ఆంధ్రప్రదేశ్ డిపార్టుమెంట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ 2018 నుండి స్వల్పకాలిక లైబ్రరీ కోర్సులను కడప, విజయవాడ మరియు గుంటూరు కేంద్రాలుగా ఈ కోర్సులను అందిస్తుంది. నాలుగు నుండి ఐదు నెలల నిడివితో ఉండే ఈ కోర్సులను డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది.
నాలుగు నెలల లైబ్రరీ సైన్స్ కోర్సులో చేరేందుకు పది ఉత్తీర్ణతయి ఉండాలి. ఐదు నెలల నిడివితో ఉండే కోర్సులలో చేరేందుకు ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండాలి. లైబ్రరీ సైన్స్ కోర్సులు ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నాయి. ఒక్కో మీడియంలో 120 సీట్లు ఉన్నాయి.
ప్రతీ కోర్సులో 33 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తారు. గ్రాడ్యుయేషన్ లేదా పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్థులకు 10 మార్కులు అదనంగా జేతచేస్తారు. ఈ కోర్సులకు సంబంధించి మరిన్ని వివరాల కోసం డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ మరియు పొట్నూరి నాగభూషణం స్కూల్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ యందు సంప్రదించగలరు.