Advertisement
10వ తరగతి తర్వాత ఒకేషనల్ మరియు బ్రిడ్జి కోర్సులు
Career Guidance Career Options

10వ తరగతి తర్వాత ఒకేషనల్ మరియు బ్రిడ్జి కోర్సులు

స్వయం ఉపాధిని అందించే వృత్తివిద్యా కోర్సులు అన్నీ ఈ ఒకేషనల్ కేటగిరీ కిందకి వస్తాయి. గరిష్టంగా రెండేళ్ల వ్యవధితో ఉండే ఈ  కోర్సులను పూర్తి చేసాక, మీకు మీరుగా స్వయం ఉపాధిని పొందటమే కాకుండా, వ్యాపార వాణిజ్య సముదాయాల్లో, బ్యాంకింగ్, ఫైనాన్స్, హాస్పిటాలిటీ, పర్యాటక రంగాల్లో ఉపాధి అవకాశాలు పొందొచ్చు.

తెలుగు రాష్ట్రాలు ఇంటర్ ఒకేషనల్ విద్యను జనరల్ ఇంటర్ గ్రూపులకు అనుబంధంగా అందిస్తున్నాయి. వీటితో పాటుగానే ఇంటర్ ఒకేషనల్ అడ్మిషన్లలను, పరీక్షలను నిర్వహిస్తున్నాయి. టెన్త్ క్లాస్ తర్వాత అందుబాటులో ఉన్న వివిధ టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ ఒకేషనల్ కోర్సుల వివరాలు తెలుసుకోండి.

ఏపీ & తెలంగాణలో ఒకేషనల్ కోర్సులు

బిజినెస్ & కామర్స్ ఒకేషనల్ కోర్సులు

10+2 అర్హుతతో బిజినెస్ మరియు కామర్స్ రంగాల్లో స్థిరపడాలనుకునే విద్యార్థుల కోసం రెండేళ్ల నిడివితో వివిధ బిజినెస్ & కామర్స్ ఒకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్, ఇండస్ట్రియల్ మరియు రిటైల్ మానేజ్మెంట్ రంగాలలో ఉపాధి పొందొచ్చు లేదా బీఏ, బీకామ్ వంటి బ్యాచిలర్ డిగ్రీలలో చేరి ఉన్నత విద్యను పూర్తి చేయొచ్చు. బిజినెస్ మరియు కామర్స్ కేటగిరిలో ఉన్న వివిధ ఒకేషనల్ కోర్సులు తెలుసుకోండి.

  • అకౌంటింగ్ & టాక్సేషన్
  • మార్కెటింగ్ & సేల్స్‌మాన్‌షిప్
  • ఆఫీస్ అసిస్టెంట్‌షిప్
  • బ్యాంకింగ్ & ఫైనాన్సియల్ సర్వీసెస్
  • ఇన్సూరెన్స్ & మార్కెటింగ్
  • ఎక్సపోర్ట్ - ఇంపోర్ట్ ప్రాక్టీసెస్ & డాక్యుమెంటేషన్
  • ఆఫీస్ & ఇండస్ట్రియల్ మానేజ్మెంట్
  • పర్చేసింగ్ & స్టోర్ కీపింగ్

అగ్రికల్చర్ ఒకేషనల్ కోర్సులు

వ్యవసాయ ఆధారిత రంగాల్లో ఆసక్తి కలిగిన విద్యార్థులకు పది తరువాత వివిధ అగ్రికల్చర్ ఒకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తిచేయడం ద్వారా ఆయా రంగాల్లో ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. లేదా బీఎస్సీ, బీఏ, బీకామ్ మరియు బీహెచ్ఎమ్ వంటి బ్యాచిలర్ డిగ్రీలలో చేరి ఉన్నత విద్య డిగ్రీలను పొందొచ్చు.

అలానే అగ్రికల్చర్ ఒకేషనల్ కోర్సులతో పాటుగా బయాలజీ బ్రిడ్జి కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు, ఎంసెట్ రాయడం ద్వారా బీఎస్ అగ్రికల్చర్, సేరికల్చర్, హార్టీకల్చర్ వంటి కోర్సులలో అడ్మిషన్ పొందొచ్చు. అగ్రికల్చర్ కేటగిరిలో ఉన్న వివిధ ఒకేషనల్ కోర్సులు తెలుసుకోండి

  • క్రాప్ ప్రొడక్షన్ & మానేజ్మెంట్
  • సాయిల్  సైన్స్ & ప్లాంట్ ప్రొటెక్షన్
  • వాటర్ షెడ్ మానేజ్మెంట్ & సాయిల్ కంజర్వేషన్
  • సీడ్ ప్రొటెక్షన్ టెక్నాలజీ
  • డెయిరింగ్
  • ఫిషరీస్
  • సెరికల్చర్
  • హార్టికల్చర్

ఇంజనీరింగ్ & టెక్నాలజీ ఒకేషనల్ కోర్సులు

10+2 అర్హుతతో ఇండస్ట్రియల్ మరియు సాంకేతిక రంగాల్లో స్థిరపడాలనుకునే విద్యార్థుల కోసం రెండేళ్ల నిడివితో వివిధ ఇంజనీరింగ్ & టెక్నాలజీ ఒకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఆటోమొబైల్, ఐటీ, ఎలక్ట్రికల్, నిర్మాణ, కంప్యూటర్ సర్వీసెస్, రూరల్ ఇంజనీరింగ్ రంగాలలో ఉపాధి పొందొచ్చు. అలానే డీటీపీ, ప్రింటింగ్ టెక్నాలజీ, టీవీ, రేడియో, వైరింగ్ & రిపేరింగ్, కంప్యూటర్ సర్వీసెస్ కోర్సులు పూర్తిచేయడం ద్వారా స్వయం ఉపాధి పొందొచ్చు.

ఉన్నత విద్య చేయాలనే ఆలోచన ఉన్న వారు బీఎస్సీ మేథమెటిక్స్, బీఏ, బీకామ్ వంటి బ్యాచిలర్ డిగ్రీలలో చేరొచ్చు. ఒకేషనల్ ఇంజనీరింగ్ కోర్సుతో పాటుగా మ్యాథ్స్ స్ట్రీమ్ బ్రిడ్జి కోర్సు పూర్తిచేసిన వారు ఎంసెట్ ద్వారా బీటెక్ కోర్సులలో అడ్మిషన్ పొందొచ్చు. అలానే పాలిటెక్నిక్ రెండవ ఏడాదిలో కూడా చేరే అవకాశం ఉంటుంది. అందుబాటులో ఉన్న వివిధ ఇంజనీరింగ్ ఒకేషనల్ కోర్సులు.

  • ఆటోమొబైల్ ఇంజినీరింగ్ టెక్నీషియన్
  • కనస్ట్రక్షన్ టెక్నాలజీ
  • కంప్యూటర్ సైన్సెస్ & ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ టెక్నీషియన్
  • ఎలక్ట్రికల్ వైరింగ్ & సర్వీసింగ్
  • రూరల్ ఇంజినీరింగ్ టెక్నీషియన్
  • వాటర్ సప్లై & శానిటరీ ఇంజనీరింగ్
  • డీటీపీ & ప్రింటింగ్ టెక్నాలజీ
  • రేడియో & టీవీ

హోమ్ సైన్స్ ఒకేషనల్ కోర్సులు

హోటల్ ఆపరేషన్స్, కేటరింగ్, రెస్టారెంట్ నిర్వహణ, హౌస్ కీపింగ్, బ్యూటీ పార్లర్ నిర్వహణ, ప్రీ స్కూల్ టీచింగ్, ఫాషన్ డిజైనింగ్ మరియు గార్మెంట్ మేకింగ్ అంశాల యందు ఆసక్తి ఉండే విద్యార్థులకు హోమ్ సైన్స్ కేటగిరిలో వివిధ ఒకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తిచేయడం ద్వారా స్వయం ఉపాధి పొందటంతో పాటుగా ఆయా రంగాలలో ఉద్యోగ అవకాశాలు దక్కించుకోవచ్చు. అలానే ఉన్నత విద్య చేయాలనుకుంటే బీఏ, బీకామ్ వంటి బ్యాచిలర్ డిగ్రీల యందు అడ్మిషన్ పొందొచ్చు. హోమ్ సైన్స్ కేటగిరిలో వివిధ ఒకేషనల్ కోర్సులు.

  • కమర్షియల్ గార్మెంట్ డిజైనింగ్ & మేకింగ్
  • ఫ్యాషన్ గార్మెంట్ మేకింగ్
  • హోటల్ ఆపరేషన్స్
  • ప్రీ-స్కూల్ టీచర్ ట్రైనింగ్
  • క్యాటరింగ్ మరియు రెస్టారెంట్ మానేజ్మెంట్
  • హెల్త్ కేర్ & బ్యూటీ కల్చర్
  • ఇంస్టిట్యూషనల్ హౌస్ కీపింగ్

హ్యూమానిటీస్ ఒకేషనల్ కోర్సులు

టూరిజం & ట్రావెల్, ఆర్ట్, కంప్యూటర్ గ్రాఫిక్స్ & యానిమేషన్ వంటి అంశాల యందు ఆసక్తి కలిగిన విద్యార్థులకు పది తరువాత వివిధ హ్యూమానిటీస్ ఒకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తిచేయడం ద్వారా ఆయా రంగాల్లో ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు, అలానే స్వయం ఉపాధి కూడా పొందొచ్చు. అదేవిధంగా బీఏ, బీకామ్ మరియు కొన్ని బీఎస్సీ కోర్సుల యందు చేరి బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందొచ్చు. హ్యూమానిటీస్ కేటగిరిలో అందుబాటులో ఉన్న వివిధ ఒకేషనల్ కోర్సులు.

  • కంప్యూటర్ గ్రాఫిక్స్ & యానిమేషన్
  • టూరిజం మరియు ట్రావెల్ టెక్నిక్
  • కమర్షియల్ ఆర్ట్స్

హెల్త్ & పారామెడికల్ ఒకేషనల్ కోర్సులు

10+2 అర్హుతతో హెల్త్ & పారామెడికల్ సిబ్బందిగా స్థిరపడాలనుకునే విద్యార్థుల కోసం రెండేళ్ల నిడివితో వివిధ హెల్త్ & పారామెడికల్ ఒకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ల్యాబ్ టెక్నిషియన్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (మహిళలు), హాస్పిటల్ నిర్వహణ, ఫిజియోథెరపీ, ఆప్తాల్మిక్ టెక్నీషియన్, వెటర్నరీ అసిస్టెంట్   వంటి డిమాండ్ ఉన్న స్వయం ఉపాధి కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తి చేయడం ద్వారా ఆయా రంగాల్లో ఉపాధి పోండంతో పాటుగా స్వయం ఉపాధి పొందొచ్చు.

అలానే ఉన్నత విద్య చేయాలనే ఆలోచన ఉన్న వారు బీఎస్సీ ఏంఎల్టీ, బీఎస్సీ నర్సింగ్, బీపీటీ వంటి బ్యాచిలర్ కోర్సులలో చేరొచ్చు. అలానే ఒకేషనల్ పారామెడికల్ కోర్సుతో పాటుగా బయాలజీ బ్రిడ్జి కోర్సు పూర్తిచేసిన వారు ఎంసెట్ ద్వారా మెడికల్ కోర్సులలో అడ్మిషన్ పొందొచ్చు. అందుబాటులో ఉన్న వివిధ పారామెడికల్ ఒకేషనల్ కోర్సులు.

  • మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్
  • మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (మహిళలు)
  • ఆప్తాల్మిక్ టెక్నీషియన్
  • ఫిజియోథెరపీ
  • హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్
  • ఎక్స్-రే టెక్నీషియన్
  • క్లినికల్ అసిస్టెంట్
  • డెంటల్ టెక్నీషియన్
  • డెంటల్ హైజినిస్ట్
  • మల్టీ పర్పస్ వెటర్నరీ అసిస్టెంట్

ఒకేషనల్ బ్రిడ్జి కోర్సులు (థియరీ)

ఒకేషనల్ విద్యార్థులు ఉన్నత విద్య అవకాశాలు కోల్పోకూడదు అనే ఉద్దేశంతో బ్రిడ్జి కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చారు. రెండేళ్ల ఒకేషనల్ విద్యను పూర్తిచేశాక ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ మరియు ఇతర బ్యాచిలర్ డిగ్రీలలో చేరాలనుకునే విద్యార్థులు ఒకేషనల్ కోర్సుతో పాటుగా అదనంగా ఈ బ్రిడ్జి కోర్సును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి మ్యాథ్స్, ఫీజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్ కేటగిర్లలో థియరీ & ప్రాక్టికల్ విధానంలో అందుబాటులో ఉన్నాయి.

  • మ్యాథమెటిక్స్
  • ఫీజికల్ సైన్సెస్ (ఫిజిక్స్ + కెమిస్ట్రీ)
  • బయోలాజికల్ సైన్సెస్ (బోటనీ + జూవాలాజీ)

ఒకేషనల్ బ్రిడ్జి కోర్సులు (ప్రాక్టికల్)

  • మ్యాథమెటిక్స్
  • ఫీజికల్ సైన్సెస్ (ఫిజిక్స్ + కెమిస్ట్రీ)
  • బయోలాజికల్ సైన్సెస్ (బోటనీ + జూవాలాజీ)

Post Comment