Advertisement
టీఎస్‌డబ్ల్యూఆర్  సీఓఈ సెట్ 2023 | షెడ్యూల్ & రిజిస్ట్రేషన్
Admissions School Entrance Exams

టీఎస్‌డబ్ల్యూఆర్ సీఓఈ సెట్ 2023 | షెడ్యూల్ & రిజిస్ట్రేషన్

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TSWREIS) ఆధ్వర్యంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) కళాశాలల్లో 2023 విద్యా ఏడాదికి సంబంధించి జూనియర్ ఇంటర్ ప్రవేశాల కోసం దరఖాస్తు కోరుతున్నారు. ఈ సీఓఈ కళాశాలలో ప్రవేశాల కోసం సీఓఈ సెట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హుత పొందిన వారికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీఓఈ కళాశాలలో అడ్మిషన్లు కల్పిస్తారు.

రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి గురుకుల విద్యను అందించేందుకు ప్రభుత్వం ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 21కి పైగా కళాశాలల్లో 3,680 పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో బాలురులకు సంబంధించి 1,680 సీట్లు, బాలికలకు సంబంధించి 2,000 సీట్లు ఉన్నాయి.

అడ్మిషన్ పొందిన విద్యార్థులకు పూర్తి ఉచితంగా రెండేళ్ల ఇంగ్లీష్ మీడియం ఇంటర్మీడియట్ విద్యతో పాటుగా ఐఐటీ, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తారు. విద్యార్థులకు ఎంపీసీ. బైపీసీ, ఎంఈసీ, సీఈసీ ఇంటర్ గ్రూపులు ఆఫర్ చేస్తున్నారు. కోర్సు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. తెలుగు మీడియాలో టెన్త్ పూర్తిచేసిన విద్యార్థులు కూడా అర్హులు.

సీఓఈ సెట్ ఎలిజిబిలిటీ

  • 2023 మార్చి పరీక్షలలో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు మాత్రమే అర్హులు
  • స్టేట్ బోర్డుతో పాటుగా ఇతర సెంట్రల్ బోర్డులలో పది పూర్తిచేసిన విద్యార్థులు కూడా అర్హులు.
  • విద్యార్థి వయస్సు 17 ఏళ్లకు మించకూడదు.
  • కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 150,000/-, పట్టణ ప్రాంతాల్లో 200,000/- లకు మించకూడదు.

సీఓఈ సెట్ 2023 షెడ్యూల్

  • దరఖాస్తు ప్రారంభం : 12 జనవరి 2023
  • దరఖాస్తు గడువు : 31 జనవరి 2023
  • అడ్మిట్ కార్డు : 20 ఫిబ్రవరి 2023
  • ఎగ్జామ్ తేదీ : 05 మార్చి 2023
  • సమయం : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 వరకు

సీఓఈ సెట్ 2023 దరఖాస్తు విధానం

దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. అర్హుత కలిగిన విద్యార్థులు www.tsswreisjc.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో విద్యార్థి వ్యక్తిగత, విద్యా, చిరునామా వివరాలు పొందుపరచడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీలు, రిజర్వేషన్ కేటగిరి, భాష ఎంపిక, పరీక్ష కేంద్రం వంటి వివరాలు దరఖాస్తు పూర్తిచేసేముందు పునఃపరిశీలించుకోండి.

దరఖాస్తులో వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఈమధ్య కాలంలో తీసుకున్న పాసుపోర్టు సైజు ఫోటో అందుబాటులో ఉంచుకోండి. కంప్యూటర్ లో డిజైన్ లేదా ఎడిట్ చేసిన ఫోటోలు అనుమతించబడవు. మీ సొంత దస్తూరితో చేసిన సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. కాపిటల్ లేటర్స్ తో చేసిన సంతకం చెల్లదు. ఫొటోగ్రాఫ్, సంతకం వాటికీ సంబంధించిన బాక్సుల్లో మాత్రమే అప్‌లోడ్ చేయండి.

వివరాలు తారుమారు అయితే దరఖాస్తు పరిగణలోకి తీసుకోరు. ఈ ఫైళ్ల సైజు 10-100 కేబీల మధ్య ఉండేలా చూసుకోండి. అడ్మిట్ కార్డు అందుబాటులో ఉండే తేదిలో పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోండి. పరీక్ష రోజు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డు, ఫొటోగ్రాఫ్ తో పాటు వ్యక్తిగత ఐడెంటి కార్డుతో పరీక్షకు హాజరవ్వాలి. నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబడవు.

దరఖాస్తు రుసుము : 100/- (దరఖాస్తు రుసుములు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా ఈ చలానా విధానంలో చెల్లించవచ్చు. చెల్లింపు సమయంలో సర్వీస్ చార్జీలు, జీఎస్టీ వంటి అదనపు చార్జీలు ఉంటె అభ్యర్థులనే భరించాలి.)

సీఓఈ సెట్ 2023 ఎగ్జామ్ నమూనా

సీఓఈ సెట్ 2023 ఓఎంఆర్ షీట్ ఆధారంగా ఆఫ్‌లైన్ యందు నిర్వహిస్తుంది. పరీక్ష మూడు గంటల నిడివితో 160 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రశ్నలు పదివ తరగతి స్థాయి సిలబస్ ఆధారితంగా ఉంటాయి. ఎంపీసీ గ్రూపుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించి పరీక్ష నిర్వహిస్తారు.

బైపీసీ గ్రూపుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఇంగ్లీష్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించి పరీక్ష నిర్వహిస్తారు. ఎంఈసీ/సీఈసీ గ్రూపులకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ మరియు జీకే & కరెంట్ అఫైర్స్ సంబంధించి ప్రశ్నలు ఇవ్వబడతయి.

ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటుంది. ప్రవేశాలు అర్హుత పరీక్షలో పొందిన మెరిట్ మరియు వివిధ కుల, లోకల్ రిజర్వేషన్ సమీకరణాల ఆధారంగా నిర్వహిస్తారు.

సబ్జెక్టు పేరు ఎంపీసీ గ్రూపు బైపీసీ గ్రూపు ఎంఈసీ/సీఈసీ గ్రూపు
ఇంగ్లీష్ 20 మార్కులు 20 మార్కులు 20 మార్కులు
మ్యాథమెటిక్స్ 60 మార్కులు 20 మార్కులు 40 మార్కులు
ఫిజిక్స్ 40 మార్కులు 40 మార్కులు -
కెమిస్ట్రీ 40 మార్కులు 40 మార్కులు -
బయాలజీ - 40 మార్కులు -
సోషల్ - - 70 మార్కులు
జీకే & కరెంట్ అఫైర్స్ - - 30 మార్కులు
మొత్తం మార్కులు  160 మార్కులు 160 మార్కులు 160 మార్కులు

సీఓఈ కాలేజీల్లో సీట్లు వివరాలు & అడ్మిషన్ ప్రక్రియ

రాష్ట్ర వ్యాప్తంగా 21 సీఓఈ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 3,680 పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో బాలురులకు సంబంధించి 1,680 సీట్లు, బాలికలకు సంబంధించి 2,000 సీట్లు ఉన్నాయి. వీటిలో 75 శాతం సీట్లు ఎస్సీ విద్యార్థులకు, 6 శాతం ఎస్టీ విద్యార్థులకు, 12 శాతం బీసీ విద్యార్థులకు మరియు 3శాతం సీట్లు మైనారిటీ విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన సీట్లను జనరల్ కేటగిరి విద్యార్థులతో భర్తీ చేస్తారు.

అడ్మిషన్ ప్రక్రియ పూర్తి సీఓఈ సెట్ మెరిట్ ఆధారంగా ఉంటుంది. రంగారెడ్డిలో గౌలిదొడ్డి కళాశాలలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో 120 చెప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయి. అలానే సంగారెడ్డిలోని హత్నురా కళాశాల మరియు ఖమ్మం కళాశాలలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు 80 చెప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి మినహాయిస్తే మిగతా అన్ని కాలేజీల్లో గ్రూపుకు 40 సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

Post Comment