జపాన్‌లో టెక్నికల్ ఇంటర్న్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పూర్తి వివరాలు
Skill development schemes

జపాన్‌లో టెక్నికల్ ఇంటర్న్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పూర్తి వివరాలు

టెక్నికల్ ఇంటర్న్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది 1993 లో జపాన్‌లో ప్రారంభమైనది. ఈ పథకం ఆన్-ది-జాబ్ ట్రైనింగ్ (OJT) ప్రోగ్రాం ద్వారా జపాన్ స్థానిక సాంకేతిక నైపుణ్యాలను ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు బదిలీ చేయడమే లక్ష్యంగా రూపొందించబడింది. ఈ పథకం పరిధిలో ఎంపికైన ఇంటర్న్‌లు జపాన్ లో శిక్షణ పొంది, తద్వారా పొందిన నైపుణ్యాలను తమ సొంత దేశాల అభివృద్ధి కోసం ఉపయోగించాల్సి ఉంటుంది.

Advertisement

నైపుణ్యాభివృద్ధిలో ద్వైపాక్షిక సహకారానికి సంబంధించి భారతదేశం మరియు జపాన్ మధ్య అక్టోబర్ 17, 2017 న ఎంఒసి సంతకం చేయబడింది. ఈ కార్యక్రమం కింద, భారతదేశం నుండి ఎంపికైన అభ్యర్థులు జపాన్‌లో మూడు నుండి ఐదు సంవత్సరాల ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది, ఆ తర్వాత వారు భారతదేశానికి తిరిగి వచ్చి జపాన్‌లో వారు పొందిన నైపుణ్యాలతో ఇండియా కోసం పనిచేయాల్సి ఉంటుంది. జనవరి 2018 నుండి ఈ కార్యక్రమాన్ని నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) పర్యవేక్షిస్తుంది.

టెక్నికల్ ఇంటర్న్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీ & వివరాలు

  • దరఖాస్తుదారుకి కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి.
  • దరఖాస్తుదారులు తన దేశానికి తిరిగి వచ్చిన తర్వాత జపాన్‌లో పొందిన సాంకేతికత, నైపుణ్యాలు లేదా జ్ఞానాన్ని వర్తింపజేస్తారని ఆశించాలి.
  • ఎంపికైన అభ్యర్థులకు జాపనీస్ భాషతో పాటుగా రోజువారీ దినచర్యను ఉపయోగపడే శిక్షణ అందిస్తారు.
  • శిక్షణ పొందిన వ్యక్తులు మూడు నుండి ఐదు సంవత్సరాల వ్యవధితో 'ఇంటర్న్‌షిప్' కోసం జపాన్‌కు పంపబడతారు.
  • టెక్నికల్ ఇంటర్న్‌షిప్ ప్రవేశం పొందిన మొదటి సంవత్సరంలో సాంకేతిక ఇంటర్న్ శిక్షణ కోసం విదేశీయులకు నివాస హోదా మంజూరు.
  • టెక్నికల్ ఇంటర్న్‌కి సగటున నెలకు ₹ 70,000 నుండి ₹ 90,000 వరకు అందిస్తారు.

నైపుణ్యం మరియు జ్ఞానం దేశ ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి. భారతదేశం గ్లోబల్ నాలెడ్జ్-బేస్డ్ ఎకానమీగా మారుతున్నందున, ఆధునిక ఉద్యోగాల కోసం నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని సమకూర్చుకోవడం ఇండియాకు అత్యవసరం. ప్రపంచంలోని అతి పిన్న వయస్కులలో భారతదేశం ఒకటి, దాని జనాభాలో 62% కంటే ఎక్కువ మంది పనిచేసే వయస్సులో ఉన్నారు.

ఇందులో 45% కంటే ఎక్కువ మంది 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. 2023 నాటికి భారతదేశంలో దాదాపు 59 మిలియన్ల మంది యువకులు (15-30 సంవత్సరాల వయస్సు) కార్మిక దళంలోకి ప్రవేశిస్తారని అంచనా.

దీనికి విరుద్దంగా ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్ జనాభా వృద్ధాప్య సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటోంది. జపాన్ జనాభాలో 20% కంటే ఎక్కువ మంది 65 ఏళ్లు పైబడినవారు ఉన్నారు, ఇది ప్రపంచంలోనే అత్యధిక నిష్పత్తి.

మెకిన్సే నివేదిక ప్రకారం, జపాన్ యొక్క పని-వయస్సు జనాభా 2012 లో 79 మిలియన్ల నుండి 2025 లో 71 మిలియన్లకు తగ్గుతుంది, మరియు అదే కాలంలో దాని డిపెండెన్సీ నిష్పత్తి 0.60 నుండి 0.73 వరకు పెరుగుతుంది. జపాన్‌లో సంతానోత్పత్తి రేటు తగ్గడం వల్ల ఈ శూన్యతను పూరించడానికి తగినంత మంది యువకులు లేరు. దేశం యొక్క వృద్ధాప్య సమస్య మరియు జనాభా తగ్గిపోతున్నందున, కార్మికుల కొరతను అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

Advertisement

Post Comment