Advertisement
ఎన్‌టీఎస్‌ఈ 2023 : నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్
Scholarships

ఎన్‌టీఎస్‌ఈ 2023 : నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్

నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్, దేశంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ప్రతిభావంతులకు అందిస్తారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) అందించే ఈ స్కాలర్షిప్, ఏటా ఇంటర్మీడియట్ నుండి ఎంఫిల్, పీహెచ్డీ చదువుతున్న 2000 మంది ప్రతిభావంతులు లబ్ధిపోతున్నారు.

స్కాలర్షిప్ పేరు నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్
ఎవరు అర్హులు క్లాస్ IX, క్లాస్ X విద్యార్థులు
ఎంపిక విధానం ఎలిజిబిలిటీ టెస్ట్ మెరిట్ ఆధారంగా
దరఖాస్తు ముగింపు తేదీ జనవరి / ఫిబ్రవరి

నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్'కు ఎంపికైన క్లాస్ XI, XII విద్యార్థులకు నెలకు 1250 /-  రూపాయలు, యూజీ, పీజీ విద్యార్థులకు నెలకు 2000/- రూపాయలు, అలానే పీహెచ్డీ విద్యార్థులకు యూజీసీ అందించే స్టైపెండ్ విలువకు సమానంగా అందిస్తుంది.

కోర్సు / క్లాస్ స్కాలర్షిప్ (నెలకు) ఏడాది మొత్తానికి
ఇంటర్మీడియేట్ (క్లాస్ XI & క్లాస్ XII ) 1,250/- 15,000/-
డిగ్రీ & పీజీ (జనరల్ డిగ్రీలతో పాటుగా మెడిసిన్ & ఇంజనీరింగ్ వంటి అన్ని కోర్సులకు) 2,000/- 24,000/-
పీహెచ్డీ యూజీసీ స్టైపెండ్'కు సరిసమానంగా యూజీసీ స్టైపెండ్'కు సరిసమానంగా

ఎన్‌సిఇఆర్‌టి ఈ స్కాలర్షిప్ లబ్దిదారులను రెండు దశల టాలెంట్ టెస్ట్ నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తుంది. దీనికి సంబంధించి మొదటి దశలో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (MAT) నిర్వహిస్తుంది. ఇందులో అర్హుత సాధించిన వారికీ స్కొలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (SAT) నిర్వహిస్తుంది. MAT పరీక్షను రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఎస్‌ఎస్‌సి బోర్డులు నిర్వహిస్తాయి.

ఈ టాలెంట్ టెస్టు యందు ఎంపికైన విద్యార్థులకు జాతీయస్థాయిలో SAT పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో మెరిట్ సాధించిన విద్యార్థులకు సామజిక రిజర్వేషన్ల ఆధారంగా స్కాలర్షిప్ అవకాశం కల్పిస్తారు.

నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ

నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసేందుకు దేశంలో లేదా విదేశాలలో క్లాస్ X చదువుతున్న భారతీయ విద్యార్థులు అర్హులు. విద్యార్థి క్లాస్ IX లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. విద్యార్థి వయస్సు 18 ఏళ్ళు మించకూడదు. పరీక్షా ఇంగ్లీష్ , హిందీతో పాటుగా తెలుగులో కూడా నిర్వహిస్తారు.

నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్

ఈ స్కాలర్షిప్ లబ్దిదారులను ఎంపిక చేసేందుకు మెంటల్ ఎబిలిటీ & స్కొలాస్టిక్ ఆప్టిట్యూడ్ అంశాల యందు MAT మరియు SAT పరీక్షలు నిర్వహిస్తారు.

మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (MAT) : ఈ పేపర్లో వెర్బల్, నాన్ వెర్బల్, రీజనింగ్, క్రిటికల్ థింకింగ్ అనాలోజి, క్లాసిఫికేషన్, న్యూమరికాల్ సిరీస్, పాటర్న్ పెరిసిప్షన్అంశాలకు సంబంధించి 100 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు చెప్పున మొత్తం 100 మార్కులకు జరుగుతుంది. పరీక్షా వ్యవధి 120 నిముషాలు ఉంటుంది. ఈ పరీక్షను రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ప్రభుత్వాలు తమ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ద్వారా నిర్వహిస్తాయి.

నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్ నేషనల్ లెవెల్ ఎగ్జామ్

స్కొలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (SAT) : MAT పరీక్షలో అర్హుత పొందిన వారికీ SAT పరీక్షా నిర్వహిస్తారు. ఈ పేపర్లో క్లాస్ VII, క్లాస్ VIII సంబంధించిన సైన్స్, సోషల్ స్టడీస్ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల నుండి 100 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు చెప్పున మొత్తం 100 మార్కులకు జరుగుతుంది. తప్పు సమాధానం చేసిన ప్రశ్నలకు రుణాత్మక మార్కులు ఉంటాయి. పరీక్షా వ్యవధి 120 నిముషాలు ఉంటుంది. ఈ పరీక్షను జాతీయ స్థాయిలో NCERT నిర్వహిస్తుంది.

నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్ ఎంపిక విధానం

MAT మరియు SAT పరీక్షలలో 40% స్కోర్ చేసిన వారిని తుది జాబితా కోసం పరిగణలోకి తీసుకుంటారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కనీసం 32 శాతం స్కోర్ చేయాల్సి ఉంటుంది. అలానే విద్యార్థులు క్లాస్ X 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందిఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 5 శాతం మినహాయింపు కల్పిస్తారు. స్కాలర్షిప్ తుది జాబితా రాష్ట్రాల వారీగా వివిధ రిజర్వేషన్ల పై ఆధారపడి రూపొందించబడి ఉంటుంది.

నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్ దరఖాస్తు విధానం

అర్హుత కలిగిన విద్యార్థులు MAT పరీక్షా మీ రాష్ట్రానికి చెందిన డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ (ఎస్‌ఎస్‌సి బోర్డు) ద్వారా సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో అర్హుత పొందిన విద్యార్థులు SAT పరీక్షా కోసం NCERT పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసేందుకు అవసరమయ్యే బ్యాంకు అకౌంట్ (ఎస్బిఐ), ఆదాయ ద్రువీకరణ పత్రం, కుల ద్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఫోటో, అకాడమిక్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచుకోవాలి.

Post Comment