Advertisement
ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్ 2023 : దరఖాస్తు, పరీక్ష తేదీ
Admissions Law Entrance Exams

ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్ 2023 : దరఖాస్తు, పరీక్ష తేదీ

నేషనల్ లా యూనివర్సిటీ ఢీల్లీ (NLU Delhi) లో యూజీ, పీజీ మరియు పీహెచ్డీ న్యాయ విద్య కోర్సులలో అడ్మిషన్లు కల్పించేందుకు ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ఈ జాతీయ స్థాయి లా ప్రవేశ పరీక్షాలో అర్హుత సాధించటం ద్వారా న్యాయ విద్య కోర్సులకు ఎంతో డిమాండ్ ఉండే నేషనల్ లా యూనివర్సిటీ ఢీల్లీలో ఎల్ఎల్‌బి (ఐదేళ్లు), ఎల్ఎల్ఎం (ఏడాది) కోర్సులతో పాటుగా మరికొన్ని న్యాయ సంబంధిత పీహెచ్డీ కోర్సులలో ప్రవేశం పొందొచ్చు.

నేషనల్ లా యూనివర్సిటీ ఢీల్లీ, క్లాట్ స్కోరును పరిగణలోకి తీసుకోదు. ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందాలంటే ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సిందే. నేషనల్ లా యూనివర్సిటీ ఢీల్లీలో ఎల్ఎల్‌బి (80 సీట్లు), ఎల్ఎల్ఎం (80 సీట్లు) మరియు పీహెచ్డీ (10 సీట్లు) కోర్సులు కలిపి మొత్తం 170 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ 170 సీట్ల కోసం ఏటా 20 నుండి 30 వేల మంది విద్యార్థులు పోటీపడుతుంటారు.

Exam Name AILET 2021
Exam Type Entrance Exam
Admission For LLB, LLM
Exam Date 20/06/2021
Exam Duration 90 Minutes
Exam Level National Level

ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్ ఎలిజిబిలిటీ

  • ఐదేళ్ల ఎల్ఎల్‌బి : 50 శాతం మార్కులతో ఇంటర్/10+2 ఉత్తీర్ణత సాదించాలి.
  • సీట్ల సంఖ్యా: 80 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 70 సీట్లు AILET మెరిట్ ఆధారంగా భర్తీచేస్తారు. మిగతా 10 సీట్లు ప్రవేశ పరీక్షలో 65% మార్కులు సాధించిన విదేశీ విద్యార్థులకు కేటాయిస్తారు.
  • రిజర్వేషన్స్: కోర్సులో 15 శాతం సీట్లు ఎస్సీ అభ్యర్థులకు, 7.5 శాతం సీట్లు ఎస్టీలకు మరియు 5శాతం శాతం సీట్లు అంగవైకుల్యం ఉండే అభ్యర్థులకు కేటాయిస్తారు.
  • ఒక ఏడాది ఎల్ఎల్ఎం :55 శాతం మార్కులతో ఎల్ఎల్‌బి లేదా దానికి సమానమైన డిగ్రీలో ఉత్తీర్ణత సాదించాలి.
  • సీట్ల సంఖ్యా: 80 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 70 సీట్లు AILET మెరిట్ ఆధారంగా భర్తీచేస్తారు. మిగతా 10 సీట్లు ప్రవేశ పరీక్షలో 65% మార్కులు సాధించిన విదేశీ విద్యార్థులకు కేటాయిస్తారు.
  • రిజర్వేషన్స్: కోర్సులో 15 శాతం సీట్లు ఎస్సీ అభ్యర్థులకు, 7.5 శాతం సీట్లు ఎస్టీలకు మరియు 5శాతం శాతం సీట్లు అంగవైకుల్యం ఉండే అభ్యర్థులకు కేటాయిస్తారు.
  • పీహెచ్డీ ప్రోగ్రామ్స్ :55 శాతం మార్కులతో ఎల్ఎల్ఎం డిగ్రీ ఉత్తీర్ణత సాదించాలి.
  • సీట్ల సంఖ్యా: 10 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 8 సీట్లు AILET మెరిట్ ఆధారంగా భర్తీచేస్తారు. ఇందులో 25 శాతం సీట్లు యూనివర్సిటీ పనిచేస్తున్న బోధనా సిబ్బందికి కేటాయిస్తారు.మిగతా 2 సీట్లు ప్రవేశ పరీక్షలో 65% మార్కులు సాధించిన విదేశీ విద్యార్థులకు కేటాయిస్తారు.
  • రిజర్వేషన్స్: కోర్సులో 15 శాతం సీట్లు ఎస్సీ అభ్యర్థులకు, 7.5 శాతం సీట్లు ఎస్టీలకు మరియు 5శాతం శాతం సీట్లు అంగవైకుల్యం ఉండే అభ్యర్థులకు కేటాయిస్తారు.

ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్ ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రారంభం 07 సెప్టెంబర్ 2022
దరఖాస్తు గడువు 20 నవంబర్ 2022
ఎగ్జామ్ తేదీ 11 డిసెంబర్ 2022
ఫలితాలు 19 డిసెంబర్ 2022

దరఖాస్తు విధానం

ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్టుకు హాజరవ్వాలనుకునే అభ్యర్థులు NLU ఢిల్లీ అధికారిక (www.nludelhi.ac.in) వెబ్సైటు ద్వారా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నియమాలను అనుసరించి అభ్యర్థుల విద్య మరియు వ్యక్తిగత వివరాలను దరఖాస్తులో పొందుపర్చాలి.

వీటికి సంబంధించిన డూప్లికేట్ ధ్రువపత్రాలను దరఖాస్తుతో పాటుగా అందజేయాలి. అందుబాటులో ఉండే పేమెంట్ విధానంలో దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. ఆమోదం పొందిన అభ్యర్థులకు పరీక్షకు వారం రోజుల ముందు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచుతారు.

ఎగ్జామ్ ఫీజు పరీక్ష కేంద్రాలు
జనరల్ & ఓబీసీ కేటగిరి అభ్యర్థులు హైదరాబాద్,
ఎస్సీ, ఎస్టీ మరియు పీహెచ్ అభ్యర్థులు చెన్నై, కటక్, బెంగుళూరు
ఎస్సీ, ఎస్టీ మరియు పీహెచ్ అభ్యర్థులు 1050/-

ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ నమూనా

ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్ కంప్యూటర్ ఆధారంగా ఆన్లైన్ విధానంలో నిర్వహించబడుతుంది. పరీక్షా ఆబ్జెక్టివ్ పద్దతిలో 90 నిముషాల నిడివితో జరుగుతుంది. ప్రతి ప్రశ్న నాలుగు ఆప్షనల్ సమాదానాలు కలిగి ఉంటుంది.

అందులో సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నలకు 1 మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నకు 1/4 శాతం మార్కులు తొలగిస్తారు. LLB, LLM మరియు పీహెచ్డీ ప్రోగ్రామ్స్'కి సంబంధించి వేరు వేరు ప్రశ్న పత్రాలు ఇవ్వబడతయి. ఇందులో ఉండే ప్రశ్నల సంఖ్యా, సిలబస్ మినహా మూడు పరీక్షలు ఒకేరీతిలో నిర్వహించబడతాయి.

ఐదేళ్ల ఎల్ఎల్‌బి ఎగ్జామ్ నమూనా

సెక్షన్ & సిలబస్ ప్రశ్నలు మార్కులు సమయం
సెక్షన్ A : ఇంగ్లీష్ 35 35 90 నిముషాలు
సెక్షన్ B : జనరల్ నాలెడ్జ్ 35 35
సెక్షన్ C : లీగల్ ఆప్టిట్యూడ్ 35 35
సెక్షన్ D : రీజనింగ్ 35 35
సెక్షన్ E : మ్యాథమెటిక్స్ 10 10
మొత్తం 150 ప్రశ్నలు 150 మార్కులు

ఏడాది ఎల్ఎల్ఎం ఎగ్జామ్ నమూనా

సెక్షన్ & సిలబస్ ప్రశ్నలు మార్కులు సమయం
సెక్షన్ A : లా ఆఫ్ టార్ట్స్ 50 50 90 నిముషాలు
సెక్షన్ B : రాజ్యాంగ చట్టం, లా ఆఫ్ కాంట్రాక్ట్స్, ఇంటర్నేషనల్ లా, ప్రాపర్టీ లా, ఫామిలీ లా మరియు ఇంటెలెక్చవల్ ప్రాపర్టీ లా 50 50
సెక్షన్ C : వ్యాసం 50 50
మొత్తం 150 ప్రశ్నలు 150 మార్కులు

పీహెచ్డీ ఎగ్జామ్ నమూనా

సెక్షన్ & సిలబస్ ప్రశ్నలు మార్కులు సమయం
సెక్షన్ A : రీసెర్చ్ మెథడాలజీ 50 50 90 నిముషాలు
సెక్షన్ B : రాజ్యాంగ చట్టం, లా ఆఫ్ కాంట్రాక్ట్స్, ఇంటర్నేషనల్ లా, ప్రాపర్టీ లా, ఫామిలీ లా మరియు ఇంటెలెక్చవల్ ప్రాపర్టీ లా 50 50
మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులు