Advertisement
బిజినెస్ లేదా కంపెనీ రిజిస్ట్రేషన్ | కంపెనీ రిజిస్ట్రేషన్ రకాలు
Entrepreneur Guide

బిజినెస్ లేదా కంపెనీ రిజిస్ట్రేషన్ | కంపెనీ రిజిస్ట్రేషన్ రకాలు

బిజినెస్ లేదా స్టార్టప్‌ ఏ దేశంలో ప్రారంభించినా, ప్రభుత్వ పరంగా కొన్ని అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ నియమాలకు లోబడి మీ సంస్థను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. భారతదేశంలో కూడా దానికి మినహాహింపు లేదు.

దేశంలో వ్యాపార, వాణిజ్య అంశాలు క్రమబద్దీకరించే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ పరిదిలో కంపెనీ చట్టం 2013 నిబంధనలను అనుచరించి మీ బిజినెస్ లేదా సంస్థను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు ఈ వ్యాపార రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళుఅరిగేలా తిరిగేవారు. ఈ రోజు ఆ పక్రియ ఆన్‌లైన్ ద్వారా పూర్తి చేయొచ్చు. లేదా కొన్ని డబ్బులు పడేస్తే ఏ పనులు చక్కబెట్టే ఆన్‌లైన్ కన్సల్టెన్సీ సంస్థలు కూడా అందుబాటులో ఉన్నాయి.

కంపెనీ రిజిస్ట్రేషన్ చేసే ముందు

బిజినెస్ లేదా స్టార్టప్ ప్రారంభించే ముందు మీ బిజినెస్ సంబంధించి కొన్ని ముఖ్యమైన టాస్కులు పూర్తిచేయాలి. మీరు అనుకునే బిజినెస్ ఐడియాకు సంబంధించి పూర్తి ప్రణాళిక రూపొందించుకోవాలి. మీ వ్యాపార పరిధి, పెట్టుబడి సేకరణ, వ్యాపార వ్యూహాలు, భవిష్యత్తు ప్రణాళికలు వంటి అనేక అంశాలకు సంబంధించి డాక్యుమెంట్ వర్క్ పూర్తిచేసి పెట్టుకోవాలి.

ఇలా చేయడం ద్వారా మీ వ్యాపారానికి సంబంధించి పూర్తి అంచనా మీకు అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా మీరు ఏ విధమైన వ్యాపార రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే అవగాహనా వస్తుంది. బిజినెస్ పరిమాణం, పెట్టుబడి పరిధి మరియు యాజమాన్యపు హక్కులు ఆధారంగా చేసుకుని ఇండియాలో 6 రకాల బిజినెస్ రిజిస్ట్రేషన్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్

బిజినెస్ లేదా స్టార్టప్‌ రిజిస్ట్రేషన్ సంబంధించి ఎక్కువ మంది ఎంపిక చేసుకునే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రైవేట్ లిమిటెడ్. చిన్న, మధ్య మరియు భారీ ప్రరిశ్రములు కూడా ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్'కు ప్రాధ్యానత ఇస్తాయి. ఇతర రిజిస్ట్రేషన్ ప్రక్రియలతో పోల్చుకుంటే ప్రైవేట్ లిమిట్ కంపెనీలకు ఉండే సౌలభ్యలు ఎక్కువ.

లక్ష రూపాయల  కనీస పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించవచ్చు. ఇద్దరు డైరెక్టర్లు ఉంటె వ్యాపారం రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రైవేట్ లిమిటెడ్ నేమ్ ట్యాగుతో పెట్టుబడులను ఆకర్షించవచ్చు. వ్యాపారంలో నష్టపోయిన డైరెక్టర్లు, షేర్ హోల్డర్లు వ్యక్తిగత ఆస్తులు కోల్పోయే భయముండదు.

వీటన్నింటికి మించి ప్రభుత్వం ఇచ్చే టాక్స్ బెనిఫిట్స్ వలన యాజమాన్యాలు ఎక్కువ లాభాలను అర్జించవచ్చు. ఈ అన్ని ప్రయోజనాల వలన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్ భారతదేశంలో ఎక్కువ ప్రాచుర్యం పొందుతుంది.

పెట్టుబడులు అవసరమయ్యే వ్యాపారాలు, బ్యాంకుల నుండి సులభంగా అప్పులు కావాలనుకునే వారు, రాష్ట్రా, జాతీయ మరియు అంతర్జాతీయ పరిధిలో వ్యాపారం చేయాలనుకునే వారు. నాణ్యమైన మానవ వనరులు అవసరమయ్యే వారు. మీ వ్యాపారానికి ప్రభుత్వ పరమైన గుర్తింపు మరియు ఇతర సౌలభ్యలు కోరుకునే వారికీ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ ఉత్తమ ఎంపిక.

ఇవాళ్టి రోజుల్లో పైవేవీ అవసరం లేకుండా ఒక వ్యాపారం లేదా స్టార్టప్ ప్రారంభించడం మరియు రన్ చేయడం అంత సులభం కాదు కాబట్టి వీరందికీ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి.

లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్షిప్ రిజిస్ట్రేషన్

లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్షిప్ (LLP) రిజిస్ట్రేషన్ యూఎస్. యూకే, ఆస్ట్రేలియా మరియు జర్మనీ దేశాల్లో వృత్తి నిపుణులు ఎక్కువ మొగ్గుచూపే కంపెనీ మోడల్. 2008 నుండి ఇండియాలో కూడా ఈ రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంది. చట్టపరమైన, వృత్తి పరమైన గుర్తింపు కోరుకునే లాయర్లు, డాక్టర్లు, అకౌంటెంట్స్, టెక్ నిపుణులు వంటి సమూహాలకు లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్షిప్ చక్కగా సరిపోతుంది.

లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్షిప్ రిజిస్టర్ చేసేందుకు ప్రారంభ పెట్టుబడి అవసరంలేదు. ఇద్దరు కనీస సభ్యులతో కంపెనీ ప్రారంభించొచ్చు. గరిష్ట సభ్యుల సంఖ్యా పరిమితి లేదు. ఎలా వ్యాపారం చేయాలనే నిబంధన లేదు. కొందరు అర్హుత కల్గిన వృత్తి నిపుణులు చట్టపరంగా కలిసి పనిచేసేందుకు మరియు ఉమ్మడి స్కిల్ నైపుణ్యంతో వ్యాపారం వృద్ధి పరిచేందుకు ఈ కంపెనీ ఫార్మేట్ చక్కగా పనిచేస్తుంది.

వన్ పర్సన్ కంపెనీ రిజిస్ట్రేషన్

సవరించిన 2013 కంపెనీ చట్టం భారత వ్యాపార రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. అందులో ముఖ్యమైనది వన్ పర్సన్ కంపెనీ రిజిస్ట్రేషన్. ఓనర్షిప్ షేరింగ్ లేకుండా, షేర్ హోల్డర్లు లేకుండా ఒంటి చేతితో కార్పొరేట్ స్టైల్ బిజినెస్ ఫార్మేట్ నిర్వహించలనుకునే వారికీ వన్ పర్సన్ కంపెనీ రిజిస్ట్రేషన్ గొప్ప ప్రత్యామ్నాయం.

ఈ బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసేందుకు కేవలం ఒక డైరెక్టర్ ఒక నామీని ఉంటె సరిపోతుంది. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఉండే అన్ని సౌలభ్యలు వన్ పర్సన్ కంపెనీ రిజిస్ట్రేషన్ లో మీరు పొందొచ్చు. లిమిటెడ్ బిజినెస్ ఐడియా స్టార్టప్‌ మరియు వ్యవస్థాపకులకు, వాటాదారుల తలనొప్పి వద్దునుకునే ఎంట్రప్రెన్యూర్లకు ఈ వన్ పర్సన్ కంపెనీ రిజిస్ట్రేషన్ చక్కగా సరిపోతుంది.

పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్

పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఒక విస్తృతమైన వ్యాపార ప్రణాళికు సంబంధించింది. మిగతా బిజినెస్ రిజిస్ట్రేషన్లకు పూర్తి భిన్నమైనది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ రిజిస్టర్ చేసేందుకు కనీసం 7మంది సభ్యలు ఉండాలి. గరిష్టంగా పరిమితి లేదు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ నిర్వహణను బోర్డు సభ్యులు నేతృత్వం వహిస్తారు. ఈ బోర్డులో సభ్యులు 3 నుండి గరిష్టంగా 15 మంది ఉండేందుకు అవకాశం ఉన్నటుంది.

ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఓ) ద్వారా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ సెక్యూరిటీ వాటాలను సాధారణ పబ్లిక్ కొనుక్కోవచ్చు. దీని కోసం తప్పనిసరి ఒక స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. సెబీ అనుమతి పొంది ఉండాలి. ట్రేడ్ సర్టిఫికెట్ కలిగివుండాలి. ఇంపోర్ట్ మరియు ఎక్స్పోర్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్ భారీ స్టార్టప్‌లకు, భారీ పెట్టుబడులు అవసరమయ్యే వ్యాపారాలకు మంచి ఎంపిక.

బేసిక్ పార్టనర్షిప్ ఫర్మ్ రిజిస్ట్రేషన్

పార్టనర్షిప్ ఫర్మ్ అనేది సాధారణ బిజినెస్ రిజిస్ట్రేషన్. ఇది సాధారణ వ్యాపార భాగస్వాములు మధ్య తలెత్తే ఆర్ధిక వివాదాల నుండి భాగస్వాములకు తమ వాటాలపై చట్టబద్దమైన హక్కు కల్పిస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేయాల్సిన నిబంధన లేదు. ఇది భాగస్వాముల ఇష్టానుసారం బిజినెస్ ప్రారంభించే ముందు లేదా బిజినెస్ ప్రారంభించిన కొన్నాళ్ల తర్వాత కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు.

రిజిస్టర్ చేసేందుకు కనిష్టంగా ఇద్దరు భాగస్వాములు ఉండాలి. గరిష్టంగా 15 మందికి అవకాశం ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ చిన్న స్టార్టప్‌లకు, రెగ్యులర్ వ్యాపారాలకు, వ్యక్తుల స్థాయిలో జరిపే వ్యాపారాలకు చక్కగా సరిపోతుంది.

సోలో ప్రోపరైటెర్షిప్ రిజిస్ట్రేషన్

సోలో ప్రోపరైటెర్షిప్ అనేది వ్యక్తిగత వ్యాపార రిజిస్ట్రేషన్. ప్రభుత్వ అనుమతితో తమ సొంత  వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. దీనికి ఎటువంటి చట్టబద్దత ఉండదు. ఏ భాగస్వాములు ఉండరు. వ్యాపారం, పెట్టుబడి, లాభాలు వ్యక్తిగతమైనవి. కాంట్రాక్టర్లు, చిరు వ్యాపారాలు, కన్సల్టెన్సీ సర్వీసులు. రిటైల్ దుకాణాలు వంటివి సోలో ప్రోపరైటెర్షిప్ రిజిస్ట్రేషన్'కు ఉదాహరణలు.

Post Comment