టీటీడబ్ల్యూ ఆర్‌జేసీ సెట్ 2023 : నోటిఫికేషన్, దరఖాస్తు, పరీక్ష తేదీ
Telangana

టీటీడబ్ల్యూ ఆర్‌జేసీ సెట్ 2023 : నోటిఫికేషన్, దరఖాస్తు, పరీక్ష తేదీ

తెలంగాణ గురుకుల విద్య సంస్థల్లో జూనియర్ ఇంటర్ ప్రవేశాలు

తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TTWREIS) లలో 2022 - 23 విద్య ఏడాదికి సంబంధించి జూనియర్ ఇంటర్ అడ్మిషన్లు కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు, గురుకులం విద్య ఫార్మేట్'లో నాణ్యమైన స్కూల్ మరియు కాలేజీ విద్యను అందించేందుకు 1999 వీటిని స్థాపించారు.

గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులకు పూర్తిస్థాయి రెసిడెన్సియల్ విధానంలో ఉచిత విద్యను ప్రభుత్వం అందిస్తుంది. ప్రవేశం పొందే విద్యార్థులకు కోర్సు పూర్తియ్యే వరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. విద్యార్థుల మానసిక ఉల్లాసం కోసం విద్యతో పాటుగా క్రీడలు, ఇతర నైపుణ్యాభివృది అంశాలలో భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే తర్పీదు అందిస్తారు. ఈ సంస్థల్లో అడ్మిషన్ల కోసం ఏటా ప్రవేశ పరీక్ష నిర్వహించి, అర్హుత పొందిన విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ఇంటర్ ఎడ్యుకేషన్ పూర్తి ఇంగ్లీష్ మీడియంలో అందిస్తారు.

రాష్ట్రం వ్యాప్తంగా 160 గురుకుల పాఠశాలలు ఉండగా అందులో 88 విద్యాసంస్థల్లో ఇంటర్ మరియు డిగ్రీ విద్యను అందిస్తున్నారు. ఇందులో 14 కాలేజీలను ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీలగా మార్చి ఐఐటీ/నిట్/ఐఐఐటీ/నీట్ వంటి పరీక్షల కోసం కార్పొరేట్ స్థాయి శిక్షణ అందిస్తున్నారు. ఎన్డీఏ వంటి ఢిఫెన్స్ పరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం వరంగల్ సమీపంలోని అశోక్ నగర్ యందు గురుకుల సైనిక్ పాఠశాలను ఏర్పాటు చేసారు.

ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా 14 ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీలలో పాటుగా, 69 జనరల్ జూనియర్ రెసిడెన్సియల్ కాలేజీలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, హెచ్ఈసీ, సీఈసీ మరియు ఒకేషనల్ కోర్సులలో అడ్మిషన్ కోసం దరఖాస్తు కోరుతున్నారు. అర్హుత కలిగిన విద్యార్థులు గడువులోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోండి.

పరీక్ష షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభ తేదీ 24 జనవరి 2022
దరఖాస్తు తుది గడువు 27 ఫిబ్రవరి 2022
పరీక్ష తేదీ 27 మార్చి 2022 (ఉ 11 గంటలకు)

ఎలిజిబిలిటీ

  • విద్యార్థులు 2021-22 మే పబ్లిక్ పరీక్షల్లో పది ఉత్తీర్ణత పొంది ఉండాలి.
  • విద్యార్థి కుటుంబ ఆదాయం ఏడాదికి లక్ష ఏభైవేలు (రూరల్), రెండు లక్షలు (అర్బన్) రూపాలకు మించకూడదు.
  • తెలుగు మరియు ఇంగ్లీష్  మీడియంలో పది చదువుకున్న విద్యార్థులు మాత్రమే పరీక్ష రాసేందుకు అర్హులు.
  • 31/08/2022 నాటికీ విద్యార్థి వయస్సు 17 ఏళ్ళు మించకూడదు.
  • సీటు సాధించిన విద్యార్థులు అడ్మిషన్ సమయంలో సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాల్సి ఉంటుంది.
  • మెజారిటీ సీట్లు ఎస్టీ విద్యార్థులకు కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం

దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. అర్హుత కలిగిన విద్యార్థులు www.tgtwgurukulam.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు సంబంధిత సర్టిఫికేట్లు అన్ని అందుబాటులో ఉంచుకోవాలి. దరఖాస్తు సమయంలో అందించే సమాచారంకు పూర్తి జవాబుదారీ మీరే కాబట్టి ఇచ్చే సమాచారంలో తప్పులు దొర్లకుండా చూసుకోండి. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీలు, రిజర్వేషన్ కేటగిరి, భాష ఎంపిక, పరీక్ష కేంద్రం వంటి వివరాలు దరఖాస్తు పూర్తిచేసేముందు పునఃపరిశీలించుకోండి.

వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఈమధ్య కాలంలో తీసుకున్న పాసుపోర్టు సైజు ఫోటో అందుబాటులో ఉంచుకోండి. కంప్యూటర్ లో డిజైన్ లేదా ఎడిట్ చేసిన ఫోటోలు అనుమతించబడవు. మీ సొంత దస్తూరితో చేసిన సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. కాపిటల్ లేటర్స్ తో చేసిన సంతకం చెల్లదు. ఫొటోగ్రాఫ్, సంతకం వాటికీ సంబంధించిన బాక్సుల్లో మాత్రమే అప్‌లోడ్ చేయండి. అవి తారుమారు ఐతే దరఖాస్తు పరిగణలోకి తీసుకోరు. ఈ ఫైళ్ల సైజు 10-100 కేబీల మధ్య ఉండేలా చూసుకోండి. అడ్మిట్ కార్డు అందుబాటులో ఉండే తేదిలో పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోండి. పరీక్ష రోజు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డు, ఫొటోగ్రాఫ్ తో పాటు వ్యక్తిగత ఐడెంటి కార్డుతో పరీక్షకు హాజరవ్వాలి. నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబడవు.

దరఖాస్తు రుసుము : 100/- (దరఖాస్తు రుసుములు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా ఈ చలానా విధానంలో చెల్లించవచ్చు. చెల్లింపు సమయంలో సర్వీస్ చార్జీలు, జీఎస్టీ వంటి అదనపు చార్జీలు ఉంటె అభ్యర్థులనే భరించాలి.)

పరీక్ష విధానం

ప్రవేశ పరీక్ష ఓఎంఆర్ షీట్ ఆధారంగా ఆఫ్‌లైన్ యందు నిర్వహిస్తుంది. పరీక్ష రెండు గంటల నిడివితో 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రశ్నలు పదివ తరగతి స్థాయి సిలబస్'తో గణితం, సోషల్, బయోలాజికల్ సైన్స్, ఫీజికల్ సైన్స్, ఇంగ్లీష్ గ్రామర్ అంశాల నుండి ఇవ్వబడతాయి. ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటుంది. ప్రవేశాలు అర్హుత పరీక్షలో పొందిన మెరిట్ మరియు వివిధ కుల, లోకల్ రిజర్వేషన్ సమీకరణాల ఆధారంగా నిర్వహిస్తారు.

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు
గణితం  20 ప్రశ్నలు 20 మార్కులు
ఫీజికల్ సైన్స్  20 ప్రశ్నలు 20 మార్కులు
బయోలాజికల్ సైన్స్  20 ప్రశ్నలు 20 మార్కులు
సోషల్ స్టడీస్ 20 ప్రశ్నలు 20 మార్కులు
ఇంగ్లీష్ గ్రామర్ & కంప్రహెన్షన్ 20 ప్రశ్నలు 20 మార్కులు

Post Comment