ఆంధ్ర యూనివర్సిటీ న్యాయ విద్యకు సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ లా (LLB), మాస్టర్ ఆఫ్ లా (LLM) తో పాటుగా ఐదేళ్ల నిడివితో ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ ఆఫర్ చేస్తుంది. వీటితో పాటుగా కొన్ని స్పెషలైజెడ్ లా డిగ్రీలు కూడా అందిస్తుంది. ఈ కోర్సులు ఆంధ్ర యూనివెర్సిటీతో పాటుగా దాని అనుబంధ కాలేజీల్లో అందుబాటులో ఉంటాయి. ఈ కోర్సులకు సంబంధించి అడ్మిషన్ ప్రక్రియ ఏపీ లాసెట్ మరియు స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ ద్వారా నిర్వహిస్తారు.
ఏయూ అందిస్తున్న న్యాయ విద్య కోర్సులు రెండేళ్ల (LLM) మరియు మూడేళ్ళ (LLB) నిడివితో అందిస్తున్నారు. ఈ రెండు/మూడేళ్ళలో అభ్యర్థులు నాలుగు/ఆరు సెమిస్టరు పరీక్షలకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఒక సెమిస్టరు యందు పాస్ కాని అభ్యర్థులు, వచ్చే ఏడాది అదే సెమిస్టరు పరీక్షకు హాజరుకావడం ద్వారా ఉత్తీర్ణత పొందాల్సి ఉంటుంది.
బ్యాచిలర్ లా కోర్సులకు సంబంధించి అభ్యర్థులు ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండాలి. మాస్టర్ ఆఫ్ లా కోర్సులకు సంబంధించి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ యందు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. కోర్సులు సంబంధించి సీట్ల వివరాలు మరియు ట్యూషన్ ఫీజుల వివరాలు కౌన్సిలింగ్/అడ్మిషన్ సమయంలో అందుబాటులో ఉంచుతారు.