Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 05 మార్చి 2024
March Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 05 మార్చి 2024

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 05 మార్చి 2024. పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహుల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నాం.

ఓరియన్ నెబ్యులా క్లస్టర్‌లో ప్రోటోప్లానెటరీ డిస్క్‌ కనుగొన్న హబుల్ స్పేస్ టెలిస్కోప్

నాసా ఖగోళ శాస్త్రవేత్తలు ఓరియన్ నెబ్యులాలోని యువ నక్షత్రాల చుట్టూ ప్రోటోప్లానెటరీ డిస్క్‌లుగా పిలువబడే నాలుగు గ్యాస్ మరియు డస్ట్ డిస్క్‌లను కనుగొన్నారు. వీటిని హబుల్ స్పేస్ టెలిస్కోప్ సహాయంతో కనుగొన్నారు. ఈ నాలుగు ప్రోటోప్లానెటరీ డిస్క్‌లు లేదా ప్రోప్లైడ్స్ వాయువు మరియు ధూళితో చుట్టబడి ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. ఈ డిస్క్‌లు మన స్వంత సౌర వ్యవస్థలుగా పరిణామం చెందే సామర్థ్యం కలిగిఉన్నటు పేర్కొన్నారు.

  • ఈ యువ నక్షేత్రాలు 1,500 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓరియన్ నెబ్యులాలో ఉన్నాయి.
  • ఈ నక్షత్రాల చుట్టూ కొత్తగా కనుగొనబడిన నాలుగు ప్రోటోప్లానెటరీ డిస్క్‌ల యొక్క హబుల్ స్పేస్ టెలిస్కోప్ చిత్రాలు గమనిస్తే ప్రతి డిస్క్ మధ్యలో ఉన్న ఎరుపు కాంతి కనిపించింది.
  • కొత్తగా ఏర్పడిన ఈ నక్షత్రం దాదాపు ఒక మిలియన్ సంవత్సరాల వయస్సు కలిగి ఉన్నట్లు అంచనా వేయబడింది.
  • దీని పరిమాణం 167 బిలియన్ మైళ్లు (మన స్వంత సౌర వ్యవస్థ యొక్క వ్యాసం కంటే 30 రెట్లు) ఉంటుంది.
  • ఈ డిస్క్‌లు మన సౌర వ్యవస్థ వ్యాసం కంటే రెండు నుండి ఎనిమిది రెట్లు పరిమాణంలో ఉన్నాయి.

ప్రోటోప్లానెటరీ డిస్క్ అనేది ప్రధానంగా గ్యాస్ (సుమారు 99%) తక్కువ శాతం ధూళి (సుమారు 1%) కలిగి ఉన్న ఖగోళ ప్రదేశం. ప్రోటోప్లానెటరీ డిస్క్ కొత్తగా ఏర్పడిన నక్షత్రాన్ని కక్ష్యలో ఉంచేందుకు ఉపయోగపడుతుంది. ఈ డిస్కుల ఉనికి గ్రహ వ్యవస్థ నిర్మాణంలో కీలకమైన ప్రారంభ దశను సూచిస్తుంది.

ఈ డిస్క్‌లోని ధూళి కణాలు కాలక్రమేణా కలిసిపోయి, చివరికి గ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువులను ఏర్పరుస్తాయి. హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఇప్పటికి అనేక ప్రోటోప్లానెటరీ డిస్క్‌లను గుర్తించింది, వీటిలో ఓరియన్ నెబ్యులాలోని నక్షత్రాల చుట్టూ దాదాపు 200 ఉన్నాయి.

జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ పరిశీలనల ప్రకారం ఓరియన్ నెబ్యులాలోని యువ నక్షత్రం చుట్టూ ఉన్న ప్రోటోప్లానెటరీ డిస్క్ ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో హైడ్రోజన్‌ను కోల్పోతున్నట్లు చూపిస్తుంది. ప్రోటోప్లానెటరీ డిస్క్ యొక్క రసాయన కూర్పు దాని నుండి ఏర్పడే చివరి గ్రహాల కూర్పును నిర్ణయిస్తుంది. ప్రోటోప్లానెటరీ డిస్క్‌లు సాధారణంగా 2-3 మిలియన్ సంవత్సరాల తర్వాత వాటి పదార్థం గ్రహాలలోకి కలిసిపోవడం మరియు నక్షత్ర వికిరణం ద్వారా కాంతివిపీడనం ద్వారా చెదరగొట్టబడటం జరుగుతుంది.

ఓరియన్ నెబ్యులాలో ఈ ప్రోటోప్లానెటరీ డిస్క్‌ల ఆవిష్కరణ నక్షత్రం మరియు గ్రహ వ్యవస్థ నిర్మాణంపై మన అవగాహనను మరింతగా పెంచుతుంది. ఈ వ్యవస్థలను అధ్యయనం చేయడం వల్ల బిలియన్ల సంవత్సరాల క్రితం మన స్వంత సౌర వ్యవస్థను సృష్టించడానికి దారితీసిన ప్రక్రియలను ఒకదానితో పోల్చేందుకు సహాయపడుతుంది.

ఎంయువ పథకం ప్రారంభించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం

ఉత్తరప్రదేశ్‌లో యువ పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించేందుకు ఎంయువ పథకంను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ప్రారంభించారు. ఎంయువ అనగా ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ అభియాన్ అని అర్ధం. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల వరకు ప్రాజెక్టులకు వడ్డీ లేని రుణాలను అందించడం ద్వారా ప్రతి సంవత్సరం లక్ష మంది యువ పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

  • ఈ కార్యక్రమానికి మద్దతుగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు కేటాయించింది.
  • ఈ పథకం యువ పారిశ్రామికవేత్తలకు వారి వ్యాపారాలను ప్రారంభించేందుకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారిని ప్రోత్సహిస్తుంది.
  • ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విద్యావంతులైన మరియు నైపుణ్యం కలిగిన యువతకు ప్రాధాన్యతనిస్తుంది.
  • ప్రభుత్వ-ప్రాయోజిత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలలో శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యత మొదటి ఇవ్వబడుతుంది.

ఈ పథకం స్వయం ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడం, రాష్ట్రంలో కొత్త సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల సృష్టిని ప్రోత్సహించడం మరియు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలకు సంభావ్య ప్రయోజనం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు ఈ చొరవ ప్రయత్నిస్తుంది.

కోల్‌కతాలో అండర్ వాటర్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కోల్‌కతాలో భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రోను మార్చి 6న ప్రారంభించారు. కోల్‌కతాలోని హుగ్లీ నది కింద ఈ మెట్రో టన్నెల్ నిర్మించబడింది. ఇది కోల్‌కతాలోని తూర్పు-పశ్చిమ మెట్రో కారిడార్ పరిధిలో హౌరా మైదాన్ మరియు ఎస్పనేడ్ మధ్య 4.8 కి.మీ మార్గాన్ని కలుపుతుంది. ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం మోదీ పాఠశాల విద్యార్థులతో కలిసి ఎస్పనేడ్ నుంచి హౌరా మైదాన్ వరకు మెట్రోలో ప్రయాణించారు.

  • ఈ అండర్ వాటర్ టన్నెల్ 520-మీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడింది.
  • తూర్పు-పశ్చిమ మెట్రో యొక్క మొత్తం 16.6 కి.మీ పొడవులో, భూగర్భ కారిడార్ హౌరా మైదాన్ మరియు ఫూల్‌బగన్ మధ్య 10.8 కి.మీ ఉంటుంది.
  • మిగిలిన భాగం ఎలివేటెడ్ కారిడారుగా హుగ్లీ నది క్రింద సొరంగంగా ఉంటుంది. ఈ సొరంగాన్ని మెట్రో రైలు కేవలం 45 సెకన్లలో క్రాస్ చేస్తుంది.

1971లో కోల్‌కతా మాస్టర్ ప్లాన్‌లో గుర్తించబడిన ఈ ప్రాజెక్ట్ జూలై 2008లో ఆమోదం పొందింది. తూర్పు -పశ్చిమ మెట్రో కారిడార్ ప్రాజెక్ట్ 2009లో ప్రారంభమైంది. 2017లో హుగ్లీ నది కింద టన్నెలింగ్ ప్రారంభించబడింది. జలాశయాల విస్ఫోటనాలు మరియు భూమి క్షీణత వంటి జాప్యాలు కారణంగా ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యింది.

4,138 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్ట్ ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, గాలి నాణ్యతను మెరుగుపరచడం మరియు సామూహిక రవాణా సౌలభ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. అండర్ వాటర్ మెట్రోతో పాటు, కోల్‌కతా మెట్రోలోని కవి సుభాష్-హేమంత ముఖోపాధ్యాయ మరియు తారతలా-మజెర్‌హట్ విభాగాలను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు.

లంచం ఆరోపణలపై ఎంపీలకు క్రిమినల్ ప్రాసిక్యూషన్ మినహాయింపు ఉండదు

ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు వారి ఓట్లకు లేదా పార్లమెంటు లేదా రాష్ట్ర అసెంబ్లీలలోని ప్రసంగానికి సంబంధించిన లంచం ఆరోపణలపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుండి తప్పించుకోలేరని సుప్రీంకోర్టులోని ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్ తీర్పునిచ్చింది. ఈ తీర్పు 1998 జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కేసులో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది.

1998 జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కేసులో తీర్పులో సుప్రీం కోర్టు ఎంపీలు మరియు ఎమ్మెల్యేలకు వారి ఓట్లకు లేదా శాసనసభలో ప్రసంగాలకు సంబంధించిన లంచం ఆరోపణలపై మినహాయింపును మంజూరు చేసింది. అయితే తాజా తీర్పు భారతదేశంలోని పార్లమెంటు సభ్యులు (ఎంపీలు) మరియు శాసనసభల సభ్యులు (ఎమ్మెల్యేలు) ఓటు వేయడానికి లంచం తీసుకుంటే ప్రాసిక్యూషన్ నుండి మినహాయింపు ఉండదని నిర్దారించింది.

  • ఓట్లకు బదులుగా లంచాలు తీసుకోవడం చట్టరీత్యా నేరమని, అలాంటి చర్యలకు శాసనసభ్యులను ప్రాసిక్యూట్ చేయవచ్చని కొత్త తీర్పు స్పష్టం చేసింది.
  • ఈ నిర్ణయం భారత రాజకీయాల్లో మరింత జవాబుదారీతనం మరియు పారదర్శకతను నిర్ధారించడానికి ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణించబడుతుంది.

ఈ తీర్పును న్యాయమూర్తులు ఎఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్, పిఎస్ నరసింహ, జెబి పార్దివాలా, సంజయ్ కుమార్ మరియు మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విడుదల చేసింది. అవినీతి మరియు చట్టసభల సభ్యుల లంచం ప్రజాజీవితంలో నిస్సహాయతను దెబ్బతీస్తుంది అని ఈ ధర్మాసనం నొక్కిచెప్పింది.

ఈ రాజ్యాంగ ధర్మాసనం జేఎంఎం లంచం కేసులో 1998 నాటి తీర్పులో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం యొక్క వివరణ రాజ్యాంగంలోని 105 మరియు 194 అధికరణలకు విరుద్ధమని పేర్కొంది. అవినీతి మరియు లంచం రాజ్యాంగం యొక్క ఆకాంక్షలు మరియు ఉద్దేశపూర్వక ఆదర్శాలను విధ్వంసం చేస్తుందని, పౌరులకు బాధ్యతాయుతమైన, ప్రతిస్పందించే మరియు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని దూరం చేసే రాజకీయాన్ని సృష్టిస్తుందని పేర్కొంది.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 105 మరియు 194 పార్లమెంట్ మరియు రాష్ట్ర అసెంబ్లీలలో ఎంపీలు మరియు ఎమ్మెల్యేల అధికారాలు మరియు విధులకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలను అందిస్తాయి. ఆర్టికల్ 105 మరియు 194 పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభలలో చర్చలు మరియు ఆలోచనల మార్పిడి జరిగే నిర్భయ వాతావరణాన్ని సృష్టిస్తాయి.

అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సాయి ప్రణీత్

భారత షట్లర్ సాయి ప్రణీత్ 31 సంవత్సరాల వయస్సులో అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సాయి ప్రణీత్ 1983లో ప్రకాష్ పదుకొనే తర్వాత 2019 లో బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న 36 సంవత్సరాలలో మొదటి భారతీయ పురుష షట్లర్‌గా నిలిచాడు.

  • భమిడిపాటి సాయి ప్రణీత్ స్వగ్రామం ఆంధ్ర ప్రదేశ్ రాష్టంలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు.
  • సాయి ప్రణీత్ హైదరాబాద్‌లోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందాడు.
  • సాయి ప్రణీత్ 2019లో అర్జున అవార్డుతో సత్కరించబడ్డాడు.
  • 2017లో సింగపూర్ ఓపెన్ టైటిల్‌ను శ్రీకాంత్ కిదాంబిని ఓడించి సాధించాడు.
  • 2016 కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్‌ను గెలుచుకున్నాడు .
  • 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఎటువంటి పతకం సాధించాక పోయిన భారతదేశానికి సగర్వంగా ప్రాతినిధ్యం వహించాడు.
  • ప్రణీత్ 2019లో ప్రపంచ 10వ ర్యాంకింగ్‌తో కెరీర్‌ అత్యధిక ర్యాంకు సాధించాడు.
  • సైనా నెహ్వాల్ , శ్రీకాంత్ కిదాంబి మరియు పివి సింధు తర్వాత సూపర్ సిరీస్ టైటిల్‌ను గెలుచుకున్న నాల్గవ భారతీయుడు సాయి ప్రణీత్.

సాయి ప్రణీత్ మార్చి 4 న అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, బ్యాడ్మింటన్‌ కోచింగ్‌లో కెరీర్‌ను కొనసాగించేందుకు సిద్దమవుతున్నట్లు ప్రకటించాడు. ఈ ఏడాది ఏప్రిల్ నుండి అమెరికాలోని ట్రయాంగిల్ బ్యాడ్మింటన్ అకాడమీలో ప్రధాన కోచ్‌గా చేరబోతున్నాట్లు వెల్లడించాడు.

తువాలు కొత్త ప్రధాన మంత్రిగా ఫెలెటి టీయో ఎన్నిక

తువాలు పార్లమెంటరీ సభ్యుడు మాజీ అటార్నీ జనరల్ ఫెలేటి టీయో ఆ దేశ సాధారణ ఎన్నికలలో విజయం తర్వాత ఈ పసిఫిక్ ద్వీప దేశం యొక్క కొత్త ప్రధానమంత్రిగా నియమితుడయ్యాడు. ఈ ఏడాది జనవరి 26న జరిగిన ఎన్నికల్లో మునుపటి ప్రధాన మంత్రి కౌసియా నటానో మరియు అతని ఎనిమిది మంది మంత్రుల్లో ముగ్గురు మళ్లీ ఎన్నిక కాలేదు.

ఈ ఎన్నికలలో ఫెలేటి టీయో వర్గం విజయం సాధించింది. ఎన్నికయిన 15 మంది శాసనసభ్యులు నామినేట్ చేసిన ఏకైక ప్రధాని అభ్యర్థిగా టియో నిలిచారు. దీనితో గవర్నర్ జనరల్ టోఫిగా వేవాలు ఫలానీ ఓటింగ్ లేకుండా ఫెలేటి టీయోను ప్రధానిగా ఎంపిక చేశారు.

తువాలు పసిఫిక్ మహాసముద్రంలోని ఒక ఓషియానియా ద్విపం. ఇది ఆస్ట్రేలియా మరియు హవాయి మధ్య దాదాపు 11,500 మంది జనాభా ఉన్న చిన్న దేశం. తైవాన్‌తో అధికారిక దౌత్య సంబంధాలను కలిగి ఉన్న 12 దేశాలలో తువాలు ఒకటిగా ఉంది. ఇది వాటికన్ సిటీ తర్వాత ప్రపంచంలో రెండవ అత్యల్ప జనాభా కలిగిన దేశంగా ఉంది. దీని మొత్తం భూభాగం 26 చదరపు కిలోమీటర్లు.

  • దేశం : తువాలు
  • ఖండం : ఓషియానియా (ఆస్ట్రేలియా)
  • రాజధాని : ఫునాఫుటి
  • అధికారిక భాషలు : తువాలువాన్, ఇంగ్లీష్
  • కరెన్సీలు : ఆస్ట్రేలియన్ డాలర్, టువాలువాన్ డాలర్
  • మోనార్క్ : చార్లెస్ II
  • గవర్నర్ జనరల్ : సర్ టోఫిగా వేవాలు ఫలానీ
  • ప్రధానమంత్రి : ఫెలేటి టీయో

ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 విజేతగా పుణెరి పల్టాన్

ప్రో కబడ్డీ లీగ్ యొక్క 10వ సీజన్‌ టైటిల్ విజేతగా పుణెరి పల్టాన్ నిలిచింది. ఫైనల్ మ్యాచులో పుణెరి పల్టన్ 28-25తో హర్యానా స్టీలర్స్‌ను ఓడించి తొలి ప్రో కబడ్డీ టైటిల్‌ను గెలుచుకుంది. పుణెరి పల్టాన్ ప్లేయర్ గౌరవ్ ఖత్రీ యొక్క 4 ట్యాకిల్ పాయింట్లు మరియు మోహిత్ గోయత్ మరియు పంకజ్ మోహిత వరుసగా 5 మరియు 9 రైడ్ పాయింట్లతో కలిసి చేసిన ప్రయత్నం వారి మొట్టమొదటి పీకేఎల్ టైటిల్‌ను కైవసం చేసుకోవడంలో సహాయపడింది.

  • ప్రో కబడ్డీ లీగ్ 2014లో ప్రారంభమైనది.
  • మొదటిలో ఎనిమిది జట్లు ఈ లీగ్‌లో పాల్గొనేవి, సీజన్ 5 నానుండి పోటీపడే జట్ల సంఖ్య 12కి పెరిగింది.
  • ఇప్పటివరకు జరిగిన 10 సీజన్లలో 7 జట్లు ప్రొ కబడ్డీ విజేతలుగా నిలిచాయి.

ప్రో కబడ్డీ లీగ్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన కబడ్డీ లీగ్. ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత భారతదేశంలో అత్యధికంగా వీక్షించబడిన రెండవ స్పోర్ట్స్ లీగ్. ప్రో కబడ్డీ లీగ్ విజేతగా అత్యధిక సార్లు పాట్నా పైరేట్స్ వరుసగా మూడు సీజన్‌లలో మూడు సార్లు పోటీలో విజయం సాధించింది. ఈ లీగ్ యందు బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ గెలుచుకున్న ఏకైక జట్టు కూడా ఇదే.

పాట్నా పైరేట్స్ తర్వాత జైపూర్ పింక్ పాంథర్స్ రెండుసార్లు గెలుపొందగా, యు ముంబా, బెంగళూరు బుల్స్ , బెంగాల్ వారియర్స్, దబాంగ్ ఢిల్లీ కెసి మరియు పుణెరి పల్టాన్ ఒక్కో టైటిల్‌ను గెలుచుకున్నాయి. 2023-24 సీజన్‌లో మొదటిసారి గెలిచిన పుణెరి పల్టన్ ప్రస్తుత ఛాంపియన్‌గా ఉంది.

  1. పీకెఎల్ సీజన్ 1 విజేత : జైపూర్ పింక్ పాంథర్స్ (2014)
  2. పీకెఎల్ సీజన్ 2 విజేత : యు ముంబా (2015)
  3. పీకెఎల్ సీజన్ 3 విజేత : పాట్నా పైరేట్స్ (2016)
  4. పీకెఎల్ సీజన్ 4 విజేత : పాట్నా పైరేట్స్ (2016)
  5. పీకెఎల్ సీజన్ 5 విజేత : పాట్నా పైరేట్స్ (2017)
  6. పీకెఎల్ సీజన్ 6 విజేత : బెంగళూరు బుల్స్ (2018)
  7. పీకెఎల్ సీజన్ 7 విజేత : బెంగాల్ వారియర్స్ (2019)
  8. పీకెఎల్ సీజన్ 8 విజేత : దబాంగ్ ఢిల్లీ కేసీ (2021)
  9. పీకెఎల్ సీజన్ 9 విజేత : జైపూర్ పింక్ పాంథర్స్ (2022)
  10. పీకెఎల్ సీజన్ 10 విజేత : పుణెరి పల్టన్ (2023)

Post Comment