స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరంలో ఉన్న వివిధ అంతర్జాతీయ సంస్థల వివరాలు తెలుసుకోండి. ఈ నగరంలో ఐక్యరాజ్యసమితి, రెడ్‌క్రాస్ ఏజెన్సీలకు చెందిన ప్రధాన కార్యాలయాలతో సహా అనేక అంతర్జాతీయ సంస్థల ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి.
జెనీవా ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో అంతర్జాతీయ సంస్థలకు ఆతిథ్యం ఇస్తుంది. ఇక్కడ 38 అంతర్జాతీయ సంస్థల ప్రధాన కార్యాలయాలతో పాటుగా 750 ఎన్జిఓల కార్యాలయాలు మరియు 177 దేశాల శాశ్వత దౌత్య కార్యాలయాలకు ఇది కేంద్రంగా ఉంది. ఇందులో ముఖ్యమైన కొన్నింటిని మీకు అందిస్తున్నాం.
అంతర్జాతీయ సంస్థ | సంక్షిప్తీకరణ | స్థాపన సంవత్సరం |
---|---|---|
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ | WTO | 1 జనవరి 1995 |
వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ | WHO | 7 ఏప్రిల్ 1948 |
వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజషన్ | WIPO | 14 జూలై 1967 |
వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజషన్ | WMO | 23 మార్చి 1950 |
యూరోపియన్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ | EBU | 12 ఫిబ్రవరి 1950 |
రెడ్ క్రాస్ అంతర్జాతీయ కమిటీ | ICRC | 17 ఫిబ్రవరి 1863 |
అంతర్జాతీయ కార్మిక సంస్థ | ILO | 11 ఏప్రిల్ 1919 |
ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ | ISO | 23 ఫిబ్రవరి 1947 |
అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ | ITU | 17 మే 1865 |
ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ | IBE | 1925 |
గ్లోబల్ ఫండ్ టు ఫైట్ ఎయిడ్స్, ట్యుబర్కులోసిస్ & మలేరియా | GFATM | 28 జనవరి 2002 |
అంతర్జాతీయ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్ | IEC | 26 జూన్ 1906 |
వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ | WHF | 1972 |
వలస కోసం అంతర్జాతీయ సంస్థ | IOM | 1951 |
ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ | ACI | 1991 |
ఇంటర్నేషనల్ ఎయిడ్స్ సొసైటీ | IAS | 1988 |
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ | WEF | జనవరి 1971 |
ఇంటర్నేషనల్ లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ మరియు ఇంటర్‌సెక్స్ అసోసియేషన్ | ILGA | ఆగస్ట్ 1978 |
ఇంటర్నేషనల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ యూనియన్ | IRU | 23 మార్చి 1948 |
ఇంటర్నేషనల్ యూనియన్ ఎగైనెస్ట్ క్యాన్సర్ | UICC | 1933 |
బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ (బాసెల్‌లో) | BIS | 17 మే 1930 |