Advertisement
Latest Current affairs in Telugu : జనవరి 01, 2024 కరెంట్ అఫైర్స్
January Telugu Current Affairs

Latest Current affairs in Telugu : జనవరి 01, 2024 కరెంట్ అఫైర్స్

January 01, 2024 Current affairs in Telugu. పోటీ పరీక్షల రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో పొందండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షల కొరకు సిద్దమవుతున్న ఆశావహులకు ఉపయోగపడతాయి.

ప్రొఫెసర్ బిఆర్ కాంబోజ్‌కు ఎంఎస్ స్వామినాథన్ అవార్డు

చౌదరి చరణ్ సింగ్ హర్యానా అగ్రికల్చరల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బిఆర్ కాంబోజ్‌ను ఎంఎస్ స్వామినాథన్ అవార్డుతో సత్కరించబడ్డారు. వ్యవసాయ శాస్త్ర రంగ శాస్త్రవేత్తగా మరియు విస్తరణ నిపుణుడిగా ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందించబడింది.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని రాజమాత విజయరాజే సింధియా అగ్రికల్చరల్ యూనివర్శిటీలో 'ఒక ఆరోగ్యం ఒకే ప్రపంచం' అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో అవార్డు ప్రదానోత్సవం జరిగింది. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆయనకు ఈ అవార్డును అందజేశారు.

ప్రొఫెసర్ కాంబోజ్ జాతీయ మరియు అంతర్జాతీయ జర్నల్స్, పుస్తకాలు మరియు సాంకేతిక పత్రికలలో సహా సుమారు 300 పరిశోధన పత్రాలు మరియు వ్యాసాలను ప్రచురించారు. ఎంఎస్ స్వామినాథన్ అవార్డు అనేది ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త మరియు భారత హరిత విప్లవ పితామహుడు అయిన డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గౌరవార్థం అందించే అవార్డు. ఇది భారతదేశంలో ఆహార భద్రత మరియు వ్యవసాయ రంగంలో సేవలు అందించిన వ్యక్తులకు అందించబడుతుంది.

హిమాచల్ హట్టి కమ్యూనిటీకి ఎస్టీ హోదా మంజూరు

హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం జనవరి 2న సిర్మౌర్ జిల్లా ట్రాన్స్‌గిరి ప్రాంతంలోని హట్టి కమ్యూనిటీకి షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) హోదాను మంజూరు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిర్ణయం హాట్టే కమ్యూనిటీపై గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపుతుందని, వారి సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధికి అవకాశాలను తెరుస్తుందని భావిస్తున్నారు.

హట్టే కమ్యూనిటీ సిర్మౌర్ జిల్లాలోని ట్రాన్స్-గిరి ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరు చారిత్రాత్మకంగా ఆర్థిక మరియు సామాజిక ప్రతికూలతలను ఎఎదుర్కొంటున్నారు. షెడ్యూల్డ్ తెగలకు అందుబాటులో ఉన్న విద్య, ఉపాధి మరియు ఇతర ప్రయోజనాలకు పొందేందుకు చాలా సంవత్సరాలుగా ఎస్టీ హోదాను డిమాండ్ చేస్తున్నారు.

ఈ ప్రాంతంలోని 154 పంచాయతీలలో నివసిస్తున్న ఈ సంఘం సభ్యులు, రాజ్యాంగ (షెడ్యూల్డ్ తెగలు) ఆర్డర్ (రెండవ సవరణ) చట్టం, 2023ని అమలు చేయకపోవడం మరియు సంఘాన్ని ఎస్టీగా నోటిఫై చేయడంపై గత కొద్దీ కాలంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్నారు. రాజ్యాంగం (షెడ్యూల్డ్ ట్రైబ్స్) ఆర్డర్ (రెండవ సవరణ) బిల్లు, 2023ని పార్లమెంటు ఆమోదించిన తర్వాత, గత ఏడాది ఆగస్టు 4న రాష్ట్రపతి దీనిని నోటిఫై చేశారు.

డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అధ్యక్షుడుగా ఫెలిక్స్ షిసెకెడి తిరిగి ఎన్నిక

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ప్రెసిడెంట్ ఫెలిక్స్ షిసెకెడి 73% కంటే ఎక్కువ ఓట్లతో రెండవసారి తిరిగి ఎన్నికయ్యారు. ఫెలిక్స్ ఆంటోయిన్ షిసెకెడి షిలోంబో 24 జనవరి 2019 నుండి డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు.  కాంగోను జర్మనీ ఆఫ్ ఆఫ్రికాగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేస్తూ ఫెలిక్స్ షిసెకెడి నాడు అధికారంలోకి వచ్చారు. అయితే గడిసిన డిసెంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికల నిర్వహణ తీరుపై విపక్షాలు అసంతృప్తిని వ్యక్తపర్చాయి. ఓట్ల లెక్కింపులో అపారదర్శకత చోటు చేసుకున్నట్లు వీరు ఆరోపించారు.

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఆఫ్రికా ఖండంలో రెండవ అతిపెద్ద దేశం మరియు ప్రపంచంలో 11వ అతిపెద్ద దేశం. ఇది దాదాపు 112 మిలియన్ల జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అధికారిక ఫ్రాంకోఫోన్ (ప్రెంచ్ అధికారిక భాష) దేశం. ఇది తొమ్మిది దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది. వీటిలో అంగోలా, బురుండి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, కాంగో రిపబ్లిక్, రువాండా, దక్షిణ సూడాన్, టాంజానియా, ఉగాండా మరియు జాంబియాలు ఉన్నాయి.

  • దేశం : డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో
  • రాజధాని : కిన్షాసా
  • అధికారిక భాష : ఫ్రెంచ్
  • కరెన్సీ : కాంగో ఫ్రాంక్
  • అధ్యక్షుడు : ఫెలిక్స్ షిసెకెడి
  • ప్రధాన మంత్రి : సామ లుకొండే

బయటి వ్యక్తుల వ్యవసాయ భూముల కొనుగోలుపై ఉత్తరాఖండ్ నిషేధం

ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇటీవలే ఇతర రాష్ట్రాల ప్రజలు తమ వ్యవసాయ మరియు ఉద్యానవన భూములను కొనుగోలు చేయడాన్ని నిషేధించింది. కొత్త భూ చట్టాలు అందుబాటులో వచ్చే వరకు ఈ నిషేధం అమలులో ఉండనున్నట్లు పుష్కర్ సింగ్ ధామి ప్రభుత్వం ప్రకటించింది. దీని కోసం ఐదుగురు సభ్యుల కమిటీ కూడా ఏర్పాటు చేసింది. ఈ నిషేధం శాశ్వతమైనది కాదు, ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ కొత్త భూ చట్టాలపై తుది నివేదికను సమర్పించే వరకు అమలులో ఉంటుంది.

స్థానిక రైతుల ప్రయోజనాలను పరిరక్షించడం మరియు భూమిని వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించకుండా చూసుకోవడం ఈ నిర్ణయం యొక్క ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తుంది. వ్యవసాయ భూముల ధరలు పెరగడం మరియు స్థానిక వనరులపై నియంత్రణ కోల్పోవడం గురించి ఆందోళనలలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం స్థిరమైన భూ వినియోగ పద్ధతులను నిర్ధారించవలసిన అవసరాన్ని కూడా హైలైట్ చేస్తుంది.

భారత్, యూఏఈల మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ 'డెజర్ట్ సైక్లోన్'

రాజస్థాన్‌లో భారత్ - యూఏఈ సంయుక్త సైనిక వ్యాయామం 'డెజర్ట్ సైక్లోన్' జనవరి 2న ప్రారంభం అయ్యింది. ఇది డెజర్ట్ సైక్లోన్యొక్క మొదటి ఎడిషన్, దీనిని నిర్వహించడం ఇదే తొలిసారి. శాంతి నిర్వహణ కార్యకలాపాలపై ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని VII అధ్యాయం కింద ఎడారి/సెమీ ఎడారి భూభాగంలో ఫైటింగ్‌తో సహా ఉప-సంప్రదాయ కార్యకలాపాలలో పరస్పర చర్యను మెరుగుపరచడం వ్యాయామం యొక్క లక్ష్యం.

ఈ వ్యాయామం రాజస్థాన్‌లోని మహాజన్‌లో 2024 జనవరి 2 నుండి 15 వ తేదీ వరకు నిర్వహించబడుతోంది. యూఏఈ నుండి జాయెద్ ఫస్ట్ బ్రిగేడ్‌కు చెందిన దళాలు ఈ వ్యాయామానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇండియా నుండి ఆర్మీ కంటెంజెంట్‌కు చెందిన మెకనైజ్డ్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌కు చెందిన బెటాలియన్ బృందం ప్రాతినిధ్యం వహిస్తోంది.

భారత్ మరియు యుఎఇ మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఈ వ్యాయామం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. రెండు దేశాలు ఎడారి యుద్ధం మరియు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో అపారమైన అనుభవాన్ని కలిగి ఉన్నాయి. ఈ వ్యాయామం వారి మధ్య పరస్పర జ్ఞానం మరియు నైపుణ్యాన్ని మార్పిడి చేసుకోవడానికి అనుమతిస్తుంది.

బృందావన్‌లో మొట్టమొదటి ఆల్-గర్ల్స్ సైనిక్ స్కూల్‌

ఉత్తరప్రదేశ్‌లోని మధురలోని బృందావన్‌లో భారతదేశ మొట్టమొదటి సంవిద్ గురుకులం బాలికల సైనిక్ పాఠశాల అందుబాటులోకి వచ్చింది. జనవరి 1, 2024 న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు.

ఈ సైనిక పాఠశాల విద్యార్థినులకు సీబీఎస్‌ఈ కరిక్యులమ్‌తో పాటుగా సైనిక శిక్షణ కూడా అందిస్తుంది. ఈ సైనిక్ పాఠశాలలో మొత్తం 120 సీట్లు అందుబాటులో ఉంటాయి. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. రాజ్‌నాథ్ సింగ్, 2019లో దశలవారీగా సైనిక్ పాఠశాలల్లో బాలికల ప్రవేశానికి ఆమోదం తెలిపారు. మిజోరంలోని సైనిక్ స్కూల్ చింగ్‌చిప్‌లో రక్షణ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

భారతదేశపు మొట్టమొదటి బాలికల సైనిక్ స్కూల్‌ను ప్రారంభించడం అనేది దేశ రక్షణ రంగంలో లింగ సమానత్వం మరియు సమగ్రతను ప్రోత్సహించే దిశగా ఒక మైలురాయి. ఈ పాఠశాల ఔత్సాహిక యువతులకు ఇంజినీరింగ్ నుండి మెడిసిన్ విద్యతో పాటుగా సాయుధ దళాలలోని విభిన్న రంగాలలో రాణించడానికి అవసరమైన శిక్షణ మరియు విద్యను అందిస్తుంది.

సైనిక్ స్కూల్స్ అనేవి రక్షణ మంత్రిత్వ శాఖ క్రింద సైనిక్ స్కూల్స్ సొసైటీ ద్వారా స్థాపించబడతాయి. 1961లో అప్పటి భారత రక్షణ మంత్రి వీకే కృష్ణ మీనన్ భారత మిలిటరీ అధికారి కేడర్‌లో ప్రాంతీయ మరియు వర్గ అసమతుల్యతను సరిచేయడానికి వీటిని స్థాపించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు ఇండియన్ నేవల్ అకాడమీలో ప్రవేశానికి విద్యార్థులను విద్యాపరంగా, మానసికంగా మరియు శారీరకంగా సిద్ధం చేయడం సైనిక్ స్కూల్స్ యొక్క ప్రాథమిక లక్ష్యం.

రక్షణ మంత్రిత్వ శాఖ సైనిక పాఠశాలలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో జాయింట్ వెంచర్‌గా నడుపుతుంది. వీటికి అవసరమయ్యే వార్షిక నిధులను రక్షణ మంత్రిత్వ శాఖనే అందిస్తుంది. సైనిక్ పాఠశాలల యందు సీబీఎస్సీ పాఠ్యాంశాలను బోధిస్తారు. ఏటా ప్రవేశ పరీక్ష ద్వారా VI మరియు క్లాస్ IXలో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రస్తుతం దేశంలో దాదాపు 33 సైనిక్ పాఠశాలలు అందుబాటులో ఉన్నాయి.

Post Comment