గేట్ 2024 పరీక్ష షెడ్యూల్ వెలువడింది. ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంతగానే ఎదురు చూసే గేట్ పరీక్షను వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో నిర్వహించనున్నారు. గేట్ దరఖాస్తులు 30 ఆగష్టు 2022 నుండి 30 సెప్టెంబరు 2022 మధ్య స్వీకరించనున్నారు. ఈ ఏడాది గేట్ పరీక్షను ఐఐటీ కాన్పూర్ నిర్వహించనుంది.
గేట్ పరీక్షను గ్రాడ్యుయేట్ స్థాయిలో ఉండే ఇంజనీరింగ్ పాఠ్యాంశాల యందు విద్యార్థుల యొక్క విషయ పరిజ్ఞానం మరియు వాటి యందు వారికున్న అవగహన సామర్ధ్యాన్ని పరీక్షించేందుకు నిర్వహిస్తారు. గేట్ అనగా గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ అని అర్ధం.
గేట్ పరీక్షను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (IISc) మరియు దేశంలో ఉండే ఎనిమిది అత్యున్నత ఐఐటీలు అయినా బెంగళూరు, బొంబై, ఢీల్లీ, కాన్పూర్, గౌహతి , ఖరగపూర్, మద్రాస్, రూర్కీ కలిసి ఉమ్మడిగా జాతీయస్థాయిలో నిర్వహిస్తాయి. దేశ వ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉన్నా ఈ అర్హుత పరీక్ష లో అర్హుత సాధిస్తే ఇంజనీరింగ్ విద్యార్థుల ఉజ్వల భవితకు పునాది వేసినట్లు అవుతుంది. ఇలాంటి ఎన్నో బహుళ ప్రయోజనాలను సమకూర్చే ఈ ఇంజనీరింగ్ అర్హుత పరీక్ష కోసం వివరంగా తెల్సుకుందాం.
గేట్ 2024 సమాచారం
Exam Name | GATE 2024 |
Exam Type | Eligibility Test |
Eligibility For | ME, M.Tech, M.arch, PhD, Jobs |
Exam Date | 3, 4, 10, 11 Feb 2024 |
Exam Duration | 3 Hours |
Exam Level | National Level |
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ వివరాలు
గేట్ పరీక్షను ఎందుకు రాయాలి
- గేట్ స్కోరు ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉండే సాంకేతిక కాలేజీల్లో ఏంఈ, ఎంటెక్, ఏంఎస్, మాస్టర్ అఫ్ ఆర్కిటెక్చర్ మరియు పీహెచ్డీ వంటి కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు.
- పబ్లిక్ సెక్టార్ ఆధ్వర్యంలో నడిచే BHEL, GAIL, IOCL, HAL, NTPC NPCIL, ONGC, PGCI కంపెనీలు, తమ ఉద్యోగాల భర్తీలో గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ రూపొందిస్తాయి.
- కేంద్ర ప్రభుత్వం నేరుగా రిక్రూట్మెంట్ చేసే గ్రూపు ఏ స్థాయి ఉద్యోగాల భర్తీ విషయంలో గేట్ స్కోరును పరిగణలోకి తీసుకుంటారు.
- పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సులకు సంబంధించిన స్కాలర్‌షిప్స్, అస్సిస్టెంట్షిప్ ప్రోగ్రాంలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 70 శాతం గేట్ వెయిటేజీ లభిస్తుంది.
- గవర్నమెంట్ ఆర్గనైజషన్స్ నిర్వహించే అన్ని ఫెలోషిప్ అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- గేట్ అర్హుత సాధించిన అభ్యర్థులు సీఎస్ఐఆర్ లాబొరేటరీసులో మరియు సీఎస్ఐఆర్ పరిశోధనాత్మక పోజెక్టుల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ యందు పాల్గునేందుకు అర్హులు.
- విద్యాసంస్థల్లో మరియు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాల్లో అధ్యాపక వృత్తిలో పని చేయాలనుకునే పోస్టుగ్రాడ్యుయేట్ తప్పనిసరి.
- పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో జాయిన్ అయిన అభ్యర్థులకు ఏడాదికి 8000 వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది.
- గేట్ స్కోర్ ఆధారంగా క్యాంపస్ రిక్రూట్మెంట్ లో కొన్ని సంస్థలు తమ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తాయి.
- గ్రాడ్యుయేట్ అభ్యర్థులతో పోల్చుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఎక్కువ ప్రారంభ జీతాలు లభిస్తాయి.
గేట్ ఎలిజిబిలిటీ
కిందిపట్టికలో ఉన్న డిగ్రీలలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత అయినవారు లేదా చివరి ఏడాది చదువుతున్న వారు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు
ఉత్తీర్ణతయిన డిగ్రీ | పరీక్ష విధానం | ఉత్తీర్ణత ఏడాది |
బీఈ/బీటెక్/బీఫార్మసీ | 10+2 తర్వాత 4 ఏళ్ళ బ్యాచిలర్ డిగ్రీ | చివరి ఏడాది చదువుతున్నవారు/ ఇంతక ముందు ఉత్తీర్ణతైన వారు |
బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ | 5 ఏళ్ళ బ్యాచిలర్ డిగ్రీ/ప్లానింగ్/ 4ఏళ్ళ నేవల్ ఆర్కిటెక్చర్ | చివరి ఏడాది చదువుతున్నవారు/ ఇంతక ముందు ఉత్తీర్ణతైన వారు |
బీఎస్సీ రీసెర్చ్ /బీఎస్ | 10+2 తర్వాత 4 ఏళ్ళ బ్యాచిలర్ డిగ్రీ | 4వ ఏడాది చదువుతున్నవారు లేదా ఇంతక ముందు ఉత్తీర్ణత అయినవారు |
ఫార్మా డీ (10+2 తర్వాత ) | 6ఏళ్ళ బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన వారు | 4,5,6వ ఏడాది చదువుతున్నవారు లేదా ఇంతక ముందు ఉత్తీర్ణతైన వారు |
ఎంబీబీస్ | 7,8,9 సెమిస్టర్లు పూర్తిచేసిన వారు | 7,8,9వ సెమిస్టర్లు చదువుతున్నవారు లేదా ఇంతక ముందు ఉత్తీర్ణతైన వారు |
ఎంఎస్సీ , ఎంఏ, ఏంసీఏ | రెండేళ్ల మాస్టర్ డిగ్రీ పూర్తిచేసినవారు | చివరి ఏడాది చదువుతున్నవారు/ ఇంతక ముందు ఉత్తీర్ణతైన వారు |
ఇంటిగ్రేటెడ్ ఏంఈ. ఎంటెక్. | ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ / 4 ఏళ్ళ బీటెక్ | 2,3,4వ ఏడాది చదువుతున్నవారు లేదా ఇంతక ముందు ఉత్తీర్ణతైన వారు |
డ్యూయల్ డిగ్రీ (డిప్లొమా/10+2 తర్వాత) | 5ఏళ్ళ బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన వారు | 4,5వ ఏడాది చదువుతున్నవారు లేదా ఇంతక ముందు ఉత్తీర్ణతైన వారు |
ఇంటిగ్రేటెడ్ ఏంఎస్సీ /బీఎస్/ఏంఎస్ | ఐదేళ్ళ ఏంఎస్సీ /బీఎస్/ఏంఎస్ | చివరి ఏడాది చదువుతున్నవారు/ ఇంతక ముందు ఉత్తీర్ణతైన వారు |
-
- పై డిగ్రీలలో ఉత్తీర్ణతయిన అభ్యర్థులకు గేట్ పరీక్ష రాసేందుకు ఎటువంటి వయోపరిమితి లేదు.
- పై డిగ్రీలలో పరీక్ష జరిగే ఏడాదికి ముందు ఉత్తీర్ణతయిన వారు ఉతీర్ణత సర్టిఫికేట్/ ప్రొవిజనల్ సర్టిఫికెట్/మెంబర్షిప్ సర్టిఫికెట్ ను దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేయవల్సి ఉంటుంది.
గేట్ 2024 షెడ్యూల్
దరఖాస్తు ప్రారంభ తేదీ | 30 ఆగష్టు 2023 |
దరఖాస్తు చివరి తేదీ | 20 అక్టోబర్ 2023 |
అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ | 03 జనవరి 2024 |
ఎగ్జామ్ తేదీలు | 3, 4, 10, 11 ఫిబ్రవరి 2024 |
ఫలితాలు | 16 మార్చి 2024 |
డౌన్‌లోడ్ స్కోర్ కార్డు | 23 మార్చి 2024 |
గేట్ 2024 దరఖాస్తు ఫీజు
గేట్ దరఖాస్తు రుసుములు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా ఈ చలానా విధానంలో చెల్లించవచ్చు. చెల్లింపు సమయంలో సర్వీస్ చార్జీలు, జీఎస్టీ వంటి అదనపు చార్జీలు ఉంటె అభ్యర్థులనే భరించాలి
కేటగిరి | గడువు కు ముందు | గడువు తర్వాత |
మహిళలు | 900/- | 1,400/- |
ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు | 900/- | 1,400/- |
జనరల్ కేటగిరి | 1,800/- | 2,300/- |
తెలుగు రాష్ట్రాలలో గేట్ పరీక్ష కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్ | |
ఐఐటీ ఖరగపూర్ జోన్ | ఏలూరు, కాకినాడ, రాజమండ్రి, తాడేపల్లి గూడెం, విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం. |
ఐఐటీ మద్రాస్ జోన్ | చిత్తూరు, గూడూరు, గుంటూరు, కడప, నెల్లూరు, ఒంగోలు, చీరాల. |
తెలంగాణ | |
ఐఐటీ బెంగళూరు జోన్ | హైదరాబాద్, కర్నూలు |
ఐఐటీ మద్రాస్ జోన్ | వరంగల్, కరీంనగర్, ఖమ్మం. |
గేట్ దరఖాస్తు ప్రక్రియ
గేట్ దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. గేట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు సంబంధిత సర్టిఫికేట్లు అన్ని అందుబాటులో ఉంచుకోవాలి. దరఖాస్తు సమయంలో అందించే సమాచారంకు పూర్తి జవాబుదారీ మీరే కాబట్టి ఇచ్చే సమాచారంలో తప్పులు దొర్లకుండా చూసుకోండి.
దరఖాస్తులో సమర్పించే ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీలు, రిజర్వేషన్ కేటగిరి, భాష ఎంపిక, పరీక్ష కేంద్రం వంటి వివరాలు దరఖాస్తు పూర్తిచేసేముందు పునఃపరిశీలించుకోండి. దరఖాస్తు పూర్తిచేసాక మూడు లేదా నాలుగు కాపీలు ప్రింట్ తీసి భద్రపర్చండి.
- వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఈమధ్య కాలంలో తీసుకున్న పాసుపోర్టు సైజు ఫోటో అందుబాటులో ఉంచుకోండి. కంప్యూటర్ లో డిజైన్ లేదా ఎడిట్ చేసిన ఫోటోలు అనుమతించబడవు.
- మీ సొంత దస్తూరితో చేసిన సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. కాపిటల్ లేటర్స్ తో చేసిన సంతకం చెల్లదు.
- ఫొటోగ్రాఫ్, సంతకం వాటికీ సంబంధించిన బాక్సుల్లో మాత్రమే అప్‌లోడ్ చేయండి. అవి తారుమారు ఐతే దరఖాస్తు పరిగణలోకి తీసుకోరు. ఈ ఫైళ్ల సైజు 10-200 కేబీల మధ్య ఉండేలా చూసుకోండి.
- దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఫొటోగ్రాఫ్ కు సమానమైనది ఇంకో ఫొటోగ్రాఫ్ ను పరీక్ష రోజు ఆయా పరీక్షకేంద్రంలో ఇవ్వాల్సి ఉంటుంది.
- అడ్మిట్ కార్డు అందుబాటులో ఉండే తేదిలో పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోండి.
- పరీక్ష రోజు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
- అడ్మిట్ కార్డు, ఫొటోగ్రాఫ్ తో పాటు వ్యక్తిగత ఐడెంటి కార్డుతో పరీక్షకు హాజరవ్వాలి.
- నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబడవు.
గేట్ 2024 ఎగ్జామ్ సరళి
గేట్ 2024 పరీక్ష పూర్తి ఆన్‌లైన్ (సీబీటీ) విధానంలో జరుగుతుంది. 30 స్పెషలైజ్డ్ సబ్జెక్టుల కొరకు జరిగే ఈ పరీక్ష, మూడు గంటల నిడివితో 100 మార్కులకు జరుగుతుంది. దరఖాస్తు సమయంలో అభ్యర్థి ఎంచుకున్న ఆప్షనల్ సబ్జెక్టు సంబంధించిన క్వశ్చన్ పేపర్ మాత్రమే కంప్యూటర్ స్క్రీన్ పైన కనపడుతుంది. ప్రశ్నపత్రంలో 65 ప్రశ్నలు ఇవ్వబడతాయి.
ప్రశ్నలలో మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు (MCQ), మరికొన్ని మల్టిఫుల్ సెలెక్ట్ ప్రశ్నలు (MSQ) లేదా న్యూమరికాల్ సమాదానపు ప్రశ్నలు (NAT) ఉంటాయి. న్యూమరికల్ సమాదానాలు ఉండే ప్రశ్నలకు సమాధానం చేసేటప్పుడు కంప్యూటర్ కీ బోర్డు పనిచేయదు. ఈ ప్రశ్నలకు కంప్యూటర్ స్క్రీన్ పైన ఉండే వర్చ్యువల్ కీ బోర్డు ఉపయోగించి 1 నుండి మూడు డిసిమిల్స్ లో సమాధానం చేయాల్సి ఉంటుంది.
Example: If the wire diameter of a compressive helical spring is increased by 2%, the change in
spring stiffness (in %) is _____ (correct to two decimal places)
ఈ 65 ప్రశ్నలలో 10 ప్రశ్నలు జనరల్ ఆప్టిట్యూడ్ అంశాల నుండి ఇవ్వగా, మిగతా 55 ప్రశ్నలు అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుండి ఇవ్వబడతాయి. పరీక్ష మొత్తంగా 100 మార్కులకు జరుగుతుంది. మార్కుల వారీగా ఆప్టిట్యూడ్ అంశాలకు 15 మార్కులు, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అంశాలకు 13 మార్కులు మరియు ఆప్షనల్ సబ్జెక్టు అంశాలకు 72 మార్కులు కేటాయించారు.
సరైన సమాధానం చేసిన మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలకు 1 లేదా 2 మార్కులు ఇవ్వబడతాయి. తప్పు సమాధానం చేసిన ప్రశ్నలలో 1 మార్కు ప్రశ్నలకు 1/3 వంతు, 2 మార్కుల ప్రశ్నలకు 2/3 వంతు ఋణాత్మక మార్కులు ఇవ్వబడతాయి. మల్టిఫుల్ సెలెక్ట్ ప్రశ్నలు మరియు న్యూమరికల్ ప్రశ్నలకు ఋణాత్మక మార్కులు లేవు.
గేట్ పరీక్ష జరిగే 25 పేపర్లు వాటి పేపర్ కోడ్స్ | |||
GATE PAPER | CODE | GATE PAPER | CODE |
Aerospace Engineering | AE | Instrumentation Engineering | IN |
Agricultural Engineering | AG | Mathematics | MA |
Architecture and Planning | AR | Mechanical Engineering | ME |
Bio-medical Engineering | BM | Mining Engineering | MN |
Biotechnology | BT | Metallurgical Engineering | MT |
Civil Engineering | CE | Petroleum Engineering | PE |
Chemical Engineering | CH | Physics | PH |
Computer Science and Information Technology |
CS | Production and Industrial Engineering |
PI |
Chemistry | CY | Statistics | ST |
Electronics and Communication Engineering |
EC | Textile Engineering and Fibre Science |
TF |
Electrical Engineering | EE | Engineering Sciences | XE* |
Ecology and Evolution | EY | Life Sciences | XL** |
Geology and Geophysics | GG |
XE* PAPER SECTIONS | CODE | XL** PAPER SECTIONS | CODE |
Engineering Mathematics (Compulsory) |
A | Chemistry (Compulsory) | P |
Any two optional sections | Any two optional sections | ||
Fluid Mechanics | B | Biochemistry | Q |
Materials Science | C | Botany | R |
Solid Mechanics | D | Microbiology | S |
Thermodynamics | E | Zoology | T |
Polymer Science and Engineering | F | Food Technology | U |
Food Technology | G | ||
Atmospheric and Oceanic Sciences | H |
- గమనిక: XE*(ఇంజనీరింగ్ సైన్సెస్), XL** (లైఫ్ సైన్సెస్)
- CE (కంప్యూటర్ ఇంజనీరింగ్), ME(మెకానికల్ ఇంజనీరింగ్) పేపర్లు ఒక రోజులో పలు సెషన్లలో జరుగుతాయి. ఒక అభ్యర్థికి ఒక సెషన్ లో మాత్రమే అనుమతి ఉంటుంది.
- ప్రతి పేపర్లో 15 మార్కుల వరకు జనరల్ ఆప్టిట్యూడ్ నుండి ఇవ్వబడతాయి.
- AE, AG, BM, BT, CE, CH, CS, EC, EE, IN, ME, MN, MT, PE, PI,
TF and XE కోడ్ ఉన్న క్వశ్చన్ పేపర్లలో 15 శాతం మార్కులు మ్యాథ్స్ సబ్జెక్టు నుండి 15 శాతం మార్కులు జనరల్ ఆప్టిట్యూడ్ నుండి ఇవ్వబడతాయి. మిగిలిన 70% శాతం అభ్యర్థి ఆప్షనల్ గా తీసుకున్న సబ్జెక్టు కు సంబంధించిన సిలబస్ నుండి ఇవ్వబడతాయి. - AR, CY, EY, GG, MA, PH, ST and XL కోడ్ ఉన్న క్వశ్చన్ పేపర్లలో 15 శాతం మార్కులు జనరల్ ఆప్టిట్యూడ్ నుండి ఇవ్వబడతాయి. మిగిలిన 85% శాతం అభ్యర్థి ఆప్షనల్ గా తీసుకున్న సబ్జెక్టు కు సంబంధించిన సిలబస్ నుండి ఇవ్వబడతాయి.
- జనరల్ ఆప్టిట్యూడ్ కి సంబంధించిన 15 మార్కులలో 5 ఒక మార్కు ప్రశ్నలు మరియు 5 రెండు మార్కుల ప్రశ్నలు ఇవ్వబడతాయి.
గేట్ స్కోర్ కాలిక్యులేటర్
గేట్ పరీక్షలో సాధించిన స్కోర్, వచ్చిన మార్కులు లెక్కించటంలో అభ్యర్థులు తరుచు గందరగోళానికి గురవుతారు. అలా జరగటానికి కారణం కూడ లేకపోలేదు. ఎందుకంటె గేట్ స్కోర్ లెక్కించటం కొంచెం సంక్లిష్టమైన ప్రక్రియ అని చెప్పక తప్పదు. గేట్ అధికారిక పరీక్ష విధానం 65 ప్రశ్నలతో 100 మార్కులకు జరుగుతుంది.
కాని గేట్ పరీక్షను 1000 మార్కుల స్కోరుకు లెక్కిస్తారు. నిజానికి గేట్ స్కోర్ మరియు గేట్ మార్కులు రెండు భిన్న అంశాలు. గేట్ మార్కులనేవి వాస్తవంగా మీకు పరీక్షలో వచ్చిన మార్కులు. గేట్ స్కోర్ అనేది వివిధ విభిన్న అంశాల లెక్కింపు అనంతరం వచ్చేది. దీని కోసం మరికొంత వివరంగా తెలుసుకుందాం.
కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వంటి పేపర్లు రాసే విద్యార్థుల సంఖ్యా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పేపర్లు అన్ని పలు సెషన్లలో జరుగుతాయి. దీని కారణంగా ప్రతి సెషన్ యందు ఉండే పేపర్ల క్లిష్టత స్థాయి వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఎవరికి నష్టం జరగకుండా ఈ పేపర్లకు సంబంధించిన మార్కులన్నీ ఒక ప్రత్యేక ఫార్ములాతో నార్మలైజ్ చేస్తారు.
ఈ నార్మలైజషన్ ప్రక్రియలో అభ్యర్థి సాధించిన మార్కులు, ఆ పేపరుకు సంబంధించిన కట్-ఆఫ్ మార్కులు మరియు ఆ సెషన్ యందు టాప్ 0.1% అభ్యర్థులకు వచ్చిన మార్కుల సగటు, ఈ ప్రక్రియలో కీలక భూమిక పోషిస్తాయి. ఈ గణన అయ్యాక మిగతా అన్ని సెషన్ల పేపర్ల కలిపి గేట్ యొక్క సాధరణ స్కోరును ఇంకో ఫార్ములా ద్వారా లెక్కించి తుది ర్యాంకులు ప్రకటిస్తారు.
జనరల్ కేటగిరికి సంబంధించి ప్రతి సబ్జెక్టు యందు క్వాలిఫై అవ్వాలంటే కనీసం 25 మార్కులు పొందాల్సి ఉంటుంది. ప్రతి సబ్జెక్టు సంబంధించి కట్-ఆఫ్ మార్కులు గేట్ అథారిటీ నిర్ణహిస్తుంది.
అన్ని సెషన్లకు గేట్ స్కోర్ లెక్కించుట :
గేట్ స్కోర్ కార్డు వ్యాలిడిటీ
ఎంటెక్ అడ్మిషన్ ప్రయోజనాల కోసం గేట్ స్కోర్‌కార్డ్ విడుదలైన సంవత్సరం నుండి మూడు సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది. కాబట్టి స్కోర్ కార్డు యొక్క ఒక సాఫ్ట్ కాపీని భవిష్యత్తు అవసరాల కోసం భద్రపర్చుకోవలసి ఉంటుంది. గేట్ అభ్యర్థులు తమ స్కోర్‌లను మెరుగుపరచుకోవాలని భావిస్తే. వచ్చే ఏడాది పరీక్షలకు కూడా హాజరుకావచ్చు. అభ్యర్థి వద్ద బహుళ చెల్లుబాటు అయ్యే గేట్ స్కోర్‌కార్డులు ఉంటే, కావలసిన సంస్థలో లేదా ఉన్నకోర్సులో ప్రవేశం సమయంలో, వారు వాటిలో దేనినైనా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
తాజా ఏడాదిలో గేట్ యందు బాగా స్కోర్ చేసిన వారు రాబోయే మూడేళ్లలోపు ఐఐటీ, ఎన్ఐటీ లేదా ఇతర విశ్వవిద్యాలయంలో ఎంటెక్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయ్యేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పబ్లిక్ సెక్టార్ కంపెనీల ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నప్పుడు గేట్ స్కోర్ ఒక సంవత్సరంకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అంటే తాజా ఏడాదిలో గేట్ పరీక్షలో అర్హత సాధించిన వారు మాత్రమే ఆ సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు పరిగణించబడతారు.
గేట్ 2024 డౌన్‌లోడ్స్
గేట్ పాత ప్రశ్న పత్రాలు | డౌన్‌లోడ్ |
గేట్ 2024 సిలబస్ | డౌన్‌లోడ్ |
గేట్ 2024 ఆన్‌లైన్ అప్లికేషన్ | దరఖాస్తు చేయండి |