ఇండియాలో 8 టాప్ ఎంబీఏ ప్రవేశ పరీక్షలు 2023
Admissions MBA Entrance Exams

ఇండియాలో 8 టాప్ ఎంబీఏ ప్రవేశ పరీక్షలు 2023

మేనేజ్మెంట్ విద్యలో జాతీయస్థాయిలో నిర్వహించే 8 టాప్ ఎంబీఏ ప్రవేశ పరీక్షల సమాచారం తెలుసుకోండి. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎంలలో ప్రవేశాలకు నిర్వహించే క్యాట్ పరీక్షతో పాటుగా వివిధ బిజినెస్ స్కూల్స్ నిర్వహించే ఎంట్రన్స్ టెస్టులు, తెలుగు రాష్ట్రాల్లో ఎంబీఏ ప్రవేశం కోసం నిర్వహించే ఐసెట్ వంటి పరీక్షల కోసం తెలుసుకోండి. వీటిలో మంచి ర్యాంకు సాధించడం ద్వారా ప్రసిద్ధ బిజినెస్ స్కూళ్లలో అడ్మిషన్ పొందొచ్చు.

  1. కామన్ అడ్మిషన్ టెస్ట్
  2. జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్
  3. సింబయాసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్
  4. టిస్‌నెట్
  5. సీమ్యాట్
  6. ఐఆర్ఏంఏ సోషల్ అవెర్నెస్ టెస్ట్
  7. బిజినెస్ స్టడీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్
  8. గీతం అడ్మిషన్ టెస్ట్

కామన్ అడ్మిషన్ టెస్ట్

cat exam

ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) లలో మేనేజ్‌మెంట్ కోర్సుల యందు అడ్మిషన్ జరిపేందుకు క్యాట్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. క్యాట్ అనగా కామన్ అడ్మిషన్ టెస్ట్ అని అర్ధం. క్యాట్ పరీక్షలో అర్హుత పొందడం ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 20 ఐఐఎంలతో పాటుగా ఇతర మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్లలో అడ్మిషన్ పొందవచ్చు.
క్యాట్ ఏగ్జామ్ నమూనా : క్యాట్ పరీక్ష పూర్తి ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. మూడు గంటల నిడివితో 300 మార్కులకు జరిగే ఈ అర్హుత పరీక్షలో మొత్తం మూడు సెక్షన్లలో 100 ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్ 1 లో 34 ప్రశ్నలు, సెక్షన్ 2 లో 32 ప్రశ్నలు, సెక్షన్ 3 లో 34 ప్రశ్నలు ఉంటాయి.  ప్రతి సెక్షనుకు ఒక గంట సమయం నిర్దేశించబడి ఉంటుంది. ఒక సెక్షన్ లో సమాధానం చేసే సమయంలో ఇంకో సెక్షన్ లో ప్రశ్నలకు సమాధానం చేసే అవకాశం ఉండదు.

సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 3 మార్కులు, తప్పు సమాధానం చేసిన ప్రశ్నలకు -1 మార్కు ఇవ్వబడుతుంది. నాన్ మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలకు నెగిటివ్ మార్కింగు విధానం లేదు. నాన్ మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలకు కంప్యూటర్ కీబోర్డు ద్వారా సమాధానం రాయాల్సి ఉంటుంది.

పరీక్ష రెండు షిఫ్టులలో పలు సెషన్లలో జరుగుతుంది. ఏటా పరీక్ష విధానం మార్చుకుంటూ పోయే ఈ ఎలిజిబిలిటీ టెస్ట్ యొక్క ప్రశ్నల తీరును అంచనా వేయటం చాల కష్టం. పరీక్ష ముందు రోజుల్లో క్యాట్ అధికారిక వెబ్‌సైట్ లో ఉండే మాక్ పరీక్షల ఆధారంగా ఒక అంచనాకు రావొచ్చు.

జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్

XAT (xavier aptitude test )

క్యాట్ తర్వాత అత్యంత ఆదరణ పొందిన మేనేజిమెంట్ ప్రవేశ పరీక్ష గా  XAT (జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్) గుర్తింపు ఉంది. ఏటా దాదాపు 90 వేలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నట్లు సమాచారం. XAT లో సాధించిన స్కోరుతో దేశవ్యాప్తంగా దాదాపు 150కి పైగా బిజినెస్ స్కూళ్లలో అడ్మిషన్ పొందచ్చు.

నోటిఫికేషన్: ఈ  ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ ప్రతి ఏటా ఆగష్టు మరియు సెప్టెంబర్ మద్య విడుదలవుతుంది

పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా దాదాపు అన్ని పేరొందిన నగరాలలో ఈ పరీక్ష నిర్వహించబడుతుంది. తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాలలో పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.
పరీక్ష విధానం: XAT ప్రవేశ పరీక్ష దాదాపు క్యాట్ పరీక్ష విధంగానే ఉంటుంది . నాలుగు సెక్షన్స్ గా విభజింపబడిన ఈ పరీక్షలో మొదటిది వెర్బల్ అండ్ లాజికల్ ఎబిలిటీ.  రెండోది డెసిషన్ మేకింగ్, మూడోది క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ ఇంటర్ప్రీటేషన్. ఈ మూడు సెక్షన్ల నుండి 75 ప్రశ్నలు వస్తాయి. నాల్గువ సెక్షన్ అయినా జనరల్ నాలెడ్జ్ నుండి 25 ప్రశ్నలు వస్తాయి.

ప్రతి ప్రశ్నకు 1 మార్క్, తప్పు ప్రశ్నకు ఒక మార్కులో నాలుగో వంతు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కనీసం ప్రయత్నించని ప్రశ్నల సంఖ్యా 8 దాటితే 0.05 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈ విషయంలో అభ్యర్థులు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. పరీక్ష ఆన్ లైన్లో ఉంటుంది. పరీక్ష కాలవ్యవధి 3 గంటలు.

సింబయాసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్(SNAP)

SNAP (SYMBIOSIS NATIONAL APTITUDE TEST)
SNAP (సింబియాసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్) అనేది సింబియాసిస్ ఇంటర్నేషనల్ డ్రీమ్డ్ యూనివర్సిటీకి చెందిన బిసినెస్ స్కూళ్లలో ఎంబీఏ అడ్మిషన్ కోసం నిర్వహించబడుతుంది. దేశవ్యాప్తంగా వీరికి 15 బిజినెస్ స్కూళ్లు ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు :  1. నోటిఫికేషన్: ఆగష్టు 2. పరీక్ష: డిసెంబర్ 3. ఫలితాలు: జనవరి

పరీక్ష విధానం: 150 మార్కులకు నిర్వహించబడే SNAP ప్రవేశ పరీక్ష నాలుగు సెక్షన్లలో విభజింపబడి ఉంటుంది. మొదటి సెక్షన్ లో జనరల్ ఇంగ్లీష్ (రీడింగ్ కంప్రెహెన్షన్, వెర్బల్ ఎబిలిటీ, వెర్బల్ రిషనింగ్), రెండో సెక్షన్ లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, మూడో సెక్షన్ లో అనలాటికల్ అండ్ లాజికల్ రిషనింగ్, నాల్గువ సెక్షన్ లో కరెంటు అఫైర్స్ కి చెందిన ప్రశ్నలు ఉంటాయి.

కరెంట్ అఫైర్స్ సెక్షన్ మినహా ప్రతి సెక్షన్లో 35 ప్రశ్నలు ఉంటాయి. 35 లో 5 ప్రత్యేక ప్రశ్నలు ఉంటాయి. సాధారణ ప్రశ్నకు 1 మార్కు, ప్రత్యేక ప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానంకి పావు వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

టిస్‌నెట్

TISSNET (TATA INSTITUTE OF SOCIAL SCIENCES)టాటాఇన్స్టిట్యూట్ అఫ్ సోషల్ సైన్సెస్ (TISS) పరిధిలోని స్కూల్ ఆఫ్ మేనేజిమెంట్ అండ్ లేబర్ స్టడీస్ పీజీ ప్రోగ్రాంలో ప్రవేశానికి టీస్ నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి.  మొదటి 30 మార్కులుకు ఇంగ్లీష్ ప్రోఫిసెన్సీ. రెండోది లాజికల్ రిషనింగ్. మూడోది జనరల్ అవెర్నెస్.

చివరి రెండు సెక్షన్లు 40 మార్కులకు ఉంటాయి. మొత్తము 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ లేదు. దరఖాస్తు స్వీకరణ డిసెంబర్ లో ఉంటుంది. ప్రవేశ పరీక్ష జనవరిలో ఉంటుంది. ప్రవేశ పరీక్షలో సాధించిన స్కోర్, మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను కోర్సులోకి తీసుకుంటారు.

కామన్ మేనేజిమెంట్ అడ్మిషన్ టెస్ట్

CMAT (common management admission test)
సీమ్యాట్ (కామన్ మేనేజిమెంట్ అడ్మిషన్ టెస్ట్) ను జాతీయ స్థాయిలో ప్రతి ఏటా భారత మానవ వనరుల మంత్రిత్వశాఖ (MHRD) ఆమోదంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నిర్వహిస్తుంది. దాదాపు దేశవ్యాప్తంగా 500కు పైగా బిజినెస్ స్కూల్స్ సీమ్యాట్ స్కోర్ ఆధారంగా ఎంబీఏ లోకి ప్రవేశం కల్పిస్తున్నాయి.

పరీక్ష విధానం: ఈ పరీక్ష నాలుగు సెక్షన్లలో ఉంటుంది. 1. లాజికల్ రిషనింగ్ 2. లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ 3. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ 4. జనరల్ అవెరినెస్. ప్రతి సెక్షన్ నుండి 25 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు నాలుగు మార్కులు. ప్రతి తప్పు సమాధానంకు ఒక మార్కులో నాల్గువ వంతు కోత ఉంటుంది.సెక్షనల్ కటాఫ్ లేదు.

మూడుగంటల కాలవ్యవధిలో 400 మార్కులకు పరీక్ష రాయాల్సి ఉంటుంది.  సెక్షనల్ కటాఫ్ లేదు కాబట్టి అభ్యర్థి ఆసక్తి మేరకు మొదటి మూడు సెక్షన్లపై పట్టు సాధిస్తే మంచి స్కోర్ సాధించవచ్చు. పరీక్ష ఆన్ లైన్ పద్దతిలో జరుగుతుంది.

ఐఆర్ఏంఏ సోషల్ అవెర్నెస్ టెస్ట్

IRMA (INSTITUTE OF RURAL MANAGEMENT ANAND)
ప్రతిష్టాత్మక ఇనిస్టిట్యూట్ అఫ్ రురల్ ఆనంద్(IRMA) లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ రురల్ మేనేజిమెంట్(పీజీడీఆర్ఎం) అభ్యసించడానికి IRVM సోషల్ అవెర్నెస్ టెస్ట్ కి హాజరు కావల్సిఉంటుంది. క్యాట్, XAT స్కోర్స్ ఆధారంగా కూడా ఇందులో ప్రవేశాలు కల్పిస్తారు.

షార్ట్ లిస్ట్ అయిన విద్యార్థులకు IRMA గ్రూప్ ఆక్టివిటీ , పెర్సనల్ ఇంటర్వ్యూలు ఒకేరోజు ఉంటాయి. ఈ పరీక్షలో అభ్యర్థి సామాజిక స్పృహ, జనరల్ అవెరినెస్ లను అంచనా వేస్తారు. ముఖ్యంగా వ్యవసాయం, విద్య, కార్పొరేట్ రెస్పాన్సబిలిటీ , పర్యావరణం, ఎంప్లాయిమెంట్ అండ్ లిటరసీ, మానవ హక్కులు, జనాభా, ఎకానమీ, మానవ ఆరోగ్యం వంటి అంశాలనుండి ప్రశ్నలు వస్తాయి.

ICFAI బిజినెస్ స్టడీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (IBSAT)

IBSAT ( ICFAI BUSINESS SCHOOL APTITUDE TEST)ఇక్ఫాయ్ బిజినెస్ స్కూల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (IBSAT) ఇక్ఫాయ్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. అహ్మదాబాద్, బెంగళూర్, గురుగ్రామ్, కోలకతా, డెహ్రాడూన్, ముంబయిలలో ఈ సంస్థ క్యాంపస్లు ఉన్నాయి. వీటిలో ఎంబీఏ చదవాలంటే ఈ పరీక్షకు హాజరవ్వాలి.

ఆన్ లైన్ విధానంలో రెండు గంటల నిడివిలో ఈ పరీక్ష జరుగుతుంది. వెర్బల్ ఎబిలిటీ, డేటా ఆడీక్వాసి అండ్ డేటా ఇంటెర్పిటేషన్, రీడింగ్ కంప్రెహెన్షన్, క్వాంటిటేటివ్ టెక్నిక్ విభాగాల నుండి మొత్తం 140 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు. నెగిటివ్ మార్కింగ్ లేదు.

గీతం అడ్మిషన్ టెస్ట్

GA T (gitam admission test)విశాఖపట్నం లోని గీతం యూనివర్సిటీ వారు కూడా GAT (గీతం అడ్మిషన్ టెస్ట్) ప్రవేశ పరీక్ష ద్వారా మేనేజిమెంట్ పీజీ లో అడ్మిషన్స్ కల్పిస్తున్నారు.ఈ ప్రెవేశ పరీక్ష ఇంచుమించు AIMA నిర్వహించే మ్యాట్ ప్రవేశ పరీక్షని పోలి ఉంటుంది. 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్ష లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ , రిషనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ పైన ప్రశ్నలు వస్తాయి.

ఈ పరీక్షలే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలు నిర్వహించే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఐసెట్) ద్వారా రాష్టంలో ఉండే వివిధ యూనివర్సిటీలలో , కాలేజీలలో అడ్మిషన్ పొందొచ్చు.

గమనిక: దాదాపు అన్ని పరీక్షల నోటిఫికేషన్స్  ఆగస్టు లో వెలువడతాయి. డిసెంబర్ లో పరీక్ష జరిపి జనవరి లో ఫలితాలు విడుదల చేస్తారు.