Advertisement
ఎన్‌టీఏ నిర్వహించే 18 జాతీయ ప్రవేశ పరీక్షలు మరియు వాటి వివరాలు
Admissions NTA Exams

ఎన్‌టీఏ నిర్వహించే 18 జాతీయ ప్రవేశ పరీక్షలు మరియు వాటి వివరాలు

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA), ఉన్నత విద్య ప్రవేశాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష మరియు ఒకే నిర్వాహక వ్యవస్థ ఉండాలనే ఆలోచనతో 2017 లో కేంద్ర ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడింది.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏటా షెడ్యూల్ ప్రకారం ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశాలకు జేఈఈ, మెడికల్ కోర్సుల ప్రవేశాలకు నీట్, మానేజ్మెంట్ కోర్సుల ప్రవేశాలకు సీమ్యాట్, ఫార్మసీ కోర్సులకు జీప్యాట్ అలానే యూజీసీ నెట్, సిఎస్ఐఆర్ నెట్ వంటి అనేక పరీక్షలు విజయవంతంగా నిర్వహిస్తుంది.

1. జేఈఈ మెయిన్ ఎగ్జామ్

JEE Main - Exam Date, Eligibility, Registrationదేశంలో నిర్వహించే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలలో ఆదరణ పరంగా, క్లిష్టత పరంగా జేఈఈ మెయిన్ ప్రధమ స్థానంలో ఉంటుంది. దేశంలో ఉన్న ఎన్ఐటీలు, ఐఐఐటీలు, సీఎఫ్ఐటీలలో చేరేందుకు జేఈఈ మెయిన్ పరీక్షలో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష ద్వారా  ప్రధానంగా  బీఈ/బీటెక్, బ్యాచలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మరియు బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఎన్ఐటీలు, ఐఐఐటీలు, సీఎఫ్ఐటీలలో మాత్రమే కాకుండా జేఈఈ మెయిన్ అర్హుతతో దేశంలో ఉండే అన్ని ప్రముఖ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో అడ్మిషన్ పొందొచ్చు. అలానే జేఈఈ అడ్వాన్సడ్ రాయాలనుకునే వారు జేఈఈ మెయిన్స్ క్వాలిఫై అవ్వటం తప్పనిసరి.

2. జేఈఈ అడ్వాన్సుడ్ ఎగ్జామ్

JEE Advanced - Exam Date, Eligibility, Registrationజేఈఈ అడ్వాన్సుడ్ పరీక్షను ఐఐటీల్లో ఇంజనీరింగ్ మరియు ఆర్కిటెక్చర్ ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించబడుతుంది. యేటా మే లేదా జూన్ లో జరిగే ఈ ప్రవేశ పరీక్షకు దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయస్థాయిలో డిమాండ్ ఉంటుంది. అంతర్జాతీయస్థాయి మౌళిక సదుపాయాలతో అత్యున్నత సాంకేతిక విద్యని అందిస్తున్న ఐఐటీల్లో చేరేందుకు ఆశావాహుల సంఖ్యా లక్షల్లో ఉంటుంది.

జేఈఈ అడ్వాన్సుడ్ ద్వారా ఐఐటీల్లో చదివే విద్యార్థులు నాణ్యమైన సాంకేతిక విద్యను అందిపుచ్చుకోవటమే కాకుండా కెరీర్ పరంగా టాప్ అంతర్జాతీయ సంస్థలలో పని చేసే అవకాశం ఉన్నందున ఐఐటీల్లో చేరేందుకు యేటా విద్యార్థులు తీవ్రమైన పోటీతత్వంతో సన్నద్ధమౌతారు.

3. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ ఎగ్జామ్)

NEET UG - Exam Date, Eligibility, Registrationనీట్ (యూజీ) పరీక్షను దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ మరియు డెంటల్ కాలేజీల్లో మొదటి ఏడాది ఎంబీబీస్ మరియు బీడీఎస్ ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మరియు గవర్నమెంట్ అఫ్ ఇండియా కనుసన్నలల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఈ పరీక్షను నిర్వహిస్తుంది.

నీట్ యూజీ ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించిన విద్యార్థులు ఎయిమ్స్ మరియు జిప్మెర్ సహా ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ లేదా డెంటల్ కౌన్సిల్ అనుమతితో నడుస్తున్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ మరియు డెంటల్ కాలేజీల్లో ప్రవేశాలు పొందొచ్చు. కెరీర్ పరంగా వైద్యరంగంలో స్థిరపడాలనే ఆశయాన్ని చేరువ చేసే ఈ మెడికల్ ప్రవేశ పరీక్ష గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

4. సీఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్

CSIR NET - Exam Date, Eligibility, Registrationసీఎస్ఐఆర్ నెట్ అనేది భారతీయ పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థులకు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) ప్రోగ్రాంలో లేదా లెక్చరేషిప్(ఎల్ఎస్ఎఫ్)/ అసిస్టెంట్ ప్రొఫిసర్షిప్ అందించే అర్హుత పరీక్ష. దేశంలో ఒకానొక క్లిష్టమైన పరీక్షగా భావించే ఈ జాతీయ అర్హుత పరీక్షను ఏటా జూన్ మరియు డిసెంబర్ నెలలో నిర్వహిస్తారు.

ఈ ప్రతిష్టాత్మకమైన అర్హుత పరీక్షలో సైన్స్ విద్యార్థులు విజయం సాధిస్తే, వారి కెరీర్ ఉజ్వలభరితమయ్యే అవకాశం ఉన్నందున, ఈ పరీక్షను భారతీయ సైన్స్ విద్యార్థులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. సీఎస్ఐఆర్ మరియు యూజీసీ ఏటా పెద్ద సంఖ్యలో విద్యార్థులకు జేఆర్ఎఫ్ ప్రోగ్రాంలలో చేరేందుకు అవకాశం కల్పిస్తుంది.

సీఎస్ఐఆర్ నెట్ యందు టాప్ మెరిట్ సాధించిన విద్యార్థులకు అనుభవిజ్ఞులైన అధ్యాపకులు, శాస్త్రవేత్తల మార్గదర్శికంలో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలు, ఇనిస్టిట్యూట్లు, ఐఐటీలు, జాతీయ ప్రయోగశాలలు మరియు ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టర్లో ఉన్న ఫార్మా కంపెనీల యందు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ప్రోగ్రాం కింద ఆయా సైన్స్ డిపార్టుమెంటులలో పనిచేసే అవకాశం లభిస్తుంది.

లెక్చరేషిప్ (LS)/అసిస్టెంట్ ప్రొఫెసోర్షిప్‌కి అర్హుత సాధించిన వారు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇనిస్టిట్యూట్లు, పీజీ కాలేజీలు లలో లెక్చరరుగా లేదా ప్రొఫిసర్లుగా జాయిన్ అయ్యేందుకు అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీల్లో అధ్యాపకుల ఉద్యోగ భర్తీ ప్రక్రియ ద్వారా కొలువులు సాధించే అవకాశం ఉంటుంది. ఈ ఎల్ఎస్/ఏపీఎస్ కాలపరిమితి జీవితకాలం ఉంటుంది.

5. యూజీసీ నెట్ ఎగ్జామ్

UGC NET Registration and Exam Dateయూజీసీ నెట్ పరీక్షను భారత విశ్వవిద్యాలయాలు మరియు ప్రభుత్వ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫిసర్షిప్ మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జెఆర్ఎఫ్) ప్రోగ్రాంలకు అర్హుత కల్పించేందుకు నిర్వహించబడుతుంది. ఈ పరీక్ష యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్ ఆదేశాలతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జరుపుతుంది. ఈ పరీక్ష దాదాపు 100కి పైగా లాంగ్వేజ్ మరియు హ్యుమానిటీస్ సబ్జెక్టులకు సంబంధించి నిర్వహిస్తారు.

ప్రైవేట్ ఇనిస్టిట్యూట్లలో ప్రొఫిసరుగా చేరేందుకు యూజీసీ-నెట్ అర్హుతకు సంబంధించి పట్టింపు లేకపోయిన, ప్రభుత్వ యూనివర్సిటీలు, కళాశాలల్లో చేరేందుకు మాత్రం నెట్ ఎలిజిబిలిటీ తప్పనిసరి. రాష్ట ప్రభుత్వాలు భర్తీచేసే ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు ఉద్యోగాలకు కూడా యూజీసీ నెట్ అర్హుత తప్పనిసరి.

జెఆర్ఎఫ్ : జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనేది యూజీసీ నెట్ యందు క్వాలిఫై సాధించిన టాప్ 0.5 శాతం మందికి మాత్రమే దక్కే గొప్ప అవకాశం. జెఆర్ఎఫ్ అర్హుత సాధించిన వారు ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో రెండేళ్ల జెఆర్ఎఫ్ ప్రోగ్రాం కింద నెలకు 31,000/- పైగా స్టైపెండుతో పరిశోధనాత్మక ఎంఫిల్, పీహెచ్‌డీ పట్టాలు పొందే అవకాశం ఉంటుంది. ఇది విజయవంతంగా పూర్తిచేస్తే 35,000/- స్టైపెండుతో మరో మూడేళ్లు ఎస్ఆర్ఎఫ్ చేసే అవకాశం దక్కుతుంది.

అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ : ఈ ఎలిజిబిలిటీ టెస్టులో కేవలం 5 నుండి 6 శాతం మంది మాత్రమే అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్‌కి అర్హుత సాధించే అవకాశం ఉంటుంది. ఒకసారి యూజీసీ-నెట్ అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ అర్హుత సాధిస్తే, జీవితాంతం మీకు నచ్చిన భారత యూనివర్సిటీల్లో  అసిస్టెంట్ ప్రొఫిసర్సుగా పని చేసేందుకు గేట్ పాస్ దొరికినట్లే. అంతే కాకుండా ప్రభుత్వ మరియు  ప్రైవేట్ కంపెనీలలో సులభంగా ఉద్యోగం పొందొచ్చు.

6. సీమ్యాట్ ఎగ్జామ్

CMAT - Exam Date, Eligibility, Registrationసీమ్యాట్ అనగా కామన్ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్ టెస్ట్ అని అర్ధం. సీమ్యాట్ పరీక్షను పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. దేశ వ్యాప్తంగా ఒకే మేనేజ్‌మెంట్‌ ప్రవేశ పరీక్ష ఉండాలనే ఉద్దేశంతో 2019 నుండి భారత మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను నిర్వహిస్తుంది.

సీమ్యాట్ స్కోరు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎఐసీటీఈ) అనుమతి పొందిన దాదాపు 1000 పైగా గొప్ప మేనేజ్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్లల్లో ప్రవేశాలు పొందేందుకు ఉపయోగ పడుతుంది. సీమ్యాట్ ప్రవేశ పరీక్ష పూర్తి ఆన్‌లైన్‌ (సీబీటి) విధానంలో జరుగుతుంది. మూడు గంటల నిడివితో జరిగే ఈ పరీక్షలో మొత్తం ఐదు విభాగాల నుండి 20 చెప్పున 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇవ్వబడతాయి.

7. జీప్యాట్ ఎగ్జామ్

GPAT - Exam Date, Eligibility, Registrationజీప్యాట్​ ప్రవేశ పరీక్షను ఎంఫార్మా మరియు వాటి అనుబంధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. జీప్యాట్​ అనగా గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని అర్ధం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష ద్వారా, దేశ వ్యాప్తంగా ఎఐసీటీఈ గుర్తింపు పొందిన దాదాపు 800 కి పైగా ఫార్మా ఇనిస్టిట్యూట్లు, టెక్నికల్ ఇనిస్టిట్యూట్లు, యూనివర్సిటీలు, కాలేజీల్లో అడ్మిషన్ పొందొచ్చు.

జీప్యాట్​ ప్రవేశ పరీక్ష పూర్తి ఆన్‌లైన్‌ (సీబీటీ) విధానంలో జరుగుతుంది. మూడు గంటల నిడివితో జరిగే ఈ పరీక్షలో కెమిస్ట్రీకి చెందిన వివిధ టాపిక్స్ నుండి మొత్తం 125 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇవ్వబడతాయి. ప్రతి ప్రశ్నకు నాలుగు వేరువేరు సమాదానాలు ఉంటాయి. అందులో నుండి ఒక సరైన సమాధానమును గుర్తించాలి.

8. ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ ఎగ్జామ్

NCHM JEE - Exam Date, Eligibility, Registrationఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ పరీక్షను బీఎస్సీ హాస్పిటాలిటీ & హోటల్ అడ్మినిస్ట్రేషన్ మరియు వాటి అనుబంధ కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఎన్సీహెచ్ఎమ్-జేఈఈ అనగా నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మానేజ్మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని అర్ధం.

ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ పరీక్షను నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ & క్యాటరింగ్ టెక్నాలజీ (ఎన్‌సీహెచ్ఎమ్ & సిటీ) సహాయంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఎన్‌సీహెచ్ఎమ్ & సిటీ అనేది ఒక స్వయంప్రతిపత్త సంస్థ. ఇది  భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బీఎస్సీ హాస్పిటాలిటీ & హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులను నిర్వహిస్తుంది.

ఈ పరీక్షలో అర్హుత సాధించడం ద్వారా 21 సెంట్రల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హోటల్ మానేజ్మెంట్, 25 స్టేట్ గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హోటల్ మానేజ్మెంట్, ఒక పబ్లిక్ సెక్టార్ ఇనిస్టిట్యూట్ మరియు మరో 24 ప్రైవేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మానేజ్మెంట్ ఇనిస్టిట్యూట్లలో బీఎస్సీ హాస్పిటాలిటీ & హోటల్ అడ్మినిస్ట్రేషన్ ప్రవేశాలు పొందొచ్చు.

9. GAT-B & BET ఎగ్జామ్

GAT-B & BET - Exam Date, Eligibility, RegistrationGAT-B & BET పరీక్షలను వివిధ బయోటెక్నాలజీ కోర్సులలో అడ్మిషన్లు మరియు జెఆర్ఎఫ్ ఎన్రోల్మెంట్ కోసం నిర్వహిస్తారు. ఈ రెండు పరీక్షలను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ బయోటెక్నాలజీ సహాయంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉమ్మడిగా నిర్వహిస్తుంది.

గ్యాట్-బి ప్రవేశ పరీక్షను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ బయోటెక్నాలజీకి చెందిన వివిధ బయోటెక్నాలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్స్ మరియు వాటి అనుబంధ పీజీ ప్రోగ్రామ్స్ వైనాడు అడ్మిషన్లు కల్పించేందుకు నిర్వహిస్తారు. గ్యాట్-బి అనగా గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్-బయోటెక్నాలజీ (GAT-B) అని అర్ధం.

గ్యాట్-బి పరీక్ష ద్వారా అడ్మిషన్ పొందే కోర్సుల జాబితాలో ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంటెక్ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ అగ్రికల్చర్ బయోటెక్నాలజీ మరియు మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ యానిమల్ బయోటెక్నాలజీ ఉన్నాయి

బీఈటీ (BET) ప్రవేశ పరీక్షను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ బయోటెక్నాలజీ - జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ( DBT JRF ) ప్రోగ్రాం అందించేందుకు నిర్వహిస్తారు. బెట్ అనగా బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ అని అర్ధం.

బీఈటీ పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులను రెండు కేటగిర్లుగా షార్ట్ లిస్ట్ చేస్తారు. కేటగిరి - I జాబితాలో ఉన్న అభ్యర్థులకు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ల యందు జేఆర్ఎఫ్ చేసే అవకాశంతో పాటుగా పీహెచ్డీ రిజిస్టర్ చేసుకునే ఛాన్స్ కల్పిస్తారు.

కేటగిరి - II మెరిట్ అభ్యర్థులకు నెట్/గేట్ మాదిరిగా డీబీటీ స్పాన్సర్ చేసే రీసెర్చ్ ప్రోగ్రామ్స్ యందు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్ అవకాశం కల్పిస్తారు. అలానే పీహెచ్డీ ప్రోగ్రాంకు రిజిస్టర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.

10. ఐసీఏఆర్ ఏఐఈఈఏ యూజీ ఎగ్జామ్

AIEEA UG - Exam Date, Eligibility, Registrationఐసీఏఆర్ ఏఐఈఈఏ యూజీ పరీక్షను అగ్రికల్చర్ మరియు దాని అనుబంధ సైన్స్ బ్యాచిలర్ డిగ్రీలల్లో మొదటి ఏడాది ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఐసీఏఆర్ ఏఐఈఈఏ అనగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ - ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్స్" అని అర్ధం.

జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరియు ఐసీఏఆర్ కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తాయి. దేశంలో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలన్ని ఐసీఏఆర్ కనుసన్నలలో పనిచేస్తాయి.

ఐసీఏఆర్-ఏయూ పరిధిలో దేశంలో మొత్తం 74 అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఉన్నాయి. అందులో 63 స్టేట్ అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్ మరియు ఫిషరీ యూనివర్సిటీలు కాగా 4 ఐసీఏఆర్ డ్రీమ్డ్ యూనివర్సిటీలు (IARI, IVRI, NDRI & CIFE,), 3 సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలు, ఇంకో 4 సెంట్రల్ యూనివెర్సిటీలు ఉన్నాయి.

11. ఐసీఏఆర్ ఏఐఈఈఏ పీజీ ఎగ్జామ్

AIEEA PG - Exam Date, Eligibility, Registrationఐసీఏఆర్-ఏఐఈఈఏ పీజీ పరీక్షను అగ్రికల్చర్ మరియు దాని అనుబంధ సైన్స్ పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సులలో మొదటి ఏడాది ప్రవేశాలు కల్పించేందుకు నిరవహిస్తారు. ఐసీఏఆర్-ఏఐఈఈఏ అనగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ - ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్స్ అని అర్ధం.

జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరియు ఐసీఏఆర్ కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తాయి. దేశంలో ఉన్నా అగ్రికల్చర్ యూనివర్సిటీలన్ని ఐసీఏఆర్ కనుసన్నలలో పనిచేస్తాయి.

ఐసీఏఆర్-ఏఐఈఈఏ ఏయూ పరిధిలో దేశంలో మొత్తం 74 అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఉన్నాయి. అందులో 63 స్టేట్ అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్ మరియు ఫిషరీ యూనివర్సిటీలు కాగా 4 ఐసీఏఆర్  డ్రీమ్డ్ యూనివర్సిటీలు (IARI, IVRI, NDRI & CIFE,), 3 సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలు, ఇంకో 4 సెంట్రల్ యూనివెర్సిటీలు ఉన్నాయి. వ్యవసాయ ఆధారిత దేశమైన ఇండియా ఏటా దాదాపు 27 వేలకు పైగా అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్లును, 14 వేల మంది  పోస్ట్ గ్రాడ్యుయేట్లను మరో 4700 మంది పీహెచ్డీలను అందిస్తుంది.

12. ఐసీఏఆర్ ఏఐసీఈ ఎగ్జామ్

ICAR AICE - Exam Date, Eligibility, Registrationఐసీఏఆర్ ఏఐసీఈ పరీక్షను అగ్రికల్చర్ మరియు దాని అనుబంధ సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి జెఆర్ఎఫ్/ఎస్ఆర్ఎఫ్(పీహెచ్డీ) ప్రోగ్రాంలలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఐసీఏఆర్ ఏఐసీఈ "ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ - ఆల్ ఇండియా కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్స్" అని అర్ధం. జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరియు ఐసీఏఆర్ కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తాయి.

ఐసీఏఆర్ ఏఐసీఈ - జెఆర్ఎఫ్/ఎస్ఆర్ఎఫ్ పరీక్ష ద్వారా 905 సీట్లను భర్తీచేయనున్నారు. ఇందులో 666 సీట్లు 55 ఐసీఏఆర్ అనుబంధ అగ్రికల్చర్ యూనివర్సిటీలలో భర్తీచేస్తారు. మిగతా స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలు అందుబాటులో ఉన్న సీట్లలో 25% (RLB CAU Jhansi, NDRI Karnal and Dr. RP CAU Pusa, Bihar 100% seats) ICAR AICE- JRF/SRF (Ph.D) పరీక్షా ఆధారంగా భర్తీచేస్తాయి.

ఐసీఏఆర్ ఏయూ పరిధిలో 2 నుండి 4 ఏళ్ళ వ్యవధితో దాదాపు 73 రకాల ప్రధాన అగ్రికల్చర్ సబ్జెక్టులలో జెఆర్ఎఫ్/ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్డీ) ప్రోగ్రాంలు అందుబాటులో ఉన్నాయి.

13. ఐఐఎఫ్‌టీ ఎగ్జామ్

IIFT EXAM - Exam Date, Eligibility, Registrationఐఐఎఫ్‌టీ (IIFT) పరీక్షను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ యందు ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్సు సంబంధించి ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఇండియాలో ఢిల్లీ, కోలకతా మరియు కాకినాడలో ఐఐఎఫ్‌టీ ఇనిస్టిట్యూట్లలను కలిగి ఉంది.

ఐఐఎఫ్‌టీ ఎంబీఏ ఇంటెర్నేషన బిజినెస్ కోర్సును రెండేళ్ల నిడివితో 6 సెమిస్టర్లగా అందిస్తుంది. ఈ ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్సును ప్రధానంగా టెక్నాలజీ వాణిజ్యంలో భారత పారిశ్రామిక సామర్ధ్యాన్ని వ్యూత్మకంగా బలపర్చేందుకు, ఆర్థిక మరియు సాంకేతిక సహకారంతో కొన్ని సంస్థాగత వాణిజ్య సంక్లిష్టతలను పరిష్కరించేందుకు అవసరమయ్యే నాణ్యమైన మానవ వనురులను రూపొందించే లక్ష్యంతో అందిస్తుంది

14. ఇగ్నో ఓపెన్‌మ్యాట్ ఎగ్జామ్

ఇగ్నో ఓపెన్‌మ్యాట్ పరీక్షను ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో మానేజ్మెంట్ కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్షను నేషన్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఈ పరీక్ష జాతీయ స్టేయిలో ఏటా రెండు సార్లు జరుగుతుంది. 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.

ఇగ్నో ఓపెన్‌మ్యాట్ పరీక్ష ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తారు. పరీక్షా ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించబడుతుంది. పరీక్షా 3 గంటల నిడివితో 200 మార్కులకు జరుగుతుంది. క్వశ్చన్ పేపర్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవెర్నెస్,  రీజనింగ్,  క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సంబంధించి 200 ప్రశ్నలు ఇవ్వబడతయి.

15. జేఎన్‌యూఈఈ ఎగ్జామ్

జేఎన్‌యూఈఈ పరీక్షను జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు రీసెర్చ్ ప్రోగ్రాంలలో అడ్మిషన్లు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఉన్నత విద్య అందిస్తున్న ఇండియన్ యూనివర్సిటీలలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ టాప్ 2లో ఉంటుంది.

పీజీ కోర్సులకు, పరిశోధనాత్మక కోర్సులకు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ కంచుకోట. యూనివర్సిటీ అనుబంధంగా 12 రీసెర్చ్ & డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్లు, 6 డిఫెన్స్ ఇనిస్టిట్యూట్లు దేశంలో విద్యా సేవలు అందిస్తున్నాయి.

16. ఢిల్లీ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌

డీయూఈటీ పరీక్షను ఢిల్లీ యూనివర్సిటీలో యూజీ, పీజీ మరియు పీహెచ్డీ/ఎంఫిల్ అడ్మషన్లు కల్పించేందుకు నిర్వహిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరియు ఢిల్లీ యూనివర్సిటీ ఉమ్మడిగా ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తాయి. ఢిల్లీ యూనివర్సిటీలో యందు అందుబాటులో ఉండే సీట్లలో దాదాపు 50% శాతం ఈ ప్రవేశ పరీక్ష ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు. మిగతా 50 శాతం సీట్లు అకాడమిక్ మెరిట్ ఆధారంగా భర్తీచేస్తారు.

ఢిల్లీ యూనివర్సిటీ దేశంలో ఎందరో రాజకీయ నాయకులను, వ్యాపారవేత్తలను, బాలీవుడ్ నటులను అందించింది. ఢిల్లీ యూనివర్సిటీకి హస్తిన నగర వ్యాప్తంగా 16 ఫాకల్టీ డిపార్టుమెంట్స్, 86 అకాడమిక్ డిపార్టుమెంట్స్, 77 అనుబంధ కాలేజీలు మరో ఐదు ఇతర ఇనిస్టిట్యూట్లు కలిగి ఉంది. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో ఏటా దాదాపు లక్షా ముప్పైవేల మంది విద్యార్థులు యూజీ, పీజీ కోర్సులు పూర్తిచేస్తున్నారు.

17. స్వయం సెమిస్టర్ ఎగ్జామ్స్

స్టడీ వెబ్ ఆఫ్ యాక్టీవ్ లెర్నింగ్ బై యంగ్ అండ్ యాస్పైరింగ్ మైండ్స్ (SWAYAM). భారత విద్య విధానంలో మార్పులు కల్పించేందుకు, ఆన్‌లైన్ విద్యను ప్రోత్సహించేందుకు మరియు ఉన్నత చదువులు అందరికి అందుబాటులో ఉంచేందుకు యాక్సెస్, ఈక్విటీ మరియు క్వాలిటీ ఎడ్యుకేషన్ నినాదంతో ఈ స్వయం ఆన్‌లైన్ లెర్నింగ్ వెబ్ పోర్టలును 2016 లో భారత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.

దేశ వ్యాప్తంగా దాదాపు వెయ్యికి పైగా అనుభవిజ్ఞులైన బోధనా సిబ్బందితో విద్యార్థులకు అవసరమయ్యే అన్ని విధాలైన కోర్సులను రూపొందించింది. ప్రస్తుతం స్వయం వేదికలో 9వ తరగతి నుండి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు 80 వేల గంటల నిడివితో దాదాపు 2000 పైగా ఆన్‌లైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

18. అర్పిట్ ఎగ్జామ్

అర్పిట్ ప్రోగ్రాంను టీచింగ్ సిబ్బంది కెరీర్ పురోగతికి తోడ్పడే అంశాల యందు ట్రైనింగ్ ఇచ్చేందుకు నిర్వహిస్తారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఏటా బోధన పద్ధతుల్లో వచ్చే మార్పులును, నూతనంగా చేర్చిన అంశాలపై అవగాహనా కార్యక్రమాలు మరియు బోధనా సంబంధిత టెక్నికల్ అంశాలు మెరుగుపరచడం సంబంధించి వీడియో శిక్షణ కార్యక్రమాలు రూపొందించి స్వయం మరియు ఎన్ఆర్సీ ద్వారా ఆన్లైన్ యందు అందుబాటులో ఉంచుతారు.

ఈ శిక్షణ కార్యక్రమాలు పూర్తిచేసిన వారికీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఏడాదికోసారి అర్పిట్ పరీక్ష నిర్వహించి, అందులో ఉత్తీర్ణత అయిన వారికి యూజీసీ గుర్తింపు కలిగిన సర్టిఫికెట్ అందజేస్తారు. దీన్ని సదురు అభ్యర్థులు తమ టీచింగ్ కెరీర్ పురోగతికి ఉపయీగించుకోవచ్చు.

నాన్-టీచింగ్ లెర్నర్లకు కూడా స్వయం పోర్టల్ ద్వారా ఈ సర్టిఫికెట్ అందజేస్తారు. భారత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2018 లో అర్పిట్ ప్రోగ్రాంను ప్రారంభించింది. దేశంలో ఉన్న దాదాపు 15 లక్షల ఉన్నత విద్యా బోధన సిబ్బంది ఈ ప్రోగ్రాంలో పాల్గున్నారు. 31 మార్చి 2019లో మొదటి సారి ఈ పరీక్షా 75 సబ్జెక్టులకు సంబంధించి నిర్వహించారు.

Post Comment