Advertisement
సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సిలబస్ 2023 మరియు ఎగ్జామ్ నమూనా
Latest Jobs UPSC

సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సిలబస్ 2023 మరియు ఎగ్జామ్ నమూనా

సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ మరియు మెయిన్ ఎగ్జామ్ సిలబస్ పొందండి. సివిల్ సర్వీసెస్ పరీక్షను రెండు దశలలో నిర్వహిస్తారు. మొదటి దశలో ఆబ్జెక్టివ్ విధానంలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇందులో  పొందిన వారికీ రెండవ దశలో డిస్క్రిప్టివ్ విధానంలో సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష జరుపుతారు. ఇందులో మెరిట్ సాధించిన వారికి వివిధ సివిల్ సర్వీసెస్ పోస్టుల వారీగా ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్ నిర్వహించి తుది ఎంపిక పూర్తి చేస్తారు.

  1. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్
  2. సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్
  3. సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్

సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ నమూనా

సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను పూర్తి ఆబ్జెక్టివ్ పద్దతిలో నిర్వహిస్తారు. ఈ పరీక్షను కేవలం స్క్రీనింగ్ టెస్ట్‌గా మాత్రమే పరిగణిస్తారు. ఇందులో పొందిన మెరిట్ కేవలం సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షకు అర్హుత పొందేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. తుది ఎంపికలో ఈ మార్కులను పరిగణలోకి తీసుకోరు. ఉద్యోగ ఖాళీలు ఆధారంగా ప్రతి పోస్టుకు గరిష్టంగా 10 నుండి 13 మంది అభ్యర్థులను మెయిన్స్ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు.

  1. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను రెండు పేపర్లుగా జరుపుతారు. వీటిని జనరల్ స్టడీస్ (పేపర్ I) మరియు ఆప్టిట్యూడ్ టెస్ట్ (పేపర్ II) పేర్లతో నిర్వహిస్తారు. ఈ రెండు పేపర్లను మొత్తం 400 (200+200) మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి పేపర్లో 100 ముల్టీపుల్ ఛాయస్ ప్రశ్నలు ఇవ్వబడతాయి.
  2. ఈ వంద ఆబ్జెక్టివ్ ప్రశ్నలుకు 2 గంటల సమయంలో సమాధానం చేయాల్సి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానం చేసిన ప్రశ్నలకు 1/3 వంతు మార్కులు తొలగిస్తారు.
  3. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పేపరు - I లో కరెంటు అఫైర్స్, భారతదేశ చరిత్ర, భారత జాతీయ ఉద్యమం, భారతీయ మరియు ప్రపంచ భౌగోళికం, భారత రాజకీయ వ్యవస్థ, పంచాయతీ రాజ్ వ్యవస్థ, పాలిటీ, ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి, పర్యావరణం, జీవవైవిధ్యం, వాతావరణ మార్పులు, ఆర్ట్ అండ్ కల్చర్ మరియు జనరల్ సైన్స్ సంబంధిత అంశాలలో అభ్యర్థి పరిజ్ణానం పరిశీలిస్తారు.
  4. సివిల్స్ ప్రిలిమినరీ పేపర్ - II లో లాజికల్ రీజనింగ్, అనలాటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్, ప్రాబ్లెమ్ సొల్వింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ మరియు మెంటల్ ఎబిలిటీ సంబంధిత అంశాల యందు అభ్యర్థి పరిజ్ఞానం పరీక్షిస్తారు. పేపర్ II ను క్వాలిఫై పేపర్‌గా పరిగణిస్తారు. ఈ పేపర్లో 33% కనీస మార్కులు సాధించిన అభ్యర్థులు ప్రిలిమ్స్ ఉత్తీర్ణతులుగా పరిగణిస్తారు.
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పేపర్లు ప్రశ్నలు మార్కులు సమయం
1 జనరల్ స్టడీస్ (పేపర్ I) 100 200 2 గంటలు
2 ఆప్టిట్యూడ్ టెస్ట్ (పేపర్ II) 100 200 2 గంటలు

సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ సిలబస్

సివిల్స్ ప్రిలిమినరీ పేపర్ I సిలబస్
  • తాజా జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన సమకాలిన అంశాలు.
  • భారతదేశ చరిత్ర మరియు భారత జాతీయ ఉద్యమం.
  • భారతీయ మరియు ప్రపంచ జాగ్రఫీ - భౌతిక, సామాజిక, ఆర్థిక భౌగోళిక శాస్త్రం.
  • భారత రాజకీయాలు మరియు పాలన - రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పంచాయతీరాజ్, పబ్లిక్ పాలసీ, హక్కులు సమస్యలు మొదలైనవి.
  • ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి - సుస్థిర అభివృద్ధి, పేదరికం, జనాభా, సోషల్ సెక్టార్ ఇనిషియేటివ్స్ మొదలైనవి.
  • పర్యావరణ జీవావరణ శాస్త్రం, జీవ వైవిధ్యం మరియు వాతావరణ మార్పులపై సాధారణ సమస్యలు (ప్రాథమిక అంశాలు)
సివిల్స్ ప్రిలిమినరీ పేపర్ II సిలబస్
  • కంప్రహెన్షన్.
  • కమ్యూనికేషన్ నైపుణ్యాలతో సహా వ్యక్తిగత నైపుణ్యాలు (ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ & కమ్యూనికేషన్ స్కిల్స్).
  • లాజికల్ రీజనింగ్ మరియు అనలిటికల్ ఎబిలిటీ.
  • డెసిషన్ మేకింగ్ మరియు ప్రాబ్లెమ్ సాల్వింగ్.
  • జనరల్ మెంటల్ ఎబిలిటీ.
  • ప్రాథమిక సంఖ్యాశాస్త్రం (సంఖ్యలు మరియు వాటి సంబంధాలు, పరిమాణం యొక్క ఆర్డర్లు మొదలైనవి - టెన్త్ క్లాస్ లెవెల్)
  • డేటా ఇంటర్‌ప్రెటేషన్ (చార్ట్‌లు, గ్రాఫ్‌లు, టేబుల్‌లు, డేటా సమృద్ధి మొదలైనవి - టెన్త్ క్లాస్ లెవెల్)

సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్ నమూనా

సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష పూర్తి రాతపరీక్ష విధానంలో ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ మొత్తం అభ్యర్థి మేధస్సు మరియు అవగాహన యొక్క లోతును అంచనా వేయడానికి ఉద్దేశించబడి ఉంటుంది. ఇందులో మొత్తం 9 పేపర్లు ఉంటాయి. ఇందులో రెండు క్వాలిఫై అవ్వాల్సిన పేపర్లు, మిగతా 7 తప్పనిసరి స్కోరు చేయాల్సిన పేపర్లు ఉంటాయి.

క్వాలిఫై పేపర్ A లో రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. పేపర్ B ఇంగ్లీష్ భాషకు సంబంధించి ఉంటుంది. ఒక్కో  క్వాలిఫై పేపర్ 300 మార్కులకు నిర్వహిస్తారు. వీటిలో కనీసం 25% మార్కులు సాధించాల్సి ఉంటుంది.

మిగతా 7 పేపర్లలో, పేపర్ I యందు  వెయ్యి నుండి 12 వందల పదాలతో 2 వ్యాసాలు (Essay) రాయాల్సి ఉంటుంది. పేపర్ II నుండి పేపర్ V వరకు జనరల్ స్టడీస్ సంబంధిత పేపర్లు ఉంటాయి. మిగతా 2 పేపర్ల కోసం ఆప్షనల్ సబ్జెక్టులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి పేపర్ 250 మార్కులకు జరుగుతుంది. ఒక్కో పేపర్ కోసం 3 గంటల నిర్ణయిత సమయం కేటయిస్తారు.

పేపర్ సిలబస్ సమయం మార్కులు
క్వాలిఫైయింగ్ పేపర్లు
పేపర్ A లాంగ్వేజ్ టెస్ట్ (రాజ్యాంగం గుర్తించిన బాషల నుండి ఆప్షనల్ ) 3 గంటలు 300
పేపర్ B ఇంగ్లీష్ 3 గంటలు 300
మార్కులు లెక్కించే పేపర్లు
పేపర్ I  వ్యాసం (Essay ) 3 గంటలు 250
పేపర్ II జీఎస్  1 : భారత వారసత్వం-సంస్కృతీ, చరిత్ర etc 3 గంటలు 250
పేపర్ III జీఎస్  2 : పాలన, రాజ్యాంగం, రాజకీయలు etc 3 గంటలు 250
పేపర్ IV జీఎస్  3 : టెక్నాలజీ, పర్యావరణం, విపత్తు నిర్వహణ etc 3 గంటలు 250
పేపర్ V జీఎస్ 4 : ఎథిక్స్, ఇంటిగ్రిటీ & ఆప్టిట్యూడ్ 3 గంటలు 250
పేపర్ VI ఆప్షనల్ సబ్జెక్టు - పేపర్ 1 3 గంటలు 250
పేపర్ VII ఆప్షనల్ సబ్జెక్టు - పేపర్ 2 3 గంటలు 250
సివిల్ సర్వీసెస్ మెయిన్ రాతపరీక్ష మొత్తం మార్కులు 1750
సివిల్ సర్వీసెస్ మెయిన్ ఇంటర్వ్యూ / పర్సనాలిటీ టెస్ట్ మార్కులు 275
సివిల్ సర్వీసెస్ మెయిన్ మొత్తం మార్కులు 2025

సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షను మొత్తం 2025 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రాతపరీక్ష కోసం 1750 మార్కులు, ఇంటర్వ్యూ కోసం 275 మార్కులు కేటాయిస్తారు. ఈ 2025 మార్కులలో అభ్యర్థి సాధించిన స్కోరు ఆధారంగా చేసుకుని సివిల్స్ సర్వీస్ పోస్టులు కేటాయిస్తారు.

సివిల్ సర్వీసెస్ మెయిన్ పేపర్ A లాంగ్వేజ్ ఎంపికలు
అస్సామీ మలయాళం సింధీ
బెంగాలీ మణిపూరి తమిళ్
గుజరాతీ మరాఠీ తెలుగు
హిందీ నేపాలీ ఉర్దూ
కన్నడ ఒడియా బోడో
కాశ్మీరీ పంజాబీ డోంగ్రి
కొంకణి సంస్కృత మైత్లి & సంతాలీ
సివిల్ సర్వీసెస్ పేపర్ VI 6 & పేపర్ VII 7 ఆప్షనల్ సబ్జెక్టులు
అగ్రికల్చర్ జియోగ్రఫీ ఫిజిక్స్
అనిమల్ హుస్బెండరీ & వెటర్నరీ సైన్స్ జియాలజి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
ఆంథ్రోపాలజీ హిస్టరీ సైకాలజీ
బోటనీ లా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
కెమిస్ట్రీ మానేజ్మెంట్ సోషియాలజీ
సివిల్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్
కామర్స్ & అకౌంటెన్సీ మెకానికల్ ఇంజనీరింగ్ జూలోజి
ఎకనామిక్స్ మెడికల్ సైన్సెస్ ఫిలాసఫీ
పొలిటికల్ సైన్స్ & ఇంటర్నేషనల్ రిలేషన్స్
లిటరేచర్ (ఇంగ్లీష్ తో పాటుగా రాజ్యాంగం గుర్తించిన 22 భాషలు)

సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్ సిలబస్

సివిల్ సర్వీస్ ఎగ్జామ్ క్వాలిఫై పేపర్ల సిలబస్ (లాంగ్వేజ్ పేపర్లు)

క్వాలిఫై పేపర్లను ఇంగ్లీష్ మరియు భారతీయ ప్రాంతీయ భాషల్లో అభ్యర్థి యొక్క ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు నిర్వహిస్తారు. ఇందులో ప్రధానంగా గద్యాన్ని చదవడం మరియు అర్థం చేసుకోవడంలో అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షించడంతో పాటుగా సంబంధిత భాషల్లో అభ్యర్థి ఆలోచనలను, స్పష్టతను అంచనా వేసే ప్రశ్నలను ఇస్తారు. ప్రశ్నల సరళి విస్తృతంగా ఈ క్రింది విధంగా ఉంటుంది.

  1. పాసేజెస్ కంప్రహెన్షన్ (పేపర్ A & B భాషలకు)
  2. సారాంశం రచన (పేపర్ A & B భాషలకు)
  3. వాడుక పదాలు మరియు వొకాబులరీ (పేపర్ A & B భాషలకు)
  4. సంక్షిప్త వ్యాసాలు (పేపర్ A & B భాషలకు)
  5. ఇంగ్లీషు నుండి భారతీయ భాషలోకి మరియు వైస్ వెర్సాకి అనువాదం (పేపర్ A భాషలకు మాత్రమే)

సివిల్ సర్వీస్ మెయిన్ ఎగ్జామ్ పేపర్ I సిలబస్

సివిల్ సర్వీస్ మెయిన్ ఎగ్జామ్ పేపర్ I లో అభ్యర్థులు బహుళ అంశాలపై వ్యాసాలు రాయవలసి ఉంటుంది. తాజాగా చోటు చేసుకున్న జాతీయ, అంతర్జాతీయ సంఘటనలు, సమస్యలు, వివాదాలు మరియు సంస్థాగత, స్థానిక సమస్యలు, ప్రభుత్వ పథకాలు, విధానాలు, పాలసీలు, పనితీరు పై ప్రశ్నలు ఇవ్వబడతాయి.

వీటి ద్వారా సంబంధిత అంశాల యందు అభ్యర్థి యొక్క ఆలోచన, అభిప్రాయం, విషయ పరిజ్ఞానం, అవగాహనను పరీక్షిస్తారు. వ్యాసంలో అభ్యర్థి యొక్క ఆలోచనలను క్రమ పద్ధతిలో అమర్చాల్సి ఉంటుంది. వ్యాసం సంక్షిప్తంగా, అర్థవంతంగా వ్రాయాలి. సమర్థవంతమైన మరియు ఖచ్చితమైన వ్యక్తీకరణకు మంచి మార్కులు ఇవ్వబడతయి.

సివిల్ సర్వీస్ మెయిన్ ఎగ్జామ్ పేపర్ II సిలబస్

జనరల్ స్టడీస్ I
ఇండియన్ హెరిటేజ్ & కల్చర్, హిస్టరీ & జాగ్రఫీ ఆఫ్ వరల్డ్ మరియు సొసైటీ
  • ఇండియన్ కల్చర్ : పురాతన కాలం నుండి ఆధునిక కాలం వరకు కళా రూపాలు, సాహిత్యం మరియు వాస్తుశిల్పం యొక్క ముఖ్యమైన అంశాలను కవర్ చేస్తారు.
  • ఆధునిక భారతీయ చరిత్ర : పద్దెనిమిదవ శతాబ్దపు మధ్యకాలం నుండి ఇప్పటి వరకు - ముఖ్యమైన సంఘటనలు, వ్యక్తులు, సమస్యలు.
  • స్వాతంత్య్ర పోరాటం : స్వాతంత్ర ఉద్యమ వివిధ దశలు, దేశంలోని వివిధ భాగాల నుండి ముఖ్యమైన సహాయకులు/సహకారాలు .
  • స్వాతంత్య్రానంతరం దేశంలోనే ఏకీకరణ మరియు పునర్వ్యవస్థీకరణ.
  • వరల్డ్ జాగ్రఫీ : 18వ శతాబ్దానికి చెందిన పారిశ్రామిక విప్లవం, ప్రపంచ యుద్ధాలు వంటి సంఘటనలు, జాతీయ సరిహద్దుల పునర్నిర్మాణం, వలసరాజ్యం, కమ్యూనిజం వంటి రాజకీయ బావజాలాలు, పెట్టుబడిదారీ విధానం, సోషలిజం వంటి మొదలగు ఆలోచన రూపాలు మరియు సమాజంపై వాటి ప్రభావం.
  • భారతీయ సమాజం, భారతదేశ వైవిధ్యం యొక్క ముఖ్య లక్షణాలు.
  • మహిళలు మరియు మహిళల సంస్థ ప్రాధన్యత, జనాభా, పేదరికం & అభివృద్ధి, పట్టణీకరణ వంటి సమస్యలు మరియు వాటి పరిష్కారాలు.
  • భారతీయ సమాజంపై ప్రపంచీకరణ ప్రభావం.
  • సామాజిక సాధికారత, మతతత్వం, ప్రాంతీయవాదం & లౌకికవాదం.
  • ప్రపంచ భౌతిక భూగోళశాస్త్రం యొక్క ముఖ్య లక్షణాలు.
  • ప్రపంచవ్యాప్తంగా కీలకమైన సహజ వనరుల పంపిణీ (దక్షిణాసియా మరియు భారత ఉపఖండంతో సహా). ప్రపంచంలోని వివిధ ప్రాంతాల (భారతదేశంతో సహా) ప్రాథమిక, ద్వితీయ మరియు తృతీయ రంగ పరిశ్రమల స్థానానికి కారణమయ్యే కారకాలు.
  • జియోఫిజికల్ దృగ్విషయాలు : భూకంపాలు, సునామీ, అగ్నిపర్వత కార్యకలాపాలు, తుఫానులు. భౌగోళిక లక్షణాలు మరియు కీలకమైన భౌగోళిక స్థాన-మార్పులు మరియు వృక్షజాలం మరియు జంతుజాలంపై ఈ మార్పుల ప్రభావాలు.

సివిల్ సర్వీస్ మెయిన్ ఎగ్జామ్ పేపర్ III సిలబస్

జనరల్ స్టడీస్ - II
గవర్నెన్స్, రాజ్యాంగం, పాలిటి, సోషల్ జస్టిస్ & ఇంటర్నేషనల్ రిలేషన్స్
  • భారత రాజ్యాంగం : చారిత్రక మూలాధారాలు, పరిణామం, లక్షణాలు, సవరణలు, ముఖ్యమైన నిబంధనలు మరియు ప్రాథమిక నిర్మాణం.
  • యూనియన్ & రాష్ట్రాల విధులు మరియు బాధ్యతలు, సంబంధిత సమస్యలు మరియు సవాళ్లు సమాఖ్య నిర్మాణం, స్థానిక స్థాయిల వరకు అధికారాలు మరియు ఆర్థికాల పంపిణీ మరియు అందులోని సవాళ్లు.
  • వివిధ వ్యవస్థలు మరియు సంస్థల మధ్య అధికారాల విభజన వివాద పరిష్కార విధానాలు.
  • భారత రాజ్యాంగం ఇతర దేశాలతో పోలిక.
  • పార్లమెంట్ & రాష్ట్ర శాసనసభల నిర్మాణం, పనితీరు, పరిపాలన ప్రవర్తన, అధికారాలు & వీటి నుండి ఉత్పన్నమయ్యే సమస్యలు.
  • కార్యనిర్వాహక మరియు న్యాయవ్యవస్థల నిర్మాణం మరియు పనితీరు. ప్రభుత్వ శాఖలు, సమూహాలు, అధికారిక/అనధికారిక సంఘాలు మరియు రాజకీయంలో వాటి పాత్ర.
  • ప్రజాప్రాతినిధ్య చట్టం యొక్క ముఖ్య లక్షణాలు.
  • వివిధ రాజ్యాంగ పదవులు, అధికారాలు, విధులు మరియు వివిధ రాజ్యాంగ సంస్థల బాధ్యతలు.
  • చట్టబద్ధమైన, నియంత్రణ మరియు వివిధ పాక్షిక-న్యాయ సంస్థలు.
  • వివిధ రంగాలలో అభివృద్ధి కోసం ప్రభుత్వ విధానాలు మరియు జోక్యాలు. వాటి నుండి ఉత్పన్నమయ్యే సమస్యలు వాటి రూపకల్పన మరియు అమలు.
  • దేశ అభివృద్ధిలో ఎన్‌జీవోలు, ఎస్‌హెచ్జీ, సంఘాలు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు, సంస్థాగత మరియు ఇతర వాటాదారుల పాత్ర.
  • ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాటి పనితీరు. ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేయబడిన యంత్రాంగాలు, చట్టాలు, సంస్థలు మరియు సంస్థలు.
  • విద్య, ఆరోగ్యం, మానవ వనరులకు సంబంధించి సామాజిక రంగం/సేవల అభివృద్ధి మరియు నిర్వహణకు సంబంధించిన సమస్యలు.
  • పేదరికం మరియు ఆకలికి సంబంధించిన సమస్యలు.
  • పాలన యొక్క ముఖ్యమైన అంశాలు, పారదర్శకత మరియు జవాబుదారీతనం, ఇ-గవర్నెన్స్- అప్లికేషన్లు, నమూనాలు, విజయాలు, పరిమితులు మరియు సంభావ్యత.
  • ప్రజాస్వామ్యంలో సివిల్ సెర్వెంట్ల పాత్ర.
  • భారతదేశం మరియు దాని పొరుగు-సంబంధాలు.
  • ద్వైపాక్షిక, ప్రాంతీయ మరియు ప్రపంచ సమూహాలతో భారతదేశానికి సంబంధించిన ఒప్పందాలు, ఆసక్తులు మరియు వాటి ప్రభావాలు.
  • భారతదేశం, భారతీయ ప్రయోజనాలపై అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల విధానాలు మరియు రాజకీయాల ప్రభావం డయాస్పోరా.
  • ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థలు, ఏజెన్సీలు మరియు వాటి నిర్మాణం, పనితీరు.

సివిల్ సర్వీస్ మెయిన్ ఎగ్జామ్ : పేపర్ IV సిలబస్

జనరల్ స్టడీస్ III
టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, జీవ వైవిద్యం, పర్యావరణం, సెక్యూరిటీ & డిజాస్టర్ మానేజ్మెంట్
  • ఇండియన్ ఎకానమీ : ప్రణాళిక, సమీకరణ, వనరులు, వృద్ధి, అభివృద్ధి మరియు ఉపాధి మరియు సంబంధించిన సమస్యలు.
  • సమ్మిళిత వృద్ధి మరియు దాని నుండి ఉత్పన్నమయ్యే సమస్యలు.
  • ప్రభుత్వ బడ్జెట్.
  • దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రధాన పంటలు, వివిధ రకాల నీటిపారుదల వ్యవస్థలు మరియు నీటిపారుదల వ్యవస్థలు నిల్వ, రవాణా మరియు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ మరియు సమస్యలు. వ్యవసాయంలో ఈ-టెక్నాలజీ.
  • ప్రత్యక్ష మరియు పరోక్ష వ్యవసాయ సబ్సిడీలు మరియు కనీస మద్దతు ధరలకు సంబంధించిన సమస్యలు. ప్రజా పంపిణీ వ్యవస్థ లక్ష్యాలు, పనితీరు, పరిమితులు, పునరుద్ధరణ. బఫర్ స్టాక్స్ మరియు ఆహార భద్రత సమస్యలు. జంతువుల పెంపకం.
  • భారతదేశంలో ఆహార ప్రాసెసింగ్ మరియు సంబంధిత పరిశ్రమల స్కోప్. అప్‌స్ట్రీమ్ మరియు దిగువ అవసరాలు, సరఫరా గొలుసు నిర్వహణ.
  • భారతదేశంలో భూ సంస్కరణలు.
  • ఆర్థిక వ్యవస్థపై సరళీకరణ ప్రభావాలు, పారిశ్రామిక విధానంలో మార్పులు మరియు వాటి ప్రభావాలు & పారిశ్రామికరంగ వృద్ధి.
  • మౌలిక సదుపాయాలు: ఇంధనం, ఓడరేవులు, రోడ్లు, విమానాశ్రయాలు, రైల్వేలు మొదలైనవి.
  • పెట్టుబడి నమూనాలు.
  • సైన్స్ అండ్ టెక్నాలజీ- డెవలప్‌మెంట్స్ మరియు దైనందిన జీవితంలో వాటి ఉపయోగాలు మరియు ప్రభావాలు.
  • సైన్స్ & టెక్నాలజీలో భారతీయుల విజయాలు. సాంకేతికత యొక్క స్వదేశీకరణ మరియు నూతన సాంకేతిక ఆవిష్కరణలు.
  • ఐటీ, స్పేస్, కంప్యూటర్లు, రోబోటిక్స్, నానో-టెక్నాలజీ, బయో-టెక్నాలజీ మరియు సమస్యలు. ఈ రంగాలలో మేధో సంపత్తి హక్కులకు సంబంధించిన అవగాహన.
  • పరిరక్షణ, పర్యావరణ కాలుష్యం మరియు క్షీణత, పర్యావరణ ప్రభావం అంచనా.
  • విపత్తు మరియు విపత్తు నిర్వహణ.
  • అభివృద్ధి మరియు అతివాద వ్యాప్తి మధ్య సంబంధాలు.
  • అంతర్గత భద్రత సవాళ్లను సృష్టించడంలో బాహ్య రాష్ట్ర మరియు రాష్ట్రేతర వ్యక్తుల పాత్ర.
  • కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, మీడియా పాత్ర మరియు సోషల్ నెట్‌వర్కింగ్ ద్వారా అంతర్గత భద్రతకు సవాళ్లు, అంతర్గత భద్రతా సవాళ్లలో సైట్‌లు, సైబర్ భద్రత యొక్క ప్రాథమిక అంశాలు, మనీలాండరింగ్ మరియు దాని నివారణ.
  • సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా సవాళ్లు మరియు వాటి నిర్వహణ. ఉగ్రవాదంతో వ్యవస్థీకృత నేరాల అనుసంధానం.
  • వివిధ భద్రతా దళాలు మరియు ఏజెన్సీలు మరియు వాటి పనితీరు.

సివిల్ సర్వీస్ మెయిన్ ఎగ్జామ్ : పేపర్ V సిలబస్

జనరల్ స్టడీస్ - IV
ఎథిక్స్, ఇంటిగ్రిటీ & ఆప్టిట్యూడ్

ఈ పేపర్‌లో అభ్యర్థుల దృక్పథం మరియు సమగ్రత, ప్రజా జీవితంలో నిస్వార్థత మరియు సమాజంతో పనిచేసేటప్పుడు అతను ఎదుర్కొనే వివిధ సంఘటనలు మరియు సంఘర్షణలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే విధానం వంటి వాటిని పరీక్షించే ప్రశ్నలు ఉంటాయి. ఉదాహరణకు కింది సమస్యలు మరియు అంశాలపై కేస్ స్టడీస్ మాదిరి ప్రశ్నలు ఇవ్వబడతయి.

  1. ఎథిక్స్ మరియు హ్యూమన్ ఇంటర్‌ఫేస్: ఇందులో వ్యక్తిగత, ఉద్యోగ నైతికత యొక్క ప్రమాణాలు, ప్రైవేట్ మరియు పబ్లిక్ సంబంధాలు, ఉద్యోగంలో మానవీయ కోణం, విలువలు, జీవిత అనుభవాలు,గొప్ప నాయకులు, సంస్కర్తలు మరియు నిర్వాహకుల బోధనలు, కుటుంబ సమాజం మరియు విద్యాపరమైన పాత్ర మరియు విలువలను పెంపొందించే సంస్థల సంబంధించి ప్రశ్నలు ఉంటాయి
  2. ఆటిట్యూడ్ : వ్యక్తిగత ఆలోచన మరియు ప్రవర్తన వ్యవహారాలు, మానవ సంబంధాలు, నైతిక మరియు రాజకీయ వైఖరులు, సామాజిక ప్రభావం మరియు ప్రజలతో మామేకం వంటివి ఉంటాయి.
  3. ఆప్టిట్యూడ్ : విధుల పట్ల సమగ్రత, నిష్పక్షపాతత మరియు పక్షపాతం లేని యోగ్యత మరియు ప్రజా సేవ పట్ల అంకితభావం, బలహీన వర్గాల పట్ల సానుభూతి, సహనం మరియు కరుణ వంటి అంశాలకు సంబంధించి ప్రశ్నలు ఇవ్వబడ్డాయి.
  4. ఎమోషనల్ ఇంటెలిజెన్స్-కాన్సెప్ట్స్, మరియు వాటి యుటిలిటీస్. అడ్మినిస్ట్రేషన్ మరియు గవర్నెన్స్‌.
  5. మానవీకరణలో భారతదేశం మరియు ప్రపంచ నైతిక ఆలోచనాపరులు మరియు తత్వవేత్తల సహకారం.
  6. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పబ్లిక్/సివిల్ సర్వీస్ విలువలు మరియు నీతి, నిజాయతి మరియు సమస్యలు, నైతిక ఆందోళనలు మరియు ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలలో గందరగోళాలు. చట్టాలు, నియమాలు, నిబంధనలు మరియు మనస్సాక్షి యొక్క అర్థం ఎథికల్ గైడెన్స్.
  7. జవాబుదారీతనం మరియు నైతిక పాలన, పాలనలో నైతిక విలువలను బలోపేతం చేయడం, అంతర్జాతీయ సంబంధాలు మరియు నిధులలో నైతిక సమస్యలు, కార్పొరేట్ పాలన మొదలగునివి.
  8. పాలనలో ప్రాబిటీ: పబ్లిక్ సర్వీస్ కాన్సెప్ట్, ప్రభుత్వంలో సమాచార భాగస్వామ్యం మరియు పారదర్శకత, సమాచార హక్కు, నీతి నియమాలు, కోడ్‌లు
    ప్రవర్తన, పౌరుల చార్టర్లు, పని సంస్కృతి, సేవా బట్వాడా నాణ్యత, ప్రజా నిధుల వినియోగం, అవినీతి సవాళ్లు.
గమనిక : పేపర్ VI మరియు VII సంబంధించి ఆప్షనల్ సబ్జెక్టుల సిలబస్ యూపీఎస్‌సీ అధికారిక వెబ్సైటులో పొందగలరు

Post Comment