Advertisement
కరెంటు అఫైర్స్ – జూన్ 2022 | రిపోర్టులు & ర్యాంకులు
Magazine 2022

కరెంటు అఫైర్స్ – జూన్ 2022 | రిపోర్టులు & ర్యాంకులు

4వ స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్'లో తమిళనాడుకు టాప్ ర్యాంకు

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా, జూన్ 7వ తేదీన కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా 4వ రాష్ట్ర ఆహార భద్రత సూచికను విడుదల చేశారు. ఈ జాబితాలో తమిళనాడు రాష్ట్రం దేశంలో టాప్ ర్యాంకు సొంతం చేసుకుంది. తర్వాత రెండు స్థానాలలో గుజరాత్, మహారాష్ట్రలు నిలిచాయి. ఈ జాబితాను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేస్తుంది.

ఎన్విరాన్మెంటల్ పెరఫార్మన్స్ ఇండెక్స్'లో ఇండియాకు అత్యల్ప ర్యాంకు

ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన పర్యావరణ పనితీరు సూచిక (EPI) 2022లో భారతదేశం18.9 స్కోరుతో 180 దేశాల జాబితాలో అట్టడుగున నిలిచింది. ఈ జాబితాలో డెన్మార్క్ అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత యూకే మరియు ఫిన్లాండ్ దేశాలు ఉన్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌తో పాటు యేల్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీలు రూపొందించిన ఈ సూచీక, వాతావరణ మార్పుల పనితీరు, పర్యావరణ వ్యవస్థ శక్తి మరియు పర్యావరణ ఆరోగ్యంపై దేశాల పనితీరు ఆధారంగా రూపొందిస్తారు.

గెజిట్ రివ్యూ యొక్క గ్లోబల్ 10 జాబితాలో చెఫ్ వికాస్ ఖన్నాకు చోటు

గెజిట్ రివ్యూ యొక్క టాప్ 10 గ్లోబల్ చెఫ్‌ల ర్యాంకింగ్స్‌లో ప్రముఖ భారతీయ చెఫ్ వికాస్ ఖన్నా ఆరవ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో బ్రిటిష్ చెఫ్ గోర్డాన్ రామ్‌సే అగ్రస్థానంలో ఉన్నారు. దీనితో ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు సంపాదించినా ఏకైక భారతీయ చెఫ్‌గా నిలిచారు. వికాస్ ఖన్నా 2011 లో న్యూయార్క్ నగరంలో రెస్టారెంట్ జునూన్ మిచెలిన్ స్టార్‌ ప్రారంభించారు.

ఈ రెస్టారెంట్ ద్వారా మాజీ యూఎస్ అధ్యక్షుడు బరాక్ ఒబామా, దలైలామా, పోప్ ఫ్రాన్సిస్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరియు అనేక ఇతర ప్రపంచ నాయకులకు ఆతిథ్యం అందించారు. అలానే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వంట పుస్తకాన్ని రూపొందించిన వ్యక్తిగా నిలిచాడు. ఇండియాలో ప్రచారమయ్యే మాస్టర్ చెఫ్ ఇండియా ప్రోగ్రాం యొక్క ఐదు సీజన్‌లను హోస్టుగా వ్యవహరించాడు.

మెరుగుపడిన భారతదేశ ఎఫ్‌డిఐ ర్యాంక్

2021లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) యొక్క అగ్ర గ్రహీతలలో భారతదేశం యొక్క ర్యాంక్ ఒక మెట్టు పైకి ఎగబాకి ఏడవ స్థానానికి చేరుకుంది. కొవిడ్ సంక్షోభంతో ఇన్‌ఫ్లోలు తగ్గిపోతున్నప్పటికీ 2021లో ఏడవ అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) గ్రహీతగా ఇండియా అవతరించింది. ఈ జాబితాలో 181 బిలియన్ డాలర్లతో చైనా మొదటి స్థానంలో ఉండగా, హాంగ్ కాంగ్ ($141B) తో రెండవ స్థానంలో నిలిచింది.

ఇండియాకు రెండవ అతిపెద్ద ముడి చమురు సరఫరాదారునిగా రష్యా

గడిచిన మేలో భారతదేశానికి రెండవ అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా అవతరించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా చమురును ప్రపంచ దేశాలు కొనేందుకు నిరాకరించడంతో, భారత్ తక్కువ ధరకు ముడి చమురు పొందేందుకు రష్యాతో ఒప్పందం కురుదుర్చుకుంది. దీనితో రష్యా సౌదీ అరేబియాను అధిగమించి భారతదేశానికి రెండవ అతిపెద్ద చమురు సరఫరాదారుగా అవతరించింది. ఇరాక్ ప్రస్తుతం ఇండియా యొక్క అతిపెద్ద ముడి చమురు సరఫరాదారునిగా ఉంది.

వరల్డ్ కాంపిటీటివ్‌నెస్ ఇండెక్స్ 2022లో భారతదేశం ర్యాంక్ 37

ఆసియా ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం పదునైన పెరుగుదలను చూపించింది, ఇటీవలే విడుదల అయినా వార్షిక వరల్డ్ కాంపిటీటివ్‌నెస్ ఇండెక్స్ 2022లో భారత్ 43వ నుండి 37వ ర్యాంక్‌కు ఆరు స్థానాలు ఎగబాకింది. 63 దేశాలకు సంబంధించిన ఈ రిపోర్టును స్విజర్లాండుకు చెందిన ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మానేజ్మెంట్ డెవలప్మెంట్ (IMD) రూపొందిస్తుంది. దీనిని మొదటిసారిగా 1989  ప్రారంభించారు.

నేషనల్ ఇ-సర్వీసెస్ డెలివరీ అసెస్‌మెంట్‌లో కేరళ అగ్రస్థానం

డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ & పబ్లిక్ గ్రీవెన్స్ (DARPG) నిర్వహించిన నేషనల్ ఇ - సర్వీసెస్ డెలివరీ అసెస్‌మెంట్‌లో కేరళ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. నేషనల్ ఇ-గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్‌మెంట్ (NeSDA)ని డీఏఆర్పీజీ 2019లో ఏర్పాటు చేసింది, ఇది దేశంలో  ఇ-గవర్నమెంట్ లేదా డిజిటల్ గవర్నమెంట్ ఎక్సలెన్స్‌ని పెంపొందించడానికి రూపొందించిన కార్యక్రమం. దీనికి సంబంధించి NeSDA 20121 నివేదిక ప్రకారం రాష్ట్రాల జాబితాలో కేరళ అత్యధిక స్కోరు సాధించగా, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో జమ్మూ & కాశ్మీర్ అగ్రస్థానంలో నిలిచింది.

ఆసియా స్టార్టప్ ఎకోసిస్టమ్'లో కేరళకు అత్యుత్తమ ర్యాంక్

యూఎస్-ఆధారిత స్టార్టప్ జీనోమ్ మరియు గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నెట్‌వర్క్ సమర్పించిన 'గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్ట్ (GSER)' ఆసియాలో తక్కువ ఖర్చుతో అత్యుత్తమ ఉద్యోగులను (ఆఫ్రోడబుల్ టాలెంట్) పొందడంలో కేరళ 1వ ర్యాంకులో నిలిచింది. ప్రపంచ వారీగా చూసుకుంటే 4వ స్థానంలో ఉంది.

బెంగళూరు విమానాశ్రయంకు ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా గుర్తింపు

బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం (BLR) 2022 స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డ్స్‌లో 'భారతదేశం మరియు దక్షిణాసియాలోని ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయం' టైటిల్‌ను కైవసం చేసుకుంది. అలానే వింగ్స్ ఇండియా 2022 అవార్డులకు సంబంధించి కూడా ఉత్తమ విమానాశ్రయంగా నిలిచింది.

ఊక్లా స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్'లో ఇండియాకు 115వ స్థానం

ఊక్లా స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ 2022 ర్యాంకులో భారతదేశం మూడు స్థానాలు ఎగబాకి 115వ స్థానంలో నిలిచింది. మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌కు సంబంధించి మే నెలలో ఇండియా సగటు ఇంటర్నెట్ వేగం 14.28 ఎంబీపీఎస్ గా నమోదు అయ్యింది. ఊక్లా స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్ స్పీడ్ డేటాను నెలవారీ ప్రాతిపదికన రిపోర్ట్ చేస్తుంది.

రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్‌స్టాలేషన్‌లలో ఇండియాకు మూడవ స్థానం

చైనా మరియు యూఎస్ తర్వాత 2021లో పునరుత్పాదక ఇంధన వ్యవస్థాపనలలో భారతదేశం మూడవ స్థానంలో నిలిచింది. REN21 (రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ నెట్వర్క్) నివేదిక ప్రకారం భారతదేశం 2021 లో 15.4 గిగావాట్ల (GW) పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయగా, చైనా (136 GW) మరియు యునైటెడ్ స్టేట్స్ (43 GW) పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యంతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.

భారతీయ బ్రోకెన్ రైస్ యొక్క అతిపెద్ద దిగుమతిదారుగా చైనా

కోవిడ్ మహమ్మారి సమయంలో, భారతదేశంలో విరిగిన బియ్యం యొక్క అతిపెద్ద దిగుమతిదారుగా చైనా ముందంజ నిలిచింది. 2021-2022 సంవత్సరంలో, భారతదేశ బ్రోకెన్ రైస్ ఎగుమతుల్లో 7.7% దిగుమతితో చైనా అతిపెద్ద కొనుగోలుదారుగా అవతరించింది. ఇది వరకు భారతీయ బ్రోకెన్ రైస్ ఆఫ్రికా దేశాలకు ఎక్కువ ఎగుమతి అయ్యేది.

ప్రపంచ అత్యుత్తమ విమానాశ్రయంగా హమద్ ఎయిర్‌పోర్ట్‌

ప్యారిస్‌లోని ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్‌పోలో జరిగిన 2022 వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డ్స్‌లో ఖతార్‌కు చెందిన హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వరుసగా రెండవ సంవత్సరం ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా గుర్తించబడింది. ఈ జాబితాలో టోక్యో అంతర్జాతీయ విమానాశ్రయం (హనేడా) రెండో స్థానంలో నిలవగా, సింగపూరుకు చెందిన చాంగి విమానాశ్రయం మూడవ స్థానంలో నిలిచింది.

అలానే ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ సర్వీస్ మరియు వరల్డ్స్ బెస్ట్ ఎయిర్‌పోర్ట్ డైనింగ్ సంబంధించి ఇస్తాంబుల్ విమానాశ్రయం ప్రత్యేక అవార్డు అందుకుంది. దీనికి సంబంధించి ఎక్స్‌పో విడుదల చేసిన టాప్ 20 జాబితాలో ఒక్క భారతీయ విమానాశ్రయం కూడా లేదు.

అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితాలో వియన్నాకు అగ్రస్థానం

ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ నివేదిక ప్రకారం, గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్‌ 2022 లో ఆస్ట్రియా రాజధాని నగరం వియన్నా ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలిచింది. ఈ నగరం గత ఐదేళ్లలో ఈ స్థానాన్ని దక్కించుకోవడం ఇది మూడవ సారి. ఈ జాబితాలో కోపెన్‌హాగన్ (డెన్మార్క్) టై (జ్యూరిచ్, స్విట్జర్లాండ్), టై (కాల్గరీ, కెనడా) వాంకోవర్ (కెనడా) టాప్ 5 జాబితాలో నిలవగా సిరియా క్యాపిటల్ నగరం డమాస్కస్ ఈ జాబితాలో అట్టడుగున నిలిచింది. గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్‌ను ఏటా ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ విడుదల చేస్తుంది. గత ఏడాది ఈ జాబితాలో ఆక్లాండ్‌ (న్యూజిలాండ్) అగ్రస్థానంలో నిలిచింది.

Post Comment