ఆన్‌లైన్ లెర్నింగ్ వేదికల్లో లిండాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఆన్‌లైన్ లెర్నింగ్ వేదికల్లో ఒకానొక పురాతణమైనది. దీన్ని 1995లో లిండా వీన్మాన్ అనే వ్యవస్థాపకరాలు రూపొందించారు. ఆతర్వాత 2015 లో మైక్రోసాఫ్టుకు చెందిన ప్రొఫిషినల్స్ సోషల్ నెట్వర్క్ "లింక్డ్ఇన్" దీన్ని హస్తగతం చేసుకుంది.
ప్రస్తుతం లిండా "లింక్డ్ఇన్ లెర్నింగ్" పేరుతొ వాడుకులో ఉంది. లిండా ప్రధానంగా ఉద్యోగ మరియు నైపుణ్యాభివృద్ధి సంబంధిత సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, వెబ్ డెవలప్‌మెంట్, ఫోటోగ్రఫీ, డిజైనింగ్ మరియు బిజినెస్ కోర్సులను అందిస్తుంది.
లింక్డ్ఇన్ లెర్నింగ్ వైనాడు ప్రస్తుతం 16 వేలకు పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి వారం ఈ సంఖ్యా పెరుగుతూనే ఉంటుంది. లింక్డ్ఇన్ లెర్నింగ్ ఉచితంగా ఒక నెల ప్రీమియం ట్రయిల్ ఆఫర్ అందిస్తుంది. ట్రయిల్ పీరియడ్ ముగిసాక కొనసాగలనుకుంటే నెల లేదా వార్షిక చెల్లింపులతో కోర్సులను అందిస్తుంది.
ఒకసారి కోర్సు నమోదు చేసుకున్నాక ఆ వ్యవధిలో సభ్యులు తమకు అందుబాటులో ఉండే సమయాల్లో కోర్సులను నేర్చుకోవచ్చు. విజయవంతగా పూర్తిచేసిన కోర్సులకు, కోర్సు పూర్తిచేసినట్లు సర్టిఫికెట్ కూడా అందజేస్తారు.
లింక్డ్ఇన్ లెర్నింగ్ ఆన్‌లైన్ లెర్నింగ్ కోర్సులు
3D యానిమేషన్ | ఎడ్యుకేషన్ & లెర్నింగ్ |
ఆడియో + మ్యూజిక్ | ఐటీ |
బిజినెస్ | మార్కెటింగ్ |
CAD | ఫోటోగ్రఫీ |
డిజైన్ | వీడియో |
డెవలపర్ | వెబ్ డిజైనింగ్ |
లింక్డ్ఇన్ లెర్నింగ్ కీ పాయింట్స్
- లింక్డ్ఇన్ లెర్నింగ్ అందిస్తున్న కోర్సులకు సంబంధించి విస్తృతమైన లైబ్రరీ అందుబాటులో ఉంది
- లింక్డ్ఇన్ లెర్నింగ్ 30 రోజుల ఉచిత ట్రయిల్ పీరియడ్ అందిస్తుంది
- లింక్డ్ఇన్ లెర్నింగ్ కోర్సులు క్వాలిటీ పరంగా అత్యుత్తమైనవి
- లింక్డ్ఇన్ లెర్నింగ్ కోర్సులు మీకు నచ్చిన సమయాల్లో నేర్చుకునే సదుపాయం ఉంది
- లింక్డ్ఇన్ లెర్నింగ్ కోర్సులు ఐదు భాషల్లో అందుబాటులో ఉన్నాయి
- లింక్డ్ఇన్ లెర్నింగ్ కోర్సులకు సంబంధించి అభ్యాసన ఫైల్స్ కోర్సుతో పాటు అందజేస్తారు
- లింక్డ్ఇన్ లెర్నింగ్ ప్రీమియం లెర్నింగుతో లింక్డ్ఇన్ ప్రీమియం ఫీచర్స్ ఉపయోగించుకోవచ్చు
- విజయవంతంగా పూర్తిచేసిన కోర్సులకు సర్టిఫికెట్ అందజేస్తారు
లింక్డ్ఇన్ లెర్నింగ్ కోర్సుల ప్రతికూలతలు
- లింక్డ్ఇన్ లెర్నింగ్ కోర్సులు అవసరమైనా దానికంటే నిడివిని కలిగి ఉంటాయి
- లింక్డ్ఇన్ లెర్నింగ్ ప్రీమియం కోర్సులకు మనీ బ్యాక్ గ్యారంటీ సదుపాయం లేదు
- ఒక అంశానికి సంబంధించి వందల్లో కోర్సులు ఉండటం వలన నాణ్యమైన కోర్సును ఎంపిక చేసుకోవటం కష్టం
- కొన్ని కోర్సులకు సర్టిఫికెట్ పొందేందుకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది
- లింక్డ్ఇన్ లెర్నింగ్ కోర్సుల రుసుములు మిగతా వాటితో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి
లింక్డ్ఇన్ లెర్నింగ్ కోర్సుల ప్రయోజనాలు మరియు ప్రతికూలతలు కొంచెపు పక్కన పెడితే, ఆన్‌లైన్ ద్వారా కొత్త సాంకేతిక, డిజైన్ నైపుణ్యాలు నేర్చుకునే ఆలోచన ఉన్నవారికి లిండా విస్తృతమైన కోర్సుల ఎంపికను అందిస్తుంది.
లింక్డ్ఇన్ లెర్నింగ్ కోర్సులను ఎటువంటి సమయం వృధా కాకుండా మీరున్నా చోట నుండే, మీకు అందుబాటులో ఉండే సమయంల్లో నేర్చుకునే అవకాశం ఉంది. ఉద్యోగ పదోన్నతి కోసం ప్రయత్నించే వారు, నూతన నైపుణ్యాలను నేర్చుకోవాలనుకునే వారు, గృహాణిలు, విద్యార్థులు లిండా ద్వారా మీ కలలను నిజం చేసుకోవచ్చు.