Daily Current affairs in Telugu : 19 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్
Telugu Current Affairs

Daily Current affairs in Telugu : 19 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్

Daily Current affairs in Telugu 19 December 2023. రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణల్లో ఆంధ్ర ప్రదేశ్ అగ్రస్థానం

నీతి ఆయోగ్ వ్యవసాయ మార్కెటింగ్ మరియు రైతు స్నేహపూర్వక సంస్కరణల సూచిక (ఏఎంఎఫ్ఎఫ్ఎఫ్ఐ) లో 94 స్కోరుతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం దక్కించుకుంది. ఆ తర్వాత స్థానాలలో ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ ర్యాంకింగ్ అగ్రి-మార్కెటింగ్, ఇ-ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్, సింగిల్ యూనిఫైడ్ లైసెన్స్, మార్కెట్ ఫీజుల హేతుబద్ధీకరణ, వ్యవసాయ రాతీయలు, ఇ-నామ్ మాడ్యూల్స్ వంటి కీలక అంశాల ఆధారంగా నిర్ణయిస్తుంది.

వ్యవసాయ మార్కెటింగ్ మరియు రైతు స్నేహపూర్వక సంస్కరణల సూచిక అనేది వ్యవసాయ రంగంలో మార్కెట్ ఆధారిత సంస్కరణల అమలుపై భారతీయ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను అంచనా వేయడానికి 2016లో నీతి ఆయోగ్ ప్రారంభించింది. భారతదేశంలోని వ్యవసాయ రంగాన్ని అతలాకుతలం చేస్తున్న ఉత్పాదకత, వృద్ధి మరియు తక్కువ వ్యవసాయ రాబడి వంటి సంక్షోభాలను నివారించేందుకు సమూల సంస్కరణలు చేపట్టే దిశగా దీనిని ప్రారంభించింది.

వ్యవసాయాన్ని మార్చడం మరియు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం అసాధ్యం. అయినప్పటికీ, వ్యవసాయాన్ని ఆధునీకరించడానికి మరియు రైతులకు అనుకూలమైన విధానాన్ని మరియు మార్కెట్ వాతావరణాన్ని సృష్టించడానికి అవసరమైన సంస్కరణలను అమలు చేయడంలో ప్రోత్సహాయించే దిశగా దీనిని ప్రారంభించింది.

సౌదీ అరేబియా ప్రభుత్వంతో ఎన్‌ఎస్‌డిసి అవగాహన ఒప్పందం

నైపుణ్యం కలిగిన కార్మికుల హక్కులను పరిరక్షించేందుకు సౌదీ అరేబియా ప్రభుత్వంతో నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఏసీ మెకానిక్స్ మరియు కార్ పెయింటర్లతో సహా నైపుణ్యం కలిగిన కార్మికులు దీని కోసం ఎన్‌ఎస్‌డిసి వెబ్ పోర్టల్ యందు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ఒప్పందం నైపుణ్యం కలిగిన కార్మికులకు సురక్షితమైన మరియు గౌరవప్రదమైన పని పరిస్థితులను, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమయ్యే మార్గదర్శకాలు మరియు ప్రమాణాలను ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం చేస్తుంది.

నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అనేది లాభాపేక్ష లేని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఇది జూలై 31, 2008న కంపెనీల చట్టం, 1956లోని సెక్షన్ 25 కింద విలీనం చేయబడింది. ఎన్‌ఎస్‌డిసి ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ మోడల్‌గా ఏర్పాటు చేయబడింది. దీని ప్రధాన కార్యలయం న్యూఢిల్లీలో ఉంది. ఇది పరిశ్రమల ప్రమేయం ద్వారా కార్మికులకు అంతర్జాతీయ ప్రమాణాలకు నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేయడంతో పాటుగా వారికీ అవసమయ్యే శిక్షణ తరగతులను కూడా అందిస్తుంది.

రాజ్యసభలో పోస్టాఫీసు బిల్లు 2023 ఆమోదం

వలసవాద కాలం నాటి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ చట్టం, 1898ని భర్తీ చేయడానికి ఉద్దేశించిన పోస్ట్ ఆఫీస్ బిల్లు, 2023ని రాజ్యసభ డిసెంబర్ 4న ఆమోదించింది. ఈ నూతన చట్టం ఇండియా పోస్ట్‌ను నియంత్రించే రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను ఆధునీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానంగా దేశ భద్రత, పబ్లిక్ ఆర్డర్, ఎమర్జెన్సీ, ప్రజా భద్రత తదితర కారణాలతో పోస్ట్ చేసిన ఏదైనా వస్తువును ఆపడానికి, తెరవడానికి లేదా స్వాధీనం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఇస్తుంది.

దేశంలోని పోస్టాఫీసుల పనితీరును నియంత్రించడానికి మరియు పౌర-కేంద్రీకృత సేవలను అందించడానికి ఒక నెట్‌వర్క్‌గా పోస్టాఫీసులను అభివృద్ధి చేయడానికి ఈ కొత్త చట్టం తీసుకురాబడింది. అవసరమైన కార్యకలాపాలకు సంబంధించి నియమాలను రూపొందించడానికి మరియు సేవలకు రుసుములను నిర్ణయించడానికి ఈ బిల్లు పోస్టల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌కు అధికారం ఇస్తుంది.

ఈ బిల్లు ఇండియా పోస్ట్‌కి దాని విస్తారమైన పోస్టాఫీసుల నెట్‌వర్క్ ద్వారా పొదుపు ఖాతాలు, డబ్బు బదిలీలు మరియు బీమా వంటి అనేక రకాల ఆర్థిక సేవలను అందించడానికి అధికారం ఇస్తుంది. సాంప్రదాయ తపాలా సేవలకు మించి విస్తరించడానికి మరియు ఇ-కామర్స్, లాజిస్టిక్స్ మరియు ఆర్థిక సేవల వంటి కొత్త సేవలను అందించడానికి ఈ బిల్లు భారతదేశం పోస్ట్‌కు అధికారం ఇస్తుంది. స్వంత టారిఫ్‌లు మరియు నిబంధనలను సెట్ చేసుకోవడానికి ఈ బిల్లు అనుమతిస్తుంది, పోటీతత్వంతో పనిచేయడానికి మరింత సౌలభ్యాన్ని అందిస్తుంది.

భారతదేశ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మహారాష్ట్ర

భారతదేశ జీడీపీలో 15.7% వాటాతో మహారాష్ట్ర దేశంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఈ జాబితాలో 9.2 శాతంలో ఉత్తరప్రదేశ్ రెండవ స్థానంలో ఉండగా, 9.1 శాతంతో తమిళనాడు మూడవ స్థానంలో ఉంది. 8.2 శాతంతో గుజరాత్ నాల్గువ స్థానంలో ఉండగా, 7.5 శాతంతో వెస్ట్ బెంగాల్ ఐదవ స్థానంలో నిలిచింది. దేశంలో పెట్టుబడులు, స్టాక్ మార్కెట్‌ను ట్రాక్ చేసే ప్రముఖ ఆన్‌లైన్ బ్లాగింగ్ ప్లాట్‌ఫాం సోయిక్ (Soic.in) ఈ నివేదిక విడుదల చేసింది.

  1. మహారాష్ట్ర (15.7%)
  2. ఉత్తరప్రదేశ్ (9.2%)
  3. తమిళనాడు (9.1%)
  4. గుజరాత్ (8.2%)
  5. వెస్ట్ బెంగాల్ (7.5%)
  6. కర్ణాటక (6.2%)
  7. రాజస్థాన్ (5.5%)
  8. ఆంధ్రప్రదేశ్ (4.9%)

ఈజిప్టు అధ్యక్షుడుగా మరోమారు అబ్దెల్ ఫట్టా

ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్ - సిసి తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మరోమారు గెలుపొందారు. దాదాపు 89.6 శాతం ఓట్లతో మరో ఆరేళ్ల కాలానికి ఆయన ఎన్నికయ్యారు. అబ్దెల్ ఫత్తా ఈజిప్టు అధ్యక్షుడుగా గెలవడం ఇది వరసగా మూడవసారి. రిటైర్డ్ ఆర్మీ ఫీల్డ్ మార్షల్ అయిన సిసి 2014లో మొదటిసారి ఈజిప్ట్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. తర్వాత 2018 ఎన్నికలలో కూడా 96 శాతం ఓట్లతో ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత రాజ్యాంగాన్ని సవరించి రాష్ట్రపతి పదవిని నాలుగు సంవత్సరాల నుంచి ఆరేళ్లకు పొడిగించుకున్నారు.

ఈజిప్ట్ ఆఫ్రికా యొక్క ఈశాన్య మూలలో సినాయ్ ద్వీపకల్పంలో విస్తరించి ఉన్న ఒక ఖండాంతర దేశం. దీనికి ఉత్తరాన మధ్యధరా సముద్రం, ఈశాన్యంలో పాలస్తీనా మరియు ఇజ్రాయెల్ యొక్క గాజా స్ట్రిప్, తూర్పున ఎర్ర సముద్రం, దక్షిణాన సూడాన్ మరియు పశ్చిమాన లిబియా సరిహద్దులుగా ఉన్నాయి. ఈశాన్యంలోని అకాబా గల్ఫ్ ఈజిప్ట్‌ను జోర్డాన్ మరియు సౌదీ అరేబియా నుండి వేరు చేస్తుంది. ఈజిప్ట్ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా 14వ స్థానంలో ఉంది. నైజీరియా మరియు ఇథియోపియా తర్వాత ఆఫ్రికాలో మూడవ అత్యధిక జనాభా కలిగిన దేశం.

  • దేశం : ఈజిప్ట్
  • రాజధాని : కైరో
  • అధికారిక భాష : అరబిక్
  • అధ్యక్షుడు : అబ్దెల్ ఫట్టా ఎల్-సిసి
  • ప్రధాన మంత్రి : ముస్తఫా మడ్‌బౌలీ

అండర్-19 ఆసియా కప్ విజేతగా బంగ్లాదేశ్

డిసెంబర్ 17న దుబాయ్‌లో జరిగిన అండర్-19 ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ 195 పరుగుల తేడాతో యూఏఈని ఓడించి విజేతగా నిలిచింది. ఈ టోర్నమెంటులో ఇది వారి మొదటి టైటిల్. అండర్-19 ఆసియా కప్పును భారత్ అత్యధికంగా 8 సార్లు సొంతం చేసుకుంది.

ఏసీసీ అండర్-19 ఆసియా కప్ అనేది ఆసియ క్రికెట్ కౌన్సిల్ తన సభ్య దేశాల నుండి అండర్-19 జట్ల కోసం నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్. 1989లో తొలిసారిగా బంగ్లాదేశ్‌లో జరిగిన ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. రెండో ఎడిషన్‌ను 14 ఏళ్ల తర్వాత 2003లో పాకిస్థాన్‌లో ఆడారు, అక్కడ భారత్ టైటిల్‌ను నిలబెట్టుకుంది.

Post Comment