Advertisement
యూజీసీ మూక్ కోర్సులు : ఆన్‌లైన్ డిగ్రీ & పీజీ ప్రోగ్రామ్స్
Online Education Useful websites

యూజీసీ మూక్ కోర్సులు : ఆన్‌లైన్ డిగ్రీ & పీజీ ప్రోగ్రామ్స్

యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ), స్వయం ఆన్‌లైన్ వేదిక ద్వారా 243 పైగా అండర్ గ్రాడ్యుయేషన్, 128 పైగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను ఆఫర్ చేస్తుంది. నిరంతర అధ్యయనంలో భాగంగా స్టూడెంట్స్, టీచర్స్ మరియు పరిశోధన విద్యార్థులకు అన్ని వేళల ఉపయోగపడే విధంగా వీటిని రూపొందించారు.

రోజురోజుకి ఆన్‌లైన్ కోర్సులకు పెరుగుతున్న ఆదరణ కారణంగా భారత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, నూతన విద్యా విధానంలో భాగంగా ఆన్‌లైన్ విద్యకు అధిక ప్రాముఖ్యత ఇస్తుంది. దీనికి సంబంధించి అనేక డిజిటల్ విద్యా వేదికలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

యూజీ, పీజీ విద్యార్థుల కోసం యూజీసీ ఇటీవలే నూతన కోర్సులను కూడా అందుబాటుకి తీసుకొచ్చింది. భారత్‌ను ప్రపంచ బౌద్ధ సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగా పునరుద్ధరించాలన్న లక్ష్యంతో హిస్టరీ ఆఫ్‌ ఇండియన్‌ బుద్ధిజం, అభిధమ్మ (పాలీ), బుద్ధిస్ట్‌ ఫిలాసఫీ అనే కోర్సులను రూపొందించింది.

అలానే నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ-2020 సిఫారసు మేరకు ఉన్నత్‌ భారత్‌ అభియాన్‌ (యూబీఏ)లో భాగంగా కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌ అండ్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఈ అండ్‌ ఎస్‌ఆర్‌) అనే కోర్సును కూడా అందుబాటులోకి తెచ్చింది

యూజీసీ యూజీ మరియు పీజీ మూక్ కోర్సులను స్వయం పోర్టల్ ద్వారా అందుబాటులో ఉచింది. స్వయం పోర్టల్ ద్వారా మీరు వీటిని ఎన్రోల్ కావాల్సి ఉంటుంది. స్వయం వేదిక ద్వారా పూర్తిచేసిన కోర్సులకు యూజీసీ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ ఇవ్వబడుతుంది. ఈ కోర్సులలో సాధించిన స్కోరును నేరుగా మీ అకాడమిక్ రికార్డులకు ట్రాన్సఫర్ చేసే సౌలభ్యం కల్పిస్తుంది. దానితో పాటుగా కోర్సు పూర్తిచేసినట్లు స్వయం ఉత్తీర్ణత సర్టిఫికెట్ అందిస్తుంది.

ఉన్నత విద్యకు నోచుకోని వారు, గృహాణిలకు, పరిశోధన విద్యలో ఉన్న విద్యార్థులకు, ఒకటికి మించి ఉన్నత డిగ్రీలను చేయాలనుకునే వారికీ మరియు ఉద్యోగం చేసుకుంటూ ఉన్నత విద్య పూర్తి చేయాలనుకునే వారికీ ఈ యూజీసీ ఆన్లైన్ కోర్సులు చక్కగా ఉపయోగపడతాయి.

యూజీసీ మూక్ టాప్ 20 పీజీ కోర్సులు

  1. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ
  2. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ
  3. ఫైనాన్సిల్ మానేజ్మెంట్
  4. సైబర్ సెక్యూరిటీ
  5. కార్పొరేట్ లా
  6. ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్
  7. కార్పొరేట్ టాక్స్ ప్లానింగ్
  8. క్రిమినల్ జస్టిస్ అడ్మినిస్ట్రేషన్
  9. ఇంటర్ నేషనల్ హ్యూమన్ రైట్ సిస్టం
  10. రీసెర్చ్ మెథడాలజీ
  11. సొసైటీ & మీడియా
  12. ఇండియన్ కల్చర్ & హిస్టరీ
  13. హ్యూమన్ రైట్స్ ఇన్ ఇండియా
  14. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
  15. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ సిస్టమ్స్
  16. ఫంక్షనల్ అనాలసిస్
  17. సిటీ అండ్ మెట్రోపాలిటన్ ప్లానింగ్
  18. బయో స్టాటిస్టిక్స్ & మాథమేటికల్ బయాలజీ
  19. కంప్యూటర్ నెట్వర్క్ & ఇంటర్నెట్ ఫొటోకాల్స్
  20. ఆర్గనైజషన్ బిహేవియర్

యూజీసీ మూక్ టాప్ 20 డిగ్రీ కోర్సులు

  1. ఐటీ ఫండమెంటల్స్
  2. ఎడ్యుకేషనల్ సైకాలజీ
  3. టూరిజమ్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా
  4. ఫైనాన్సియల్ అకౌంటింగ్
  5. ఫుడ్ కెమిస్ట్రీ
  6. డేటా మైనింగ్
  7. ఆల్జీబ్రా & ట్రీగానోమెట్రీ
  8. రిటైల్ బిజినెస్ మానేజ్మెంట్
  9. కార్పొరేట్ ఫైనాన్స్
  10. ఫండమెంటల్స్ ఆఫ్ బిజినెస్ & అకౌంటింగ్
  11. జెనిటిక్స్ & జీనోమిక్స్
  12. టూరిజం & ట్రావెల్ మానేజ్మెంట్
  13. ఫుడ్ సైన్స్ & ప్రాసెస్సింగ్
  14. జియో కెమిస్ట్రీ
  15. ఫుడ్ మైక్రోబయాలజీ
  16. సైబర్ లా
  17. ఆడియో & విజువల్ మీడియా
  18. హెల్త్ సైకాలజీ
  19. సోషియాలజీ & ట్రైబల్ సొసైటీ
  20. టెలివిజన్ జర్నలిజం

Post Comment