ఆర్‌ఆర్‌బి అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ 2022
Latest Jobs Railway

ఆర్‌ఆర్‌బి అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ 2022

ఇండియన్ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ మరియు సాంకేతిక నిపుణుల నియామకాలు చేపట్టేందుకు ఆర్‌ఆర్‌బి ఈ అసిస్టెంట్ లోకో పైలట్ మరియు టెక్నిషియన్స్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది. ఉద్యోగ ప్రకటన జాతీయస్థాయిలో విడుదల చూసేటప్పటికి నియామక ప్రక్రియ జోన్ లెవెల్లోనే జరుగుతుంది.

అభ్యర్థులు తమ అభిఇష్టం మేరకు ఏ జోన్ పరిదిలోనైనా దరఖాస్తు చేసేందుకు అనుమతి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు 7వ సీపీసీ ప్రకారం లెవెల్ 2 పరిదిలో (19900/-) ప్రారంభ వేతనం అందిస్తారు. ఇతర అలోవెన్సులతో కలుపుకుంటే దాదాపు 30 వేల వరకు అందుకుంటారు.

నియామక బోర్డు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు
నియామక పరీక్షా అసిస్టెంట్ లోకో పైలట్ మరియు టెక్నిషియన్స్ ఎగ్జామినేషన్
ఎంపిక ప్రక్రియ రాతపరీక్ష
ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్
వయో పరిమితి 18 - 28 ఏళ్ళ మధ్య
సిలబస్ క్లిక్ చేయండి

ఎన్లో సవాళ్లతో కూడుకున్న లోకో పైలట్ ఉద్యోగ జీవితంలో పనితీరు ఆధారంగా ప్రమోషన్లు కల్పిస్తారు. అసిస్టెంట్ లోకో పైలట్ నుండి సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్, లోకో పైలట్ శాంటర్, లోకో పైలట్ గూడ్స్, లోకో పైలట్ మెయిల్ మరియు పవర్ కంట్రోలర్ / క్రూ కంట్రోలర్ / లోకో ఫోర్‌మాన్ వరకు ఎదిగే అవకాశం ఉంటుంది.

ఎలిజిబిలిటీ

  • జాతీయత : ఇండియా/నేపాల్/భూటాన్ దేశాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. 1 జనవరి 1962 ముందు భారత్ వచ్చి స్థిరపడిన టిబెటియన్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. భారతీయ మూలాలు కలిగి పాకిస్తాన్, బర్మా, శ్రీలంకా, తూర్పు ఆఫ్రికా దేశాలు కెన్యా, ఉగాండా, యునైటెడ్ రిపబ్లిక్ టాంజానియా (పూర్వం టాంగన్యికా మరియు జాంజిబార్), జాంబియా, మాలావి, జైర్, ఇథియోపియా మరియు వియత్నాం దేశాల నుండి శాశ్వతంగా భారత్ లో స్థిరపడేందుకు వచ్చే భారతీయ సంతతి కూడా అర్హులు.
  • వయోపరిమితి: వివిధ పోస్టులను అనుసరించి 18 నుండి 28 ఏళ్ళ మధ్య వయస్సు ఉండే అభ్యర్థులు దరఖాస్తు చెయ్యొచ్చు. ఓబీసీ అభ్యర్థులకు గరిష్టంగా 3 ఏళ్ళ వయోపరిమితి సడలింపు ఉంటుంది. షెడ్యూల్డ్ కులాల వారికీ గరిష్టంగా 5 ఏళ్ళు, వికలాంగులకు 10 ఏళ్ళు సడలింపు కల్పిస్తారు.
  • విద్య అర్హుత : ఐటీఐ, ట్రేడ్ అప్రెంటిస్‌షిప్, డిప్లొమా లేదా ఇంజనీరింగ్ ఉత్తీర్ణతయినా అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.
  • ఫీజికల్ ప్రమాణాలు: ఆర్‌ఆర్‌బి రిక్రూట్మెంట్ బోర్డు నియామక నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాంగా ఉండాలి.  
దరఖాస్తు ఫీజు
జనరల్ కేటగిరి అభ్యర్థులు 500/-
మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, వికలాంగులు, ESM అభ్యర్థులు 250/-

దరఖాస్తు ప్రక్రియ

అర్హుత ఉన్న అభ్యర్థులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైటు నుండి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్'లో పొందిపర్చిన విదంగా బోర్డు అడిగిన వ్యక్తిగత, విద్యా సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది.

దరఖాస్తు పారంభించే ముందు అవసరమయ్యే వివరాల్ని అందుబాటులో పెట్టుకోండి. పుటిన తేదీ వివరాలు, కేటగిరి వివరాలు, మొబైల్ నెంబర్ మరియు మెయిల్ ఐడీ వంటి వివరాలు తప్పులు దొర్లకుండా పొందుపర్చండి. పోస్టు ఎంపిక, పరీక్షా కేంద్ర ఎంపిక వివరాలు మరో మారు సరిచూసుకోండి. అప్లోడ్ చేసే ధ్రువపత్రాలు బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా రూపొందించుకోండి.

దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేశాక అందుబాటులో ఉండే పేమెంట్ మార్గం ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించండి. దరఖాస్తు రుసుము చెల్లించని అప్లికేషన్లు పరిగణలోకి తీసుకోబడవు.

జోన్స్ వారీగా ఆర్‌ఆర్‌బి సమాచారం
Ahmedabad  www.rrbahmedabad.gov.in Phone : 079-22940858 Jammu Srinagar www.rrbjammu.nic.in Phone : 0191-2476757
Ajmer www.rrbajmer.gov.in Phone: 0145 – 2425230 Kolkata www.rrbkolkata.gov.in Phone: 033 – 25430108
Allahabad www.rrbald.nic.in Phone : 0532-2224531 Malda www.rrbmalda.gov.in Phone : 03512-264567
Bangalore www.rrbbnc.gov.in Phone: 080 – 23330378 Mumbai www.rrbmumbai.gov.in Phone : 022-23090422
Bhopal www.rrbbpl.nic.in Phone : 0755-2746660 Muzaffarpur www.rrbmuzaffarpur.gov.in Phone : 0621-2213405
Bhubaneswar www.rrbbbs.gov.in Phone : 0674-2303015 Patna www.rrbpatna.gov.in Phone: 0612-2677680
Bilaspur www.rrbbilaspur.gov.in Phone : 07752-247291 Ranchi www.rrbranchi.gov.in Phone : 0651-2462429
Chandigarh www.rrbcdg.gov.in Phone: 0172 – 2730093 Secunderabad www.rrbsecunderabad.nic.in Phone : 040-27821663
Chennai www.rrbchennai.gov.in Phone : 044-28275323 G Siliguri www.rrbsiliguri.org Phone : 0353-2663840
orakhpur www.rrbgkp.gov.in Phone : 0551-2201209 Guwahati www.rrbguwahati.gov.in Phone: 0361 – 2540815
  Thiruvanthapuram www.rrbthiruvananthapuram.gov.in Phone : 0471-2323357

ఎగ్జామ్ నమూనా

అసిస్టెంట్ లోకో పైలట్ మరియు టెక్నిషియన్ నియామక ప్రక్రియ నాలుగ దశల్లో  చేపడతారు. ఈ నాలుగు దశలకు సంబంధించిన తేదీ, సమయం, పరీక్షా కేంద్రం మరియు ఇతర వివరాలను అర్హుత ఉన్న అభ్యర్థులకు ఆర్‌ఆర్‌బి నేరుగా అందజేస్తుంది.

  1. ఫస్ట్ స్టేజ్ సీబీటీ
  2. సెకండ్ స్టేజ్ సీబీటీ
  3. కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (కేవలం ALP అభ్యర్థులకు మాత్రమే)
  4. డాక్యుమెంట్ వెరిఫికేషన్

ఫస్ట్ స్టేజ్ సీబీటీ

మొదటి దశలో జరిగే కంప్యూటర్ ఆధారిత పరీక్షా అసిస్టెంట్ లోకో పైలట్లకు మరియు టెక్నిషియన్లకు కామన్ గా ఉంటుంది. స్క్రీనింగ్ ప్రక్రియలో భాగంగా జరిగే పరీక్షలో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటిలిజెన్స్ & రీజనింగ్, జనరల్ సైన్స్ మరియు జనరల్ అవెర్నెస్ & కరెంటు అఫైర్స్ అంశాలకు సంబంధించి 75 ప్రశ్నలు ఇవ్వబడతాయి. పరీక్షా వ్యవధి 60 నిముషాలు ఉంటుంది. ఈ పరీక్షలో సాధించిన మార్కులు రెండవ స్టేజ్ కోసం అభ్యర్థులను ఎంపిక చేసేందుకు మాత్రమే ఉపయోగిస్తారు.

ఈ పరీక్షలో కేటగిరి వారీగా అర్హుత మార్కులు కేటాయిస్తారు. జనరల్ కేటగిరి అభ్యర్థులు 40% కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఓబీసీ మరియు ఎస్సీ అభ్యర్థులు 30%, ఎస్టీ అభ్యర్థులు 25% అర్హుత మార్కులు పొందడం తప్పనిసరి.

అసిస్టెంట్ లోకో పైలట్ ఫస్ట్ స్టేజ్ సీబీటీ ఎగ్జామ్ నమూనా
సిలబస్ ప్రశ్నలు (75) మార్కులు (75) సమయం
మ్యాథమెటిక్స్ 20 20 60 నిముషాలు
జనరల్ ఇంటిలిజెన్స్ & రీజనింగ్ 25 25
జనరల్ సైన్స్ 20 20
జనరల్ అవెర్నెస్ & కరెంటు అఫైర్స్ 10 10

సెకండ్ స్టేజ్ CBT

ఫస్ట్ స్టేజ్ సీబీటీ లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు రెండవ దశలో సెకండ్ స్టేజ్ సీబీటీ నిర్వహిస్తారు. ఖాళీ ఉండే పోస్టుల సంఖ్యకు 15 రేట్లు అభ్యర్థులను కేటగిరి వారీగా సెకండ్ స్టేజ్ కోసం ఎంపిక చేస్తారు. సెకండ్ స్టేజ్ సీబీటీ రెండు భాగాలుగా ఒకే రోజు జరుగుతుంది. రెండు భాగాల నిడివి 2.30 నిముషాలు ఉంటుంది.

పార్ట్ A : ఈ పేపర్లో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటిలిజెన్స్ & రీజనింగ్, జనరల్ సైన్స్ & ఇంజనీరింగ్ మరియు జనరల్ అవెర్నెస్ & కరెంటు అఫైర్స్ అంశాలకు సంబంధించి 100 ఆబ్జెక్టివ్  ప్రశ్నలు ఇవ్వబడతాయి. పరీక్షా వ్యవధి 90 నిముషాలు. పార్ట్ A లో సాధించిన మార్కులు తర్వాత రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఉపయోగపడతాయి. ఈ పరీక్షలో కేటగిరి వారీగా అర్హుత మార్కులు కేటాయించారు. జనరల్ కేటగిరి అభ్యర్థులు 40% కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఓబీసీ మరియు ఎస్సీ అభ్యర్థులు 30%, ఎస్టీ అభ్యర్థులు 25% అర్హుత మార్కులు పొందడం తప్పనిసరి.

అసిస్టెంట్ లోకో పైలట్ సెకండ్ స్టేజ్ సీబీటీ పార్ట్ A పరీక్షా విధానం
సిలబస్ ప్రశ్నలు (100) మార్కులు (100) సమయం
మ్యాథమెటిక్స్ 25 25 90 నిముషాలు
జనరల్ ఇంటిలిజెన్స్ & రీజనింగ్ 25 25
జనరల్ సైన్స్ & ఇంజనీరింగ్ 40 40
జనరల్ అవెర్నెస్ & కరెంటు అఫైర్స్ 10 10

పార్ట్ B : 60 నిముషాల వ్యవధితో 75 మార్కులకు నిర్వహిస్తారు. పార్ట్ B అందరూ అభ్యర్థులు 35% కనీస మార్కులతో అర్హుత సాధించాల్సి ఉంటుంది. ఇందులో కేటగిరి వారి అర్హుత మార్కుల సడలింపు లేదు. అర్హుత సాధించని అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తారు. డైరెక్టర్ జనరల్ ఎంప్లాయిమెంట్ & ట్రైనింగ్ (DGET) సూచించిన ట్రేడ్ సిలబస్ నుండి ప్రశ్నలు ఉంటాయి.

ఐటిఐ / ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ అర్హత ఉన్న అభ్యర్థులకు వారు చదువుకున్న ట్రేడ్ నుండి ప్రశ్నలు ఇవ్వబడతాయి. డిగ్రీ, డిప్లొమా, హెచ్‌ఎస్‌సి (10 + 2) అర్హత కలిగిన అభ్యర్థులు ALP యొక్క పోస్టుల కోసం తము చదువుకున్న గ్రూపులకు దగ్గరల్లో ఉండే ట్రేడును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన సిలబస్ DGET వెబ్సైటులో అందుబాటులో ఉంటుంది.

అసిస్టెంట్ లోకో పైలట్ సెకండ్ స్టేజ్ సీబీటీ పార్ట్ B పరీక్షా విధానం
సిలబస్ ప్రశ్నలు మార్కులు సమయం
ఎంపిక చేసుకున్న DGET ట్రేడ్ 75 75 60 నిముషాలు
ఇంజనీరింగ్ (డిగ్రీ /డిప్లొమా) అభ్యర్థులు ఎంపిక చేసుకోవాల్సిన ట్రేడులు
ఇంజనీరింగ్ (డిగ్రీ /డిప్లొమా) ఎంపిక చేసుకోవాల్సిన ట్రేడ్
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మరియు సంబంధిత గ్రూపులు ఎలక్ట్రీషియన్ / ఇనుస్ట్రుమెంట్ మెకానిక్ / వైర్‌మెన్/ వెండర్(ఆర్మేచర్) / రెఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ మెకానిక్
ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ మరియు సంబంధిత గ్రూపులు ఎలక్ట్రానిక్స్ మెకానిక్ / మెకానిక్ రేడియో & టీవీ
మెకానికల్ ఇంజనీరింగ్ మరియు సంబంధిత గ్రూపులు ఫిట్టర్ / మెకానిక్ మోటారు వెహికల్ / ట్రాక్టర్ మెకానిక్ / మెకానిక్ డీజిల్ / టర్నర్ /మెషినిస్ట్ / రెఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ / హీట్ ఇంజిన్ /మిల్‌రైట్ నిర్వహణ మెకానిక్
ఆటో మొబైల్ ఇంజనీరింగ్ మరియు సంబంధిత గ్రూపులు మెకానిక్ మోటారు వెహికల్ / ట్రాక్టర్ మెకానిక్ /మెకానిక్ డీజిల్ / హీట్ ఇంజిన్ /రెఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ మెకానిక్
ఫిజిక్స్ మరియు మ్యాథ్స్‌తో హెచ్‌ఎస్‌సి (10 + 2) ఎలక్ట్రీషియన్ / ఎలక్ట్రానిక్స్ మెకానిక్ / వైర్‌మాన్

కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ALP అభ్యర్థులకు)

కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే నిర్వహిస్తారు. సెకండ్ స్టేజ్ సీబీటీ లో పార్ట్ A & B లలో మెరిట్ సాధించిన ALP అభ్యర్థులను ఆప్టిట్యూడ్ టెస్ట్ కోసం ఎంపిక చేస్తారు. ఖాళీ ఉన్న ALP పోస్టుల సంఖ్యకు 8 రేట్లు మంది అభ్యర్థులను ఆప్టిట్యూడ్ టెస్టుకు ఎంపిక చేస్తారు. ఆప్టిట్యూడ్ టెస్టు  ప్రతి టెస్ట్ బ్యాటరీలో అభ్యర్థి కనీసం 42 మార్కులు సాధించాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కులు ఉండవు. ప్రశ్న పత్రం ఇంగ్లీష్ మరియు హిందీ భాషలో అందుబాటులో ఉంటుంది.

తుది ఎంపికలో సెకండ్ స్టేజ్ సీబీటీ పార్ట్ A లో సాధించిన మార్కులకు 70% వెయిటేజీ ఉంటుంది. మిగతా 30 % వెయిటేజీ ఆప్టిట్యూడ్ టెస్టులో సాధించిన మార్కులకు కల్పిస్తారు. అన్ని టెస్టుల్లో అర్హుత సాధించిన అభ్యర్థులకు చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. అభ్యర్థులు రెండు ఫోటో కాపీలతో పాటుగా అవసరమయ్యే అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరవ్వాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనంతరం ఎంపికైన అభ్యర్థుల లిస్టును విడుదల చేస్తారు. వారికీ ట్రైనింగ్ అందించి విధుల్లోకి తీసుకుంటారు.

ALP ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీస్
1 Memory Test – Aptitude Test for Measuring Memory
2 Following Directions – Aptitude Test to Measure the Ability to Follow Directions
3 Depth Perception – Aptitude Test to Measure Depth Perception
4 Concentration Test – Aptitude Test to Measure Concentration
5 Perceptual Speed Test – Aptitude Test to Measure Perceptual Speed