Advertisement
ఎంబీఏ ప్రవేశ పరీక్షలు 2024 : మేనేజ్‌మెంట్ కోర్సుల్లో అడ్మిషన్లు
Admissions MBA Entrance Exams

ఎంబీఏ ప్రవేశ పరీక్షలు 2024 : మేనేజ్‌మెంట్ కోర్సుల్లో అడ్మిషన్లు

మేనేజ్‌మెంట్ కోర్సులలో అడ్మిషన్ పొందేందుకు జాతీయ & అంతర్జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలతో పాటుగా, రాష్ట్ర స్థాయిలో, ఇనిస్టిట్యూట్ స్థాయిలో వివిధ మేనేజ్‌మెంట్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి.

ఐఐఎంలలో ఎంబీఏ ప్రవేశాల కోసం నిర్వహించే క్యాట్ పరీక్షతో పాటుగా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే సీమ్యాట్, ఏపీ, తెలంగాణ నిర్వహించే ఐసెట్, అంతర్జాతీయ ప్రవేశాల కోసం జీమ్యాట్, అలానే వివిధ ప్రీమియం ఇనిస్టిట్యూట్లు నిర్వహించే జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్, సింబియాసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, టీస్ నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ వంటివి ఎన్నో పరీక్షలు అందుబాటులో ఉన్నాయి.

కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్ ఎగ్జామ్)

CAT - Exam Date, Syllabus, Exam Patternదేశంలో మేనేజ్‌మెంట్ విద్యకు ప్రఖ్యాత గాంచిన ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) లలో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం(PGP) మరియు మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ), డాక్టరొల్, మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం వంటి వివిధ మేనేజ్‌మెంట్ కోర్సుల యందు ప్రవేశాల కోసం క్యాట్ (కామన్ అడ్మిషన్ టెస్ట్) నిర్వహించబడుతుంది.

యేటా నవంబర్ లో జరిగే ఈ ప్రవేశ పరీక్ష కోసం దేశ వ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇంత డిమాండ్ ఉన్న ఈ మేనేజ్‌మెంట్ ప్రవేశ పరీక్ష యొక్క పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఐఐఎం నాగపూర్ మినహా మిగతా అన్ని ఐఐఎం లు పీహెచ్డీ, FPM, డాక్టోరల్, EFPM, EPhD వంటి ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ ని అందిస్తున్నాయి.

కామన్ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్ ఎగ్జామ్)

CMAT - Exam Date, Eligibility, Registrationసీమ్యాట్ అనగా కామన్ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్ టెస్ట్ అని అర్ధం. సీమ్యాట్ పరీక్షను పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. దేశ వ్యాప్తంగా ఒకే మేనేజ్‌మెంట్‌ ప్రవేశ పరీక్ష ఉండాలనే ఉద్దేశంతో 2019 నుండి భారత మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను నిర్వహిస్తుంది.

సీమ్యాట్ స్కోరు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎఐసీటీఈ) అనుమతి పొందిన దాదాపు 1000 పైగా గొప్ప మేనేజ్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్లల్లో ప్రవేశాలు పొందేందుకు ఉపయోగ పడుతుంది.

మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్ ఎగ్జామ్)

Management Aptitude Test 2023మ్యాట్ ఎగ్జామ్ యందు అర్హుత పొందటం ద్వారా భారతదేశంలోని 600 పైగా బిజినెస్ స్కూళ్లలో ఎంబీఏ మరియు దాని అనుబంధ మేనేజ్‌మెంట్‌ కోర్సులలో అడ్మిషన్ పొందొచ్చు. మ్యాట్ పరీక్ష ఏటా ఫిబ్రవరి, మే, సెప్టెంబర్ మరియు డిసెంబర్‌ నెలల్లో నాలుగు సార్లు నిర్వహించబడుతుంది.

మానవ వనరుల మంత్రిత్వ శాఖ 2003 లో మ్యాట్ పరీక్షను జాతీయస్థాయి మేనేజ్‌మెంట్‌ పరీక్షగా ఆమోదం తెలిపింది. మ్యాట్ స్కోరును జాతీయ స్థాయిలో అన్ని మేనేజ్‌మెంట్‌ కాలేజీలు పరిగణలోకి తీసుకుంటాయి. ఏటా నాలుగు సార్లు నిర్వహించే ఈ పరీక్ష పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకొండి.

ఏపీ ఐసెట్ ఎగ్జామ్

AP ICET Notification And Scheduleఏపీ ఐసెట్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలు మరియు మానేజ్మెంట్ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఐసెట్ అనగా ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని అర్ధం. ఏపీ ఐసెట్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కనుసన్నలలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహిస్తుంది.

పూర్తి ఆన్‌లైన్‌ విధానంలో జరిగే ఈ పరీక్షలో 2 గంటల 30 నిమిషాల వ్యవధిలో 200 ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. పరీక్షలో సెక్షన్ A మరియు సెక్షన్ B తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలో అందుబాటులో ఉంటాయి. సెక్షన్ C కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది.

తెలంగాణ ఐసెట్ ఎగ్జామ్

TS ICET Notification And Scheduleతెలంగాణ ఐసెట్ పరీక్షను తెలంగాణ యూనివర్సిటీలు మరియు మానేజ్మెంట్ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఐసెట్ అనగా ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని అర్ధం.

టీఎస్ ఐసెట్ పరీక్షను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కనుసన్నలలో శ్రీ కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తుంది. పూర్తి ఆన్‌లైన్‌ విధానంలో జరిగే ఈ పరీక్షలో 2 గంటల 30 నిమిషాల వ్యవధిలో 200 ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది.

క్యాట్ పరీక్షకు దీటుగా ఇతర ఎంబీఏ ప్రవేశ పరీక్షలు

Top MBA Exams in Indiaమేనేజ్మెంట్ విద్యలో జాతీయస్థాయిలో నిర్వహించే 8 టాప్ ఎంబీఏ ప్రవేశ పరీక్షల సమాచారం తెలుసుకోండి. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎంలలో ప్రవేశాలకు నిర్వహించే క్యాట్ పరీక్షతో పాటుగా వివిధ బిజినెస్ స్కూల్స్ నిర్వహించే ఎంట్రన్స్ టెస్టులు, తెలుగు రాష్ట్రాల్లో ఎంబీఏ ప్రవేశం కోసం నిర్వహించే ఐసెట్ వంటి పరీక్షల కోసం తెలుసుకోండి. వీటిలో మంచి ర్యాంకు సాధించడం ద్వారా ప్రసిద్ధ బిజినెస్ స్కూళ్లలో అడ్మిషన్ పొందొచ్చు.

ఐఐఎఫ్‌టీ ఎగ్జామ్

IIFT EXAM - Exam Date, Eligibility, Registrationఐఐఎఫ్‌టీ (IIFT) పరీక్షను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ యందు ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్సు సంబంధించి ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఇండియాలో ఢిల్లీ, కోలకతా మరియు కాకినాడలో ఐఐఎఫ్‌టీ ఇనిస్టిట్యూట్లలను కలిగి ఉంది.

ఐఐఎఫ్‌టీ ఎంబీఏ ఇంటెర్నేషన బిజినెస్ కోర్సును రెండేళ్ల నిడివితో 6 సెమిస్టర్లగా అందిస్తుంది. ఈ ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్సును ప్రధానంగా టెక్నాలజీ వాణిజ్యంలో భారత పారిశ్రామిక సామర్ధ్యాన్ని వ్యూత్మకంగా బలపర్చేందుకు, ఆర్థిక మరియు సాంకేతిక సహకారంతో కొన్ని సంస్థాగత వాణిజ్య సంక్లిష్టతలను పరిష్కరించేందుకు అవసరమయ్యే నాణ్యమైన మానవ వనురులను రూపొందించే లక్ష్యంతో అందిస్తుంది.

ఇగ్నో ఓపెన్‌మ్యాట్ ఎగ్జామ్

IGNOU Openmat - Exam Date, Eligibility, Registrationఇగ్నో ఓపెన్‌మ్యాట్ పరీక్షను ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో మానేజ్మెంట్ కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్షను నేషన్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఈ పరీక్ష జాతీయ స్టేయిలో ఏటా రెండు సార్లు జరుగుతుంది. 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఆసక్తి, అర్హుత ఉన్న అభ్యర్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.

Post Comment