Advertisement
భారతదేశ చరిత్రలో ముఖ్యమైన సంఘటనలు మరియు తేదీలు
Study Material

భారతదేశ చరిత్రలో ముఖ్యమైన సంఘటనలు మరియు తేదీలు

భారతదేశ చరిత్రను మూడు భాగాలుగా మనం అధ్యయనం చేయోచ్చు. అవి ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్య యుగ భారతదేశ చరిత్ర మరియు ఆధునిక భారతదేశ చరిత్ర.. ఈ మూడింటికి సంబంధించి అన్ని ముఖ్య చారిత్రాత్మక సంఘనాలను ఇక్కడ పొందుపర్చాము. చరిత్ర అంటే ఆసక్తి ఉన్నవారికి మరియు పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న వారికి ఇది తప్పక సహాయ పడుతుంది.

ప్రాచీన & మధ్యయుగ భారతదేశ చరిత్ర

ప్రాచీన భారతదేశ చరిత్ర క్ర్తిస్తూపూర్వం 20 లక్షల సంవత్సరాల నాట ప్రారంభమైంది. ఆ కాలంలో జీవించిన మానవులను ప్రోటో హ్యూమన్స్ గా బహువిస్తున్నారు.5,00,000 BC  భారతదేశంలో మొట్టమొదటిసారిగా శివాలిక్ (నేపాల్) ప్రాంతంలో మానవ జీవనం ప్రారంభమైనట్లు భావిస్తున్నారు.

70,000 బీసీ లో ఆదిమానవుల మనుగడ ప్రారంభమైనట్లు తెలుస్తుంది. కానీ మొదటి ప్రాచీన భారతీయులుగా నాగాస్ (అస్సాం), భిల్స్, సంతల్స్ (అండమాన్), గోండ్స్, తోడాస్ గిరిజన తెగలు జీవనం సాగించినట్లు భావిస్తున్నారు. ఆ తర్వాత ద్రావిడలు మరియు ఆర్యులు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు.

వీరు ఉపయోగించిన రాళ్ళూ మరియు లోహ పనిముట్లను ఆధారంగా చేసుకుని ప్రాచీన భారతదేశ చరిత్రను 5 భాగాలుగా విభజించవచ్చు. అవి పాలియోలిథిక్ కాలం, మెసోలిథిక్ కాలం, నియోలిథిక్ కాలం, చాల్‌కోలిథిక్ కాలం మరియు ఐరన్ ఏజ్.

తేదీ / ఏడాది చారిత్రాత్మక సంఘటనలు
2 million BC – 10,000 BC పాలియోలిథిక్ కాలం (ప్రాచీన శిలాయుగం) : ఈ యుగంలో మొదట నిప్పు కనుగున్నారు. లైమ్ స్టోన్ ఆధారిత పనిముట్లు ఉపయోగించారు. ఆస్ట్రిచ్ గుడ్లను ఆహారంగా తీసుకున్నారు. వీటికి సంబంధించిన ఆనవాళ్లు ప్రధానంగా భీంబెట్కా (M.P), హన్స్గి, కర్నూల్ గుహలు, నర్మదా లోయ (హత్నోరా, M.P), కలడ్గి బేసిన్ లలో లభించాయి.
10,000 BC – 8,000 BC మెసోలిథిక్ కాలం (సూక్ష్మ శిలాయుగం) : ఈ యుగంలో ఊహించని వాతావరణ మార్పులు చోటు చేసుకున్నాయి. చిన్న చిన్న రాళ్లను ఆయుధాలుగా ఉపయోగించారు. పెంపుడు జంతువుల పెంపకం మరియు మానవ అవసరాల కోసం వాటిని ఉపయోగించడం జరిగింది. వీటికి సంబంధించిన ఆనవాళ్లు ప్రధానంగా బ్రహ్మగిరి (మైసూర్), నర్మదా, వింధ్య మరియు గుజరాత్ లలో లభించాయి.
8000 BC – 4,000 BC నియోలిథిక్ కాలం (నూతన శిలాయుగం) : వ్యవసాయం ప్రారంభమైంది. చక్రం (వీల్) కనుగున్నారు. పదునైన రాతి ఆయుధాలను ఉపయోగించారు. గ్రామీణ జీవనం ప్రారంభమైంది. ఈ కాలానికి సంబంధించిన ప్రాచీన ఇనామ్‌గావ్ అనే తొలి గ్రామాన్ని మహారాష్ట్ర భీమ్ లోయలో కనుగున్నారు.

వీటికి సంబంధించిన ఆనవాళ్లు ప్రధానంగా బుర్జాహోమ్ (కాశ్మీర్), గుఫ్క్రాల్ (కాశ్మీర్), మెహర్ఘర్ (పాకిస్తాన్), చిరాండ్ (బీహార్), దౌజలి హాడింగ్ (త్రిపుర / అస్సాం), కోల్డిహ్వా (యుపి), మహాగర (యుపి), హల్లూర్ (ఎపి), పైయంపల్లి (ఎపి), మాస్కి, కోడెకల్, సంగనా కల్లెర్, ఉట్నూర్, తక్కల కోటలలో లభించాయి.

4000 BC – 1,500 BC చాల్‌కోలిథిక్ కాలం (రాగి రాతియుగం) : ఈ యుగంలో మానవుడు రాగిని ఉపయోగించినట్లు తెలుస్తుంది. పూర్తిస్థాయి వ్యవసాయం, స్థిరమైన గ్రామీణ జీవనానికి అలవాటుపడ్డారు. ఆభరణాలు, నూలు వస్త్రాలు ధరించిన ఆనవాళ్లున్నాయి.

సింధు లోయ (హరప్ప) నాగరికత (2,500 బీసీ - 1,500 బీసీ) ఈ కాలంలోనే ప్రారంభమైనది. ఇది బ్రహ్మగిరి, సింధు, నవదా తోలి (నర్మదా ప్రాంతం), మహిషాదల్ (డబ్ల్యూ. బెంగాల్), చిరాండ్ (గంగా ప్రాంతం) ప్రాంతాలలో ఆనవాళ్లు లభించాయి.

1500 BC – BC 200 ఐరన్ ఏజ్ (ఇనుప యుగం) : ఇనుముతో ఆయుధాలు తయారు చేశారు. పూర్తిస్థాయి నాగరిక జీవనానికి అలవాటు పడ్డారు. ద్రావిడలు మరియు ఆర్యులు ఈ కాలంలో మనుగడ సాగించినట్లు చరిత్ర ఆనవాళ్లు చెబుతున్నాయి.
2500 BC – BC 1500 సింధు లోయ నాగరికత ( హరప్ప & మొహెంజొదారో )
2000 BC – BC 1500 మధ్య ఆసియా ప్రాంతాల నుండి ఆర్యులు ప్రవేశం
1500 BC – BC 1000 తొలి వేదకాలం (రుగ్వేదం)
1000 BC – BC 500 తరువాత వేద కాలం - సామవేదం, యజుర్వేదం మరియు అధర్వవేదం. బ్రాహ్మణులు, ఆరణ్యకులు, సంహితులు ఈ కాలంలో తొలి ఉపనిషత్తులు మరియు వేద మంత్రాలు రచించారు.
540 BC – BC 468 జైన మతం ఆవిర్భావం : వర్ధమాన మహావీర జననం - వైశాలి సమీపంలోని కుంద గ్రామంలో జన్మించాడు మరియు పావపురి (పాట్నా, బీహార్) లో నిర్యాణం జరిగింది.
563 BC – BC 483 బౌద్ధ మతం ఆవిర్భవం : లుంబినీ (నేపాల్) లో గౌతమ బుద్ధుని జననం. బుద్ధ గయ (బీహార్) లో జ్ఞాన సముపార్జన. వారణాసి సారనాధ్ వద్ద మొదటి ధర్మబోధ. ఉత్తర ప్రదేశ్ గోరఖ్ పూర్ వద్ద గల కుశీనగరం లో మహాపరి నిర్యాణం.
422 BC – BC 324 మగధలో నంద వంశం
326 BC – BC 325 మాసిడోనియాకు చెందిన అలెగ్జాండర్ దండయాత్ర
322 BC – BC 298 మౌర్య వంశ స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడు
305 BC – BC 303 సెల్ల్యుకన్ రాయబారి మెగస్తనీస్ భారతదేశ సందర్శనం. ఇండికా గ్రంధం రచన
273 BC – BC 232 అశోకుడు పరిపాలన (కళింగ యుద్ధం 262 బీసీ - 261 బీసీ)
273 BC – BC 232 అశోకుని వారసులు - చిట్టచివరి మౌర్యరాజు బృహద్రధుడు. మౌర్య సేనాపతి పుష్యమిత్ర శుంగుని చేతిలో వధ.
58 BC విక్రమసంవత్ యుగం ప్రారంభం. ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుడు ప్రారంభించాడు.
78 CE (క్రీ.శ) కనిష్కుడు శక సంవత్సరాన్ని ప్రారంభించాడు.
78 CE - 101 CE భారతదేశంలో కుషాణుల్లో కెల్లా అత్యంత పరాక్రమశాలి కనిష్కుడు కాశ్మీర్ లో నాల్గువ బౌద్ధ మండలి సమావేశం జరిపాడు. బౌద్ధమతం - మహాయానం , హీనయానంగా విడిపోయింది.
320 CE - 540 CE గుప్తుల వంశం ప్రారంభం
320 CE - 335 CE ఒకటో చంద్రగుప్తుడుచే గుప్తా వంశము స్థాపన & పాలనా
335 CE - 380 CE సముద్రగుప్తుడు పాలనా (ఇండియన్ నెపోలియన్)
380 CE - 412 CE రెండో చంద్రగుప్తుడు (విక్రమాదిత్యుడు). చైనా యాత్రికుడు షాహియాన్ భారతదేశ పర్యటన (399 CE - 414 CE)
606 CE - 647 CE కనౌజ్ రాజు హర్షవర్ధనుడు హ్యూయన్ త్షాంగ్  భారతదేశ పర్యటన (629 CE - 645 CE)
50 BC - 250 CE దక్షిణాపథంలో శాతవాహన వంశం. 80 CE - 104 CE శాతవాహన రాజుల్లో అత్యంత గొప్పవాడైన గౌతమాపుత్ర శాతకర్ణి పరిపాలన కాలం. 170 CE - 199 CE శ్రీ యజ్ఞశ్రీ శాతకర్ణి
క్రీ.శ మొదటి శతాబ్దం నుండి 3 శతాబ్దం వరకు తమిళ రాజ్యంలో సంగం యుగం
543 CE - 753 CE బాదామి చాళుక్యులు
543 CE - 567 CE ఒకటవ పులకేశి. ఇతనే చాళుక్య వంశస్థాపకుడు
610 CE - 642 CE రెండవ పులకేశి. చాళుక్య రాజులలో పరాక్రమశాలి
575 CE - 897 CE కాంచీ పల్లవులు( కంజీవరం) 630-668 ఒకటో నరసింహవర్మ. పల్లవ రోజుల్లో గప్పవాడు. మహాబలిపురం పట్టణ నిర్మాత
624 CE - 1076 CE వేంగీ చాళుక్యులు లేదా తూర్పుదేశ చాళుక్యులు
753 CE - 973 CE మన్యఖేట రాష్ట్రకూటులు
850 CE - 1267 CE తంజావూరు చోళులు రాజరాజ డి గ్రేట్ (1014 - 1044)
711 CE - 712 CE అరబ్బులచే సింధూ రాష్ట్ర ఆక్రమణ
950 CE - 1203 CE బుందేల్ ఖండ్ లో చందేలులా కాలం
956 CE - 1192 CE శాకంభరి చాహమాన్లు (అజ్మీర్, రాజస్థాన్ ) లేదా చౌహానులు
1000 CE - 1027 CE గజని మహమ్మద్ 16-17 సార్లు ఉత్తర భారతదేశంపై దాడి . 1026 సోమనాధ్ దేవాలయం పై దాడి.
1175 CE - 1195 CE మహమ్మద్ ఘోరీచే ఉత్తర భారతదేశంపై దాడి. 1191 మొదటి తరైన్ యుద్ధం. పృథ్విరాజ్ చౌహన్ చేతిలో మహమ్మద్ ఘోరీ ఓటమి. రెండవ తరైన్ యుద్ధం. మహమ్మద్ ఘోరీ చేతిలో పృథ్విరాజ్ చౌహన్ ఓటమి & మరణం.
1206 CE - 1526 CE ఢీల్లి సుల్తానులు
1206 CE - 1290 CE ఏ. ఐబక్ వంశం : కుతుబుద్దీన్ ఐబక్ నేతృత్యంలో ఢీల్లీలో సుల్తానుల సామ్రాజ్య స్థాపన.
1290 CE - 1320 CE బి. ఖిల్జీలు ; 1290 - 1296 ఖిల్జీ వంశస్థాపకుడు. సుల్తాన్ జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ.
1296 CE - 13216 CE సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ. 1299 లో గుజరాత్ స్వాధీనం. 1309-13 లో మాలిక్ కపూర్ నేతృత్వంలో దక్షిణ భారతదేశ దండయాత్ర. అనేక సంస్కరణలు. 1302 లో కొత్త రాజధాని సిరి (ఢీల్లి) నిర్మాణం.
1320 CE - 1414 CE సి. తుగ్లక్ లు : 1320 - 1325 తుగ్లక్ వంశస్థాపకుడు షియాసుద్దీన్ తుగ్లక్ (ఘాజీ మాలిక్) రెండో సారి దండయాత్ర. కాకతీయ, పాండ్య రాజ్యాలు ఢీల్లీ సుల్తానుల వశం.
1325 CE - 1351 CE మహమ్మద్ బీన్ తుగ్లక్ 1324 రాజధాని ఢీల్లీని దౌలతాబాద్ కు మార్చారు. 1329 నుండి టోకెన్స్ కరెన్సీ నాణేల ముద్రణ జారీ. 1398 లో నసీరుద్దీన్ మహమ్మద్ హయాంలో తైమూర్ దండయాత్ర జరిగి. ఢీల్లీ సర్వ నాశనం అయ్యింది.
1414 CE - 1451 CE డి. సయ్యద్ వంశ పాలనా :  ఖిజీర్జాన్ (1414-21), ముబారక్ ఖాన్ (1421-34), మహమ్మద్ షా (1434-45) ; అల్లావుద్దీన్ ఆలమ్ షా (1445-51)
1158 CE - 1328 CE కాకతీయుల పాలనా, గణపతి దేవుడు రాజధాని హన్మకొండ నుండి వరంగల్ కు మార్చడు. కుమార్తె రుద్రాంబ (1261-1290) చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. చిట్టచివరి కాకతీయ పాలకుడు ప్రతాపరుద్రుడు (1290-1323),  కాకతీయాల రాజ్యం ఢిల్లీ సుల్తానుల వశం (1323)
1216 CE - 1323 CE మధురై పాండ్య రాజ్యం. ఢిల్లీ సుల్తానుల వశం (1323) (1322-23)
1336 CE - 1649 CE విజయనగర సామ్రాజ్యం. హరిహర, బుక్క రాయులు ఈ సామ్రాజ్య సృష్టికర్తలు. విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణ దేవరాయలు గొప్ప రాజు (1509-1529). 1565 లో రాక్షస తంగిడి యుద్ధం. విజయనగర సామ్రాజ్యం ఓటమి. రామరాయుల మృతి. విజయనగర ప్రభుత్వం పెనుగొండకు బదిలీ.
1495 CE - 1510 CE పోర్చుగీస్ పాలనా ప్రారంభం. 1498 లో కాలికట్ కు వాస్కోడిగామా రాక, 1510 లో బీజాపూర్ నుండి గోవా స్వాధీనం. 1511లో మలక్కా స్వాధీనం.
1526 CE - 1707 CE మొగలు సామ్రాజ్యం. 1519-1526 మధ్య హిందూస్తాన్ పై బాబర్ 7 సార్లు దండయాత్ర. 1526 లో మొదటి పానిపట్టు యుద్ధం. ఈ యుద్ధంలో ఇబ్రహీం లోడీని బాబర్ ఓడించాడు. ఈ యుద్ధంలో ఇబ్రహీం లోడి మరణించాడు. భారత ఉపఖండంలో మొగల్ సామ్రాజ్యం స్థాపన. 1527 లో కాణ్వా యుద్ధం. 1530లో ఆగ్రాలో బాబర్ మృతి.
1530 CE - 1556 CE హుమాయూన్ పాలనా. 1533 లో దిన్'పనా పేరుతో ఢిల్లీలో కొత్త నగరం నిర్మాణం. 1540లో బిలీగ్రామ్ యుద్ధం. ఈ యుద్ధంలో హుమాయూన్ ఓటమి. 1540-54 మధ్య అజ్ఞాతం. 1555 లో మల్లి ఢిల్లీ స్వాధీనం. 1556 లో ఢిల్లీలోనే మృతి.
1556 CE - 1605 CE అక్బర్ పాలనా : 1556 లో రెండవ పానిపట్టు యుద్ధం. 1576 లో హల్దీఘాట్ యుద్ధం. మహారాణా ప్రతాప్ ఓటమి.
1605 CE - 1627 CE జహింగిర్ పాలనా : 1611 లో మొదటి సారిగా మచిలీపట్నంలో ఆంగ్లేయుల విడిది. 1627 లో లాహోరులో జహింగిర్ మృతి.
1627 CE - 1658 CE షాజహాన్ పాలనా : పోర్చుగీస్ పై దాడి. 1632లో హుగ్లీలో పోర్చుగీస్ స్థావరం ద్వాంసం. 1636లో బీజాపూర్, గోల్కొండలపై మొదటి ఒడంబడిక. 1636 లో దక్కన్ వైస్రాయ్ గా ఔరంగజేబు నియామకం. 1658 జూన్ 18 న ఔరంగజేబు చేతిని షాజహాన్ బందీ. 1666 ఆగ్రాలో షాజహాన్ మృతి.
1658 CE - 1707 CE ఔరంగజేబు పాలనా : 1658 జులై 31 న ఢిల్లీలో పట్టాభిషేకం. 1665లో శివాజితో పురంధర్ ఒడంబడిక. 1689 లో శివాజీ కుమారు శంభోజిని పట్టుకుని చంపేశాడు. 1707 లో అహ్మద్ నగర్ లో మృతి చెందాడు.
1626 CE - 1761 CE మరాఠాలు : శివాజీ 1630 ఫిబ్రవరి 19న జననం. 1648 లో స్వతంత్ర పాలనా ప్రారంభం. 1674 లో స్వరాజ్య స్థాపన. 1680 లో మృతి.
1713 CE - 1719 CE బహుదర్ షా మనవడు మహమ్మద్ ఫరూఖ్ సియార్ పట్టాభిషేకం. 1716లో సిక్కు నాయకుడు బహుదూర్ బంధీ & మరణ శిక్షా. ఈస్టిండియా కంపెనీకి కలకత్తా చుట్టుపక్కల 37 గ్రామాల్లో వ్యాపారానికి ఫరూఖ్ సియార్ హక్కుల దారాదత్తం.
1754 CE - 1759 CE రెండో అలంగీర్ : 1757 & 1759 లలో అహ్మద్ షా అబ్దాలీ ఢిల్లీపై దాడిచేసి బీభత్సం సృష్టించాడు. అలంగీరుని అతని వజీరు దారుణంగా వధించాడు.
1759 CE - 1806 CE 1761 లో అహ్మద్ షా అబ్దాలీ 3వ పానిపట్టు యుద్ధంలో మరాఠాలను ఓడించాడు. 1764 బక్సార్ యుద్ధంలో బ్రిటిష్ దళాల చేతిలో షా ఆలం నవాబ్ షుజావూద్దౌలా, నవాబ్ మీరు ఖాసీమ్ దళాలు కలసికట్టుగా తుడిచిపెట్టుకు పోయాయి.  క్లైవ్ చేతికి బెంగాల్, బీహార్, ఒడిశా దివానీ హక్కులను మంజూరు చేసాడు. 1803లో షా ఆలమ్ బ్రిటిష్ వారి శరణు కోరాడు.

ఆధునిక భారతదేశ చరిత్ర

తేదీ / ఏడాది చారిత్రాత్మిక సంఘటన
1772 - 1785 బెంగాల్ గవర్నర్ గా వారెన్ హేస్టింగ్స్ నియామకం. మొదటి గవర్నర్ జనరల్ గా 1773-1785 పరిపాలన. 1775 లో నందకుమార్ జ్యూడిషియల్ మర్డర్. 1775-1782 మధ్య కాలంలో మొదటి ఆంగ్లో-మరాఠా యుధం. 1780-84 మధ్య కాలంలో ఆంగ్లో-మైసూర్ రెండవ యుద్ధం.
1786 - 1793 గవర్నర్ జనరల్ గా లార్డ్ కారన్'వాలీస్ నియామకం. 1790 లో టిప్పు సుల్తానుకు వ్యతిరేకంగా మరాఠాలతోను, నైజాంతోను కూటమి కట్టాడు. 1790-92 మధ్య కాలంలో ఆంగ్లో-మైసూర్ మూడవ యుద్ధం. ఇది ఆంగ్లేయులకు, టిప్పు సుల్తాన్ కు మధ్య జరిగింది. 1792 లో శ్రీరంగపట్నం సంధి. 1793 లో బెంగాల్లో శాశ్వత స్థావరం. 1793 లో కొలకత్తా నుండి జమీందార్ వ్యవస్థకు శ్రీకారం. జిల్లా, సిటీ, ప్రొవిన్షియల్ కోర్టులు ఏర్పాటు. సాధర్, నిజామత్, అదాలత్ స్థాపన.
1793 - 1798 గవర్నర్ జనరల్ గా సర్ జాన్ షోర్. 1795లో బెంగాలీలోని ఐరోపా అధికారులచే బెంగాల్ తిరుగుబాటు.
1798 - 1805 గవర్నర్ జనరల్ గా లార్డ్ వెల్లస్లీ. 1799 లో ఆంగ్లో-మైసూర్ నాలుగవ యుద్ధం. టిప్పు సుల్తాన్ ఓటమి & మరణం. 1803-05 మధ్యకాలంలో ఆంగ్లో-మరాఠా రెండో యుద్ధం. మరాఠా దళం ఓటమి.
1805 - 1807 గవర్నర్ జనరల్ గా లార్డ్ కారన్'వాలీస్(1805 లో జులై ) రెండోదపా నియామకం. 1805 ఆక్టోబరులో ఘాజీపూర్లో మృతి. గవర్నర్ జనరల్ గా జార్జిబార్లో నియామకం. 1807 లో వెల్లూరులో ఇంగ్లీష్ సిపాయిల తిరుగుబాటు.
1807 - 1813 గవర్నర్ జనరల్ గా లార్డ్ మింటో నియామకం. రంజిత్ సింగ్ మెట్కాఫే మధ్య అమృత్సర్ ఒడంబడిక.
18133 - 1823 గవర్నర్ జనరల్ గా లార్డ్ హేస్టింగ్స్ నియామకం. 1813-16 మధ్య ఆంగ్లో-నేపాల్ యుద్ధం. గుర్ఖా నాయకుడు అమర్ సింగ్ ఓటమి. "సంగిల్' ఒడంబడిక పై సంతకం. 1821లో పూనా కాలేజీ, 1822 లో బొంబాయి లో నేటివ్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రారంభం.
1823 - 1828 గవర్నర్ జనరల్ గా లార్డ్ ఆమ్ హేరిస్ట్ నియామకం. 1824-26 మధ్య కాలంలో మొదటి ఆంగ్లో-బర్మా యుద్ధం.
1828 - 1835 గవర్నర్ జనరల్ గా లార్డ్ విలియం బేంటిక్ నియామకం. 1828 లో రాజా రాంమోహన్ రాయ్ బ్రహ్మ సమాజ స్థాపన. 1829 లో సతిసహగమన దురాచారం నిషేధం. 1833 లో పాలనా రంగంలో సహజ మార్పులతో చార్టడ్ చట్టం. 1833 లో రాజా రాంమోహన్ రాయ్ మరణం.
1835 - 1836 తాత్కాలిక గవర్నర్ జనరల్ గా చార్లెస్ మెట్'కాఫే నియామకం. 1835 లో కలకత్తా మెడికల్ కాలేజీ ప్రారంభం. పత్రిక ఆంక్షలు సడలింపు.
1836 - 1842 గవర్నర్ జనరల్ గా లార్డ్ ఆక్లాండ్ నియామకం. 1837-40 మధ్యకాలంలో మొదటి ఆఫ్ఘన్ యుద్ధం. 1838 లో బొంబై టైమ్స్, ఆతర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురణ. 1889 లో మహారాజా రంజిత్ సింగ్ మరణం.
1842 - 1844 గవర్నర్ జనరల్ గా  లార్డ్ ఎల్లెన్'బరో నియామకం. 1842 లో ఆఫ్ఘన్ యుద్ధం ముగింపు. 1843 లో బానిసత్వ చట్టం విరుద్ధమని ప్రకటన. బ్రిటిష్ ఇండియాలో నిషేధం.
1844 - 1848 గవర్నర్ జనరల్ గా లార్డ్ హార్డింజ్ నియామకం. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆంగ్లభాష తెలిసి ఉండటం తప్పనిసరి చేసారు. 1845 లో ఆంగ్లో-సిక్కు మొదటి యుద్ధం. 1847 రూర్కీలో ఇంజనీరింగ్ యూనివర్సిటీ స్థాపన.
1848 - 1856 గవర్నర్ జనరల్ గా లార్డ్ డల్హౌషి నియామకం. రాజ్య సంక్రమణ సిద్ధాంతం రద్దు. బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణకు కృషి.  1848-49 మధ్య రెండో ఆంగ్లో-సిక్కు యుద్ధం. 1852 లో రెండో ఆంగ్లో-బర్మా యుద్ధం. 1853 లో బొంబాయి- థానే మధ్య మొడటి భారతీయ రైలు ప్రారంభం. 1854 లో పోస్ట్ ఆఫీస్ చట్టం ఆమోదం. యూనివర్సల్ పోస్టల్ రేట్లలో మొదటి తపాలా బిళ్ళలు విడుదల. విద్య వ్యవస్థలో నూతన మార్పుల కోసం చార్లెస్ వుడ్స్ విద్యా కమిటీ సిపార్సు. 1855 లో కలకత్తా-ఆగ్రా మధ్య మొదటి టెలిగ్రాఫ్ లైన్ పూర్తి.
1856 - 1858 గవర్నర్ జనరల్ గా లార్డ్ కానింగ్ నియామకం. హిందూ వితంతు పునర్వివాహ చట్టం ఆమోదం. 1857-58 లలో బరంపురంలో పదాతిదళం తిరుగుబాటు. సిపాయిల తిరుగుబాటు, మీరట్, ఘాన్సీ, అలహాబాద్, లక్నో లో తిరుగుబాటు. 1858 లో అధికారాన్ని ఈస్టిండియా కంపెనీ నుండి ఆంగ్ల సార్వభౌమత్వానికి బదలాయిస్తూ అలహాబాద్ దర్బారులో విక్టోరియా రాణి ప్రకటన.
1858 - 1862 మొదటి వైస్రాయ్, గవర్నర్ జనరల్గా లార్డ్ కానింగ్ నియమాకం. మొదటిసారిగా ఆదాయ పన్ను విధింపు.  కాగితపు కరెన్సీ విడుదల. 1860 లో దీనబందు మిత్రాచే నీల్ దర్పణ్ నాటకం ముద్రణ. 1861 లో ఇండియన్ కౌన్సిల్ చట్టం జారీ.
1862 - 1863 వైస్రాయ్, గవర్నర్ జనరల్ గా లార్డ్ ఎల్జిన్ నియామకం. 1863 లో వాయువ్య ప్రాంతంలో వాహబ్ లపై సైనిక చర్య. ధర్మశాల వద్ద ఎల్జిన్ మృతి.
1864 - 1869 వైస్రాయ్, గవర్నర్ జనరల్ గా  సర్ జాన్ లారెన్స్ నియామకం. 1866 - 68 లో దేశంలో అత్యధిక ప్రాంతంలో కరువు. ఒరిస్సా, మద్రాస్ ప్రెసిడెన్సీ, బుందేల్ ఖండ్, రాజపురాణా లలో తీవ్ర క్షామం.
1869 - 1872 వైస్రాయ్, గవర్నర్ జనరల్ గా లార్డ్ మేయో నియామకం. 1869 లో ఐసీఎస్ కు సురేంద్రనాధ్ బెనర్జీ అర్హుడుగా ప్రకటన. 1870 ఆర్థిక వ్యవస్థలో మార్పులు. ప్రాంతీయ ప్రభుత్వాలకు విద్య, ప్రింటింగ్, రోడ్లు, పబ్లిక్ వర్క్స్ తదితర రంగాల్లో నిర్ణిత వార్షిక కేటాయింపులకు నిర్ణయం.
1872 - 1876 వైస్రాయ్, గవర్నర్ జనరల్ గా లార్డ్ నార్త్ బ్రూక్ నియామకం. 1875 లో మేడమ్ బ్లావట్స్'స్కీ నేతృత్వంలో థియోసాఫికల్ సొసైటీ (దివ్య జ్ఞాన సమాజం) స్థాపన. 1875 లో బొంబాయిలో దయానంద సరస్వతి సారథ్యంలో ఆర్యసమాజ స్థాపన.
1876 - 1880 వైస్రాయ్, గవర్నర్ జనరల్ గా లార్డ్ లిట్టన్ నియామకం. 1876 లో ఐసీఎస్ పరీక్షలకు వయోపరిమితి తగ్గింపు. 1877 లో భారతదేశపు మహారాణిగా విక్టోరియా రాణిని ప్రకటిస్తూ ఢిల్లీ దర్బారు నిర్వహణ. 1878 లో ప్రాంతీయ బాష పత్రికల చట్టం.  1879 లో ఇంగ్లాండ్ నుండి దిగుమతి అయ్యే నూలు వస్త్రాలపై దిగుమతి సుంకాల రద్దు.
1880 - 1884 వైస్రాయ్, గవర్నర్ జనరల్ గా లార్డ్ రిప్పన్ నియామకం. 1881 లో మొదటి ఫ్యాక్టరీ చట్టం అమలు. 1882 లో ప్రాంతీయ బాష పత్రికల చట్టం రద్దు. 1883 లో దయానంద సరస్వతి మృతి. కలకత్తాలో మొదటి నేషనల్ కాన్ఫిరెన్స్ సదస్సు.
1884 - 1888 వైస్రాయ్, గవర్నర్ జనరల్ గా ఎర్ల్ ఆఫ్ డఫ్రీన్ నియామకం. 1884 లో హంటర్ ఎడ్యుకేషన్ కమిషన్ సిపార్సులకు ప్రభుత్వం ఆమోదం. 1885 లో ఆంగ్లో-బర్మా మూడవ యుద్ధం. బర్మా రాజు థీలా లొంగుబాటు. బొంబాయిలో మొడటి భారత జాతీయ కాంగ్రెస్ సదస్సు. 1886 లో బ్రిటిష్ ఇండియాలో బర్మా కూడా భాగమని ప్రకటన.
1888 - 1894 వైస్రాయ్, గవర్నర్ జనరల్ గా లార్డ్ లాన్సడౌన్ నియామకం. మహిళలు, బాలల రక్షణ కోసం ఫ్యాక్టరీ బిల్ ఆమోదం. వివాహ వయస్సు నిర్ణాయక బిల్ ఆమోదం. 1892లో ఇండియన్ కౌన్సిల్ చట్టం అమలు. 1893 లో చికాగో లో సర్వమతల సదస్సుకు స్వామి వివేకానంద హాజరు.
1894 - 1899 వైస్రాయ్, గవర్నర్ జనరల్ గా విక్టర్ అలెగ్జాండర్ బ్రూస్-ది ఎర్ల్ ఆఫ్ ఎల్జిన్ నియామకం. 1897 లో వాయువ్య ప్రాంతంలో గిరిజనుల తిరుగుబాటు. బొంబాయిలో ప్రబలిన ప్లేగు వ్యాధి. పూనాలో బ్రిటిష్ అధికారులు రాండ్ మరియు ఆమేరిస్ట్ హత్య.
1899 - 1905 వైస్రాయ్, గవర్నర్ జనరల్ గా లార్డ్ కర్జన్ నియామకం. 1904 లో భారత విశ్వవిద్యాలయాల చట్టం ఆమోదం. ఆర్కియోలాజికల్ సర్వ్ ఆఫ్ ఇండియా స్థాపన. 1905 లో బెంగాల్ విభజన.
1905 - 1910 వైస్రాయ్, గవర్నర్ జనరల్ గా లార్డ్ మింటో నియామకం. 1906 లో ఢాకాలో అఖిల భారత ముస్లిం లీగ్ స్థాపన. 1909 లో ఇండియన్ కౌన్సిల్ (మింట్లో-మార్లో సంస్కరణలు) చట్టం ఆమోదం.
1910 - 1916 వైస్రాయ్, గవర్నర్ జనరల్ గా లార్డ్ చార్లెస్ హార్డింజ్. 1911 లో ఐదో జార్జికి రాజుగా ఢిల్లీలో పట్టాభిషేకం. బెంగాల్ విభజన రద్దు. భారత రాజధానిని బెంగాల్ నుండి ఢిల్లీకి మార్చాలని నిర్ణయం. 1915 లో గాంధీజీ బొంబాయికి రాక. గోఖలే మరణం. అనిబిసెంట్ హోమ్ రూల్ లీగ్ ప్రకటన. 1914-18 మొదటి ప్రపంచ యుద్ధం.
1916 - 1921 వైస్రాయ్, గవర్నర్ జనరల్ గా లార్డ్ చామ్స్ ఫోర్డ్ నియామకం. 1916 లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో 19 మంది సభ్యులచే రాజ్యాంగ సవరణకై మెమోరాండం. 1917 చంపారన్ సత్య గ్రహంలో పాలుపంచుకున్న గాంధీ, అనిబిసెంట్ కు మద్రాస్ ప్రభుత్వం ప్రతిఘటన. అనిబిసెంట్ నిర్బంధం. 1919 లో  రౌలత్ (దేశ ద్రోహం) బిల్లు ప్రవేశం. ఈ బిల్లుపై దేశ వ్యాప్తంగా ప్రజల నుండి నిరసనలు. అమృతసర్ లో జలియన్ వాలాబాగ్ మారణకాండ. 1919 భారత ప్రభుత్వ చట్టం అమలు. 1920 లో బాలగంగాధర్ తిలక్ మృతి.
1921 - 1926 వైస్రాయ్, గవర్నర్ జనరల్ గా లార్డ్ రీడింగ్ నియామకం. 1921 సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభం. ఆగస్టులో మలబార్ మోప్లాల తిరుగుబాటు. 1922 చౌరి చౌరా సంఘటన. సహాయ నిరాకరణ ఉద్యమం నిలిపివేత. 1924 లో భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకలాపాలు ప్రారంభం. 1925 లో సెంట్రల్ లెజిస్లేచర్ కు భారతీయ మొదటి ప్రిసైడింగ్ అధికారిగా విఠల్ భాయ్ ఎన్నిక.
1926 - 1931 వైస్రాయ్, గవర్నర్ జనరల్ గా లార్డ్ ఇర్విన్ నియామకం. 1926 ట్రేడ్ యూనియన్ చట్టం అమలు. 1928 లో వ్యవసాయంపై రాయల్ కమిషన్ నియామకం. 1928 ఫిబ్రవరి 3 న సైమన్ కమిషన్ బొంబాయి రాక. 1930 మొదటి నివేదిక ప్రచురణ. 1930 లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం లండన్ లో ప్రారంభం.  1931 లో గాంధీ-ఇర్విన్ ఒప్పందం పూర్తి. సెప్టెంబరులో రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి ఇంగ్లాండుకు గాంధీజీ ప్రయాణం.
1931 - 1936 వైస్రాయ్, గవర్నర్ జనరల్ గా లార్డ్ వెల్లింగ్టన్ నియామకం. 1932 లో బ్రిటిష్ ప్రధాని రామ్'సే మెక్'డోనాల్డ్ కమ్యూనల్ అవార్డు ప్రకటన. 1934 లో బీహార్ భూకంపం. 1935 లో భారత ప్రభుత్వ చట్టం.
1936 - 1944 వైస్రాయ్, గవర్నర్ జనరల్ గా లార్డ్ లిన్'లిత్'గో (భారత్ లో పనిచేసిన వైస్రాయ్, గవర్నర్ జనరల్స్ లో ఇతనే ఎక్కువ కలం కొనసాగారు). 1939 సెప్టెంబర్  8 న రెండో ప్రపంచ యుద్ధం (1939-45) ప్రారంభం. 1941 జనవరిలో కలకత్తా నుండి బెర్లిన్ ప్రయాణంలో అదృశ్యం. 1942 లో జపాన్ భారత్ పై వైమానిక బాంబు దాడి. 1942 జులాయి 14 న క్విట్ ఇండియా తీర్మానం ఆమోదం.
1944 - 1947 వైస్రాయ్, గవర్నర్ జనరల్ గా లార్డ్ వేవెల్ నియామకం. 1944 లో ఇంగ్లాండ్ లో అట్లీ నాయకత్వంలో లేబర్ ప్రభుత్వం. 1945 జూన్ లో సిమ్లా కాంగ్రెస్. ముస్లిమ్ లీగ్ నాయకులతో లార్డ్ వేవెల్ సమావేశం. 1946 మార్చిలో కేబినెట్ బృందం భారత్ రాక. ప్రతిపాదన సమర్పణ. 1946 జూన్ లో భారత ప్రాదేశిక అసెంబ్లీ ఎన్నికలు పూర్తి.  1946 ఆగష్టు 6 న తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు జవహర్ లాల్ నెహుకు ఆహ్వానం. 1947 ఫిబ్రవరి 20 భారత్ లో బ్రిటిష్ పాలనా ముగిసినట్లు అట్లేచే చారిత్రాత్మక ప్రకటన.
1947 - 1948 చిట్టచివరి వైస్రాయ్, గవర్నర్ జనరల్ గా లార్డ్ మౌంట్ బటన్ చే 1947 జూన్ 3 న భారత్ విభజనకు ప్రణాళిక సమర్పణ. భారత్, పాకిస్తాన్ ప్రత్యేక రాజ్యాలకు అధికార బదలాయింపు ప్రకటన. 1947 జులాయి 15-16 తేదీల్లో భారత్ స్వాతంత్ర బిల్లు బ్రిటిష్ పార్లమెంట్ లో ఆమోదం. 1947 ఆగష్టు 15 న భారతదేశ గవర్నర్ జనరల్ గా లార్డ్ మౌంట్ బటన్ ప్రమాణ స్వీకారం. భారత స్వాతంత్ర సముపార్జన. జవహర్‌లాల్ నెహ్రూ భారత మొదటి ప్రధాని (1947-64)
1948 - 1950 భారతదేశ ప్రధమ చివరి గవర్నర్ జనరల్ గా చక్రవర్తుల రాజగోపాలాచారి. మహాత్మ గాంధీ హత్య (1948 జనవరి 30). భారతదేశం యొక్క కొత్త రాజ్యాంగం స్వీకరించబడింది మరియు ఆమోదించబడింది (1949 నవంబర్ 26), భారతదేశం నూతన రిపబ్లిక్ దేశంగా అవతరించింది. నూతన రాజ్యాంగం (1950 జనవరి 26) అమలులోకి వచ్చింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మొదటి రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డారు. ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు.
1951 మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభం.
1952 భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించబడ్డాయి. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేయబడింది (NDC). కుటుంబ నియంత్రణ ప్రణాళికను ప్రారంభించారు.
1953 యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏర్పాటు (యూజీసీ), సెంటర్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటు(సీబీఐ) ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏర్పాటు.
1954 చైనీస్ ప్రీమియర్  చౌ ఎన్-లై భారతదేశం సందర్శించారు. చైనా మరియు భారతదేశం మధ్య పంచశిల ఒప్పందం కుదిరింది.
1955 హిందూ వివాహ చట్టం మరియు భారతీయ పౌరసత్వ చట్టం రూపొందించారు.
1956 భాషా ప్రాతిపదికన భారత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. 2వ పంచవర్ష ప్రణాళిక ప్రారంభం. ఇన్సురెన్స్ కంపెనీలను జాతీయం చేసారు.
1957 భారతదేశంలో రెండవ సార్వత్రిక ఎన్నికలు నిర్వహించబడ్డాయి. నాణేల దశాంశ వ్యవస్థలోకి మార్పు. సాకా ఎరా ఆధారంగా జాతీయ క్యాలండర్ విడుదల చేసారు.
1959 దలైలామా రాజకీయాల ఆశ్రయం కోసం భారతదేశానికి చేరుకున్నారు. ఇండో-చైనీస్ సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. పంచాయతీ రాజ్ చట్టాన్ని మొదటి సారి రాజస్థాన్ లో అమలు చేసారు.
1961 గోవా, డామన్ మరియు డియు పోర్సుగీసు వారి నుండి స్వాధీనం చేసుకోబడ్డాయి. అర్జున అవార్డులను పరిచయం చేసారు.
1962 ఇండో-చైనా యుద్ధం
1964 జవహర్‌లాల్ నెహ్రూ మరణం. లాల్ బహదూర్ శాస్త్రి భారత రెండో ప్రధానిగా ఎన్నుకోబడ్డారు.
1965 ఇండో-పాకిస్తాన్ యుద్ధం.
1966 తాష్కెంట్ డిక్లరేషన్ (ఇండియా-పాకిస్తాన్ మధ్య 1996 జనవరి 10). లాల్ బహదూర్ శాస్త్రి మరణం. ఇందిరా గాంధీ ప్రధానిగా ఎన్నిక.
1969 14 అతిపెద్ద వాణిజ్య బ్యాంకులను భారత ప్రభుత్వం జాతీయం చేసింది. మొదటి దాదా సాహిబ్ ఫాల్కే అవార్డు కోసం దావికా రాణిని ఎంపిక చేసారు.
1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధం, ఇండియా నుండి బాంగ్లాదేశ్ కొత్త దేశంగా ఏర్పాటు.
1972 భారత్ మరియు పాకిస్తాన్ ల మధ్య సిమ్లా ఒప్పందం.
1973 ప్రాజెక్ట్ టైగర్ పేరుతో పులి సంరక్షణ కార్యక్రమం ప్రారంభం.
1974 పోఖ్రాన్ వద్ద మే 18న భూగర్భ అణు పేలుడు జరిగింది.
1975 దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించబడింది. మొదటి సారి భారత అంతరిక్ష కేంద్రం నుండి ఆర్యభట్ట కక్ష్యలోకి ప్రవేశపేట్టారు.
1977 జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాజ్‌పేయి UNO లో హిందీలో ప్రసంగించారు.
1978 అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లు పరిచయం. రూ. 1,000, రూ. 5,000 మరియు రూ. 10,000 విడుదల.
1979 మొరార్జీ దేశాయ్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. చరణ్ సింగ్ ప్రధాని తాత్కాలిక ప్రధాని అయ్యారు. లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్ మరణం. భాస్కర I ఉపగ్రహం లాంచింగ్.
1980 మదర్ థెరిసా భారత్ రత్న అవార్డు అందుకున్నారు. మరో 6 బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి.
1981 కుసిమ్ నుండి మొదటి భారతీయ అంటార్టిక్ యాత్ర ప్రారంభం. దక్షిణ గంగోత్రి పేరుతో భారతదేశం యొక్క మొదటి శాశ్వత స్టేషన్ అంటార్టికాలో ఏర్పాటు చేయబడింది.
1983 ఆచార్య వినోబా భావే కు మరణానంతరం భారత్ రత్న ప్రదానం చేశారు. INSAT-IB విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
1984 రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ వ్యోమగామిగా  రికార్డుకెక్కారు. బచేంద్ర పాల్ ఎవరెస్ట్ ఆరోహించిన మొదటి భారతీయ మహిళ గుర్తింపు పొందారు. ఇందిరా గాంధీ హత్య. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఎన్నికయ్యారు. భూపాల్ గ్యాస్ ప్రమాదం చోటుచేసుకుంది.
1985 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంది. ద్రోణాచార్య అవార్డు పరిచయం చేసారు.
1986 మిజోరాం శాంతి ఒప్పందం.
1987 అబ్దుల్ గఫర్ ఖాన్ భారతరత్న అవార్డు అందుకున్నా మొదటి విదేశీయుడుగా గుర్తింపు పొందారు.
1988 ఎం.జి.రామచంద్రన్ కు భారతరత్న అవార్డు ప్రధానం చేసారు. మాల్దీవులు అధ్యక్షుడు అబ్దుల్ గయూమ్ కు సహాయం చేసేందుకు భారత ఆర్మీ వెళ్ళింది. ఓటుహక్కు వయస్సును 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించే రాజ్యాంగ సవరణ బిల్లును లోకసభలో ఆమోదించారు.
1989 వి.పి. సింగ్ భారత ఏడువ ప్రధాన మంత్రిగా ఎంపికయ్యారు.
1990 నెల్సన్ మండేలా భారతరత్న అందుకున్నారు. లోకసభ విశ్వాస పరీక్షలో ఓడిపోవడం వలన వీపీ సింగ్ ప్రధాని పదవికి రాజీనామా చేసారు. చంద్ర శేఖర్ కొత్త ప్రధానిగా ఎన్నుకోబడ్డారు.
1991 రాజీవ్ గాంధీ హత్య  (శ్రీపెరం, బుదూర్, తమిళనాడు). మొరార్జీ దేశాయ్‌కు భారతరత్న అందజేశారు. రాజీవ్ గాంధీ, సర్దార్ పటేల్ లకు మరణాంతరం భారతరత్న అందజేశారు.
1992 మౌలానా ఆజాద్ మరణానంతరం భారత్ రత్న అవార్డు అందుకున్నారు. కార్ సేవకులు అయోధ్య లోని బాబ్రీ మసీదును కూల్చివేశారు.
1993 అర్జున్ యుద్ధ ట్యాంకును భారత సైన్యంకు అందజేశారు. OBC యొక్క ఉద్యోగ కోటాను ప్రవేశపెట్టారు.
1994 పంచాయతీ రాజ్ చట్టం పూర్తిస్థాయిలో అమలులోకి తెచ్చారు.
1995 మొరార్జీ దేశాయ్ మరణించారు. బొంబాయి పేరును ముంబై గా మార్చారు.
1996 అటల్ బిహారీ వాజ్‌పేయి మే 16 న ప్రధానిగా ఎన్నికయ్యారు. మే 28 న ప్రధాని పదవికి రాజీనామా చేశారు. హెచ్.డి. దేవేగౌడ జూన్ 1 న ప్రధాని పదవి చేపట్టారు. మద్రాస్ పేరును  చెన్నైగా మార్చారు.
1997 పిఎస్‌ఎల్‌వి-సి 1 ఉపగ్రహం ఆంధ్రప్రదేశ్ శ్రీహరి కోట నుండి నింగిలోకి ఎగిరింది. అరుంధతి రాయ్ 29 వ బుకర్ అవార్డుకు ఎంపికయ్యారు. కల్పన చావ్లా అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ యుఎస్ మహిళగా రికార్డుకెక్కారు.
1998 భారతదేశం పోఖ్రాన్ వద్ద రెండవ (మే 11) మరియు మూడవ (మే 13) అణు పేలుడు జరిగింది. కుమారి.ఎంఎస్  సుబ్బలక్ష్మి, జయ ప్రకాష్ నారాయణ్ లకు భారతరత్న అవార్డు అందజేశారు. వాజ్‌పేయి 12 వ ప్రధాని మంత్రిగా ఎంపికయ్యారు. పరం 10000 ఇండియా యొక్క కొత్త సూపర్ కంప్యూటర్ ఆవిష్కరించబడింది. కొంకణ్ రైల్వే (760 కి.మీ) ప్రారంభోత్సవం.
1999 ఇన్సాట్ 2 E ఏప్రిల్ 3 న నింగికి ఎగిరింది. పిఎస్‌ఎల్‌వి-సి 2 ఐఆర్‌ఎస్ పి 4 ను నింగిలో విడుదల చేసింది. భారతదేశం పాల ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచింది. అమర్తసేన్ భారతరత్న అవార్డు అందుకున్నారు. కార్గిల్ నుండి పాక్ చొరబాటుదారులను తిప్పికొట్టేందుకు విజయ్ ఆపరేషన్ చేపట్టింది.
2000 బిల్ క్లింటన్ భారతదేశాన్ని సందర్శించారు. మొదటి భారత మహిళగా లారా దత్తా మిస్ యూనివర్స్ కు  ఎంపికయ్యారు. ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మరియు ఉత్తరాంచల్ కొత్త రాష్ట్రాలుగా ఏర్పాటు. కర్ణం మల్లేశ్వరి సిడ్నీ ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెలుచుకుంది. ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ గా ఎంపికయ్యారు.
2001 GSLV D1 GSAT ను లంచ్ చేసింది. భారత పార్లమెంట్ పై దాడి జరిగింది.
2002 శ్రీమతి పూర్ణిమ అద్వానీ జాతీయ మహిళా కమిషన్ కు చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. భారత మాజీ వైమానిక దళం చీఫ్ అర్జన్ సింగ్, మొట్టమొదటి మార్షల్ IAF గా ఎంపికయ్యారు. ఎ.పి.జె. అబ్దుల్ కలాం 11 వ భారత రాష్ట్రపతిగా ఎంపికయ్యారు. పిఎస్‌ఎల్‌వి 1,060 కిలోల వాతావరణ శాటిలైట్ (మెట్సాట్) శ్రీహరికోట నుండి విజయవంతంగా ప్రయోగించింది. జస్టిస్ వి.ఎన్. ఖరే భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.
2003 ఇన్సాట్ 3 E సెప్టెంబర్ 28న నింగికి ఎగిరింది. ఎయిర్ మార్షల్ టి.ఎం. అస్తానా స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ యొక్క మొదటి కమాండర్-ఇన్-చీఫ్ గా ఎంపికయ్యారు. జమ్మూ కాశ్మీర్ నుండి మెహబూబా ముఫ్తీ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష బాధ్యతులు స్వీకరించడం ద్వారా, ఆ రాష్ట్రం నుండి రాజకీయ పార్టీకి నాయకత్వం వహించిన మొదటి మహిళగా గుర్తింపు సాధించారు. ఐఎన్ఎస్ తల్వార్ రూపంలో నేవీ యొక్క మొట్టమొదటి స్టీల్త్ యుద్ధనౌకను పశ్చిమ నౌకాదళంలోకి చేర్చారు. జి. మాధవన్ నాయర్ స్పేస్ కమిషన్ మరియు ఇస్రో చైర్మన్ పదవిని చేపట్టారు. మేజర్ రాజ్య వర్ధన్ సింగ్ రాథోడ్ ఒలింపిక్స్ షూటింగ్‌లో భారత్‌కు రజత పతకం సాధించిపెట్టారు.

Post Comment