ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ 2014లో స్థాపించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన అనంతరం ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంను విభజించి దీన్ని తెలంగాణాలో ఏర్పాటు చేసారు. వ్యవసాయ అభివృద్ధిలో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాముఖ్యత గ్రహించిన ఆనాటి పెద్దలు దానికి అనుగుణంగా దేశంలో వ్యవసాయ విద్యను మెరుగు పర్చేందుకు, స్థిరమైన వ్యవసాయ పరిశోధన స్థావరాలు స్థాపించేందుకు, గ్రామీణ జీవితాల సమగ్ర అభివృద్ధికి గ్రామీణ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సమగ్రమైన పరిస్కారం చుపిస్తాయనే ఉద్దేశ్యంతో వీటిని నెలకొల్పారు. ఈ యూనివర్సిటీ ప్రస్తుతం అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులతో పాటుగా యూజీ, పీజీ, పీహెచ్డీ స్థాయిలో విభిన్న వ్యవసాయ కోర్సులు అందిస్తుంది. ప్రవేశాలు ఎంసెట్ మరియు వివిధ అగ్రిసెట్ ల అర్హుత ఆధారంగా కల్పిస్తుంది.