Advertisement
టాపర్ ఆన్‌లైన్ క్లాసులు : మెరుగైన ఫలితాల కోసం మెరుగైన అభ్యాసం
Online Education Useful websites

టాపర్ ఆన్‌లైన్ క్లాసులు : మెరుగైన ఫలితాల కోసం మెరుగైన అభ్యాసం

భారతీయ ఆన్‌లైన్ విద్యా సంబంధిత లెర్నింగ్ వేదికల్లో టాపర్‌ను ఒకానొక ఉత్తమ ఆన్‌లైన్ విద్యా వేదికగా అభివర్ణించవచ్చు. టాపర్ ఆన్‌లైన్ విద్యకు సంబంధించి 360 డిగ్రీల కోణంలో కంటెంట్ అందిస్తుంది. లైవ్ క్లాసులతో మొదలుకుని తక్షణ సందేహ పరిస్కారం వరకు అన్ని సేవలను ఒకే వేదిక ద్వారా ఆఫర్ చేస్తుంది.

టాపర్ 2013 లో జిషాన్ హయత్ , హేమంత్ గోటేటి లచే స్థాపించబడింది. టాపర్ ప్రధానంగా 5 వ తరగతి నుండి 10+2 సంబంధించి దేశవ్యాప్తంగా 22 స్టేట్ బోర్డులతో  సహా 58 అకాడమిక్, పోటీ మరియు ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ఉత్తమ కంటెంట్ అందిస్తుంది.

టాపర్ భారతీయ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి పూర్తిస్థాయి ఆన్‌లైన్ లెర్నింగ్ వేదికను రూపొందించింది. ప్రతి కోర్సును లెర్న్, ప్రాక్టీస్ మరియు ఆస్క్ విధానంలో విద్యను అందిస్తుంది. లెర్నింగ్ ప్రక్రియ లో విద్యార్థులకు ఆన్‌లైన్ లైవ్ లేదా వీడియో క్లాసులు అందిస్తారు. తరవాత స్టేజిలో సబ్జెక్టుకు సంబంధించి అడాప్టివ్ ప్రాక్టీస్ నిర్వహస్తారు.

దీని ద్వారా విద్యార్థి పఠన వేగాన్ని, అభ్యాస వేగాన్ని అలానే సబ్జెక్టు ఎంతవరకు అవగతం చేసుకున్నాడనే విషయాన్ని గ్రహిస్తారు. మూడవ దశలో విద్యార్థికి సదురు సబ్జెక్టు యందు కలిగే సందేహాలను పరిష్కరిస్తారు.

ఈ సందేహ పరిష్కరణ ఇమేజ్ అప్లోడ్ చేయడం ద్వారా లేదా ఆన్‌లైన్ లైవ్ చాట్ ద్వారా లేదా లైవ్ ట్యూటర్ల ద్వారా పరిష్కరిస్తారు. పాఠశాల విద్యకు సంబంధించి అన్ని విధమైన ఫీచర్లు ఒకే వేదికలో లభించడం వలన ఆన్‌లైన్ ద్వారా స్కూలు ఎడ్యుకేషన్ పూర్తిచేయాలనుకునే విద్యార్థులకు టాపర్ ఒక ఉత్తమ ఎంపికగా చెప్పొచ్చు.

toppr