తెలంగాణ టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ ట్రైనింగ్ కోర్సు 2023
Telangana

తెలంగాణ టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ ట్రైనింగ్ కోర్సు 2023

తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ నిర్వహించే 42 రోజుల టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ సమ్మర్ కోర్సు కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. దరఖాస్తు సమయానికి అభ్యర్థుల వయస్సు కనిష్టంగా 18 ఏళ్ళు గరిష్టంగా 45 ఏళ్ళ మధ్య ఉండాలి. ఈ ట్రైనింగ్ కోర్సు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాదు మరియు నల్గొండ జిల్లా పరిధిలో ఆయా జిల్లా విద్యా అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.

Exam Name TS TTC
Exam Type Eligibility
Eligibility For Teaching
Exam Date NA
Exam Duration 2.00 Hours
Exam Level State Level (TS)

ఈ  42 రోజుల ట్రైనింగ్ విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు థియరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ఉతీర్ణత సాధించిన వారికీ టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ అంజేస్తారు. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ లేనివారికి ఈ టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.bse.telangana.gov.in వెబ్సైటు ద్వారా గడువులోపు దరఖాస్తు చేసుకోండి.

టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ ట్రైనింగ్ ఎలిజిబిలిటీ

42 రోజుల సమ్మర్ టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ ట్రైనింగ్ కోర్సులో చేరేందుకు ఆసక్తి చూపే అభ్యర్థులు ఈ క్రింది విద్య అర్హుతలలో ఏదో ఒకటి కలిగి ఉండాలి.

  • టెన్త్ లేదా తత్సమమైన విద్యార్హుత కలిగి ఉండాలి
  • సాంకేతిక విద్యకు సంబంధించి, సంబంధిత ట్రేడులో టెక్నికల్ సర్టిఫికెట్(టీసీసీ) పొందిఉండాలి (లేదా)
  • లోయర్ గ్రేడ్ సర్టిఫికెట్ లేదా స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ & ట్రైనింగ్ (SBTET) (లేదా)
  • తెలంగాణ ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఐటీఐ జారీచేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ (లేదా)
  • నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ వీవింగ్ లేదా డిపార్టుమెంటు ఆఫ్ ఇండస్ట్రీస్ & కామర్స్ వారిచే జారీచేయబడ్డ సర్టిఫికెట్ (లేదా)
  • తెలుగు విశ్వవిద్యాలయం జారీచేసిన కర్ణాటక సంగీతం నందు గాత్రం సర్టిఫికెట్ లేదా తత్సమాన సర్టిఫికెట్ కలిగి ఉండాలి

టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ ట్రైనింగ్ దరఖాస్తు

టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ ట్రైనింగ్ కోర్సులకు హాజయ్యేందుకు ఆసక్తి కనబర్చే అభ్యర్థులు తెలంగాణ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్  (www.bse.telangana.gov.in) వెబ్సైటు నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

పూర్తిచేసిన దరఖాస్తులను ప్రింట్ తీసి అందుబాటులో ఉండే జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో గడువులోపు అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుములు క్రింది చూపిన విధానంలో ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ ద్వారా చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.ts TTC

టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ ట్రైనింగ్ దరఖాస్తు ఫీజు

  • దరఖాస్తు రుసుము లోయర్ గ్రేడ్ కోర్సులకు 150/-
  • దరఖాస్తు ఫీజు హయ్యర్ గ్రేడ్ కోర్సులకు 250/-

ట్రైనింగ్ ప్రదేశాలు

  • కరీంనగర్
  • నిజామాబాద్
  • నల్గొండ
  • హైదరాబాద్
  • వరంగల్