బైజుస్ ఆన్‌లైన్ క్లాసులు : కంప్రెహెన్సివ్ & కాంపిటేటివ్ ఆన్‌లైన్ లెర్నింగ్
Online Education Useful websites

బైజుస్ ఆన్‌లైన్ క్లాసులు : కంప్రెహెన్సివ్ & కాంపిటేటివ్ ఆన్‌లైన్ లెర్నింగ్

ఇండియన్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఆన్‌లైన్ విద్య పరంగా స్థాపించబడిన డిజిటల్ లెర్నింగ్ వేదికల్లో బైజుస్ ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. అప్పటి వరకు సాంప్రదాయ విద్యా విధానానికి అలవాటు పడ్డ భారతీయ విద్యార్థులకు బైజుస్ నూతన బోధనా విధానాన్ని పరిచయం చేసింది.

బైజుస్ 2011 లో పూర్తి భారతీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడింది. బైజు రవీంద్రన్ స్థాపించిన ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకత నేడు ఒక ప్రసిద్ధ భారతీయ బహుళజాతి సంస్థగా విజయపథంలో నడుస్తుంది. బైజుస్ పాఠశాల విద్యార్థులకు సంబంధించి పూర్తిస్థాయి కంప్రెహెన్సివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అందిస్తుంది. కేజీ నుండి 10+2 వరకు పెర్సనాలైజ్డ్ వీడియో తరగతులను రూపొందిస్తుంది.

సృజనాత్మకమైన విజువలైజేషన్ టీచింగ్ విధానం ద్వారా ప్రతి కాన్సెప్ట్'కు సంబంధించి పూర్తిస్థాయి అవగాహన విద్యార్థులలో కలిగేలా వీడియో తరగతులను రికార్డు చేస్తుంది. ఆయా తరగతులకు సంబంధించి అభ్యాస ప్రక్రియతో పాటుగా ప్రతి విద్యార్థికి వ్యక్తిగతంగా సపోర్టు అందిస్తుంది.

ఇండియన్ టాప్ క్లాస్ టీచర్లతో రూపొందించబడిన ఈ కంటెంట్ మీకు నచ్చిన సమయాల్లో అభ్యసించేందుకు అవకాశం కల్పిస్తుంది. బైజుస్ సీబీఎస్‌ఈ పాఠ్య ప్రణాళికతో పాటుగా దేశంలో ఇతర ఎడ్యుకేషన్ బోర్డులకు సరిపోయే కంటెంట్ అందిస్తుంది. బైజుస్ ప్రీమియం తరగతులతో పాటుగా కొన్ని పరిమితులతో ఉచిత తరగతులను కూడా అందుబాటులో ఉంచింది.

బైజుస్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వంటి ప్రభుత్వలతో అధికారికంగా భాగస్వామ్యం కావడం ద్వారా పూర్తి ఉచితంగా కంటెంట్ అందిస్తుంది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత ట్యాబులు కూడా పంపిణి చేసింది.

byjus

బైజుస్ పాఠశాల విద్యతో పాటుగా సివిల్స్, జేఈఈ, నీట్, క్యాట్ వంటి పరీక్షలకు ఉపయోగపడే కంటెంట్ అందిస్తుంది. మ్యాథ్స్, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ సబ్జెక్టుల చెందిన పూర్తిస్థాయి వీడియో కంటెంట్ తో పాటుగా వెబ్ డిజిటల్ టెక్స్ట్ కూడా అందుబాటులో ఉంచింది.

అలానే బైజుస్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ కూడా అందిస్తుంది. బీనాట్ (బైజుస్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్) పేరుతో అదిపెద్ద ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఇందులో టాప్ మెరిట్ సాధించిన విద్యార్థులకు బైజుస్ కంటెంటును పూర్తి ఉచితంగా అందిస్తుంది.

Post Comment