Daily Current Affairs Quiz: 26 December 2024
Current Affairs Quiz

Daily Current Affairs Quiz: 26 December 2024

నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(26 డిసెంబర్ 2024): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.

1. ఇటీవల అండమాన్, నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును కేంద్ర ప్రభుత్వం ఏ పేరుగా మార్చింది?

  1. శ్రీ విజయనగరం
  2. శ్రీ విజయపురం
  3. శ్రీ గంగానగర్
  4. స్వరాజ్యం
సమాధానం
2. శ్రీ విజయపురం

2. రాష్ట్ర ఆహార భద్రత సూచిక 2023-24లో మొదటి మూడు ర్యాంకులు పొందిన రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల సరైన క్రమాన్ని గుర్తించండి?

  1. కేరళ, తమిళనాడు, జమ్మూ కశ్మీర్
  2. కేరళ, తమిళనాడు, గుజరాత్
  3. కేరళ, గుజరాత్, తమిళనాడు
  4. కేరళ, గుజరాత్, జమ్మూ కశ్మీర్
సమాధానం
1. కేరళ, తమిళనాడు, జమ్మూ కశ్మీర్

3. రఫెల్ నాదల్ ప్రొఫెషనల్ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను ఏ దేశానికి చెందినవాడు?

  1. స్పెయిన్
  2. పోలాండ్
  3. బ్రూనై
  4. జర్మనీ
సమాధానం
1. స్పెయిన్

4. గత మూడేళ్ళలో అత్యధిక సైబర్ క్రైమ్ కేసులు నమోదైన రాష్ట్రం?

  1. మహారాష్ట్ర
  2. కర్ణాటక
  3. తమిళనాడు
  4. తెలంగాణ
సమాధానం
4. తెలంగాణ

5. 2024 - 29 కుటీర, గ్రామీణ పరిశ్రమల విధానాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

  1. హర్యానా
  2. రాజస్థాన్
  3. గుజరాత్
  4. ఉత్తరప్రదేశ్
సమాధానం
3. గుజరాత్

6. అంతర్జాతీయ గీత మహోత్సవ్ 2024 ఎక్కడ జరిగింది?

  1. కేదార్‌నాథ్
  2. కురుక్షేత్ర
  3. కాశీ
  4. రామేశ్వరం
సమాధానం
2. కురుక్షేత్ర

7. 2024 డిసెంబర్ 18న ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌకను జాతికి అంకితం చేసినవారు ఎవరు?

  1. ప్రధాని నరేంద్ర మోడీ
  2. రక్షణ శాఖ సహాయ మంత్రి - సంజయ్ సెత్
  3. రక్షణ శాఖ మంత్రి - రాజ్‌నాథ్ సింగ్
  4. హోంమంత్రి - అమిత్ షా
సమాధానం
2. రక్షణ శాఖ సహాయ మంత్రి - సంజయ్ సెత్

8. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 612వ సెంట్రల్ బోర్డు సమావేశాన్ని ఇటీవల ఎక్కడ నిర్వహించారు?

  1. చెన్నై
  2. గువాహటి
  3. లక్నో
  4. ఢిల్లీ
సమాధానం
4. ఢిల్లీ

9. ఇటీవల అంతర్జాతీయ సోలార్ ఫెస్టివల్ 2024 ఎక్కడ నిర్వహించారు?

  1. గురుగ్రామ్
  2. జైపూర్
  3. న్యూఢిల్లీ
  4. జోధ్‌పూర్
సమాధానం
3. న్యూఢిల్లీ

10. ఇటీవల వార్తల్లో నిలిచిన భారత ప్రభుత్వ ఆపరేషన్ 'సద్భావ్' దేనికి సంబంధించింది?

  1. ఫిరోజ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతంలో మానవతా సహాయం
  2. సిరియాలో మానవతా సహాయ చర్య
  3. యాగీ తుఫాన్ ప్రభావిత దేశాల్లో మానవతా సహాయం
  4. ఇజ్రాయెల్లో మానవతావాద సహాయ చర్య
సమాధానం
3. యాగీ తుఫాన్ ప్రభావిత దేశాల్లో మానవతా సహాయం

11. దేశంలో విపత్తు ప్రమాద నిర్వహణ కోసం బీమా పరిష్కారాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది?

  1. న్యూఢిల్లీ
  2. మణిపూర్
  3. హర్యానా
  4. నాగాలాండ్
సమాధానం
4. నాగాలాండ్

12. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో సైనిక పాఠశాలను ఎవరు ప్రారంభించారు?

  1. ప్రధాని మోడీ
  2. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
  3. ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్
  4. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
సమాధానం
3. ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్

13. ఇటీవల గుజరాత్‌లోని సూరత్‌లో ప్రధాని మోదీ ప్రారంభించిన 'నీటి సంరక్షణ ప్రజా భాగస్వామ్య కార్యక్రమం' ఏ ప్రచారానికి సంబంధించినది?

  1. జల శక్తి అభియాన్
  2. జల క్రాంతి అభియాన్
  3. అటల్ గ్రౌండ్ వాటర్ స్కీమ్
  4. ఏదీకాదు
సమాధానం
1. జల శక్తి అభియాన్

14. ఇండియా కారికామ్ సమ్మిట్ 2024 2వ ఎడిషన్ ఏ దేశంలో జరిగింది?

  1. పోలాండ్
  2. గయానా
  3. నైజీరియా
  4. బ్రెజిల్
సమాధానం
2. గయానా

15. గోవాలో ‘55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా' ఎప్పటివరకు కొనసాగింది?

  1. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 7
  2. నవంబర్ 20 -28
  3. నవంబర్ 18 - 27
  4. డిసెంబర్ 11 - 15
సమాధానం
2. నవంబర్ 20 -28

16. ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు వంద శాతం పన్ను మినహాయింపును ఏ రాష్ట్రం ప్రకటించింది?

  1. తమిళనాడు
  2. ఆంధ్రప్రదేశ్
  3. మహారాష్ట్ర
  4. తెలంగాణ
సమాధానం
4. తెలంగాణ

17. బ్రెజిల్‌లో 19వ ఎడిషన్ జీ20 సదస్సు ఇటీవల ముగిసింది.జీ20 సమ్మిట్ 20వ ఎడిషన్ ఎక్కడ జరగనుంది?

  1. ఇండియా
  2. శ్రీలంక
  3. దక్షిణాఫ్రికా
  4. యూఎస్ఏ
సమాధానం
3. దక్షిణాఫ్రికా

18. 31వ ఏపీఈసీ సమ్మిట్ ఎకనామిక్ లీడర్స్ మీటింగ్‌ను ఏ దేశం నిర్వహించింది?

  1. దక్షిణాఫ్రికా
  2. ఇండియా
  3. పెరూ
  4. పోలాండ్
సమాధానం
3. పెరూ

19. భారత మొదటి విదేశీ జన్ ఔషధీ కేంద్రాన్ని ఏ దేశంలో ప్రారంభించారు?

  1. యూఏఈ
  2. శ్రీలంక
  3. మారిషస్
  4. మాల్దీవులు
సమాధానం
3. మారిషస్

20. ది బ్యాంకింగ్, ఫైనాన్స్ వోస్ట్ మ్యాగజైన్‌తో కలిసి ఐటీసీ మరాఠా, ముంబయిలో 18వ ఎన్‌బీఎఫ్‌సీ 100 టెక్ సమ్మిట్‌ను ఏ సంస్థ నిర్వహిస్తుంది?

  1. రిజర్వ్ బ్యాంక్
  2. నేషనల్ ప్రెమెంట్స్ ఆఫ్ ఇండియా
  3. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్
  4. ఎలక్ట్స్ టెక్నో మీడియా
సమాధానం
3. ఎలక్ట్స్ టెక్నో మీడియా

21. కాప్ 29 వద్ద గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ ఏ దేశం ప్రారంభించింది?

  1. ఇండియా
  2. యూఎస్
  3. ఫ్రాన్స్
  4. యూఏఈ
సమాధానం
4. యూఏఈ

22. సూపర్ టైపూన్ మాన్-యి ఇటీవల ఏ దేశంలో బీభత్సం సృష్టించింది?

  1. సింగపూర్
  2. మలేషియా
  3. ఇండోనేషియా
  4. ఫిలిప్పీన్స్
సమాధానం
4. ఫిలిప్పీన్స్

23. గ్రీవెన్స్ రిడ్రెసల్ అసెస్‌మెంట్, ఇండెక్స్ 2023ను ఏ కేంద్ర మంత్రి ప్రారంభించారు?

  1. అర్జున్ రామ్ మేఘవాల్
  2. డా.జితేంద్ర సింగ్
  3. దేవేంద్ర సింగ్
  4. జేపీ నడ్డా
సమాధానం
2. డా.జితేంద్ర సింగ్

24. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా వాట్సాప్ గోప్యతా విధానంపై మెటాకు ఎన్ని కోట్ల రూపాయల జరిమానా విధించారు?

  1. రూ.400 కోట్లు
  2. రూ. 213.14 కోట్లు
  3. రూ.302.02 కోట్లు
  4. రూ.500 కోట్లు
సమాధానం
2. రూ. 213.14 కోట్లు

25. గ్లోబల్ స్పోర్ట్స్ సంస్థ దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ తన స్పోర్ట్స్ అంబాసిడర్లుగా ఎవరిని నియమించింది?

  1. సచిన్
  2. సానియామీర్జా
  3. హర్బజన్ సింగ్
  4. 2 మరియు 3
సమాధానం
4. 2 మరియు 3

26. భారత్ తన మొదటి దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణి ప్లెట్ ట్రయల్‌ను ఎక్కడ నిర్వహించింది?

  1. కొచ్చి
  2. శ్రీహరికోట
  3. ఏపీజే అబ్దుల్ కలాం ఐల్యాండ్
  4. పోఖ్రాన్
సమాధానం
3. ఏపీజే అబ్దుల్ కలాం ఐల్యాండ్

27. రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హర్యానా ఆటగాడు అన్షుల్ కాంబోజ్ ఏ జట్టుపై ఇన్నింగ్స్ 10 వికెట్లు పడగొట్టాడు?

  1. సౌరాష్ట్ర
  2. ముంబయి
  3. బెంగాల్
  4. కేరళ
సమాధానం
4. కేరళ

28. మూడీస్ రేటింగ్స్ ఆర్థిక సంవత్సరం 2024 కోసం దేశ ఆర్థిక వృద్ధి అంచనాను ఎంత శాతానికి పెంచింది?

  1. 7.1 శాతం
  2. 7.3 శాతం
  3. 7.2 శాతం
  4. 7.4 శాతం
సమాధానం
3. 7.2 శాతం

29. 'కమ్ అండ్ ఇన్‌స్టాల్ 'సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?

  1. ఉత్తరాఖండ్
  2. హిమాచల్ ప్రదేశ్
  3. పంజాబ్
  4. ఉత్తరప్రదేశ్
సమాధానం
2. హిమాచల్ ప్రదేశ్

30. తమ ఇంటిగ్రేటెడ్ యాంటెన్నా సిస్టమ్ యునికార్న్‌ను భారత నౌకాదళ నౌకలకు అందించడానికి ఏ దేశం అంగీకరించింది?

  1. ఫ్రాన్స్
  2. రష్యా
  3. జపాన్
  4. సింగపూర్
సమాధానం
3. జపాన్

Post Comment