There are eight parts of speech in the English language: noun, pronoun, verb, adjective, adverb, preposition, conjunction, and interjection. The part of speech indicates how the word functions in meaning as well as grammatically within the sentence.
మాట్లాడే భాషలో అన్ని పదాలు ఒకే పాత్రను పోషించావు. ఒక సంభాషణలో ఒక్కో మాట ఒక్కో పాత్రను నిర్వహిస్తుంది. ఒక పదం చేసే క్రియను గురించి తెలియజేస్తే, ఇంకో పదం క్రియ చేసే వ్యక్తి కోసం తెలుపుతుంది. మరో పదం వ్యక్తి యొక్క భావానికి సంబంధించినది అయితే, ఇంకోటి క్రియ లక్షణాన్ని వివరిస్తుంది. వీటినే బాషా భాగాలు అంటారు. ఆంగ్లభాషలో మొత్తం 8 బాషా భాగాలు ఉన్నాయి.
- Noun (నామవాచకం)
- Pronoun (సర్వనామము)
- Verb (క్రియ)
- Adjective (విశేషణం)
- Adverb (క్రియా విశేషణం)
- Preposition (విభక్తి ప్రత్యయము)
- Conjunction (సముచ్ఛయం)
- Interjection (ఆశ్చర్యార్ధకం)
ఎదుట వ్యక్తితో జరిగే సంభాషణ, అర్దవంతంగా జరగాలంటే బాషా భాగాలపై పట్టు ఉండాలి. భాషా భాగాలపై పట్టు కుదరకుండా ముందుకు సాగడం కుదరదు. భాషలో ఏ మాటను తీసుకున్న ఈ 8 భాగాలలో ఏదో ఒకటై ఉంటుంది.
ఒక పని ఎవరు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, యెంత గొప్పగా చేస్తున్నారు వంటి భావాలు తెలియజేయాలంటే బాషా భాగాలూ నేర్చుకుని తీరాలి. తెలుగు భాషపై పట్టు ఉంటే వీటిని నేర్చుకోవడం తేలిక అవుతుంది. Verb, Preposition మినహా మిగతా భాగాలతో అంత సమస్య ఉండదు.