విద్యా వ్యవస్థ ఆధునికరణలో భాగంగా స్వయం ప్రభ టీవీని భారత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆన్‌లైన్ విద్యతో పాటుగా టెలివిజన్ ద్వారా బోధన తరగతులు ప్రచారం చేయాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేసింది.
ఇంటర్నెట్ అందుబాటులో లేని విద్యార్థులకు, ఇంటర్నెట్ సమకూర్చుకోలేని విద్యార్థులకు 34 DTH చానల్స్ ద్వారా 2017 జూన్ 9 నుండి విద్యా ప్రచారాలు ప్రారంభించింది. 9వ తరగతి నుండి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు ప్రతిరోజూ 4 గంటల నిడివితో అకాడమిక్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇవే తరగతులను ఒక రోజులో 5 సార్లు పునరావృతం చేస్తున్నారు.
స్వయం ప్రభలో తరగతులను NPTEL, IITs, UGC, CEC, IGNOU, NCERT ల సహాయంతో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ వేదికలో 3 లక్షలకు పైగా వీడియో తరగతులు అందుబాటులో ఉన్నాయి.
ఆర్ట్స్, సైన్స్, కామర్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, లా, మెడిసిన్, అగ్రికల్చర్ కోర్సులకు సంబంధించి అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరగతులను స్వయం పోర్టల్ సహాయంతో పూర్తి అకాడమిక్ పాఠ్య ప్రణాళికను నిర్వహిస్తుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికీ స్వయం ఉత్తీర్ణత సర్టిఫికెట్ అందజేస్తుంది.
స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి 9 నుండి 12 లెవెల్ విద్యార్థులకు అకాడమిక్ తరగతులతో పాటుగా కాంపిటేటివ్ పరీక్షకు ఉపయోగపడే కంటెంట్ ఆఫర్ చేస్తుంది. అలానే దేశంలో మరియు విదేశాల్లో ఉండే భారతీయ పౌరుల నిరంతర, జీవితకాల అభ్యాసకుల అవసరాలను తీర్చగల పాఠ్య ప్రణాళిక ఆధారిత కోర్సులు కూడా అందుబాటులో ఉంచింది. ఈ కోర్సులన్నీ స్వయం ప్రభ యూట్యూబ్ ఛానెళ్లలో ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయి.
స్వయం ప్రభ : ఉన్నత విద్య టీవీ ఛానల్స్
ఉన్నత విద్యకు సంబంధించి 22 స్వయం ప్రభ టీవీ చానెల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రచారాలను యూజీసీ, ఇగ్నో, నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్ లెర్నింగ్ మరియు కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ (సిఇసి) సహాయంతో అందిస్తుంది.
ఛానెల్ 1 (వాగీష్ టీవీ) | హ్యుమానిటీస్ 1 : లాంగ్వేజ్ & లిటరేచర్ (సిఇసి & యూజీసీ) |
ఛానెల్ 2 (సంస్కృతం టీవీ) | హ్యుమానిటీస్ 2 : ఆర్ట్స్, హిస్టరీ, ఫిలాసఫీ (సిఇసి & యూజీసీ) |
ఛానెల్ 3 (ప్రబోద్ టీవీ) | సోషల్ సైన్స్ 1 : సోషియాలజీ, పొలిటికల్ సైన్స్ (సిఇసి & యూజీసీ) |
ఛానెల్ 4 (సరస్వత్ టీవీ) | సోషల్ సైన్స్ 2 : ఎడ్యుకేషన్, సైకాలజీ, హోమ్ సైన్స్ (సిఇసి & యూజీసీ) |
ఛానెల్ 5 (ప్రబందన్ టీవీ) | సోషల్ సైన్స్ 3 : మేనేజ్‌మెంట్, లైబ్రరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్ (సిఇసి & యూజీసీ) |
ఛానెల్ 6 (విధిక్ టీవీ) | సోషల్ సైన్స్ 4 : లా, లీగల్ స్టడీస్, హ్యూమన్ రైట్స్ (సిఇసి & యూజీసీ) |
ఛానెల్ 7 (కౌటిల్య టీవీ) | ఎకనామిక్స్, కామర్స్ అండ్ ఫైనాన్స్ (సిఇసి & యూజీసీ) |
ఛానెల్ 8 (ఆర్యభట్ టీవీ) | ఫిజికల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ (సిఇసి & యూజీసీ) |
ఛానెల్ 9 (స్పాందన్ టీవీ) | లైఫ్ సైన్సెస్, బోటనీ, జువాలజీ, బయో సైన్స్ (సిఇసి & యూజీసీ) |
ఛానెల్ 10 (దీక్షా టీవీ) | అప్లైడ్ సైన్సెస్, అలైడ్ ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్ (సిఇసి & యూజీసీ) |
ఛానెల్ 11 | మెకానికల్ ఇంజనీరింగ్ & బ్రాంచులు (ఎన్‌పిటిఎల్) |
ఛానెల్ 12 | సివిల్ ఇంజనీరింగ్ & బ్రాంచులు (ఎన్‌పిటిఎల్) |
ఛానెల్ 13 | కంప్యూటర్ సైన్స్ & ఐటీ బ్రాంచులు (ఎన్‌పిటిఎల్) |
ఛానెల్ 14 | ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ & బ్రాంచులు (ఎన్‌పిటిఎల్) |
ఛానెల్ 15 | ఇంజనీరింగ్ సైన్సెస్ & బ్రాంచులు (ఎన్‌పిటిఎల్) |
ఛానెల్ 16 | హ్యుమానిటీస్ అండ్ మేనేజ్‌మెంట్ బ్రాంచులు (ఎన్‌పిటిఎల్) |
ఛానెల్ 17 | సోషల్ సైన్సెస్ & హ్యుమానిటీస్ బ్రాంచులు (ఇగ్నో) |
ఛానెల్ 18 | బేసిక్ & అప్లయిడ్ సైన్సెస్ (ఇగ్నో) |
ఛానెల్ 19 | ప్రొఫిషినల్ & ఒకేషనల్ ఎడ్యుకేషన్ (ఇగ్నో) |
ఛానెల్ 20 | స్టేట్ ఓపెన్ యూనివర్సిటీస్ & టీచర్ ఎడ్యుకేషన్ (ఇగ్నో) |
ఛానెల్ 21 (వ్యాస్ టీవీ) | హయ్యర్ ఎడ్యుకేషన్ క్లాసులు (సిఇసి & యూజీసీ) |
ఛానెల్ 22 | ఐఐటీ క్లాసులు (ఎన్‌పిటిఎల్) |
స్వయం ప్రభ : పాఠశాల విద్య టీవీ ఛానల్స్
పాఠశాల విద్యకు సంబంధించి 12 స్వయం ప్రభ టీవీ చానెల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రచారాలను పీఎం ఈవిద్యా చానెల్స్ పేరుతొ వివిధ సీబీఎస్ఈ వంటి వివిధ కేంద్ర విద్యా సంస్థల సహాయంతో అందిస్తున్నారు. ఈ 12 పీఎం ఈవిద్యా చానెల్స్ యందు క్లాస్ 1 నుండి క్లాస్ 12 వరకు అకాడమిక్ తరగతులు ప్రచారం చేస్తారు.
ఛానెల్ 23 (పీఎం ఇ-విద్య) | క్లాస్ 1 తరగతులు |
ఛానెల్ 24 (పీఎం ఇ-విద్య) | క్లాస్ 2 తరగతులు |
ఛానెల్ 25 (పీఎం ఇ-విద్య) | క్లాస్ 3 తరగతులు |
ఛానెల్ 26 (పీఎం ఇ-విద్య) | క్లాస్ 4 తరగతులు |
ఛానెల్ 27 (పీఎం ఇ-విద్య) | క్లాస్ 5 తరగతులు |
ఛానెల్ 28 (పీఎం ఇ-విద్య) | క్లాస్ 6 తరగతులు |
ఛానెల్ 29 (పీఎం ఇ-విద్య) | క్లాస్ 7 తరగతులు |
ఛానెల్ 30 (పీఎం ఇ-విద్య) | క్లాస్ 8 తరగతులు |
ఛానెల్ 31 (పీఎం ఇ-విద్య) | క్లాస్ 9 తరగతులు |
ఛానెల్ 32 (పీఎం ఇ-విద్య) | క్లాస్ 10 తరగతులు |
ఛానెల్ 33 (పీఎం ఇ-విద్య) | క్లాస్ 12 తరగతులు |
ఛానెల్ 34 (పీఎం ఇ-విద్య) | క్లాస్ 13 తరగతులు |