డిఫెన్స్ & సెక్యూరిటీ | కరెంటు అఫైర్స్ : మే 2022
Telugu Current Affairs

డిఫెన్స్ & సెక్యూరిటీ | కరెంటు అఫైర్స్ : మే 2022

ఐఏఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా ఎయిర్ మార్షల్ సంజీవ్ కపూర్

ఎయిర్ మార్షల్ సంజీవ్ కపూర్ భారత వైమానిక దళం యొక్క డైరెక్టర్ జనరల్ (ఇన్‌స్పెక్షన్ అండ్ సేఫ్టీ)గా బాధ్యతలు స్వీకరించారు. సంజీవ్ కపూర్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి గ్రాడ్యుయేట్డిగ్రీ పూర్తిచేశారు. ఆయన 1985లో ట్రాన్స్‌పోర్ట్ పైలట్‌గా భారత వైమానిక దళం యొక్క ఫ్లయింగ్ బ్రాంచ్‌లో కెరీర్ ప్రారంభించారు.

Advertisement

ఎయిర్ పవర్ ఇండెక్స్'లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్'కు 3వ ర్యాంకు

భారత వైమానిక దళం ప్రపంచంలోనే మూడవ అత్యంత శక్తివంతమైన వైమానిక శక్తిగా ర్యాంకు పొందింది. వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడరన్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రచురించిన నివేదిక ప్రకారం, చైనా వైమానిక దళం కంటే భారత వైమానిక దళం మెరుగైనిదిగా గుర్తించబడింది. ఈ జాబితాలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, రష్యా తర్వాతి స్థానంలో ఉంది. భారత్ 3వ స్థానంలో, చైనా 4వ స్థానంలో ఉన్నాయి.

భారత్-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక వ్యాయామం 'బొంగోసాగర్' ప్రారంభం

ఇండియన్ నేవీ (IN) - బంగ్లాదేశ్ నేవీ (BN) ద్వైపాక్షిక వ్యాయామం ' బొంగోసాగర్ ' యొక్క మూడవ ఎడిషన్ మే 24న బంగ్లాదేశ్‌లోని పోర్ట్ మోంగ్లాలో ప్రారంభమైంది. దీనికి సంబంధించి మొదటి దశ హార్బర్ ఫేజ్ వ్యాయామం బాంగ్లాదేశ్  మోంగ్లాలో మే 24-25 మధ్య జరిగింది. రెండవ దశ సీ ఫేజ్, బంగాళాఖాతంలో మే 26-27 మధ్య నిర్వహించారు. ఈ వ్యాయామంలో భారత నౌకాదళానికి చెందిన కోరా, సుమేధ షిప్స్ పాల్గున్నాయి. దీనిని ఇరు దేశాల సముద్ర జలాల మధ్య పరస్పర ఆర్థిక మరియు రక్షణ సహకారం పెంపొందించేందుకు నిర్వహిస్తారు.

 ఇండియన్ ఆర్మీ మొదటి మహిళా ఏవియేటర్‌గా కెప్టెన్ అభిలాషా బరాక్

హర్యానాకు చెందిన కెప్టెన్ అభిలాషా బరాక్, భారత సైన్యంలో యుద్ధ వైమానిక చోదకురాలు (Combat Aviator)గా ఎంపికైన మొదటి మహిళా అధికారిగా నిలిచింది. ఈమేరకు నాసిక్‌లోని కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో అభిలాషాకు “వింగ్స్” బ్యాడ్జి ప్రధానం చేశారు. ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్ లో మహిళలు గ్రౌండ్ డ్యూటీలలో భాగంగా మాత్రమే ఉండేవారు. గత ఏడాది జూన్లో తొలిసారిగా ఇద్దరు మహిళా అధికారులు హెలికాప్టర్ పైలట్ శిక్షణకు ఎంపికయ్యారు.

భారతదేశపు రెండవ స్వదేశీ సర్వే నౌక ఐఎన్ఎస్ నిర్దేశక్‌ ప్రారంభం

గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (GRSE) లిమిటెడ్ నిర్మిస్తున్న నాలుగు సర్వే నౌకలలో రెండవది ఐఎన్ఎస్ నిర్దేశక్ చెన్నై సమీపంలోని కట్టుపల్లిలో మే 26న ప్రారంభించబడింది. ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్‌గుప్తా చేతుల మీదుగా ఈ లాంచ్ వేడుక జరిగింది.

Advertisement

Post Comment