Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 24 జనవరి 2024
January Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 24 జనవరి 2024

January 24, 2024 Current affairs in Telugu. రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో పొందండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షల కొరకు సిద్దమవుతున్న ఆశావహుల కోసం వీటిని అందిస్తున్నాం.

సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2024

ఉత్తరప్రదేశ్‌లోని 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2024 కోసం ఎంపిక చేయబడింది. 2023 ఉత్తరాఖండ్ వరదల బాధితులకు వైద్య సహాయం అందించడంలో ఆదర్శప్రాయమైన సేవలకు గాను ఈ ఆసుపత్రి గుర్తింపు పొందింది. జనవరి 23, 2024న న్యూ ఢిల్లీలో జరిగిన ఒక వేడుకలో ఈ అవార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రదానం చేశారు.

సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం అనేది విపత్తు నిర్వహణలో విశేష కృషి చేసిన వ్యక్తులకు మరియు సంస్థలకు భారత ప్రభుత్వం అందించే వార్షిక పురస్కారం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా 23 జనవరి 2020లో ఈ అవార్డును ఏర్పాటు చేశారు. ఈ అవార్డు కింద సంస్థలకు ₹51 లక్షలు మరియు వ్యక్తులకు ₹5 లక్షల నగదు బహుమతిని అందజేస్తుంది.

ఉత్తరప్రదేశ్‌లోని 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్ 1942లో స్థాపించబడింది. ఇది భారత సాయుధ దళాల యొక్క ఏకైక వైమానిక వైద్య సంస్థ. ఇది వివిధ ప్రపంచ సంక్షోభాలలో దాని అసాధారణమైన సేవలకు గుర్తింపు పొందింది. ఈ సంస్థ ప్రకృతి వైపరీత్యాల సమయంలో మరియు యుద్ధ సమయాల్లో జాతీయంగా మరియు అంతర్జాతీయంగా పెద్దఎత్తున మానవతా మరియు విపత్తు సహాయ కార్యకలాపాలు నిర్వహిస్తుంది.

60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్ 2013లో ఉత్తరాఖండ్ వరదలు, 2015లో ఆపరేషన్ మైత్రి పేరుతో నేపాల్ భూకంపం, 2018లో ఆపరేషన్ సముద్ర భాగంగా ఇండోనేషియా సునామీ సమయంలో వైద్య సహాయం అందించింది. ఇటీవల ఫిబ్రవరిలో టర్కీ మరియు సిరియాలో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపానికి ప్రతిస్పందనగా 99-సభ్యుల బృందాన్ని సమీకరించింది. ఆపరేషన్ దోస్త్‌లో భాగంగా 12 రోజుల వ్యవధిలో 3600 మంది రోగులకు సంరక్షణను అందించింది.

హమారా సంవిధాన్, హమారా సమ్మాన్ ప్రచార కార్యక్రమం ప్రారంభం

భారతదేశ 75వ గణతంత్ర సంవత్సరాన్ని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ 'హమారా సంవిధాన్, హమారా సమ్మాన్' అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన సూత్రాలకు పౌరుల సమిష్టి నిబద్ధతను పునరుద్ఘాటించడం ఈ ప్రచారం లక్ష్యం. ఈ ప్రచార కార్యక్రమం అణగారిన వర్గాలకు చట్టబద్ధంగా సాధికారత కల్పించడం మరియు వారికి న్యాయం జరిగేలా చూడటంపై దృష్టి సారిస్తుంది.

ఇందులో భాగంగా పాఠశాలలు, కళాశాలలు మరియు బహిరంగ ప్రదేశాల్లో ప్రచార సామాగ్రి పంపిణీతో సహా వివిధ మాధ్యమాలను ఉపయోగించి రాజ్యాంగం యొక్క సూత్రాలు మరియు విలువల గురించి ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. ఇది అట్టడుగు వర్గాలకు న్యాయ సహాయం మరియు కౌన్సెలింగ్ అందించడంపై దృష్టి పెడుతుంది. ప్రభుత్వం ఉచిత న్యాయ సహాయ శిబిరాలను నిర్వహిస్తుంది, తద్వారా అణగారిన ప్రజలు వారి చట్టపరమైన సమస్యలను పరిష్కరించడంలో సహాయం అందిస్తుంది.

హమారా సంవిధాన్, హమారా సమ్మాన్ ప్రచారం భారత రాజ్యాంగాన్ని రక్షించడంలో మరియు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన అడుగు. రాజ్యాంగం యొక్క సూత్రాలు మరియు విలువల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి మరియు అట్టడుగు వర్గాలకు చట్టబద్ధంగా అధికారం కల్పించడానికి ఈ ప్రచారం పనిచేస్తోంది.

22 మంది భారతీయ సంతతి శాస్త్రవేత్తలకు వైభవ్ ఫెలోషిప్

కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 22 మంది భారతీయ సంతతి శాస్త్రవేత్తలకు వైభవ్ ఫెలోషిప్ అందజేశారు. న్యూ ఢిల్లీలో జరిగిన వైయష్విక్ భారతీయ విజ్ఞానిక్ వైభవ్ ఫెలోషిప్‌ల మొదటి బ్యాచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీటిని అందించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, భారత్  అంతరిక్షం, ఆవిష్కరణలు, క్వాంటం మిషన్ మరియు బయోటెక్నాలజీ రంగంలో భారీ పురోగతి సాధించిందని పేర్కొన్నారు.

వైష్విక్ భారతీయ వైజ్ఞానిక్ ఫెలోషిప్ (వైభవ్ ఫెలోషిప్) ప్రోగ్రామ్‌ అనేది విదేశాల్లో వివిధ పరిశోధనలలో నిమగ్నమైన భారతీయ సంతతికి చెందిన అత్యుత్తమ శాస్త్రవేత్త/సాంకేతికవేత్తలను భారతీయ పరిశోదన సంస్థలతో కనెక్ట్ చేసే ఒక కార్యక్రమం. దీనిని జూన్ 2023లో భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద అమలు చేస్తున్నారు. భారతదేశ ఉన్నత విద్యా మరియు శాస్త్రీయ సంస్థల పరిశోధన పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడం వైభవ్ ఫెలోషిప్ లక్ష్యం.

ఈ పథకం భారతీయ ఉన్నత విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ నిధులతో కూడిన శాస్త్రీయ సంస్థలు మరియు భారతీయ డయాస్పోరా శాస్త్రవేత్తల మధ్య సహకారాన్ని అందిస్తుంది. వైభవ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ గరిష్టంగా 3 సంవత్సరాల నిడివితో అందిస్తారు. ఎంపికైన పరిశోధకులు కనీసం భారత పరిశోధన విభాగాల కోసం సంవత్సరంలో రెండు నెలలు వెచ్చించాల్సి ఉంటుంది.

ఎంపికైన సభ్యులు క్వాంటం టెక్నాలజీ, హెల్త్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్, ఎనర్జీ, కంప్యూటర్ సైన్సెస్ మరియు మెటీరియల్ సైన్సెస్ వంటి 18 గుర్తించబడిన నాలెడ్జ్ వర్టికల్స్‌లో పని చేయాల్సి ఉంటుంది. వీరికి ఫెలోషిప్ గ్రాంట్ కింద నెలకు రూ. 4,00,000 అందిస్తారు. అలానే అంతర్జాతీయ మరియు దేశీయ ప్రయాణం, వసతి సౌకర్యం కూడా కల్పిస్తారు.

భారతీయ భాషల్లో స్టడీ మెటీరియల్స్ కోసం అనువాదిని యాప్‌ ప్రారంభం

భారతీయ భాషల్లో డిజిటల్ స్టడీ మెటీరియల్‌లను అందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత 'అనువాదిని' యాప్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలో బహుభాషా విద్యను ప్రోత్సహించడం మరియు అభ్యాస సౌలభ్యాన్ని మెరుగుపరచడం కోసం దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ చొరవ భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో జాబితా చేయబడిన అన్ని భాషలలో డిజిటల్ స్టడీ మెటీరియల్‌లను అందిస్తుంది.

ఇది విద్యార్థి తన మాతృభాషలో విద్యను ప్రోత్సహించే జాతీయ విద్యా విధానం 2020 సిఫార్సుకు అనుగుణంగా రూపొందించబడింది. ఇది భాషా అవరోధాలను తొలగించడం మరియు వివిధ ప్రాంతీయ భాషలలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌లను అందుబాటులో ఉంచడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ యాప్ యందు అన్ని రాష్ట్రాల పాఠశాల మరియు ఉన్నత విద్యా కోర్సులకు సంబంధించిన స్టడీ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో యూజీసీ, ఏఐసీటీఈ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌లు కూడా రాష్ట్ర పాఠశాలలు, యూనివర్సిటీలకు సంబంధించిన కోర్సులు కూడా అందుబాటులోకి రానున్నాయి.

గణతంత్ర దినోత్సవంలో త్రివిధ దళాల మహిళా పరేడ్‌

జనవరి 26, 2024న జరిగిన 75వ గణతంత్ర దినోత్సవం పరేడ్‌లో భారత సైన్యం, నావికాదళం మరియు వైమానిక దళంలోని సిబ్బందితో కూడిన పూర్తి మహిళా ట్రై-సర్వీసెస్ బృందం కర్తవ్య మార్గంలో కవాతు చేసి చరిత్ర సృష్టించింది. ఇందులో భారత ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ నుండి 144 మంది మహిళా అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

144 మంది మహిళా అధికారులు మరియు సిబ్బందితో కూడిన ఈ బృందానికి మిలటరీ పోలీసు కెప్టెన్ సంధ్య నాయకత్వం వహించారు. ముగ్గురు సూపర్‌న్యూమరీ అధికారులు కెప్టెన్ శరణ్య రావు (ఆర్మీ), సబ్ లెఫ్టినెంట్ అన్షు యాదవ్ (నేవీ), మరియు ఫ్లైట్ లెఫ్టినెంట్ సృష్టి రావు (ఎయిర్ ఫోర్స్) వారివారీ సిబ్బందిని లీడ్ చేశారు.

భారత రిపబ్లిక్ డే పరేడ్‌లో మహిళలతో కూడిన ట్రై-సర్వీసెస్ బృందం పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ ప్రదర్శన భారత సాయుధ దళాలలో మహిళల పాత్ర పెరుగుదలను చూపిస్తుంది. ఈ చొరవ భారత సాయుధ దళాలలో లింగ సమానత్వాన్ని సాధించడానికి ఒక ముఖ్యమైన అడుగుగా పనిచేసింది, ఇది ఆయా రంగాలలో మరింత మహిళల చేరికను ప్రోత్సహిస్తుంది.

గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో మొత్తం మహిళలతో కూడిన ట్రై-సర్వీసెస్ బృందం పాల్గొనడం కేవలం ఉత్సవ కార్యక్రమం కాదు. ఇది భారతదేశంలోని మహిళల పురోగతి మరియు సాధికారత యొక్క శక్తివంతమైన దృశ్యాన్ని ప్రదర్శిస్తుంది. అలానే ఇది దేశానికి సేవ చేయడంలో వారి అచంచలమైన నిబద్ధతను తెలుపుతుంది.

ఐసీసీ 2023 అవార్డులు మరియు టీమ్ ఆఫ్ ది ఇయర్‌ వివరాలు

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2023 ఏడాదికి సంభందించి అన్ని ఫార్మాట్లలో క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు ఐసీసీ అవార్డులు ప్రకటించింది. ఐసిసి పురుషుల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023ను ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ దక్కించుకోగా ఐసిసి పురుషుల వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 కిరీటాన్ని భారత వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గెలుచుకున్నాడు. అలానే ఐసీసీ పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డును ఆస్ట్రేలియా బ్యాట్సమ్యాన్ ఉస్మాన్ ఖవాజా సొంతం చేసుకున్నాడు.

ఐసీసీ అవార్డు క్రీడాకారుడు దేశం
ఐసిసి పురుషుల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 పాట్ కమిన్స్ ఆస్ట్రేలియా
ఐసిసి పురుషుల వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 విరాట్ కోహ్లీ ఇండియా
ఐసీసీ పురుషుల టీ20ఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 సూర్యకుమార్ యాదవ్ ఇండియా
ఐసీసీ పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 ఉస్మాన్ ఖవాజా ఆస్ట్రేలియా
ఐసీసీ పురుషుల అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 బాస్ డి లీడే నెదర్లాండ్స్
ఐసీసీ పురుషుల ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 రచిన్ రవీంద్ర దక్షిణాఫ్రికా
ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 నాట్ స్కివర్-బ్రంట్ ఇంగ్లాండ్
ఐసీసీ మహిళల వన్డే క్రికెట్ ఆఫ్ ది ఇయర్ 2023 చామరి ఆటపట్టు శ్రీలంక
ఐసీసీ మహిళల టీ20ఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 హేలీ మాథ్యూస్ వెస్టిండీస్
ఐసీసీ ఉమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 క్వీంటర్ అబెల్ కెన్యా
ఐసీసీ ఉమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 ఫోబ్ లిచ్‌ఫీల్డ్ ఆస్ట్రేలియా
ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు 2023 జింబాబ్వే జట్టు జింబాబ్వే
ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్ 2023 రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఇంగ్లండ్

ఐసీసీ పురుషుల టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023 : ఉస్మాన్ ఖవాజా, దిముత్ కరుణరత్నే, కేన్ విలియమ్సన్, జో రూట్, ట్రావిస్ హెడ్, రవీంద్ర జడేజా, అలెక్స్ కారీ (కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), ఆర్ అశ్విన్, మిచెల్ స్టార్క్, స్టువర్ట్ బ్రాడ్.

ఐసీసీ పురుషుల వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023 : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమాన్ గిల్, ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్ (కీపర్), మార్కో జాన్సెన్, ఆడమ్ జాంపా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ.

ఐసీసీ పురుషుల టీ20ఐ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023 : యశస్వి జైస్వాల్, ఫిల్ సాల్ట్, నికోలస్ పూరన్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), మార్క్ చాప్మన్, సికందర్ రజా, అల్పేష్ రంజానీ, మార్క్ అడైర్, రవి బిష్ణోయ్, రిచర్డ్ షిప్.

ఐసీసీ మహిళల వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023 : ఫోబ్ లిచ్ఫీల్డ్, చమరి అతపత్తు (కెప్టెన్), ఎల్లీస్ పెర్రీ, అమేలియా కెర్, బెత్ మూనీ (కీపర్), నాట్ స్కివర్-బ్రంట్, యాష్ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, నాడిన్ డి క్లర్క్, లీ తహుహు, నహిదా అక్టర్.

ఐసీసీ మహిళల టీ20ఐ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023 : చమరి అతపత్తు (కెప్టెన్), బెత్ మూనీ (కీపర్), లారా వోల్వార్డ్ట్, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, అమేలియా కెర్, ఎల్లీస్ పెర్రీ, యాష్ గార్డనర్, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, మేగాన్ షట్.

బీసీసీఐ అవార్డులు 2024 విజేతలు

భారత క్రికెట్ బోర్డు 2019 నుండి 2023 ఏడాదిలకు సంభందించి అన్ని ఫార్మాట్లలో క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు బీసీసీఐ అవార్డులు 2024ను ప్రకటించింది. 2006-07లో  ప్రారంభించిన బీసీసీఐ అవార్డులు 2019 నుండి అవార్డుల ప్రదానోత్సవం జరగలేదు. గత నాలుగు సంవత్సరాల అవార్డుల విజేతలను హైదరాబాద్‌లో జరిగిన గ్లిట్జీ వేడుకలో ప్రకటించారు.

  • కల్నల్ సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు :
    ఫరోఖ్ ఇంజనీర్, రవిశాస్త్రి
  • పాలీ ఉమ్రిగర్ అవార్డు - ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ - పురుషులు :
    మహ్మద్ షమీ (2019-20), రవిచంద్రన్ అశ్విన్ (2020-21), జస్ప్రీత్ బుమ్రా (2021-22), శుభ్‌మన్ గిల్ (2022-23)
  • ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ - మహిళలు :
    దీప్తి శర్మ (2019-20, 2022-23), స్మృతి మంధాన (2020-21, 2021-22)
  • ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం - పురుషులు :
    మయాంక్ అగర్వాల్ (2019-20), అక్షర్ పటేల్ (2020-21), శ్రేయాస్ అయ్యర్ (2021-22), యశస్వి జైస్వాల్ (2022-23)
  • ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం - మహిళలు :
    ప్రియా పునియా (2019-20), షఫాలీ వర్మ (2020-21), సబ్భినేని మేఘన (2021-22), అమంజోత్ కౌర్ (2022-23)
  • దిలీప్ సర్దేశాయ్ అవార్డు - టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు :
    యశస్వి జైస్వాల్ (2022-23)
  • దిలీప్ సర్దేశాయ్ అవార్డు - టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు :
    రవిచంద్రన్ అశ్విన్ (2022-23)
  • వన్డేల్లో అత్యధిక పరుగులు చేసినవారు - మహిళలు :
    పూనమ్ రౌత్ (2019-20), మిథాలీ రాజ్ (2020-21), హర్మన్‌ప్రీత్ కౌర్ (2021-22), జెమిమా రోడ్రిగ్స్ (2022-23)
  • వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మహిళలు :
    పూనమ్ యాదవ్ (2019-20), ఝులన్ గోస్వామి (2020-21), రాజేశ్వరి గయక్వాడ్ (2021-22), దేవికా వైద్య (2022-23)
  • దేశీయ క్రికెట్‌లో ఉత్తమ అంపైర్ :
    ఎ పద్మనాభన్ (2019-20), బృందా రాఠి (2020-21), జయరామన్ మదగోపాల్ (2021-22), రోహన్ పండిట్ (2022-23)
  • బీసీసీఐ దేశీయ టోర్నమెంట్లలో అత్యుత్తమ ప్రదర్శన :
    ముంబై (2019-20), మధ్యప్రదేశ్ (2021-22), సౌరాష్ట్ర (2022-23)
  • లాలా అమర్‌నాథ్ అవార్డు - రంజీ ట్రోఫీలో బెస్ట్ ఆల్ రౌండర్ :
    ఎంబి మురాసింగ్ (2019-20), షామ్స్ ములానీ (2021-22), శరన్ష్ జైన్ (2022-23)
  • లాలా అమర్‌నాథ్ అవార్డు - దేశీయ పరిమిత ఓవర్లలో ఉత్తమ ఆల్ రౌండర్ :
    బాబా అపరాజిత్ (2019-20), ఆర్ఆర్ ధావన్ (2020-21, 2021-22), రియాన్ పరాగ్ (2022-23)
  • మాధవరావు సింధియా అవార్డ్ - రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు :
    రాహుల్ దలాల్ (2019-20), సర్ఫరాజ్ ఖాన్ (2021-22), మయాంక్ అగర్వాల్ (2022-23)
  • మాధవరావు సింధియా అవార్డు - రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ :
    జయదేవ్ ఉనద్కత్ (2019-20), షామ్స్ ములానీ (2021-22), జలజ్ సక్సేనా (2022-23)
  • ఎంఎ చిదంబరం ట్రోఫీ - అండర్-19 కూచ్ బెహార్ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు :
    పి కాన్పిల్లెవార్ (2019-20), మయాంక్ శాండిల్య (2021-22), డానిష్ మాలెవార్ (2022-23)
  • ఎంఎ చిదంబరం ట్రోఫీ - అండర్-19 కూచ్ బెహార్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు :
    హర్ష్ దూబే (2019-20), ఎఆర్ నిషాద్ (2021-22), మానవ్ చోటాని (2022-23)
  • జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ - బెస్ట్ ఉమెన్ క్రికెటర్ సీనియర్ డొమెస్టిక్ :
    సాయి పురందరే (2019-20), ఇంద్రాణి రాయ్ (2020-21), కనికా అహుజా (2021-22), నబమ్ యాపు (2022-23)
  • జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ - బెస్ట్ ఉమెన్ క్రికెటర్ జూనియర్ డొమెస్టిక్ :
    కష్వీ గౌతమ్ (2019-20), సౌమ్య తివారీ (2021-22), వైష్ణవి శర్మ (2022-23)

Post Comment