ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీలో అగ్రికల్చర్ పొలిటిక్నిక్ కోర్సులు
Universities

ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీలో అగ్రికల్చర్ పొలిటిక్నిక్ కోర్సులు

ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలిటెక్నిక్ పరిధిలో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ మరియు సీడ్ టెక్నాలజీ లలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు అందిస్తుంది. ఈ కోర్సులు 2  నుండి 3 ఏళ్ళ కాలవ్యవధితో ఉంటాయి. డిప్లొమా కోర్సులు ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలంటే 50 శాతం మార్కులతో టెన్త్ ఉత్తీర్ణతయి ఉండాలి.

అగ్రికల్చర్ పొలిటిక్నిక్ కోర్సులు

డిప్లొమా కోర్సు కోర్సు కాలవ్యవధి ఎలిజిబిలిటీ
డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ రెండేళ్లు టెన్త్ పాస్
డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ మూడేళ్లు టెన్త్ పాస్
డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ రెండేళ్లు టెన్త్ పాస్
డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ రెండేళ్లు టెన్త్ పాస్

అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సుల అడ్మిషన్ విధానం

అగ్రికల్చర్ పాలిటెక్నిక్ దరఖాస్తులు ఆన్‌లైన్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. www.angrau.ac.in వెబ్సైటు ద్వారా దరఖాస్తు సమర్పించాలి. దరఖాస్తు చేసే ముందు మీ వ్యక్తిగత మొబైల్ నెంబర్ ద్వారా ఒన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత దరఖాస్తులో పొందుపర్చిన వ్యక్తిగత, విద్య వివరాలు నింపాల్సి ఉంటుంది.

ఆ తర్వాత దశలో మీరు పొందుపర్చిన వివరాలకు సంబంధించి ధ్రువపత్రాలు సూచించిన ఫార్మాట్ లో అప్లోడ్ చేయాలి. చివరిగా దరఖాస్తు ఫీజు చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది.

దరఖాస్తు చేసిన అభ్యర్థులు అందరికి సీట్లు లభించినట్లు కాదు. సీట్ల కేటాయింపు టెన్త్ క్లాస్ అకాడమిక్ మెరిట్, రిజర్వేషన్ సంబంధిత అంశాల ప్రాతిపదికన జరుగుతుంది. ఈ వివరాల కోసం తరుసు యూనివర్సిటీ అధికారిక వెబ్సైటును సందర్శిస్తూ ఉండండి.

దరఖాస్తు ఫీజు
జనరల్ కేటగిరి 500/-
ఎస్సీ, ఎస్టీ మరియు పీహెచ్ 250/-

Post Comment