Advertisement
వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం 2023 : పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
Scholarships

వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం 2023 : పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం కింద ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ, కాపు మరియు బ్రాహ్మణ విద్యార్థులకు వారు ఎంపిక చేసుకున్న కోచింగ్ సెంటర్లలో ఉచితంగా పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తారు. కుటుంబ ఆదాయం ఆరు లక్షల లోపు ఉండే విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసేందుకు అర్హులు.

ఈ పథకం పరిధిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి ఉద్యోగ పోటీ పరీక్షలకు ప్రైవేట్ ఇనిస్టిట్యూట్లలో ఉచిత కోచింగ్ అందిస్తారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అర్హుత పరీక్ష నిర్వహించి, ఇందులో ఎంపికైన విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు.

స్కాలర్షిప్ పేరు వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం
స్కాలర్షిప్ టైప్ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
ఎవరికి అందిస్తారు ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ, కాపు మరియు బ్రాహ్మణ విద్యార్థులు
అర్హుత కుటుంబ ఆదాయం 6 లక్షలలోపు

గత రెండేళ్లలో యూపీఎస్సీ, ఏపీపీఎస్సి లకు ఎంపికైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా శిక్షణ సంస్థలను టాప్‌ 5, టాప్‌ 6 – 10 మరియు ఇతర సంస్థలుగా విభజించారు. దీనిలో భాగంగా మొదటి కేటగిరిలోని ఇన్‌స్టిట్యూట్‌కు రూ.1,30,000; రెండో కేటగిరి ఇన్‌స్టిట్యూట్‌కు రూ.1,15,000; మూడో కేటగిరి ఇన్‌స్టిట్యూట్‌కు రూ.1,00,000 ను అభ్యర్థికి ఫీజుగా చెల్లిస్తారు.

శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు 80 శాతం బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి. 80 శాతం హాజరు ఉండే విద్యార్థులకు నెలకు స్టయిపెండ్‌ కింద హైదరాబాద్‌, ఇతర మెట్రోపాలిటన్‌ నగరాల్లో రూ.10000, సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌ దిల్లీలో ఉంటే రూ.12,000 ను అందిస్తారు.

దీంతోపాటు అన్ని కేటగిరీల అభ్యర్థులకు ప్రయాణ ఖర్చు కింద రూ.2000ను ఇస్తారు. అదనపు అలవెన్సులో భాగంగా మ్యాగజైన్‌ అలవెన్స్‌ కింద రూ.10000, ఇంటర్వ్యూలకు ఎంపికయ్యే అభ్యర్థులకు ఇతర అలవెన్సుల కింద రూ.10,000 అందిస్తారు.

వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం ఎలిజిబిలిటీ

కుటుంబ ఆదాయం ఆరు లక్షల లోపు ఉండే ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ, కాపు మరియు బ్రాహ్మణ విద్యార్థలు ఈ పథకానికి దరఖాస్తు చేసేందుకు అర్హులు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను అర్హుత పరీక్షా ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు 85 శాతం బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి.

వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం దరఖాస్తు

అర్హుత ఉండే అభ్యర్థులు ప్రభుత్వ జన్మభూమి పోర్టల్ వైఎస్ఆర్ విద్యోన్నతి ట్యాబ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సదురు డిపార్టుమెంటు అర్హుత పరీక్షా నిర్వహిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు వివరాలతో కూడిన మెసేజ్'ను మొబైల్ ఫోనుకు పంపిస్తారు.

డిపార్టుమెంట్ పంపించిన లింక్ ద్వారా ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ మరియు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి వస్తుంది. అందులో ఉండే కోచింగ్ సంస్థలలో ఒక దానిని అభ్యర్థి ఎంపిక చేసుకుని, కేటాయించిన సమయంలో సదురు సంస్థ వద్ద హాజరవ్వాల్సి ఉంటుంది.

Post Comment