ క్లాస్ యందు విద్యార్థి సాధించి గ్రేడ్ పాయింట్స్ (GP) ఆధారంగా ప్రవేశాలు చేపట్టాలని ఆర్డర్స్ జారీ చేశారు. కాబట్టి, విద్యార్థులు తమ ఒరిజినల్ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ మరియు ట్రాన్సఫర్ సర్టిఫికెట్ (TC) సమర్పించి తమకు అందుబాటులో ఉండే జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు పొందొచ్చు.
అడ్మిషన్స్ ప్రారంభ తేదీ | 25/07/2021 |
అడ్మిషన్ చివరి తేదీ | 05/07/2021 |
ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభం | 01/06/2121 |
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఆన్‌లైన్ ప్రవేశాలు 2021-22
రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్న 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ ఏడాది ఇంటర్మీడియట్ ప్రవేశాలు ఆన్‌లైన్ పద్దతిలో చేపట్టనున్నారు. రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి పోర్టల్ ద్వారా విద్యార్థి తమ SSC హాల్ టికెట్ మరియు వ్యక్తిగత వివరాలు నమోదు చేసి, తమ జిల్లా పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మొదటి ఏడాది ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశాలు టెన్త్ క్లాస్ యందు విద్యార్థి సాధించి గ్రేడ్ పాయింట్స్ (GP) మెరిట్ ఆధారంగా కల్పిస్తారు. ఈ కింది లింకును ఉపయోగించి, సంబంధిత వివరాలు నింపడం ద్వారా మీరు నేరుగా ప్రవేశాలు పొందొచ్చు.