ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థులను ఎక్కువ కలవరపరిచే అంశాలలో ప్రధానమైనది యూఎస్ స్టూడెంట్ వీసా పొందటం. దీనికి గల ప్రధాన కారణం, యూఎస్ విద్యార్థి వీసా అంత సులువుగా దక్కేది కాదు. ఈ ప్రక్రియ అనేక అంశాలతో ముడిపడి ఉంటుంది.
ఈ ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు దొర్లినా ఒక విద్యా సంవత్సరం వృధా అవుతుంది. కావున వీసాకు దరఖాస్తు చేసే నాటి నుండి వీసా జారీ అయ్యే వరకు ప్రతీ అంశాన్ని జాగ్రత్తగా పూర్తి చేయాల్సి ఉంటుంది. యూజీ, పీజీ కోర్సులు అమెరికాలో చేద్దాం అనుకునే విద్యార్థులు ఏడాది ముందుగానే ప్రణాళిక చేసుకోవాలి.
స్టూడెంట్ వీసాకు దరఖాస్తు చేయాలంటే ముందుగా ఏదైనా అమెరికన్ యూనివర్సిటీ నుండి అడ్మిషన్ పొంది ఉండాలి. అడ్మిషన్ పొందాలంటే వాటికీ సంబంధించే ప్రవేశ పరీక్షాలో అర్హుత సాధించడంతో పాటుగా టోఫెల్ వంటి ఇంగ్లీష్ ప్రొఫిసెన్సీ టెస్టుల యందు అర్హుత పొందాల్సి ఉంటుంది.
ఈ దశలన్నీ పూర్తిచేసేందుకు ఎలా చూసుకున్న ఏడాదికి మించే సమయం పడుతుంది. సాధారణంగా అమెరికా అకాడమిక్ ఇయర్ ఆగష్టు నుండి ప్రారంభం అవుతుంది. యూనివర్సిటీ తరగతులు ప్రారంభానికి 120 రోజుల ముందుగానే మీకు వీసా జారీ చేస్తారు. ప్రస్తుతం భారతీయ విద్యార్థుల కోసం ఏడాది ముందుగానే వీసా అందిస్తుంది. ఏది ఏమైనా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీ అమెరికా ప్రయాణానికి ప్లాన్ చేసుకోండి.
యూఎస్ ఉన్నత కోసం F1 స్టూడెంట్ వీసా
అమెరికాకు ఉన్నత విద్య కోసం వచ్చే విద్యార్థుల కోసం యూఎస్ఏ రాయబార కార్యాలయం (ఎంబసీ) మూడు రకాల విద్యార్థి వీసాలను జారీ చేస్తుంది. పూర్తిస్థాయి అండర్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ అకాడమిక్ కోర్సులలో జాయిన్ అయ్యే విద్యార్థులు F1 స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి.
ఒకేషనల్ మరియు ఇతర ట్రైనింగ్ కోర్సులలో చేరే విద్యార్థులు M1 స్టూడెంట్ వీసా కోసం అప్లై చేసుకోవాలి. షార్ట్ టర్మ్ కోర్సులు చేసేందుకు వెళ్లే విద్యార్థులు J1 వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ మూడు రకాల విద్యార్థి వీసాలను ఐదేళ్ల చెల్లుబాటుతో జారీచేస్తారు.
F1 వీసాతో వెళ్లే వారు మొదటి ఏడాదిలో ఎటువంటి జాబ్ చేసేందుకు అనుమతించారు. తర్వాత ఏడాది నుండి వారానికి గరిష్టంగా 20 నుండి 30 గంటలు యూనివర్సిటీ పరిధిలో జాబ్ చేసందుకు మాత్రమే అనుమతిస్తారు.
యూఎస్ స్టూడెంట్ వీసా రకాలు మరియు ఉపయోగాలు
Type of Visa | Purpose of visit | Visa Fee | Stay/Valid period |
F1 Visa |
|
$ 510 USD | 5 Years |
M Visa | Vocational or other recognized nonacademic institution, other than a language training program | $ 510 USD | 5 Year |
Exchange visitor (J) |
|
$ 510 USD | 5 Year |
SEVIS I-901 fee
యూఎస్ వీసాకు దరఖాస్తు చేసే ముందు స్టూడెంట్ అండ్ ఎక్చ్ంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టం (SEVIS) పోర్టల్ యందు రిజిస్టర్ చేసుకోవాలి. SEVIS అమెరికాకు వచ్చే నాన్ ఇమిగ్రెంట్ స్టూడెంట్స్ యొక్క సమాచారాన్ని రెగ్యులేట్ చేస్తుంది. సేకరించిన డాటాను అక్రమ వలస విద్యార్థులను గుర్తించేందుకు, నేరాలకు పాల్పడే విద్యార్థులను ట్రాక్ చేసేందుకు ఉపయోగించుకుంటుంది.
SEVIS యందు రిజిస్టర్ చేసుకోవాలంటే స్టూడెంట్ అండ్ ఎక్చ్ంజ్ విజిటర్ ప్రోగ్రాం (SEVP) జాబితాలో ఉండే యూనివర్సిటీ యందు అడ్మిషన్ పొంది ఉండాలి. SEVP జాబితాలో ఉండే యూనివర్సిటీలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు, సదురు యూనివర్సిటీలు SEVP ఐడీ తో పాటుగా Form I-20 ని జారీ చేస్తుంది.
ఈ వివరాలతో SEVIS పోర్టల్ యందు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. SEVIS రిజిస్ట్రేషన్ ఫీజు $ 350 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడు వివాహితులైయి, తమ పిల్లలను తమతో పాటుగా అమెరికాలో స్కూల్ ఎడ్యుకేషన్ లో జాయిన్ చేయాలని అనుకుంటే. వారి పేరున కూడా SEVIS రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. పిల్లలకు SEVIS రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు.
యూఎస్ స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేయండి
SEVIS రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకున్నాక యు.ఎస్ ఎంబసీ పోర్టల్ యందు ఆన్‌లైన్ విధానంలో వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీని కోసం ఆన్‌లైన్ నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తు- ఫారం DS-160 నింపాల్సి ఉంటుంది. మీ ఫోటోతో పాటుగా దరఖాస్తులో అడిగే పూర్తి వివరాలు పొందుపర్చి, అందుబాటులో ఉండే యు.ఎస్ రాయబార కార్యాలయం యందు వీసా ఇంటర్వ్యూ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
తర్వాత దశలో వీసా దరఖాస్తు ఫీజు $160 డాలర్లు చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తియ్యాక దాని ప్రింట్ తీసుకుని, మీరు షెడ్యూలు చేసుకున్న తేదీలో మీకు అందుబాటులో ఉండే యూఎస్ రాయబార కార్యాలయంలో ఇంటర్వ్యూకి హాజరుకావాలి.
యూఎస్ స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూ
17 ఏళ్ళ లోపు పిల్లలకు, 80 ఏళ్ళు దాటినా వృద్దులకు యూఎస్ స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూ అవసరం ఉండదు. మిగతా అందరూ మీకు కేటాయించిన తేదీల్లో దగ్గరలో ఉండే యూఎస్ రాయబార కార్యాలయం యందు సంబంధిత ధ్రువపత్రాలతో వీసా ఇంటర్వ్యూ కోసం హాజరు కావాలి. 2 నుండి 3 నిముషాల్లో పూర్తియ్యే ఈ ప్రక్రియ కోసం మీరు ఎటువంటి ఒత్తడికి గురికావాల్సిన అవసరం లేదు.
జనరల్ ఇంటర్వ్యూ ఫార్మాలిటీ పాటిస్తూ, మీరు ఏ కారణాలతో ఉన్నత విద్య కోసం యూఎస్ వెళ్లాలని అనుకుంటున్నారో, మీరు ఎంపికచేసుకున్న కోర్సుతో భవిష్యత్ కెరీర్లో ఏం చేస్తారో చెప్పగలిస్తే మీ స్టూడెంట్ వీసా దాదాపు ఆమోదం పొందినట్లు భావించవచ్చు.
అలానే మీరు జాయిన్ అయ్యే యూనివర్సిటీ మరియు ఎంపిక చేసుకున్న కోర్సు, యూనివర్సిటీ వుండే స్టేట్ కోసం పలు ప్రశ్నలను సంధించే అవకాశం ఉంటుంది. కావున ఈ వివరాలపై ఇంటర్వ్యూకి వెళ్లేముందు దృష్టి పెట్టండి. అడ్మిషన్ లెటర్ తో పాటుగా మీరు జాయిన్ అయ్యే యూనివర్సిటీ జారీ చేసిన Form I-20 ని ఇంటర్వ్యూకి తప్పనిసరి తీసుకెళ్లాల్సి ఉంటుంది.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఏం ఉండదు. ఇంటర్వ్యూ అధికారి అడగకుండా మీరు ఏంటి డాక్యూమెంట్స్ అందించాల్సిన అవసరం లేదు. మీ అడ్మిషన్ వివరాలు, వీసా ఆఫీసర్ అడిగిన ప్రశ్నలకు మీరు చెప్పిన సమాదానాలు సంతృప్తికరంగా ఉంటె తర్వాత ప్రక్రియలో భాగంగా మీ ఫింగర్ ప్రింట్ డేటా సేకరిస్తారు.
దరఖాస్తు ఏమైనా సందేహాలు ఉంటె అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ కోసం పై అధికారులకు రిఫర్ చేస్తారు. ఏది ఏమైనా ఇంటర్వ్యూ ముగిసిన 2 నుండి 3 వారాల్లో మీ వీసా జారీ అయ్యిందా లేదా అనే సమాచారం మీకు అందిస్తారు.
వీసా అధికారి ప్రధానంగా విద్యార్థి ఫైనాన్సియల్ రిపోర్ట్ పరిశీలిస్తారు. ముఖ్యంగా F1 వీసా ద్వారా వెళ్లే విద్యార్థులు, కోర్సును పూర్తిచేయగలిగే ఫైనాన్సియల్ సపోర్టు కలిగి ఉన్నరా లేదా అంచనా వేస్తారు. దీని కోసం గడిసిన మూడు నాలుగేళ్ళ కుటుంబ ఫైనాన్సియల్ రిపోర్ట్ అందించాల్సి వస్తుంది. అదే విద్యార్థి స్కాలర్షిప్ లేదా ఎడ్యుకేషన్ లోన్ సుపోర్ట్ ద్వారా వెళితే, వాటికీ సంబంధించిన పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది.
విద్యార్థి వీసాలనును యూనివర్సిటీ తరగతులు ప్రారంభం అయ్యేందుకు 120 రోజుల ముందే జారీ చేస్తారు. అయితే కోర్సు ప్రాంభమయ్యేందుకు 30 రోజుల ముందు మాత్రమే ఆ దేశంలోకి అనుమతిస్తారు. తరగతులు ప్రారంభం అయ్యేందుకు 60 రోజుల ముందర ఎటువంటి వీసాలు జారీ చేయరు. కోర్సు పూర్తిచేశాక 60 రోజులలో అమెరికాను విడిచి వెళ్లాల్సి ఉంటుంది. కావాలనుకుంటే ఇంకో ఏడాది వీసా గడువును పొడిగించుకునే అవకాశం కల్పిస్తారు.
యూఎస్ స్టూడెంట్ వీసా ఒక్కటే సరిపోదు
యూఎస్ స్టూడెంట్ వీసా జారీ అయినంతా మాత్రాన నేరుగా యూఎస్ వెళ్లిపోయినట్లు కాదు. స్టూడెంట్ వీసా కేవలం మీరు అమెరికా ఎయిర్ పోర్ట్ యందు దిగేందుకు వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. యూఎస్ ఎయిర్ పోర్ట్ దిగిన వెంటనే అమెరికాలో తిరిగేందుకు ఇతర అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అనుమతిని ఎయిర్ పోర్ట్ యందు ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (DHS), యు.ఎస్. కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అధికారులు అందిస్తారు.
విమానం దిగగానే పై అధికారుల దగ్గరుకు పోయి మీ పాస్‌పోర్ట్, Form I-20, అడ్మిషన్ లెటర్, వీసా పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అన్ని వివరాలు ఖచ్చితంగా ఉంటె..మీ పాస్‌పోర్ట్ లేదా పేపర్ ఫారం I-94 పై అడ్మిషన్ స్టాంప్ వేచి మీ రాక / బయలుదేరే రికార్డును నమోదు చేసి అనుమతిస్తారు. లేకుంటే మీవి, మీ చేతిలో పెట్టి రిటర్న్ విమానం ఎక్కించి ఇండియాకు సాగనంపుతారు.
యూఎస్ స్టూడెంట్ వీసా కోసం కావాల్సిన డాక్యూమెంట్స్
- చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్. పాస్‌పోర్ట్ తప్పనిసరి 6 నెలల ముందు ఆమోదం పొంది ఉండాలి. కుటుంబ సభ్యులు ఇంకెవరైనా పాస్‌పోర్ట్ కలిగి ఉంటె వాటి వివరాలు కూడా అందించాలి.
- ప్రింట్ తీసిన వీసా దరఖాస్తు ఫారం DS-160 నిర్ధారణ పేజీ.
- వీసా దరఖాస్తు రుసుము చెల్లింపు రసీదు.
- ఫారం DS-160 లో అప్‌లోడ్ చేసిన మీ ఫోటో.
- మీ యూనివర్సిటీ జారీ చేసిన Form I-20.
- యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్, ఎంట్రన్స్ ఎగ్జామ్ ర్యాంకు కార్డు.
- Admission Essay or SOP statement of purpose.
- ఫ్యామిలీ ఫైనాన్సియల్ రిపోర్టు ( ట్యూషన్ ఫజు, జీవన మరియు ప్రయాణ ఖర్చులను చెల్లించే ఆర్థిక స్తోమత కలిగి ఉన్నట్లు).
- ఇతర వ్యక్తిగత అకాడమిక్ సర్టిఫికెట్స్, పర్సనల్ ఐడీ కార్డ్స్, అడ్రస్ కార్డ్స్
యూఎస్ ఇమిగ్రేషన్ వెబ్‌సైట్లు
DEPARTMENT of STATE / BUREAU of CONSULAR AFFAIR | Website |
U.S. Immigration and Customs Enforcement | Website |
Education In US | Website |
Department of Homeland Security (Study in the States) | Website |
US Embassy | Website |
ఇండియాలో అమెరికా రాయభారి కార్యాలయాలు
U.S. Consulate General in HyderabadPaigah Palace |
U.S. Consulate General in ChennaiGemini Circle |
U.S. Embassy in New DelhiShantipath, Chanakyapuri |
U.S. Consulate General in MumbaiC-49, G-Block, Bandra Kurla Complex |