Advertisement
ఎయిమ్స్‌ పీజీ అడ్మిషన్ టెస్ట్ 2023 | రిజిస్ట్రేషన్ & ఎగ్జామ్ తేదీ
Admissions Medical Entrance Exams

ఎయిమ్స్‌ పీజీ అడ్మిషన్ టెస్ట్ 2023 | రిజిస్ట్రేషన్ & ఎగ్జామ్ తేదీ

ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లలో ఎండీ, ఎంఎస్, డీఎం, ఎంసీహెచ్ మరియు ఎండీఎస్ వంటి మెడికల్ పీజీ కోర్సులలో అడ్మిషన్లు కల్పించేందుకు ఎయిమ్స్ పీజీ పరీక్షా నిర్వహిస్తారు.

ఢీల్లి ప్రధాన కేంద్రంగా ఉన్న ఎయిమ్స్ దేశ వ్యాప్తంగా భోపాల్, భువనేశ్వర్, జోధాపూర్, పాట్నా, రాయపూర్ మరియు రిషికేశ్ తో కలుపుకుని 7 ఇనిస్టిట్యూట్లను కలిగి ఉంది. ఈ ప్రవేశ పరీక్షా ద్వారా ఈ ఏడు ఎయిమ్స్ ఇనిస్టిట్యూట్లలో అడ్మిషన్లు కల్పిస్తారు.

సంబంధిత మెడికల్ కోర్సులలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఎండీ, ఎంఎస్, డీఎం, మరియు ఎంసీహెచ్ విభాగాల్లో ఎయిమ్స్ ఆరేళ్ళ పీజీ కోర్సులను అందిస్తుంది.

దేశంలో ఒకానొక్క గొప్ప మెడికల్ ఇనిస్టిట్యూట్‌గా చెప్పుకునే ఎయిమ్స్ యందు పీజీ సీట్లకోసం భారీ డిమాండ్ ఉంటుంది. జాతీయ స్థాయిలో జరిగే ఈ ప్రవేశ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 30 నుండి 40 వేల మంది మెడికల్ గ్రాడ్యుయేట్లు పోటీపడతారు. పరీక్షా ఏటా నవంబర్ నెలలో ఉంటుంది.

Exam Name AIIMS PG 2023
Exam Type Entrance Exam
Admission For Md, MS. DM, MDS & M.Ch
Exam Date 07 May 2023
Exam Duration 3.00 Hours
Exam Level National Level

దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ ఇనిస్టిట్యూట్లు

ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
అన్సారీ నగర్, న్యూఢీల్లీ
www.aiims.edu
ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
సాకేత్ నగర్, భోపాల్, మధ్యప్రదేశ్
www.aiimsbhopal.edu.in
ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
భువనేశ్వర్, ఒడిశా
www.aiimsbhubaneswar.edu.in
ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
జోధాపూర్, రాజస్థాన్
www.aiimsjodhpur.edu.in
ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
పాట్నా, బీహార్
www.aiimspatna.org
ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
రాయపూర్, ఛత్తీస్గఢ్
www.aiimsraipur.edu.in
ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
రిషికేశ్ ఉత్తరాఖండ్
http://www.aiimsrishikesh.edu.in

ఎయిమ్స్‌ పీజీ సెట్ ముఖ్యమైన తేదీలు

 ప్రారంభం -
దరఖాస్తు గడువు  -
ఎగ్జామ్ తేదీ 07 మే 2023
ఫలితాలు 13 మే 2023

ఎయిమ్స్‌ పీజీ సెట్ ఎలిజిబిలిటీ

  • ఎండీ, ఎంఎస్, డీఎం, ఎంసీహెచ్  కోర్సుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు 55 శాతం మార్కులతో ఎంబీబీఎస్ పూర్తిచేసి ఉండాలి
  • ఎండీఎస్ కోర్సుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు 55 శాతం మార్కులతో బీడీఎస్ పూర్తిచేసి ఉండాలి
  • ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
  • విదేశాల్లో మెడికల్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్థులు ఎఫ్ఎంజీఈ పరీక్షలో అర్హుత సాధించి ఉండాలి.

ఎయిమ్స్‌ పీజీ సెట్ రిజిస్ట్రేషన్

ఎయిమ్స్ పీజీ పరీక్షకు హాజరవ్వాలనుకునే అభ్యర్థులు ఎయిమ్స్ (www.aiimsexams.org) వెబ్సైటు ద్వారా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఎయిమ్స్ ఎగ్జామ్ బోర్డు నియమాలను అనుసరించి అభ్యర్థుల విద్య మరియు వ్యక్తిగత వివరాలను దరఖాస్తులో పొందుపర్చాలి.

వీటికి సంబంధించిన డూప్లికేట్ ధ్రువపత్రాలను దరఖాస్తుతో పాటుగా అందజేయాలి. అందుబాటులో ఉండే పేమెంట్ విధానంలో దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. ఆమోదం పొందిన అభ్యర్థులకు పరీక్షకు వారం రోజుల ముందు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచుతారు.

దరఖాస్తు ఫీజు జనరల్ - 1500/-
ఎస్సీ, ఎస్టీ & పీహెచ్ - 1200/-
ఎగ్జామ్ సెంటర్లు తిరుపతి. కర్నూలు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం & హైదరాబాద్

ఎయిమ్స్‌ పీజీ సెట్ ఎగ్జామ్ నమూనా (ఎండీ /ఎంఎస్ & ఎండిఎస్)

ఎయిమ్స్ పీజీ పరీక్షా సీబీటీ విధానంలో జరుగుతుంది. పరీక్షా వ్యవధి 3 గంటలు. పరీక్షా ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో మొత్తం 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఎండీ /ఎంఎస్ పేపర్లలో ఎంబీబీఎస్ లెవెల్ సిలబస్ సంబంధిత ప్రశ్నలు ఉంటాయి.

ఎండీఎస్ పేపరులో బీడీఎస్ లెవెల్ సిలబస్ సంబంధిత ప్రశ్నలు ఇవ్వబడతయి. ప్రశ్నలు ప్రధానంగా 7 కేటగిర్లలో ఉంటాయి. ఆయా కేటగిర్లకు సంబంధిత ప్రశ్నలకు ఈ కింది విధంగా మార్కులు ఇవ్వబడతయి.

పేపర్ ప్రశ్నలు మార్కులు సమయం
ఎండీ /ఎంఎస్ & ఎండిఎస్ 200 ప్రశ్నలు 200 మార్కులు 3 గంటలు

ప్రశ్నల వారీగా మార్కులు కేటాయింపు

Type of MCQ Correct Wrong Review Not Answered
Single Best Response
Multiple True False
Match the Following
Multiple Completion
Reason Assertion
Extended Matching
Sequential Arrangement
+1
+1/5
+1/4
+01
+01
+1/2
+01
-1/3
-1/5
-1/4
- 1/4
- 1/4
-1/2
-01
0
0
0
0
0
0
0
0
0
0
0
0
0
0

ఎయిమ్స్‌ పీజీ సెట్ ఎగ్జామ్ నమూనా (డీఎం /ఎంసీహెచ్)

డీఎం మరియు ఎంసీహెచ్ కోర్సులు 6 ఏళ్ళ నిడివితో అందిస్తారు. ఈ కోర్సుల ఎంపిక ప్రక్రియ ఎండీ, ఎంఎస్, ఎండీఎస్ మాదిరిగానే  ఉంటుంది. ఆరేళ్ళ కోర్సుకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి 6 నెలలు సూపర్ స్పెషలిటీ హాస్పిటల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ అందజేస్తారు.

చివరి ఆరు నెలలు ఈ ట్రైనింగ్ సంబంధించి డిపార్టుమెంటల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫై అయినా విద్యార్థులకు తర్వాత దశకు చేరుకుంటారు. క్వాలిఫై అవ్వని అభ్యర్థులను 6 నెలల జూనియర్ రెసిడెన్సీ సర్టిఫికెట్ అందజేసి కోర్సు నుండి తప్పిస్తారు.

తర్వాత దశలో ఏడాది పాటు సర్జరీ సంబంధిత ప్రాధమిక విషయాలను బోధిస్తారు. ఆ తర్వాత దశలో సర్జరీ సంబంధిత పూర్తిస్థాయి సూపర్ స్పెసిలిటీ కోర్సును అంజేస్తారు. ఈ కోర్సు పూర్తి అయ్యేందుకు ఐదున్నర నుండి ఆరేళ్లు పడుతుంది. దీన్ని విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణత అయినా అభ్యర్థులకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపుతో డీఎం మరియు ఎంసీహెచ్ డిగ్రీలను అందజేస్తారు.

ఎయిమ్స్‌ పీజీ సెట్ రిజర్వేషన్లు & ప్రవేశాలు

ఎయిమ్స్ పీజీ అడ్మిషన్ ప్రక్రియ ఎయిమ్స్ పీజీ సెట్ మెరిట్ ఆధారంగా జరుగుతుంది. సీబీటీ పరీక్షలో 50 పెర్సెంటైల్ మార్కులు సాధించిన అభ్యర్థులను అర్హులుగా ప్రకటిస్తారు. అందుబాటులో ఉండే సీట్లలో 57% శాతం ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తారు.

మిగిలిన సీట్లు విదేశీ విద్యార్థులకు ఇతర కేటగిరి విద్యారులకు కేటయిస్తారు. రిజర్వేషన్ పరమైన సీట్ల కేటాయింపు 2006 సంబంధించిన అడ్మిషన్ చట్టం నియమాలకు అనుగుణంగా జరుగుతుంది. వివిధ కేటగిర్లకు సంబందించిన రిజర్వేషన్ కోటా ఈ క్రింది విదంగా ఉంటుంది.

రిజర్వేషన్ కేటగిరి రిజర్వేషన్ కోటా
ఓబీసీ
ఎస్సీ
ఎస్టీ
ఈడబ్ల్యూఎస్
పిహెచ్
27%
15%
7.5%
10%
5%