Advertisement
నీట్ పీజీ ఎగ్జామ్ 2023 : షెడ్యూల్, రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ నమూనా
Admissions Medical Entrance Exams NTA Exams

నీట్ పీజీ ఎగ్జామ్ 2023 : షెడ్యూల్, రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ నమూనా

నీట్ పీజీ 2023 అడ్మిషన్ ప్రకటన వెలువడింది. డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (ఎండీ), మాస్టర్స్ ఇన్ సర్జరీ (ఎంఎస్) మరియు ఇతర మెడికల్ పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలు చేపట్టేందుకు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ఎంబీబీఎస్ పూర్తిచేసి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ వెబ్సైటు ద్వారా గడువులోపు దరఖాస్తు చేసుకోండి.

Exam Name NEET PG 2023
Exam Type Entrance Exam
Admission For Md & MS
Exam Date 05/03/2023
Exam Duration 3.30 Hours
Exam Level National Level

నీట్ పీజీ 2023 షెడ్యూల్

నీట్ పీజీ దరఖాస్తు ప్రారంభం 07 జనవరి 2023
నీట్ పీజీ దరఖాస్తు తుది గడువు 27 జనవరి 2023
నీట్ పీజీ 2023 ఎగ్జామ్ తేదీ 05 మార్చి 2023
 నీట్ పీజీ 2023 రిజల్ట్ 31 మార్చి 2023

నీట్ పీజీ 2023 ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ జారీచేసిన ఎంబీబీఎస్ సర్టిఫికెట్ లేదా ప్రొవిజనల్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి
  • విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన భారతీయ మరియు ఎన్ఆర్ఐ విద్యార్థులు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ అర్హుత సాధించి ఉండాలి
  • ఎంఎంబీఎస్ పూర్తిచేసి, ఏడాది ఇంటెర్షిప్ కూడా పూర్తిచేసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ లేని అభ్యర్థులు అనర్హులు
  • నేషనల్ మెడికల్ కౌన్సిల్ లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ గుర్తింపు ద్రువీకరణను పరీక్షా సమయంలో మరియు అడ్మిషన్ సమయంలో అభ్యర్థులు తప్పనిసరి చూపించాల్సి ఉంటుంది
  • ఒకటికి మించి చేసిన దరఖాస్తులు పరిగణలోకి తీసుకోబడవు. ఆన్లైన్ ద్వారా చేసే దరఖాస్తు ప్రస్తుత విద్య సంవత్సరానికి మాత్రమే పరిగణలోకి తీసుకోబడతాయి

నీట్ పీజీ 2023 ఎగ్జామ్ ఫీజు

అభ్యర్థి కేటగిరి దరఖాస్తు రుసుము
జనరల్ & ఓబీసీ కేటగిరి అభ్యర్థులు 4250/- + 765/- (18% GST) = 5015/-
ఎస్సీ, ఎస్టీ మరియు పీహెచ్ అభ్యర్థులు 3250/- + 585/- (18% GST) = 3835/-

నీట్ ఎగ్జామ్ సెంటర్లు

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ
అనంతపూర్, తిరుపతి, చీరాల. చిత్తూరు, ఏలూరు, కాకినాడ, కడప, తాడేపల్లిగూడెం, కర్నూలు, నెల్లూరు, గుంటూరు, రాజమండ్రి, అమలాపురం, అమరావతి, భీమవరం, విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాదు, నంద్యాల, పాల్వంచ, నల్గొండ, సూర్యాపేట,

నీట్ పీజీ 2023 రిజిస్ట్రేషన్

నీట్ పీజీ పరీక్షకు హాజరవ్వాలనుకునే అభ్యర్థులు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ (www.nbe.edu.in) వెబ్సైటు ద్వారా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా మొబైల్, మెయిల్ ఐడి ఉపయోగించి అప్లికేషన్ ఐడీ జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత దశలో బోర్డు నియమాలను అనుసరించి విద్యార్థి యొక్క విద్య మరియు వ్యక్తిగత వివరాలను దరఖాస్తులో పొందుపర్చాలి.

పై వివరాలకు సంబంధించిన డూప్లికేట్ ధ్రువపత్రాలను దరఖాస్తుతో పాటుగా అందజేయాలి. అలానే స్కాన్ చేసిన సంతకం, అభ్యర్థి ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చివరిగా అందుబాటులో ఉండే పేమెంట్ విధానంలో దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. ఆమోదం పొందిన అభ్యర్థులకు పరీక్షకు వారం రోజుల ముందు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచుతారు.

నీట్ పీజీ ఎగ్జామ్ నమూనా

నీట్ పీజీ పరీక్ష సీబీటీ విధానంలో జరుగుతుంది. పరీక్ష వ్యవధి 3 గంటల 30 నిముషాలు. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో మొత్తం 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, 3 భాగాలుగా ఉంటాయి. పార్ట్ A లో 50 ప్రశ్నలు, పార్ట్ B లో 50 ప్రశ్నలు మరియు పార్ట్ C 100 ప్రశ్నలు ఇవ్వబడతాయి.

సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నకు 4 మార్కులు ఇవ్వబడతాయి. తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నకు 1 మార్కు తొలగించబడుతుంది. సమాధానం చేయని ప్రశ్నలకు ఎటువంటి మార్కులు కేటాయించబడవు. ఒకదానికి మించి సమాధానాలు గుర్తించిన ప్రశ్నలను లెక్కించారు.

సబ్జెక్టు / సిలబస్ ప్రశ్నలు మార్కులు సమయం
పార్ట్ - A 
అనాటమీ
ఫీజియోలజీ
బయో కెమిస్ట్రీ
17
17
16
50 3.30 గంటలు
పార్ట్ - B
పాథాలజీ
ఫార్మకాజీ
మైక్రో బయాలజీ
ఫోరెనిక్ మెడిసిన్
సోషల్ & ప్రివెంటివ్ మెడిసిన్
15
05
10
05
15
50
పార్ట్ - C
జనరల్ మెడిసిన్
జనరల్ సర్జరీ
ఒబీటెస్ట్రిక్ & గైనకాజీ
పీడియాట్రిక్స్
ఈఎన్టి
ఆప్తమోలోజి
25
25
20
10
10
10
100

నీట్ పీజీ క్వాలిఫై మార్కులు

నీట్ పీజీ పరీక్షలో కనీస అర్హుత మార్కులు సాధించిన వారికి మాత్రమే ర్యాంకింగ్ కోసం పరిగణలోకి తీసుకుంటారు. దీనికి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కేటగిరి వారీగా ఈ క్రింది కనీస అర్హుత మార్కులు నిర్ణయించింది. ఇందులో అర్హుత మార్కులు ఈ విద్య ఏడాదికి మాత్రమే చెల్లుబాటు అవుతాయి.

కేటగిరి కనీస అర్హుత మార్కులు
జనరల్
ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్
జనరల్ పిహెచ్
50%
40%
45%

నీట్ పీజీ అడ్మిషన్ ప్రక్రియ

నీట్ పీజీ ప్రవేశాలు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నిర్వహిస్తుంది. అడ్మిషన్ ప్రక్రియ నీట్ పీజీ మెరిట్ ఆధారంగా జరుగుతుంది. రిజర్వేషన్ పరమైన సీట్ల కేటాయింపు 2006 సంబంధించిన అడ్మిషన్ చట్టం నియమాలకు అనుగుణంగా జరుగుతుంది. వివిధ కేటగిర్లకు సంబందించిన రిజర్వేషన్ కోటా ఈ క్రింది విదంగా ఉంటుంది.

రిజర్వేషన్ కేటగిరి రిజర్వేషన్ కోటా
ఓబీసీ
ఎస్సీ
ఎస్టీ
ఈడబ్ల్యూఎస్
పిహెచ్
27%
15%
7.5%
10%
5%

అందుబాటులో ఉండే సీట్లలో 50% రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ఉండే మెడికల్ కాలేజీలకు, ఇనిస్టిట్యూట్లకు మరియు యూనివర్సిటీలకు కేటాయిస్తారు. ఈ సీట్ల కేటాయింపు అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉంటాయి. మిగతా 50% సీట్లు ఆల్ ఇండియా కోటాలో భర్తీ చేస్తారు.

ఇవి దేశ వ్యాప్తంగా ఉండే AMFS, ESI మరియు కేంద్ర ప్రభుత్వ అధీనంలో నడిచే యూనివర్సిటీలకు కేటాయిస్తారు. ఈ సీట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ద్వారా కేటాయించబడతాయి.

నీట్ పీజీ ద్వారా ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ సైన్సెస్ ఇనిస్టిట్యూట్లలో అడ్మిషన్లు

ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ సైన్సెస్ ఇనిస్టిట్యూట్లలో అడ్మిషన్ల కోసం పోటీపడే అభ్యర్థులు దరఖాస్తు సమయంలో సంబంధిత ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఈ ఇనిస్టిట్యూట్లలో ప్రవేశాల కోసం AFMS ప్రత్యేక అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.

ఈ కోర్సుల సంబంధిత ప్రవేశాల కోసం నీట్ పీజీ ఫలితాలు వెలువడ్డాక మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (MCC) మరియు AFMS ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎగ్జామినేషన్ వెబ్సైటులో మీకు అందుబాటులో ఉంటాయి. AFMS అడ్మిషన్ ప్రక్రియలో రిజర్వేషన్ పరమైన సీట్ల కేటాయింపుకు అవకాశం ఉండదు.

కౌన్సిలింగులో పాల్గునే వివిధ AFMS ఇనిస్టిట్యూట్లు

  • ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ - పూణే
  • ఆర్మీ హాస్పిటల్ (రీసెర్చ్ & రెఫరెన్సు) - ఢీల్లీ సెంట్రల్
  • INHS అశ్విని - ముంబాయి
  • కమాండ్ హాస్పిటల్ ఎయిర్ ఫోర్స్ - బెంగళూరు
  • కమాండ్ హాస్పిటల్ ఈస్ట్రన్ కమాండ్ - కోలకతా
  • కమాండ్ హాస్పిటల్ వెస్ట్రన్ కమాండ్ - చాందిమందిర్
  • కమాండ్ హాస్పిటల్ సెంట్రల్ కమాండ్ - లక్నో
  • ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ - బెంగళూరు

నీట్ పీజీ కౌన్సిలింగ్ సమాచారం కోసం

ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ
Tel. (Off): 040-246002514-16
Fax : 040-24738195
E-Mail : dmegoap@yahoo.co.in
డైరెక్టర్ ఆఫ్ హెల్త్
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్
DM & HS క్యాంపస్, కోటి, హైదరాబాద్
Tel. (Off): 040-24602514, 15, 16
Fax : 040-24656909, 24600769
E-Mail : dme@telangana.gov.in
డైరెక్టర్ ఆఫ్ హెల్త్
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్
DM & HS క్యాంపస్, కోటి, హైదరాబాద్

Post Comment