Noun definition and types in Telugu | తెలుగులో స్పోకెన్ ఇంగ్లీష్
Spoken English

Noun definition and types in Telugu | తెలుగులో స్పోకెన్ ఇంగ్లీష్

A noun is a word that names something, such as a person, place, thing, or idea. In a sentence, nouns can play the role of subject, direct object, indirect object, subject complement, object complement, appositive, or adjective.

Advertisement

బాషా భాగాలలో మొదటిది నామవాచకం. పేర్లును గురించే తెలియజేసే భాషాభాగాన్ని Noun అంటారు. అవి వ్యక్తులు, జంతువులు, వస్తువులు, పదార్దాలు, ప్రదేశాలు, ఆలోచన (ఐడియా), చర్య (యాక్షన్) మరియు నాణ్యత (క్వాలిటీ) ఇలా అన్ని రకాల పేర్లు Nouns అవుతాయి.

EX : రాము (వ్యక్తి), పిల్లి (జంతువు), బంగారం (పదార్థం), టీవీ (వస్తువు), హైదరాబాద్ (ప్రాంతం), నిజాయితీ (నాణ్యత), సంగీతం (యాక్షన్), సలహా (ఐడియా). నామవాచకాన్ని తిరిగి 8 రకాలుగా విభజించారు.

Common Nouns Countable Nouns
Proper Nouns Uncountable Nouns
Abstract Nouns Collective Nouns
Concrete Nouns Compound Nouns

Common Nouns

ఒక కేటగిరికి లేదా ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన వ్యక్తులు, జంతువులు, వస్తువులు మరియు ప్రాంతాల పేర్లను కామన్ నౌన్సుగా చెప్పుకుంటారు. ఉదాహరణకు Girl, City, Animal, Food etc. కామన్ నౌన్స్ అన్ని బహువచనలుగా ఉంటాయి. ఇక్కడ పలానా అనే నిర్దిష్ట పేరు ఉండదు.

ఇలా పలానా అనే పేర్లు అన్ని కలిసి కామన్‌గా ఏర్పడ్డ కేటగిరి పేరు మాత్రమే ఉంటుంది.  విద్యార్థి (ఏ విద్యార్థి ?), అమ్మాయి (ఏ అమ్మాయి ?), నది (ఏ నది ?), సిటీ (ఏ సిటీ ?), ఫుడ్ (ఏ ఫుడ్).

Proper Nouns

కామన్ నౌన్సులలో పలానా అని చెప్పలేని నిర్దిష్ట వ్యక్తి, జంతువూ, ప్రాంతం, వస్తువుల పేర్లను Proper Nouns అంటారు. ప్రొపెర్ నౌన్స్ ఎప్పుడూ ఏక వచనంలో ఉంటాయి. నది అనేది కామన్ నౌన్ అయితే, గోదావరి నది అనేది ప్రొపెర్ నౌన్ అవుతుంది.

అమ్మాయి అనేది కామన్ నౌన్ అయితే, సమంత అనేది ప్రొపెర్ నౌన్ అవుతుంది. అలానే ఫుడ్ అనేది కామన్ నౌన్ అయితే, బిర్యానీ అనేది ప్రొపెర్ నౌన్ అవుతుంది.

Abstract Nouns

భౌతిక రూపం లేని పేర్లను Abstract Nouns అంటారు. ఇంకా చెప్పాలంటే జంతువులుగా కానీ, వస్తువులుగా కానీ, పదార్థములుగా కానీ ఉండని వాటిని Abstract Nouns గా చెప్పొచ్చు. వీటికి సంబంధించి రూపం, స్పర్శ, రుచి, వాసన, శబ్దం మనం చూడలేము, వినలేము మరియు అనుభూతి పొందలేము. Ex : Love, Fear, Freedom, Time etc.

Concrete Nouns

Abstract Nouns వాటిలా కాకుండా రూపం, స్పర్శ, రుచి, వాసన కలిగిన పేర్లను Concrete Nouns అంటారు. దీని కోసం అతిగా ఆలోచించాల్సిన పనిలేదు. Abstract Nouns మినహాయిస్తే మిగతా అన్ని పేర్లను Concrete Nouns గా చెప్పొచ్చు. Abstract Noun కోసం చెప్పుకునే సందర్భంలో మాత్రమే దీనికోసం చెప్పాల్సి వస్తుంది. మిగతా సందర్భాలలో దీనితో పనిలేదు. Ex : Sun, Tree, Dog, Tv etc.

Countable Nouns

ఏక మరియు బహువచన రూపాలను కలిగిన పేర్లను Countable Nouns అంటారు. ఇంకా చెప్పాలంటే లెక్కించ గలిగే పేర్లను Countable Nouns గా చెప్పొచ్చు. ఈ పేర్ల ముందు సాధారణంగా నెంబర్ లేదా A/ An ఎల్లప్పుడూ ఉంటాయి. Ex : An apple, two apples, three apples etc.

Uncountable Nouns

లెక్కించేందుకు వీలు కానీ Uncountable Nouns అంటారు. ఇవి సాధారణంగా substance, Liquid మరియు Abstract Nouns చెందినవై ఉంటాయి. Ex : Wood, Milk, Water, Light, Happines etc.

Collective Nouns

Collective Noun ను తెలుగులో సామూహిక నామవాచకం అంటారు. ఇవి బృందాలను తెలిపే పేర్లుగా చెప్పొచ్చు. ఒక వర్గానికి చెందిన ఒంటిరి వ్యక్తులు, జంతువులు లేదా వస్తువు కలిసి ఒక సమూహంగా ఏర్పడటాన్ని బృందం లేదా సమూహం అంటారు. ఈ సమూహాలకు చెందిన పేర్లనే Collective Nouns అంటారు. Ex : Army, Society, Group, People.Team, A flock of sheep (గొర్రెల) etc.

Compound Nouns

రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలతో ఏర్పడిన పేర్లను Compound Nouns అంటారు. సాధారణంగా ఈ పదాల మధ్య హైపెన్ గుర్తు ఉంటుంది, లేదా రెండు పదాలుగా రాయబడుతుంది. ఇవి noun + noun, noun + verb, noun + adverb, verb + noun కలవడం ద్వారా ఏర్పడతాయి.  Ex : Credit card, Brother-in-law, Rainfall, Haircut etc.

టైప్స్ ఆఫ్ నౌన్స్ పూర్తిగా అర్ధమైతే సరే, అర్థంకాకున్న ఆందోళన పడకండి. ఈ పేర్లు అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఒక వాక్యంలో ఉండే పేర్లను గుర్తించగలిగేతే సరిపోతుంది. పోటీపరీక్షల సంబంధించి అయితే ఇవన్నీ పూర్తిస్థాయిలో నేర్చుకోవాల్సి ఉంటుంది. కేవలం మాట్లాడేందుకు అయితే Noun అంటే ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది.

Nounస్ లో చాలా వాటికి స్త్రీ, పురుష బేధాలు, ఏక, బహు వచనాలూ ఉంటాయి. అంటే జెండర్, నెంబర్ అనేవి Nounకి విషయాలుగా భావించవచ్చు. అలానే నౌన్ ఒక వాక్యంలో ఎప్పుడూ ఒకేరకం పాత్ర నిర్వహించదు.

ఒక సందర్భంలో కర్తగా (subject) ఉంటె ఇంకో సందర్భంలో కర్మాగా (Object) ఉంటుంది. మరో సందర్భంలో మరో రకంగా.. Ex : Ramu Eating Biryani. ముందు వాక్యంలో రాము అనే పేరు సబ్జెక్టుగా ఉండగా బిర్యానీ అనే పేరు ఆబ్జెకక్టుగా ఉంది.

Advertisement

Post Comment