తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2022 | మొత్తం ఖాళీలు 16,614
Latest Jobs TSPSC

తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2022 | మొత్తం ఖాళీలు 16,614

తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు భారీస్థాయిలో పోలీస్ నియామక భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించిన మహా ఉద్యోగ మేళాలో భాగంగా వెలువడిన మొదటి నియామక నోటిఫికేషన్ ఇది. ఈ నియామక ప్రకటన ద్వారా ఎస్‌ఐ మరియు కానిస్టేబుల్ విభాగాల్లో 16,614 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో  సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులు 587, కానిస్టేబుల్ పోస్టులు 16,027 ఉన్నాయి. వీటికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మే 2 వ తేదీ నుండి అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. అర్హుత కలిగిన అభ్యర్థులు మే 2 నుండి www.tslprb.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.

వయోపరిమితి పెంపు

ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని మూడేళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో మరింత మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు పొందే అవకాశం కలగనుంది. గతంలో జనరల్ కోటాలో ఎస్‌ఐ పోస్టులకు గరిష్ట వయోపరిమితి 25 ఏళ్ళు ఉండగా..ఇప్పుడు ఇది 28 ఏళ్లకు పెరగనుంది. అలానే జనరల్ కేటగిరిలో కానిస్టేబుల్ పోస్టుల గరిష్ట వయోపరిమితిని కూడా 22 నుండి 25 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం బీసీ, ఎస్సీ, ఎస్టీ వంటి రిజర్వేషన్ కోటా అభ్యర్థులకు మరింత ఉపయోగపడనుంది.

పోస్టుల వారీగా ఖాళీలు

పోస్టు పేరు వేతన స్కేల్ ఖాళీలు
ఎస్‌ఐ (సివిల్) 42300 -115270 414 పోస్టులు
ఎస్‌ఐ (ఏఆర్) 42300 -115270 66 పోస్టులు
ఎస్‌ఐ (ఎస్ఏఆర్ & సీపీఎల్) - పురుషులు 42300 -115270 5 పోస్టులు
ఎస్‌ఐ (స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) - పురుషులు 42300 -115270 12 పోస్టులు
ఎస్‌ఐ (టీఎస్ఎస్పీ) - పురుషులు 42300 -115270 23 పోస్టులు
ఎస్‌ఐ (విపత్తు & అగ్నిమాపక శాఖ) 38890 -112510 26 పోస్టులు
ఎస్‌ఐ (డిప్యూటీ జైలర్) - పురుషులు 38890 -112510 8 పోస్టులు
ఎస్‌ఐ (ఐటీ & కమ్యూనికేషన్) 42300-115270 22 పోస్టులు
ఎస్‌ఐ (పోలీస్ ట్రాన్స్ పోర్ట్ ) - పురుషులు 42300-115270 3 పోస్టులు
ఎస్‌ఐ (ఫింగర్ ప్రింట్ బ్యూరో) 33750-99310 8 పోస్టులు
కానిస్టేబుల్ (సివిల్) 24280-72850 4965 పోస్టులు
కానిస్టేబుల్ (ఏఆర్) 24280-72850 4423 పోస్టులు
కానిస్టేబుల్ (రిజర్వ్) - పురుషులు 24280-72850 100 పోస్టులు
కానిస్టేబుల్ (టీఎస్ఎస్పీ) - పురుషులు 24280-72850 5010 పోస్టులు
కానిస్టేబుల్ (స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) 24280-72850 390 పోస్టులు
కానిస్టేబుల్ (అగ్ని మాపక శాఖ) 24280-72850 610 పోస్టులు
వార్డర్ (జైళ్ల శాఖ) పురుషులు 24280-72850 136 పోస్టులు
వార్డర్ (జైళ్ల శాఖ) మహిళలు 24280-72850 10 పోస్టులు
కానిస్టేబుల్ (ఐటీ & కమ్యూనికేషన్) 24280-72850 262 పోస్టులు
కానిస్టేబుల్ (మెకానిక్) 24280-72850 21 పోస్టులు
కానిస్టేబుల్ (డ్రైవర్) 24280-72850 100 పోస్టులు

ఎలిజిబిలిటీ

వయోపరిమితి ఎస్‌ఐ పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు
వయోపరిమితి
ఎడ్యుకేషన్
ఫీజికల్ స్టాండర్డ్
కంటి చూపు
గరిష్ట వయోపరిమితి 28 ఏళ్ళు
గ్రాడ్యుయేషన్
బౌతికంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి
Dv లెఫ్ట్ (6/6) రైట్ 6/6
Ev లెఫ్ట్ (0/5) రైట్ 0/5
గరిష్ట వయోపరిమితి 25 ఏళ్ళు
ఇంటర్మీడియట్
బౌతికంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి
Dv లెఫ్ట్ (6/6) రైట్ 6/6
Ev లెఫ్ట్ (0/5) రైట్ 0/5

దరఖాస్తు ప్రక్రియ

అర్హులైన అభ్యర్థులు www.tslprb.in వెబ్‌సైట్‌ ద్వారా తుది గడువులోపు దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ప్రక్రియ పూర్తి ఆన్‌లైన్ పద్దతిలో ఉంటుంది. దరఖాస్తు చేసే ముందు సదురు పోర్టల్ యందు అభ్యర్థుల వ్యక్తిగత యూజర్ నేమ్ మరియు పాస్‌వర్డ్ రూపొందించుకోవాలి. నియామక ప్రక్రియ పూర్తీయ్యేవరకు వీటిని అభ్యర్థులు భద్రపర్చుకోవాలి. దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు ఆధార్, మొబైల్ నెంబర్ మరియు మెయిల్ ఐడీలను కలిగి ఉండాలి. అభ్యర్థి వ్యక్తిగత, విద్య, చిరునామా వివరాలు నింపి, పరిక్ష రుసుమును చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హుత పొందిన అభ్యర్థులు, రెండవ దశ కోసం ఇదే పోర్టల్ ద్వారా సంబంధిత డాక్యూమెంట్స్ ఉపయోగించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేసే ముందు సంబంధిత సర్టిఫికేట్లు అన్ని అందుబాటులో ఉంచుకోవాలి. దరఖాస్తు సమయంలో అందించే సమాచారంకు పూర్తి జవాబుదారీ మీరే కాబట్టి ఇచ్చే సమాచారంలో తప్పులు దొర్లకుండా చూసుకోండి. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీలు, రిజర్వేషన్ కేటగిరి, భాష ఎంపిక, పరీక్ష కేంద్రం వంటి వివరాలు దరఖాస్తు పూర్తిచేసేముందు పునఃపరిశీలించుకోండి. దరఖాస్తు పూర్తిచేసాక మూడు లేదా నాలుగు కాపీలు ప్రింట్ తీసి భద్రపర్చండి.

  • వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఈమధ్య కాలంలో తీసుకున్న పాసుపోర్టు సైజు ఫోటో అందుబాటులో ఉంచుకోండి. కంప్యూటర్ లో డిజైన్ లేదా ఎడిట్ చేసిన ఫోటోలు అనుమతించబడవు.
  • మీ సొంత దస్తూరితో చేసిన సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. కాపిటల్ లేటర్స్ తో చేసిన సంతకం చెల్లదు.
  • ఫొటోగ్రాఫ్, సంతకం వాటికీ సంబంధించిన బాక్సుల్లో  మాత్రమే అప్‌లోడ్ చేయండి. అవి తారుమారు ఐతే దరఖాస్తు పరిగణలోకి తీసుకోరు. ఈ ఫైళ్ల సైజు 10-200 కేబీల మధ్య ఉండేలా  చూసుకోండి.
  • దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఫొటోగ్రాఫ్ కు సమానమైనది ఇంకో ఫొటోగ్రాఫ్ ను పరీక్ష రోజు ఆయా పరీక్షకేంద్రంలో  ఇవ్వాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు అందుబాటులో ఉండే తేదిలో పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోండి.
  • పరీక్ష రోజు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు, ఫొటోగ్రాఫ్ తో పాటు వ్యక్తిగత ఐడెంటి కార్డుతో పరీక్షకు హాజరవ్వాలి.
  • నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబడవు.

దరఖాస్తు రుసుము

దరఖాస్తు రుసుములు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా ఈ చలానా విధానంలో చెల్లించవచ్చు. చెల్లింపు సమయంలో సర్వీస్ చార్జీలు , జీఎస్టీ వంటి అదనపు చార్జీలు ఉంటె అభ్యర్థులనే భరించాలి.

పోస్టు పేరు  జనరల్ అభ్యర్థులు ఎస్సీ & ఎస్టీ
ఎస్‌ఐ పోస్టులు 1,000 /- 500 /-
కానిస్టేబుల్ పోస్టులు 800 /- 400 /-

ఎంపిక విధానం

తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, ఎస్‌ఐ మరియు కానిస్టేబుల్ నియామక ప్రక్రియను మూడు దశలలో నిర్వహిస్తుంది. మొదటి దశలో ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహిస్తుంది. దీనిలో అర్హుత పొందిన అభ్యర్థులకు రెండవ దశలో ఫీజికల్ ఎఫిసియన్సీ టెస్ట్ మరియు ఫీజికల్ మెజర్మెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫై అయినా అభ్యర్థులకు చివరిగా ఫైనల్ రాతపరీక్ష నిర్వహించి, వివిధ రిజర్వేషన్ల కోటా ఆధారంగా తుది ఎంపిక చేపడతారు.

ప్రిలిమినరీ పరీక్ష (ఎస్‌ఐ పోస్టులు)

ఎస్‌ఐ పోస్టుల కోసం నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష 3 గంటల నిడివితో 200 మార్కులకు ఓఎంఆర్ (ఆఫ్‌లైన్) ఆధారిత ఆబ్జెక్టివ్ టెస్ట్ నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం 200 ప్రశ్నలను కలిగి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు వన్ మార్కు కేటాయించబడతుంది. పరీక్ష ఇంగ్లీష్, తెలుగు మరియు ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అర్హుత పొందేందుకు కనీసం 30 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది.

సిలబస్ ప్రశ్నలు / మార్కులు  సమయం
అర్థమెటిక్, రీజనింగ్ / మెంటల్ ఎబిలిటీ పరీక్ష 100 ప్రశ్నలు / 100 మార్కులు 90 నిముషాలు
జనరల్ స్టడీస్ 100 ప్రశ్నలు / 100 మార్కులు 90 నిముషాలు

సిలబస్ :  అర్థమెటిక్, రీజనింగ్ / మెంటల్ ఎబిలిటీ పరీక్ష, జనరల్ స్టడీస్ 

ప్రిలిమినరీ పరీక్ష (కానిస్టేబుల్ పోస్టులు)

కానిస్టేబుల్ పోస్టుల కోసం నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష 3 గంటల నిడివితో 200 మార్కులకు ఓఎంఆర్ (ఆఫ్‌లైన్) ఆధారిత ఆబ్జెక్టివ్ టెస్ట్ నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం 200 ప్రశ్నలను కలిగి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు వన్ మార్కు కేటాయించబడతుంది. పరీక్ష ఇంగ్లీష్, తెలుగు మరియు ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అర్హుత పొందేందుకు కనీసం 30 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది.

సిలబస్ :  1. ఇంగ్లీష్ 2. అర్థమెటిక్ 3. జనరల్ సైన్స్ 4. భారతదేశ చరిత్ర, సంస్కృతి, జాతీయ ఉద్యమం 5. భౌగోళిక శాస్త్ర సూత్రాలు, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ & ఎకానమీ 6. జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రస్తుత సంఘటనలు 7. రీజనింగ్ / మెంటల్ ఎబిలిటీ పరీక్ష 8. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు.

ఫీజికల్ ఎఫిసియన్సీ టెస్ట్ మరియు ఫీజికల్ మెజర్మెంట్ టెస్ట్

(ఎస్‌ఐ & కానిస్టేబుల్ పోస్టులు)

ప్రిలిమినరీ పరీక్షలో అర్హుత పొందిన అభ్యర్థులు, రెండవ దశ పరీక్ష కోసం అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. చేసుకున్న అభ్యర్థులకు ఫీజికల్ ఎఫిసియన్సీ టెస్ట్ మరియు ఫిజకల్ మెజర్మెంట్ టెస్ట్ సంబంధిత వివరాలు నియామక బోర్డు అందిస్తుంది. ఫీజికల్ ఎఫిసియన్సీ టెస్టులో భాగంగా రన్నింగ్ ఈవెంట్, లాంగ్ జంప్ / షాట్-పుట్ ఈవెంట్‌లు నిర్వహిస్తారు. వీటిని పూర్తిచేసిన వారికీ ఫిజకల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది.

ఫీజికల్ ఎఫిసియన్సీ టెస్టు (PET)
పురుషులు  మహిళలు
రన్నింగ్ ఈవెంట్  7.15 నిముషాల్లో 1600 మీటర్లు 5.20 నిముషాల్లో 800 మీటర్లు
లాంగ్ జంప్ 4 మీటర్లు 2.5 మీటర్లు
షాట్-పుట్ 6 మీటర్లు (7.2 Kg) 4 మీటర్లు (4 Kg)
ఫిజకల్ మెజర్మెంట్ టెస్ట్ (PMT)
పురుషులు  మహిళలు 
ఎత్తు 167.6 cms 152.5 cms

ఫైనల్ రాతపరీక్ష (FWE) | ఎస్‌ఐ పోస్టులు

ఫీజికల్ ఎఫిసియన్సీ టెస్ట్ మరియు ఫిజకల్ మెజర్మెంట్ టెస్టుల్లో అర్హుత పొందిన అభ్యర్థులు, మూడవ దశ పరీక్ష కోసం అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫైనల్ రాతపరీక్ష సంబంధిత వివరాలు నియామక బోర్డు అందిస్తుంది. ఫైనల్ రాతపరీక్ష నాలుగు పేపర్లుగా ఉంటుంది. పేపర్ I & II లు 100 మార్కులకు, పేపర్ III & IV లు 200 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్ I & II లలో పార్ట్ A లో 25 మార్కులకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, పార్ట్ B లో 75 మార్కులకు డిస్క్రిప్టివ్ ప్రశ్నలు ఇవ్వబడతయి. పేపర్ III & IV పూర్తి ఆబ్జెక్టివ్ పద్దతిలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అర్హుత పొందేందుకు జనరల్ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు, రిజర్వేషన్ కోటా అభ్యర్థులు 30 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది.

పేపర్  సిలబస్ మార్కులు  సమయం
పేపర్ I ఇంగ్లీష్ (ఆబ్జెక్టివ్ + డిస్క్రిప్టివ్) 100 మార్కులు (25 + 75) 2 గంటలు
పేపర్ II తెలుగు / ఉర్దూ (ఆబ్జెక్టివ్ + డిస్క్రిప్టివ్) 100 మార్కులు (25 + 75) 2 గంటలు
పేపర్ III అర్థమెటిక్, రీజనింగ్ / మెంటల్ ఎబిలిటీ 200 మార్కులు 3 గంటలు
పేపర్ IV జనరల్ స్టడీస్ 200 మార్కులు 3 గంటలు

ఫైనల్ రాతపరీక్ష (FWE) |కానిస్టేబుల్ పోస్టులు

ఫీజికల్ ఎఫిసియన్సీ టెస్ట్ మరియు ఫిజకల్ మెజర్మెంట్ టెస్టుల్లో అర్హుత పొందిన అభ్యర్థులు, మూడవ దశ పరీక్ష కోసం అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫైనల్ రాతపరీక్ష సంబంధిత వివరాలు నియామక బోర్డు అందిస్తుంది. ఫైనల్ రాతపరీక్ష పోస్టుల ఆధారంగా 200 లేదా 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష పూర్తి ఆబ్జెక్టివ్ పద్దతిలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అర్హుత పొందేందుకు జనరల్ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు, రిజర్వేషన్ కోటా అభ్యర్థులు 30 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది.

పోస్టు కోడ్ సిలబస్ మార్కులు  సమయం
21, 26, 27 & 28 ఉద్యోగాలకు జనరల్ స్టడీస్ 200 మార్కులు 3 గంటలు
22, 23, 24 & 25 ఉద్యోగాలకు జనరల్ స్టడీస్ 100 మార్కులు 2 గంటలు

సిలబస్ :  1. ఇంగ్లీష్ 2. అర్థమెటిక్ 3. జనరల్ సైన్స్ 4. భారతదేశ చరిత్ర, సంస్కృతి, జాతీయ ఉద్యమం 5. భౌగోళిక శాస్త్ర సూత్రాలు, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ & ఎకానమీ 6. జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రస్తుత సంఘటనలు 7. రీజనింగ్ / మెంటల్ ఎబిలిటీ పరీక్ష 8. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు.

Post Comment