'కన్యా శిక్ష ప్రవేశ ఉత్సవ్' ప్రచార కార్యక్రమం ప్రారంభం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కన్యా శిక్ష ప్రవేశ ఉత్సవ్ పేరుతో దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించింది. 11-14 ఏళ్లలోపు బడి బయట ఉన్న నాలుగు లక్షల మంది కౌమార బాలికలను తిరిగి విద్యావ్యవస్థలోకి తీసుకురావడమే లక్యంగా ఈ కార్యక్రమంను రూపొందించారు. ఈ కార్యక్రమం మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
ఛత్తీస్‌గఢ్'లో 'కౌశల్య మాతృత్వ యోజన' పథకం పార్రంభం
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్, కౌశల్య మాతృత్వ యోజన పేరుతో నూతన పథకం ప్రారంభించారు. ఈ పథకం పరిధిలో రాష్ట్రంలో రెండవ ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లులకు 5 వేల రూపాయల ఆర్థిక సాయం అంజేస్తారు. ఈ పథకాన్ని మార్చి 7న రాయ్‌పూర్‌లోని బీటీఐ గ్రౌండ్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి మహిళా సదస్సు ద్వారా ప్రారంభించారు.
జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్‌కి నేషనల్ అవార్డు
సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ (SHG) బ్యాంక్ లింకేజ్‌లో అత్యుత్తమ పనితీరుకు గుర్తింపుగా జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్‌కి '2020-21 ఆర్థిక సంవత్సరానికి జాతీయ అవార్డు లభించింది. ఈ అవార్డును గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ GoI) అందించింది.
మిషన్ ఇంద్రధనుష్ యొక్క ఇమ్మునైజషన్ కవరేజీలో ఒడిశా అగ్రస్థానం
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS)-5 ప్రకారం, మిషన్ ఇంద్రధనుష్ కింద 90.5% ఇమ్మునైజషన్ కవరేజీతో ఒడిశా దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా కోవిడ్, పోలియో, క్షయ, కామెర్లు, వంటి 12 రకాల వ్యాధులన నివారణ కోసం వాక్సినేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఒడిశా ప్రభుత్వం 90.5% వాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేసి దేశంలో అగ్రస్థానంలో నిలిచింది.
నేషనల్ ఇ-విధాన్ అప్లికేషన్‌ను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా నాగాలాండ్
నేషనల్ ఇ-విధాన్ అప్లికేషన్‌ను అమలు చేసిన దేశంలోనే మొదటి రాష్ట్ర అసెంబ్లీగా నాగాలాండ్ చరిత్ర సృష్టించింది. జాతీయ ఇ-విధాన్ ప్రాజెక్టులో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో పేపర్‌లెస్ మోడ్ శాసన వేదికలుగా తీర్చిదిద్దనున్నారు. దీనిలో భాగంగా శానసభ్యులు ఎలక్ట్రిక్ డివైజుల ద్వారా పరిపాలన పాత్రలను యాక్సిస్ చేసే సౌకర్యం కల్పిస్తున్నారు. దీనికోసమే ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం NeVA సాఫ్ట్వేర్ డెవలప్ చేసింది.