ఇంటర్నేషనల్ వాలంటీర్ హెచ్‌క్యూ : విదేశాల్లో స్వచ్చంద సేవ
Career Guidance Volunteer Programs

ఇంటర్నేషనల్ వాలంటీర్ హెచ్‌క్యూ : విదేశాల్లో స్వచ్చంద సేవ

ఇంటర్నేషనల్ వాలంటీర్ హెచ్‌క్యూ లిమిటెడ్ ( IVHQ ) అనేది న్యూజిలాండ్ ఆధారిత వాలంటీర్ ట్రావెల్ కంపెనీ, దీనిని డేనియల్ జాన్ రాడ్‌క్లిఫ్ 2007 లో స్థాపించారు. ఈ సంస్థ సరసమైన స్వచ్ఛంద విదేశీ పర్యటనలను సులభతరం చేస్తుంది, ప్రయాణికులు ప్రపంచాన్ని అర్థవంతమైన రీతిలో అన్వేషించడానికి వీలు కల్పిస్తుంది.

Advertisement

ఇంటర్నేషనల్ వాలంటీర్ హెచ్‌క్యూ దీర్ఘకాలిక సుస్థిరతపై దృష్టి సారించే స్వచ్ఛంద ప్రాజెక్టులు నిర్వహిస్తుంది. ఇందులో పిల్లల సంరక్షణ, బోధన, వైద్యం, వన్యప్రాణి, పర్యావరణం, కంస్ట్రక్షన్, కళలు, క్రీడలు, ఎన్జీవో మద్దతు, శరణార్థుల మద్దతు, మహిళా సాధికారత, సముద్ర తాబేలు మరియు సముద్ర పరిరక్షణ, కమ్యూనిటీ డెవలప్‌మెంట్, వృద్ధుల సంరక్షణ మరియు ప్రత్యేక అవసరాల సంరక్షణ వంటి విస్తృత కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తుంది.

ఇంటర్నేషనల్ వాలంటీర్ హెచ్‌క్యూ ప్రస్తుతం 90 కంటే ఎక్కువ దేశాలలో 100,000 కంటే ఎక్కువ అంతర్జాతీయ వాలంటీర్లను కలిగి ఉంది. సామాజిక సేవ & ట్రావెలింగ్ అంశాలపై అభిరుచి వుండే వారికీ ఇంటర్నేషనల్ వాలంటీర్ ప్రోగ్రామ్స్ జీవితకాలం గుర్తుండిపోయే అనుభవాలని అందిస్తుంది. ఒక వైపు సామజిక సేవ చేసే అదృష్టంతో పాటుగా మరో వైపు ప్రపంచాన్ని సందర్శించే గొప్ప అవకాశం ఈ ప్రోగ్రాముల ద్వారా మీకు లభిస్తుంది.

ఇంటర్నేషనల్ వాలంటీర్ హెచ్‌క్యూ ప్రస్తుతం 300 కి పైగా ప్రాజెక్ట్‌లను ఆఫర్ చేస్తుంది. ఈ ప్రోగ్రాంలు కనిష్టంగా 1 వారం వ్యవధి నుండి గరిష్టంగా ఏడాది నిడివితో ఉంటాయి. ప్రోగ్రాం రుసుములు ప్రయాణించే దేశం ఆధారంగా వారానికి గరిష్టంగా 180 $ డాలర్ల నుండి ప్రారంభం అవుతాయి. ఈ రుసుములతో విమానాశ్రయం పికప్ నుండి వసతి, భోజనం వరకు అన్ని రకాల సేవలు కల్పిస్తారు. ప్రోగ్రాం పూర్తియ్యాక సర్టిఫికేట్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాలంటీర్ అందిస్తారు.

ఇంటర్నేషనల్ వాలంటీర్ హెచ్‌క్యూతో విదేశాలలో స్వచ్ఛంద సేవకులుగా పనిచేయడం వలన, మీ సాధారణ పర్యటన వైవిధ్య భరితమవుతుంది. ఈ ప్రయాణం మిమ్మల్ని స్థానిక సమాజలతో భాగస్వామ్యం చేస్తుంది, కొత్త సంస్కృతులను ప్రామాణికమైన రీతిలో అనుభవించే అవకాశం లభిస్తుంది.

ప్రపంచాన్ని కొత్తగా చూడటానికి ఇది ఉత్తమమైన మార్గం. మిమ్మల్ని మీరు కనెక్ట్ చేసుకోవడానికి, జీవితకాల స్నేహాలను పెంచుకోవడానికి మరియు మీ అంతర్గత సామర్థ్యాన్ని వెలికితీసేందుకు ఈ ప్రోగ్రాంలు ఎంతగానో ఉపయోగపడతాయి. మీ క్లిష్ట సమయంలో నిజమైన ప్రభావం చూపాలనుకుంటే ఈ అనుభూతిని తప్పక ఆస్వాదించాల్సిందే.

Advertisement

Post Comment