పరిశ్రమలు & కర్మాగారాలు – తెలుగు జీకే క్విజ్
Study Material Telugu Gk

పరిశ్రమలు & కర్మాగారాలు – తెలుగు జీకే క్విజ్

1. కింది వాటిలో మహారత్న కేటగిరిలో లేని కంపెనీ ఏది ?

  1. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
  2. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్
  3. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్
  4. కోల్ ఇండియా లిమిటెడ్
సమాధానం
1. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్

2. దేశంలో సముద్ర తీరంలో ఉన్న స్టీల్ పరిశ్రమ ఏది ?

  1. భూషణ్ పవర్ & స్టీల్ లిమిటెడ్
  2. ఎస్సార్ స్టీల్ లిమిటెడ్
  3. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్
  4. జిందాల్ స్టీల్ & పవర్ లిమిటెడ్
సమాధానం
3. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్)

3. రూర్కెలా ఇనుము పరిశ్రమ ఏ రాష్ట్రంలో ఉంది ?

  1. జార్ఖండ్
  2. పశ్చిమ బెంగాల్
  3. ఛత్తీస్‌గఢ్
  4. ఒడిశా
సమాధానం
4. ఒడిశా

4. బొకారో స్టీల్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది ?

  1. జార్ఖండ్
  2. పశ్చిమ బెంగాల్
  3. ఛత్తీస్‌గఢ్
  4. ఒడిశా
సమాధానం
1. జార్ఖండ్

5. కెమ్మనగుండి ఇనుప ఖనిజంను ఉపయోగించుకునే స్టీల్ పరిశ్రమ ఏది ?

  1. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్
  2. జిందాల్ స్టీల్ & పవర్ లిమిటెడ్
  3. ఎస్సార్ స్టీల్ లిమిటెడ్
  4. విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్
సమాధానం
4. విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్

6. విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్ ఏ రాష్ట్రంలో ఉంది ?

  1. తమిళనాడు
  2. కర్ణాటక
  3. ఒడిశా
  4. ఛత్తీస్‌గఢ్
సమాధానం
2. కర్ణాటక

7.విశాఖ ఉక్కుకు ఇనప దాతువు ఎక్కడ నుండి సరఫరా అవుతుంది ?

  1. గరివిడి
  2. బైలాడిలా
  3. గురమ్ హాసాని
  4. సింగ్ భామ్
సమాధానం
2. బైలాడిలా

8. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో చక్కెర మిల్లులు ఉన్న రాష్ట్రం ?

  1. మహారాష్ట్ర
  2. గుజరాత్
  3. బీహార్
  4. ఉత్తరప్రదేశ్
సమాధానం
1. మహారాష్ట్ర

9. భారతదేశంలో జనపనారను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది ?

  1. ఆంధ్రప్రదేశ్
  2. అస్సాం
  3. ఒడిశా
  4. పశ్చిమ బెంగాల్
సమాధానం
4. పశ్చిమ బెంగాల్

10. నారిమానం చమురు క్షేత్రం ఎక్కడ ఉంది ?

  1. గోదావరి డెల్టా
  2. కావేరి డెల్టా
  3. కావేరి డెల్టా
  4. మహానది డెల్టా
సమాధానం
2. కావేరి డెల్టా

11. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దల్లి రాజహార గనులు దేనికి ప్రసిద్ధి ?

  1. బొగ్గు
  2. మాంగనీస్
  3. ముడి ఇనుము
  4. సున్నపురాయి
సమాధానం
3. ముడి ఇనుము

12. బ్రిటిష్ ప్రభుత్వ సహాయంతో నిర్మించిన స్టీల్ ఫ్యాక్టరీ ఏది ?

  1. భిలాయ్ (ఛత్తీస్‌గఢ్)
  2. బొకోరో (జార్ఖండ్)
  3. దుర్గాపూర్ (పశ్చిమ బెంగాల్)
  4. వైజాగ్ స్టీల్ (ఆంధ్రప్రదేశ్)
సమాధానం
3. దుర్గాపూర్ (పశ్చిమ బెంగాల్)

13. జర్మనీ ప్రభుత్వ సహాయంతో నిర్మించిన స్టీల్ ఫ్యాక్టరీ ఏది ?

  1. భిలాయ్ (ఛత్తీస్‌గఢ్)
  2. బొకోరో (జార్ఖండ్)
  3. దుర్గాపూర్ (పశ్చిమ బెంగాల్)
  4. రూర్కెలా (ఒడిశా)
సమాధానం
4. రూర్కెలా (ఒడిశా)

14. దేశంలో కాఫీ ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది ?

  1. కేరళ
  2. అస్సాం
  3. కర్ణాటక
  4. గోవా
సమాధానం
3. కర్ణాటక

15. భారతదేశంలో రబ్బరును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది ?

  1. కేరళ
  2. అస్సాం
  3. కర్ణాటక
  4. పశ్చిమ బెంగాల్
సమాధానం
1. కేరళ

16. భారతదేశంలో అతిపెద్ద షిప్‌యార్డ్ ఏది ?

  1. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్
  2. హిందుస్థాన్ షిప్‌యార్డ్
  3. గార్డెన్ రీచ్ షిప్‌యార్డ్
  4. గోవా షిప్‌యార్డ్
సమాధానం
1. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్

17. గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ ఎక్కడ ఉంది ?

  1. కోల్‌కతా
  2. గోవా
  3. ముంబాయి
  4. కొచ్చిన్
సమాధానం
1. కోల్‌కతా

18. భారతదేశంలో మొదటి సిమెంట్ ప్లాంట్ ఎక్కడ స్థాపించబడింది ?

  1. రాంచీ
  2. బెంగుళూరు
  3. ముంబాయి
  4. చెన్నై
సమాధానం
4. చెన్నై (మద్రాస్)

19. భారతదేశంలో అత్యధిక పేపర్ మిల్లులు ఉన్న రాష్ట్రం ఏది ?

  1. మహారాష్ట్ర
  2. ఆంధ్రప్రదేశ్
  3. ఒడిశా
  4. పశ్చిమ బెంగాల్
సమాధానం
1. మహారాష్ట్ర

20. భారతదేశ ఎలక్ట్రానిక్ రాజధానిగా ఏ నగరాన్ని పిలుస్తారు ?

  1. హైదరాబాద్
  2. బెంగుళూర్
  3. గాంధీనగర్
  4. లక్నో
సమాధానం
2. బెంగుళూరు

Post Comment