Advertisement
ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్ గైడెన్స్
Entrepreneur Guide

ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్ గైడెన్స్

ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఏంటి ? బిజినెస్ లేదా స్టార్టప్‌ రిజిస్ట్రేషన్ సంబంధించి ఎక్కువ మంది ఎంపిక చేసుకునే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రైవేట్ లిమిటెడ్. చిన్న, మధ్య మరియు భారీ ప్రరిశ్రములు కూడా ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్'కు ప్రాధ్యానత ఇస్తాయి. ఇతర రిజిస్ట్రేషన్ ప్రక్రియలతో పోల్చుకుంటే ప్రైవేట్ లిమిట్ కంపెనీలకు ఉండే సౌలభ్యలు ఎక్కువ.

కొందరు ప్రైవేట్ యాజమాన్యులు మరియు ప్రైవేట్ వాటాదారుల ఆదీనంలో నడిచే సంస్థలను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అంటారు. ఈ కంపెనీకి సంబంధించి యాజమాన్య హక్కులు అందులో పెట్టుబడి పెట్టిన వ్యక్తుల వాటాలపై ఆధారపడి పరిమితంగా ఉంటాయి.

ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్టేషన్ ఎందుకు..? లక్ష కనీస పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించవచ్చు. ఇద్దరు డైరెక్టర్లు ఉంటె వ్యాపారం రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రైవేట్ లిమిటెడ్ నేమ్ ట్యాగ్ తో పెట్టుబడులను ఆకర్షించవచ్చు. వ్యాపారంలో నష్టపోయిన డైరెక్టర్లు, షేర్ హోల్డర్లు వ్యక్తిగత ఆస్తులు కోల్పోయే భయముండదు.

వీటన్నింటికి మించి ప్రభుత్వం ఇచ్చే టాక్స్ బెనిఫిట్స్ వలన యాజమాన్యాలు ఎక్కువ లాభాలను అర్జించవచ్చు. ఈ అన్ని ప్రయోజనాల వలన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్ భారతదేశంలో ఎక్కువ ప్రాచుర్యం పొందుతుంది.

ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ అవసరమయ్యే వ్యాపారాలు : పెట్టుబడులు అవసరమయ్యే వ్యాపారాలు. బ్యాంకుల నుండి సులభంగా అప్పులు కావాలనుకునే వారు. రాష్ట్రా, జాతీయ మరియు అంతర్జాతీయ పరిధిలో వ్యాపారం చేయాలనుకునే వారు. నాణ్యమైన మానవ వనరులు అవసరమయ్యే వారు. మీ వ్యాపారానికి ప్రభుత్వ పరమైన గుర్తింపు మరియు ఇతర సౌలభ్యలు కోరుకునే వారికీ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ ఉత్తమ ఎంపిక.

ఇవాళ్టి రోజుల్లో పైవేవీ అవసరం లేకుండా ఒక వ్యాపారం లేదా స్టార్టప్ ప్రారంభించడం మరియు రన్ చేయడం అంత సులభం కాదు కాబట్టి వీరందికీ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి.

ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రాధమిక నియమావళి

  • ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్టర్ చేసేందుకు కనీసం ఇద్దరు డైరెక్టర్లు ఉండాలి గరిష్టంగా 15 మంది వరకు అవకాశం ఉంటుంది.
  • ప్రైవేట్ లిమిటెడ్ కంపనీలో వాటాదారులు కనిష్టంగా  ఇద్దరు గరిష్టంగా 200 మంది వరకు ఉండొచ్చు.
  • ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్ చేసేందుకు లక్ష రూపాయల కనీస పెట్టుబడి ఉండాలి.
  • రిజిస్టర్ కంపెనీ ఆఫీస్ కలిగి ఉండాలి. కంపెనీ ఆఫీస్ కమర్షియల్ భవనం కానవసరంలేదు. మీరు ఉండే ఇంటిని లేదా అనుమతి ధ్రువపత్రాలతో మీరుండే రెంటల్ హౌస్ కూడా ఆఫీసుగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్ కోసం కావాల్సిన డాక్యూమెంట్స్

  • ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్టర్ చేసేందుకు డైరెక్టర్లు, షేర్ హోల్డర్లు చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత మరియు నివాస ధ్రువపత్రాలు కలిగి ఉండాలి.
  • వ్యక్తిగత గుర్తింపు కోసం విదేశీయులు/ఎన్ఆర్ఐ సభ్యులు పాన్ కార్డు మరియు పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి.
  • వ్యక్తిగత గుర్తింపు కోసం భారతీయ పౌరులు ఓటర్ కార్డు/ పాస్‌పోర్ట్ / డ్రైవింగ్ లైసెన్స్ /పాన్ కార్డు కలిగి ఉండాలి.
  • చిరునామా గుర్తింపు కోసం తాజాగా తీసుకున్న బ్యాంకు స్టేటుమెంట్, టెలిఫోన్ బిల్, గ్యాస్ బిల్, కరెంటు బిల్ ఉండాలి.
  • పాస్‌పోర్ట్-సైజ్డ్ ఫొటోగ్రాఫ్ మరియు మీసొంత దస్తూరితో సంతకం (డైరెక్టర్లకు మాత్రమే) అందించాలి.
  • రిజిస్టర్ ఆఫీస్: ఆఫీసుకు సంబంధించిన ఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్ కలిగివుండాలి.
  • ఇంగ్లీషులో టైపుచేసిన నోటరైజ్డ్ రెంటల్ అగ్రిమెంట్ కలిగివుండాలి.
  • భవన యాజమాని నుండి నిరభ్యంతర పత్రం (NOC) పొందిఉండాలి.
  • సొంత భవనమైతే అమ్మకపు దస్తావేజు / ఆస్తి దస్తావేజు అందజేయాలి.

ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్ విధానం

ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ క్రింది 8 దశలలో పూర్తిచేయాల్సింది ఉంటుంది. ఇందులో కంపెనీ పేరు ఎంపిక నుండి, డైరెక్టర్ సిగ్నేచర్ సర్టిఫికెట్, డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్, eMOA మరియు eAOA డాక్యుమెంటేషన్, కంపెనీ PAN మరియు TAN పొందటం, జిఎస్టీ రిజిస్ట్రేషన్ వరకు పలు దశలు ఉంటాయి.

ఏకరూప కంపెనీ పేరు కోసం దరఖాస్తు చేయాలి డైరెక్టర్ సిగ్నేచర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేయాలి (DSC)
డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (DIN) eMOA మరియు eAOA డాక్యుమెంటేషన్
కంపెనీ PAN మరియు TAN నెంబర్ కోసం దరఖాస్తు చేయాలి ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్ మరియు కార్పొరేట్ ఐడెంటిటీ నెంబర్ జారీ
జిఎస్టీ రిజిస్ట్రేషన్, కంపెనీ ఆధార్, ఇంపోర్ట్ & ఎక్స్పోర్ట్ రిజిస్ట్రేషన్ కంపెనీ బ్యాంకు అకౌంట్  కోసం దరఖాస్తు

యూనిక్ కంపెనీ పేరు ఎంపిక

కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అతి ముఖ్యమైన భాగం మీ వ్యాపారానికి మంచి పేరు ఎంపిక చేయడం. అది అక్షర సరూపంలో కానీ, పలకడంలో కానీ ఇంకో కంపెనీ పేరును పోలి ఉండకూడదు. అందుకారణంగా మీ బిజినెస్ కు పేరు పెట్టేముందు MCA (మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్) వెబ్సైటులో  సంబంధించిన బిజినెస్ పేరు మరియు ట్రేడ్ మార్క్ సంబంధిత వివరాలు ముందుగా శోధించి పూర్తి వివరాలు సేకరించండి.

అలానే నేమ్ రిజిస్ట్రేషన్ కోసం MCA కు దరఖాస్తు చేసేటప్పుడు ముందు జాగ్రత్తలో భాగంగా 3 నుండి 4 ఆప్షనల్ నేమ్స్ సిపార్సు చేయండి. ఒక బిజినెస్ నేమ్ పాపులర్ గా ఉండటం ఎంతుయా ముఖ్యమో అది రాబోయే కాలంలో చిక్కులు తేకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం.

ప్రైవేట్ లిమిట్ రిజిస్ట్రేషన్ కంపెనీలు వాటి పేరు వెనక ప్రైవేట్ లిమిటెడ్ నేమ్ ట్యాగ్ ఉండటం తప్పనిసరి. అలానే ఈరోజుల్లో ప్రతి బిజినెస్ కు ఒక వెబ్సైటు ఉండటం తప్పనిసరి.  కంపెనీ పేరు ఖరారు చేసేముందు మీ పేరుకు సంబంధించిన డొమైన్ నేమ్ (.in/.com) అందుబాటులో ఉందేలేదో చెక్ చేసుకోండి.

మీ కంపెనీ పేరులో ఇన్సూరెన్సు , బ్యాంక్, స్టాక్ ఎక్స్ఛేంజ్, వెంచర్ క్యాపిటల్, అసెట్ మేనేజ్మెంట్, మ్యూచువల్ ఫండ్ మొదలైన పదాలు ఉంటె ఆర్బిఐ, సెబీ, ఆర్డిఐల ఆమోదాలు అవసరం. ఇంటర్నేషనల్, గ్లోబ్, కాంటినెంటల్, ఆసియాటిక్, ఆసియా, ఇండస్ట్రీస్, ఉద్యోగ్, హిందుస్తాన్, ఇండియా, భారత్, ఎంటర్ప్రైజెస్, ప్రొడక్ట్స్, బిజినెస్ మొదలైన పదాలను కలిగి ఉండే కంపెనీలు కనీసం 5 లక్షలు ప్రారంభ పెట్టుబడి కలిగి ఉండాలి.

DSC & DIN రిజిస్ట్రేషన్

ఇంటర్నెట్ అధికారిక దరఖాస్తులు పూర్తిచేసేందుకు డైరెక్టర్ సిగ్నేచర్ సర్టిఫికెట్ (DSC) తప్పనిసరి. ఒక సారి DSC పొందేక దాని కాలపరిమితి ఒకటి లేదా రెండేళ్లు ఉంటుంది. తర్వాత దాన్ని క్రమానుగతంగా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.

DSC లేనిదే డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (DIN) కు దరఖాస్తు చేయలేము. DIN లేనిదే కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగదు. ప్రతి కంపెనీ డైరెక్టర్ DIN కలిగి ఉండటం తప్పనిసరి. DIN కంపెనీ డైరెక్టర్ సంబంధించిన వ్యక్తిగత సమాచారం కలిగి ఉంటుంది.

ఇది ఫేక్ కంపెనీ రిజిస్ట్రేషన్లలు జరగకుండా ఉండేందుకు, ఫైనాన్సియల్ స్కామ్స్ జరిగేటప్పుడు ఆ డైరెక్టర్లు తప్పించుకునేందుకు అవకాశం లేకుండా చేస్తుంది. DIN నెంబర్ కోసం సంబంధిత ధ్రువపత్రాలతో MCA వెబ్సైటు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

eMOA మరియు eAOA డాక్యుమెంటేషన్

eMOA (మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్) మరియు eAOA (ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ) డాక్యుమెంటేషన్ నిబంధన ప్రక్రియ 2013 కంపెనీ చట్టంలో MCA ప్రవేశ పెట్టింది. వీటికి సంబంధించిన ఫారం నెంబర్ IN 33 & IN 34 తప్పనిసరి పూర్తిచేయాల్సి ఉంటుంది.

ఈ నిబంధన ప్రకారం కంపెనీ స్థాపించేందుకు గల కారణంతో పాటుగా, పెట్టుబడుల గురించి, డైరెక్టర్లు, షేర్ హోల్డర్ల గురించి పూర్తి వివరాలు తెలియజేయాల్సి. ఈ వివరాలన్నీ నిబంధలు అనుచరించి ఆఫేడివిట్ రూపంలో అందించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తిచేసాక కంపెనీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

కంపెనీ పాన్ & ట్యాన్ కోసం దరఖాస్తు

ఇండియాలో బిజినెస్ చేసే ప్రతి వ్యాపార సంస్థ పాన్ (పర్మినెంట్ అకౌంట్ నెంబర్) మరియు టాన్ (టాక్స్ డెడిక్షన్ నెంబర్) నంబర్లు తప్పనిసరి కలిగి ఉండాలి.  ఆదాయ పన్ను చెల్లింపులు వాటికీ సంబందించిన రిటర్న్ లావాదేవీలు నిర్వహించేందుకు ఈ నంబర్లు అవసరం. పాన్, టాన్ నంబర్లకు దరఖాస్తు చేసే ముందు కంపెనీ పేరు తప్పనిసరి రిజిస్టర్ అయ్యి ఉండాలి. పాన్ మరియు టాన్ నంబర్లకు ఆదాయ పన్ను వెబ్సైటు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్ & కార్పొరేట్ ఐడెంటిటీ నెంబర్ జారీ

కంపెనీ రిజిస్ట్రేషన్ లో ఇది చివరి ప్రక్రియ. రిజిస్ట్రేషన్ కోసం అందించిన అన్ని వివరాలు సరైనవని MCA ధ్రువీకరించక ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్ మరియు కార్పొరేట్ ఐడెంటిటీ నెంబర్ జారీ చేస్తుంది. దీనికి 15 నుండి 20 రోజులు సమయం పడుతుంది.  ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్ జారీతో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్టేషన్ ప్రక్రియ పూర్తివుతుంది.

ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్ జారీ ద్వారా మీ కంపెనీకి అధికారకంగా వ్యాపారం చేసేందుకు అనుమతి లభించినట్లు అర్ధం. కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయ్యాక కరెంట్ బ్యాంకు అకౌంట్, జిఎస్టీ నెంబర్, కంపెనీ ఆధార్ మరియు ఇంపోర్ట్ & ఎక్స్పోర్ట్ సర్టిఫికెట్లు కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీనితో మీ కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సంపూర్ణంగా పూర్తిఅయినట్లు భావించవచ్చు.

ఈ ప్రక్రియ మొత్తం మీరు సొంతంగా చేసుకునేందుకు అన్నిరకాల రుసుములు కలుపుకుంటే 5000 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అదే కన్సల్టెన్సీ సంస్థలను ఆశ్రయిస్తే వారు ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు పది వేల నుండి 15 వేలు తీసుకుని ఈ మొత్తం ప్రక్రియ పూర్తిచేసి పెడతారు.

ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ ప్రయోజనాలు

ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ మీ వ్యాపారానికి కార్పొరేట్ లుక్ తెచ్చిపెడుతుంది. ఇది ఇన్వెస్టర్లను మరియు కస్టమర్లను ఆకర్షించేందుకు సహాయపడుతుంది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు బ్యాంకులు త్వరగా అప్పులు ఇచ్చేనందుకు మగ్గుచూపుతాయి. బిజినెస్ నడిపేందుకు అవసరమయ్యే నాణ్యమైన మానవ వనరులను ఆకర్షిస్తుంది. దీనితో నైపుణ్యం ఉండే టీంతో పనిచేసే అవకాశం లభిస్తుంది.

ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభించేందుకు ఇద్దరు డైరెక్టర్లు ఉంటె సరిపోతుంది. 200 వరకు షేర్ హోల్డర్లలు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం కల్పిస్తుంది. షేర్ హోల్డర్లకు పరిమితమైన హక్కులు ఉండటం వలన డైరెక్టర్లకు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఉంటుంది. కంపెనీ నష్టాల్లో కూరుకుపోయిన కంపెనీ యాజమాన్య వ్యక్తిగత ఆస్తులకు వచ్చే ముప్పు ఉండదు. కంపెనీ అమ్మకం, విలీనం మరియు యాజమాన్య మార్పులు సులభంగా నిర్వర్తించవచ్చు.

ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వం అనేక పన్ను ప్రయోజనలను చేకూర్చిపెడుతుంది. కంపెనీ నమోదు చేసే లాభాలపై టాక్స్ చెల్లిస్తే చాలు. వ్యక్తుల రాబడిపై పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు అంతర్జాతీయంగా వ్యాపారం చేసేందుకు అనుమతి ఉంటుంది. విదేశీ పెట్టుబడులు ఆహ్వానించేందుకు అవకాశం ఉంటుంది. ఇది నేటి టెక్ ఎంట్రీప్రెన్యూర్స్ ఎంతగానో లబ్ది చేకూరుస్తుంది.

ప్రైవేట్ లిమిట్ రిజిస్ట్రేషన్ వలన ఒనగూరే ప్రతికూలతలు

ప్రైవేట్ లిమిట్ రిజిస్ట్రేషన్ వలన ఒనగూరే ప్రయోజనాలతో పాటుగా కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. కంపెనీ రిజిస్టర్ చేసేందుకు 15 నుండి 20 రోజులు పడుతుంది. దరఖాస్తు రుసుములు కాసింత అధికంగా ఉంటాయి. కనీసం ఇద్దరు డైరెక్టర్లు, ఇద్దరు షేర్ హోల్డర్లు ఉండటం వలన ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉండదు. కంపెనీలో ఆర్థికపరమైన అవకతవకలు చోటుచేసుకుంటే దానికి డైరెక్టర్లు పూర్తిస్థాయి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

షేర్ హెల్డర్లు ఆర్జించే లాభాలకు టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. 200 దాటి షేర్ హోల్డర్లను చేర్చుకునేందుకు అవకాశం ఉండదు. MCA నిబంధనలు ప్రకారం ఏడాదిలో రెండుసార్లు బోర్డు మీటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. ఏడాదికోసారి కంపెనీ అకౌంట్స్ ఆడిట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది రిటర్న్స్ చేయాల్సి ఉంటుంది. వాటిపాటుగా అనేక కార్పొరేట్ ఫార్మాలిటీస్ అసరించాల్సిన అవకాశం ఉంటుంది.

Post Comment