క్రీడా వ్యవహారాలు | మే కరెంటు అఫైర్స్ 2022
Telugu Current Affairs

క్రీడా వ్యవహారాలు | మే కరెంటు అఫైర్స్ 2022

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధుకు కాంస్యం

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు తన రెండవ ఆసియా కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మనీలాలో జరిగిన ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ సెమీఫైనల్‌ మ్యాచులో జపాన్‌కు చెందిన టాప్-సీడ్ మరియు డిఫెండింగ్ ఛాంపియన్ అకానె యమగుచి చేతిలో ఓడిపోవడంతో కాంస్య పథకం దక్కించుకుంది. సింధు ఇదివరకు 2014 గిమ్‌చియాన్ ఎడిషన్‌లో తన మొదటి ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షి కాంస్యాన్ని గెలుచుకుంది.

Advertisement

ఖేలో మాస్టర్స్ గేమ్స్ రెండవ ఎడిషన్ ప్రారంభం

యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, మే 1వ తేదీన 2వ ఎడిషన్ ఖేలో మాస్టర్స్ గేమ్స్ ఢిల్లీ-2022 క్రీడా కార్యక్రమంను త్యాగరాజ్ స్టేడియంలో ప్రారంభించారు. ఖేలో మాస్టర్స్ ఇండియా ఫౌండేషన్ ద్వారా నిర్వహించే ఈ కార్యక్రమమును 30 నుంచి 95 ఏళ్లు మాస్టర్ అథ్లెట్ల కోసం ప్రారంభించారు. స్కూల్ పిల్ల కోసం నిర్వహించే ఖేలో ఇండియా గేమ్స్ మాదిరిగా యువత, పెద్దలను ఆటల్లో ప్రోత్సహించేందుకు దీనిని నిర్వహిస్తున్నారు.

తోలి కేరళ ఒలింపిక్ క్రీడలు ప్రారంభం

మొట్ట మొదటిసారి నిర్వహిస్తున్న కేరళ ఒలింపిక్ క్రీడలును ఆ రాష్ట్ర క్రీడల మంత్రి వీ అబ్దురహిమాన్ స్థానిక యూనివర్సిటీ స్టేడియంలో ప్రారంభించారు. ఈ మెగా బహుళ-క్రీడా ఈవెంటును స్థానిక క్రీడాకారులను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా కేరళ ఒలింపిక్స్ అసోసియేషన్ (KOA) ప్రతిపాదించింది.

రోనీ ఓసుల్లివన్'కు రికార్డుస్థాయిలో 7వ ప్రపంచ స్నూకర్ టైటిల్‌

రోనీ ఓసుల్లివాన్ రికార్డుస్థాయిలో ఏడవ ప్రపంచ స్నూకర్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన రోనీ ఓ'సుల్లివన్ స్నూకర్ చరిత్రలో అతిగొప్ప ప్లేయరుగా గుర్తింపు దక్కించుకున్నాడు. అత్యధిక ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లను గెలిచినా జాబితాలో స్టీఫెన్ హెండ్రీ మరియు రోనీ ఓ'సుల్లివన్'లు ఏడుసార్లు టైటిళ్లతో అగ్రస్థానంలో ఉన్నారు. వీరి తర్వాత రే రియర్డన్ మరియు స్టీవ్ డేవిస్ ఒక్కొక్కరు ఆరు టైటిల్స్ గెలుచుకున్నారు.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఇండియాకు నెం.1 ర్యాంకు

2016 లో కోల్‌కతాలో వెస్టిండీస్‌పై 3-0 సిరీస్ స్వీప్‌ తర్వాత మొదటిసారిగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఇండియా అగ్రస్థానాన్ని తిరిగి పొందింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మే 4న విడుదల చేసిన వార్షిక ఐసీసీ పురుషుల T20I టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత జాతీయ క్రికెట్ జట్టు నం.1 స్థానాన్ని కైవసం చేసుకుంది. 2021 T20 ప్రపంచ టోర్నమెంటులో ఘోరమైన పరాభవం తర్వాత రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత టీ ట్వంటీ జట్టు స్వదేశంలో న్యూజిలాండ్, వెస్టిండీస్ మరియు శ్రీలంకపై వైట్‌వాష్ నమోదు చేసింది.

సైప్రస్ ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్'లో జ్యోతి యర్రాజీకి స్వర్ణం

సైప్రస్ ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ మీట్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో భారత క్రీడాకారిణి జ్యోతి యర్రాజి జాతీయ రికార్డును బద్దలు కొట్టి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. 22 ఏళ్ల జ్యోతి 13.23 సెకన్లతో పోడియంపైకి దూసుకెళ్లి, 2002 నుంచి అనురాధ బిస్వాల్ పేరిట ఉన్న 20 ఏళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. అలానే మహిళల 1500 మీటర్ల రేసులో మరో భారత అథ్లెట్ లిలీ దాస్ స్వర్ణం సాధించగా, పురుషుల 200 మీటర్ల విభాగంలో భారత్‌కు చెందిన అమ్లాన్ బోర్గోహైన్ కాంస్య పతకం దక్కించుకున్నాడు.

భారత్ ఖాతాలో తొలి థామస్ కప్ టైటిల్‌

భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు చారిత్రాత్మక క్రీడా ప్రదర్శనతో తొలిసారి థామస్ కప్‌ను సొంతం చేసుకుంది. బ్యాంకాక్‌లో జరిగిన తుది పోరులో భారత్‌ 3-0 తేడాతో 14 సార్లు థామస్ కప్ విజేతయినా ఇండోనేషియా జట్టును చిత్తుచేయడం ద్వారా తోలి థామస్ కప్‌'ను సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన టైలో లక్ష్య సేన్ 8-21, 21-17, 21-16తో ఆంథోనీ గింటింగ్‌ను ఓడించడంతో ఈ చరిత్రత్మక అద్భుతం చోటుచేసుకుంది. భారత్ ఇది వరకు 1952, 1955 మరియు 1979 లలో సెమీఫైనల్'కు చేరుకుంది.

థామస్ కప్'ను ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్‌షిప్స్ గా అభివర్ణిస్తారు. ఇది బ్యాడ్మింటన్ సభ్య దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్ల మధ్య జరిగే అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీ. ఇది 1949 లో ప్రారంభించబడింది. ఇందులో 16 జట్లు పాల్గొంటాయి.

మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ 'కు స్వర్ణం

తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ ఐబిఏ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఆమె థాయ్‌లాండ్‌కు చెందిన జిట్‌పాంగ్ జుటామాస్‌ను 5-0 తేడాతో ఓడించడం ద్వారా ఈ ఘనత దక్కించుకుంది. దీనితో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన ఐదవ భారతీయ మహిళగా ఆమె రికార్డుకెక్కింది. ఈ జాబితాలో ఇది వరకు సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖ కేసీ మరియు మేరీ కోమ్'లు ఉన్నారు.

స్విమ్మర్ అరియార్న్ టిట్మస్ 400 మీటర్ల ఫ్రీస్టైల్ ప్రపంచ రికార్డు

ఆస్ట్రేలియన్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో టోక్యో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అరియార్న్ టిట్మస్ మహిళల 400 మీటర్ల ఫ్రీస్టైల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. సౌత్ ఆస్ట్రేలియన్ ఆక్వాటిక్ సెంటర్‌లో జరిగిన ఫైనల్‌లో టిట్మస్ 3 నిమిషాల 56.40 సెకన్లలో పూర్తిచేయడం ద్వారా కేటీ లెడెకీ (3:56ని) యొక్క మునుపటి రికార్డును అధిగమించింది.

700 ఫోర్లు బాదిన తొలి ఆటగాడిగా శిఖర్ ధావన్

పంజాబ్ కింగ్స్ ఓపెనింగ్ బ్యాటర్ శిఖర్ ధావన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) చరిత్రలో 700 ఫోర్లు కొట్టిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో తర్వాత రెండు స్థానాలలో డేవిడ్ వార్నర్ (577), విరాట్ కోహ్లీ (576) ఉన్నారు.

ఐపీఎల్ 2022 టైటిల్‌ విజేతగా గుజరాత్ టైటాన్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 టైటిల్ విజేతగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. మే 29 న అహ్మదాబాద్‌ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఏడు వికెట్ల తేడాతో అరంగేట్రం చేసిన మొదటి సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఛాంపియన్‌గా నిలిచింది. అలానే ఈ సీజన్ ఆరంజ్ టోపీను రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్ అందుకోగా, పర్పుల్ టోపీని అదే జట్టుకు చెందిన యుజ్వేంద్ర చాహల్ దక్కించుకున్నాడు.

Advertisement

Post Comment